ముంచంగిపుట్టు: ముంచంగిపుట్టు మండల వాసులకు త్వరలోనే సబ్ పోస్టాఫీసు సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్టు అనకాపల్లి డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు తెలిపారు. మండల కేంద్రంలో బుధవారం ఆయన సబ్ పోస్టాఫీసు ఏర్పాటుకు అనుకూలమైన ప్రభుత్వ భవనాలు, స్థలాలను పరిశీలించారు. స్థానిక ఎంపీడీవో సూర్యనారాయణమూర్తి, తహసీల్దార్ నర్సమ్మలను కలిసి సబ్ పోస్టాఫీసు ఏర్పాటుకు భవనం లేక స్థలం కేటాయించాలని కోరుతూ వినతిపత్రం అందించారు. ఇందుకు వారు సైతం సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా పోస్టల్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు మాట్లాడుతూ పోస్టల్ సేవలు విస్తరణలో భాగంగా ముంచంగిపుట్టు మండల కేంద్రంలో సబ్ పోస్టాఫీసు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రసుత్తం డిజిటల్ యుగంలో ఆధునిక సాంకేతికతతో పోస్టల్ శాఖ పని చేస్తుందని, తపాలా జీవిత బీమా, గ్రామీణ జనాభాకు బ్యాంకింగ్ సేవలు, పాస్ పోర్టు వంటి సేవలు విస్తృతం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అరకు డివిజన్ పోస్టల్ ఐపీవో లక్ష్మికిషోర్, పెదబయలు ఎంవో శ్రీను పాల్గొన్నారు.
అనకాపల్లి డివిజన్ పోస్టల్
సూపరింటెండెంట్ శ్రీనివాసరావు