ముంచంగిపుట్టు: నిత్యం నిండుకుండలా ఉండే మత్స్యగెడ్డలో జలకళ తగ్గుతోంది. మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి నీరు అందించే జోలాపుట్టు జలాశయం మత్స్యగెడ్డ నీటి నిల్వపైనే ఆధారపడి ఉంటుంది. ఎండల కారణంగా మత్స్యగెడ్డలో నీటి ప్రవాహం తగ్గుతోంది. సుజనకోట, పెదగూడ, దార్రెల, పనసపుట్టు, దొడిపుట్టు పంచాయతీల గుండా ప్రవహించే మత్స్యగెడ్డలో నీటి పరిస్థితి మార్చి నెలలోనే ఇలా ఉందంటే రానున్న రోజుల్లో పూర్తిగా అడుగంటిపోయే పరిస్థితి ఏర్పడుతుందని స్థానికులు చెబుతున్నారు. మళ్లీ వర్షాలు కురిసే వరకు మత్స్యగెడ్డలో నీరు చేరే అవకాశం లేదు. మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి సైతం నీటి గండం ఉంటుందని మత్స్యగెడ్డ పరీవాహక ప్రజలు తెలిపారు.