సాక్షి,పాడేరు/సీలేరు: బాలికలపై లైంగిక దాడులకు పాల్పడితే పోక్సో కేసులు నమోదు చేస్తామని విశాఖ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్ హెచ్చరించారు.జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ అధ్యక్షురాలు ఎం.వి.శేషమ్మ అధ్యక్షతన పాడేరు లోని శ్రీకృష్ణాపురం గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో, సీలేరు జెడ్పీ పాఠశాలలో ఆదివారం నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సుల్లో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. బాలికలపై లైంగిక దాడులకు పాల్పడే వారికి 10 నుంచి 15ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందన్నారు. బాలికలపై రోజురోజుకు పెరుగుతున్న అఘాయిత్యాల నిర్మూలనకు తీసుకోవలసిన చర్యలపై అవగాహన కల్పించారు.ప్రతి విద్యార్థిని గుడ్‌టచ్ ,బ్యాడ్‌టచ్‌లపై, పొక్సో చట్టంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు.విద్యార్థులు సినిమాల ప్రభావాలకు గురి కాకుండా ఉన్నత లక్ష్యాలను ఏర్పర్చుకోవాలని చెప్పారు. గిరిజన విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన చదువులతో దేశానికే ఆదర్శంగా నిల వాలన్నారు. మనం ఏ ప్రాంతంలో ఉన్నా లక్ష్యాన్ని నిర్దేశించుకుని, పట్టుదలతో సాధన చేస్తే విజయం లభిస్తుందని తెలిపారు. న్యాయ విజ్ఞాన సదస్సులను జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్నట్టు చెప్పా రు. జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ అధ్యక్షురాలు ఎం.వి.శేషమ్మ మాట్లాడుతూ గిరిజన బాలికలంతా పోక్సో చట్టంపై అవగాహన ఏర్పర్చుకోవాలన్నారు. పాడేరులో జరిగిన సమావేశంలో చోడవరం కోర్టు సబ్‌జడ్జి వి.గౌరీశంకర్,అనకాపల్లి ప్రిన్సిపల్ సివిల్ జడ్జి ధర్మారావు, ఏఎస్పీ ధీరజ్, డీఎంహెచ్‌వో డాక్ట ర్ జమాల్‌బాషా,ఐసీడీఎస్ సీడీపీవో సూర్యలక్ష్మి,డీఈవో బ్రహ్మాజీరావు,ఇన్‌చార్జి గిరిజన సంక్షేమశాఖ డీడీ ఎల్.రజనీ, తహసీల్దార్ త్రినాథనాయుడు, శ్రీకృష్ణాపురం హెచ్‌ఎం మంజుల తదితరులు పాల్గొన్నారు. సీలేరులో జరిగిన కార్యక్రమంలో చింతపల్లి జూనియర్ సివిల్ జడ్జి ఎం.రోహిత్, జిల్లా విద్యాశాఖాఽధికారి బ్రహ్మాజీరావు, సీడీపీవో లక్ష్మి, సీఐ వరప్రసాద్, తహసీల్దార్ రామకృష్ణ, వైద్యాధికారులు మస్తాన్‌వల్లీ, హిమబిందు పాల్గొన్నారు.
సినిమా ప్రభావాలకు దూరంగా ఉండాలి
విశాఖ జిల్లా ప్రధాన న్యాయమూర్తి
ఆలపాటి గిరిధర్
బాలికలపై లైంగిక దాడులకు పాల్పడితే పోక్సో కేసులు
బాలికలపై లైంగిక దాడులకు పాల్పడితే పోక్సో కేసులు