
స్వాతంత్య్ర సమరయోధుల విగ్రహాల ఆవిష్కరణ
పెదబయలు: స్వాతంత్య్ర సమరయోధుల ఆశయాలు కొనసాగించాలని మాజీ సమితి అధ్యక్షుడు జర్సింగి బాలంనాయుడు, వైస్ ఎంపీపీ కొర్రా రాజుబాబు అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయం ప్రాంగణంలో వైస్ ఎంపీపీ కొర్రా రాజుబాబు సొంత నిధులతో ఏర్పాటు చేసిన స్వాతంత్య్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, మర్రి కామయ్య,డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహాలను సీనియర్ సిటిజన్స్,మండల ప్రజా ప్రతినిధుల చేతుల మీదుగా శుక్రవారం ఆవిష్కరించారు. అనంతరం బాలంనాయుడు, రాజుబాబు మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుల ప్రాణత్యాగం వల్ల మనం ఇప్పుడు స్వేచ్ఛను అనుభవిస్తున్నామన్నారు. మాజీ సమితి అధ్యక్షుడు జర్సింగి బాలంనాయుడు,సీనియర్ సిటిజన్స్ లొట్టి రామూర్తి,పోయిభ బుల్లిదొర,రెడ్డి సుబ్బారావు, పల్టాసింగి భీమన్న, మర్రి కామయ్య మనుమలను దుశ్శాలువాలతో సన్మానించారు.అనంతరం విగ్రహాల దాత కొర్రా రాజుబాబు, వారి కుటుంబ సభ్యులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఎల్.పూర్ణయ్య,ఎంపీపీ బొండా వరహాలమ్మ,జెడ్పీటీసీ కూడ బొంజుబాబు, వైస్ ఎంపీపీ కొర్రా సోనే, ఏటీడబ్ల్యూవో వెంకటరమణ, మాజీ ఎంపీపీలు జర్సింగి సూర్యనారాయణ,వెచ్చంగి కొండయ్య,స్థానిక ఎంపీటీసీ కె.బొంజుబాబు,మాజీ సర్పంచ్ పాంగి సింహాచలం,రూడ లక్ష్మణరావు.వనల్భ సన్యాసిరావు. పుర్సకారి భాస్కర్‌రావు, కూడ రాధాకృష్ణ,ఉపాధి ఏపీవో అప్పలనాయుడు, ఏపీఎం దేవమంగ తదితరులు పాల్గొన్నారు.

స్వాతంత్య్ర సమరయోధుల విగ్రహాల ఆవిష్కరణ