సాక్షి, పాడేరు: ఉమ్మడి విశాఖ జిల్లా నవ నిర్మాణ సమితి రూపొందించిన తాగునీటి సంరక్షణ పంచసూత్రాల ప్రచార పోస్టర్‌ను కలెక్టర్ ఎ.ఎస్.దినేష్‌కుమార్ గురువారం తన చాంబర్‌లో ఆవిష్కరించారు. పంచసూత్రాలపై అన్ని గ్రామాల్లో ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత, తాగునీటి వనరుల సంరక్షణ, సురక్షిత తాగునీటి వినియోగం ద్వారా ఆరోగ్యకరమైన గిరిజన సమాజం సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో కె.పద్మలత, జిల్లా నవనిర్మాణ సంస్థ కార్యదర్శి ఎ.రఘురామ్, సీనియర్ మేనేజర్లు రవికుమార్, వి.వి.ఎస్.ఎస్.కుమార్ పాల్గొన్నారు.