సింహాచలం: గేట్–2025లో ఆలిండియా 23వ ర్యాంకును సాధించి సింహాచలం దరి శ్రీనివాస్‌నగర్‌కి చెందిన చింతా దినేష్ సత్తా చాటాడు. దినేష్ తాడేపల్లి గూడెంలోని ఎన్‌ఐటీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. తండ్రి హరిశివప్రసాద్ అనకాపల్లి జిల్లా తుమ్మపాల పీహెచ్‌సీలో సీనియర్ అసిస్టెంట్. తల్లి సుజాత గృహిణి. టెన్త్‌లో 10 జీపీఏ, ఇంటర్‌లో 980 మార్కులు సాధించాడు. గేట్–2025లో ఎలక్ట్రానిక్స్ అండ్ క మ్యూనికేషన్స్ విభాగంలో ఆలిండియా 23వ ర్యాంకు సాధించిన దినేష్‌ను కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, సన్నిహితులు అభినందించారు.