
తేనె సేకరణ, నిల్వపై అవగాహన
చింతపల్లి: గిరిజన రైతులు పెట్టెతేనెను సమర్థవంతంగా నిర్వహించగలిగితే అదనంగా నికర ఆదాయం వస్తుందని చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు సందీప్‌నాయక్, ప్లాంట్ పెథాలజిస్ట్ డాక్టర్ వెంకటేష్‌బాబు అన్నారు. చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో పెట్టెతేనె నిర్వహణపై రైతులకు శిక్షణ కార్యక్రమాలు చేపుడుతున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం రైతులను అంతర్ల గ్రామానికి తీసుకెళ్లారు. అక్కడ గిరిజన రైతు కోరాబు లింగన్నపడాల్ చేపడుతున్న పెట్టెతేనె నిర్వహణ పద్ధతులను చూపించారు. తేనె సేకరణ, నిల్వలపై పలు సూచనలిచ్చారు. ఏడాది పొడవునా వివిధ రకాల పూలు, పండ్ల సాగు చేపట్టడం ద్వారా తేనెటీగలకు ఆహారం సమృద్ధిగా లభిస్తుందని తద్వారా పెట్టెతేనె నిర్వహణకు అనువుగా ఉంటుందన్నారు.
గాయపడిన క్వారీ కార్మికుడి మృతి
అనకాపలి టౌన్: కుంచంగి క్వారీలో ఒడిశాకు చెందిన కె.జానీ అనే కార్మికుడు మృతి చెందాడని రూరల్ ఎస్‌ఐ రవికుమార్ తెలిపారు. శుక్రవారం ఉదయం క్వారీ పనులు చేస్తుండగా గాయపడిన జానీని చికిత్స నిమిత్తం ఎన్టీఆర్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన చికిత్స పొందుతూ మృతి చెందాడని, ఈ మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు.