అనంతగిరి(అరకులోయటౌన్): బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారితోపాటు వారికి సహకరించిన వారిపై కూడా కఠిన చర్యలు తప్పవని అరకులోయ ఇన్‌చార్జి జడ్జి ధర్మారావు అన్నారు. మండలంలోని కొత్తూరు కస్తూర్బా గాంధీ విద్యాలయం (కేజీబీవీ)లో మండలం న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన మాట్లాడారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. బాలికల పట్ల ఎవరైనా చెడుగా ప్రవర్తిస్తే టీచర్లకు గాని, తల్లిదండ్రులకు తెలియజేయాలన్నారు. పిల్లలు సోషల్ మీడియాకు, సెల్ ఫోన్లకు దూరంగా ఉండాలని సూచించారు. వేసవి సెలవుల్లో ఇళ్లకు వెళ్లే విద్యార్థులు తల్లిదండ్రులు చేసే పనుల్లో నిమగ్నమైతే కష్టసుఖాలు తెలుస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ సుశీల పాల్గొన్నారు.
ఇన్‌చార్జి జడ్జి ధర్మారావు
బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తిసే కఠిన చర్యలు