వై.రామవరం: మండలంలోని కోట గ్రామ ప్రజల ఆధ్వర్యంలో గురువారం మావోయిస్టులకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. తమకు మావోయిజం వద్దని, అబివృద్ధే ముఖ్యమని నినాదాలు చేస్తూ వీధుల్లో తిరిగారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గతంలో మావోయిస్టులు అడ్డుకోవడంతో మారుమూల ప్రాంతాలకు రోడ్ల నిర్మాణం, సెల్ టవర్ల నిర్మాణం వంటి అబివృద్ధి కారక్రమాలు నిలిచిపోయాయని చెప్పారు. రవాణా సదుపాయం లేక రోగులను డోలీల్లో తరలించే పరిస్థితి ఉండేదన్నారు. ఇప్పుడిప్పుడే అబివృద్ధి చెందుతున్న మారుమూల ప్రాంత అభివృద్ధిని మావోయిస్టులు అడ్డుకోవద్దని కోరారు. అనంతరం మానవహారం నిర్వహించి, మావోయిజం జోలికి వెళ్లమని స్థానికులు ప్రతిజ్ఞ చేశారు.