చింతపల్లి: మండల కేంద్రం చింతపల్లిలో ముత్యాలమ్మతల్లి ఉత్సవాలను ఏప్రిల్ 24 నుంచి 27 వరకూ నిర్వహించడానికి ఉత్సవ కమిటీ నిర్ణయించినట్టు ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు తెలిపారు.ముత్యాలమ్మతల్లి ఆలయ ప్రాంగణంలో శుక్రవారం ఉత్సవ కమిటీ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ జాతరను నాలుగు రోజుల పాటు వైభవంగా నిర్వహించడానికి ప్రతి ఒక్కరి సహకారం ఎంతో అవసరమన్నారు. పాడేరు మోదకొండమ్మ జాతర తరువాత ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ జాతర నిర్వహిస్తున్నట్టు చెప్పారు.
అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా
హేమంత్, వినాయకరావు
ముత్యాలమ్మతల్లి ఉత్సవ కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా దురియా హేమంత్‌కుమార్,పసుపులేటి వినాయకరావు, కార్యదర్శిగా పోతు రాజు బాలయ్యపడాల్(జెట్పీటీసీ),ఉపాధ్యక్షురాలిగా కోరాబు అనూషదేవి(ఎంపీపీ)లను ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్టు ఎమ్మెల్యే ప్రకటించారు.గ్రామ పెద్దలు, అన్ని సంఘాల ప్రతినిధులతో కలిపి పూర్తి స్థాయి కమిటీని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి,సర్పంచ్ దురియా పుష్పలత,ఉద్యోగ సంఘ నాయుకులు యు.వి. గిరి, శశికుమార్, వెంకటరమణ,పద్మనాభం వర్తక సంఘ నాయకులు బేతాళుడు,జోగేశ్వరరావు,రెహమాన్,ఆలయ ధర్మకర్త వంశస్థులు మాదల తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.
పాడేరు ఎమ్మెల్యే
మత్స్యరాస విశ్వేశ్వరరాజు
అందరి సహకారంతో వైభవంగా ముత్యాలమ్మ జాతర
అందరి సహకారంతో వైభవంగా ముత్యాలమ్మ జాతర