పాడేరు : సర్కేడియన్ వి యాప్ ద్వారా గుండె వ్యాధులను నిర్ధారించవచ్చని జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విశ్వమిత్ర తెలిపారు. ఎన్‌ఆర్‌ఐ విద్యార్థి నంద్యాల సిద్ధార్థ్ రూపొందించిన సర్కేడియన్ వి యాప్ ద్వారా జిల్లా ఆస్పత్రిలో 250 మంది రోగులకు పరీక్షలు నిర్వహించగా పదిమంది గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్టు నిర్ధారించామని చెప్పారు. ఈ పదిమంది రోగులకు జనరల్ మెడిసిన్ నిపుణులు ప్రొఫెసర్ డాక్టర్ సర్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో 2డీ ఎకో, ఈసీజీ పరీక్షలు నిర్వహించామని వారంతా గుండె వ్యాధితో బాధపడుతున్నారని తేలిందని తెలిపారు. వెంటనే వారిని కార్డియాలజీ వైద్య నిపుణుల వద్దకు పంపినట్టు చెప్పారు. గుండె వ్యాధిగ్రస్తులకు శనివారం కూడా స్క్రీనింగ్ పరీక్ష నిర్వహిస్తామన్నారు. ఎన్‌ఆర్‌ఐ విద్యార్థి సిద్ధార్థ్ రూపొందించిన యాప్ ఏఐ కేవలం ఏడు సెకెన్లలోనే గుండె జబ్బులను నిర్ధారిస్తుందన్నారు. కలెక్ట్ దినేష్‌కుమార్ ఆదేశాల మేరకు ఎన్‌ఆర్‌ఐ విద్యార్థి పాడేరు జిల్లా ఆస్పత్రికి వచ్చి పరీక్షలు నిర్వహించడం గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో ఆస్పత్రి సిబ్బంది, ఎన్‌ఆర్‌ఐ విద్యార్థిమహేష్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్
డాక్టర్ విశ్వమిత్ర