
జాతీయ వర్క్‌షాపులో అరకు జెడ్పీటీసీ
అరకులోయ టౌన్: కేంద్ర పంచాయతీరాజ్ శాఖ హర్యానాలోని రోతాక్‌లో నిర్వహించిన రెసిడెన్షియల్ మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం వర్క్‌షాప్‌లో అరకులోయ జెడ్పీటీసీ శెట్టి రోషిణి పాల్గొన్నారు. ఐదు రోజులపాటు జరిగిన వర్క్‌షాప్‌లో పాల్గొని తిరిగి వచ్చిన జెడ్పీటీసీ శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీరు, విద్యుత్, రవాణా, పారిశుధ్యం తదితర అంశాలపై వర్క్‌షాప్ నిర్వహించారన్నారు. తాను రోడ్లు, విద్య అంశాలపై నివేదిక ఇచ్చానని, ఈ రంగాల్లో అభివృద్ధికి పలు సూచనలు చేశానన్నారు. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతమైన అరకులోయ మండలం గన్నెల పంచాయతీలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన రహదారుల గురించి తాను సమర్పించిన పత్రంలో పేర్కొన్నానని చెప్పారు. ఏజెన్సీలో ఇంకా చాలాచోట్ల విద్య, విద్యుత్, తాగునీరు, పారిశుధ్య సమస్య తీవ్రంగా ఉందని చెబుతూ.. గిరిజనులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరినట్టు జెడ్పీటీసీ శెట్టి రోషిణి చెప్పారు. రాష్ట్రం నుంచి తనతోపాటు తిరుపతి జిల్లా తెల్లకూర్ జెడ్పీటీసీ ప్రిస్కిల్లా, అధికారులు హాజరైనట్టు ఆమె వివరించారు.