● రాష్ట్ర సర్పంచ్‌ల సంక్షేమ కార్యవర్గ సభ్యుడు కుందరి రామకృష్ణ
గూడెంకొత్తవీధి: మండలంలో 6 పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు జమ కాలేదని రాష్ట్ర సర్పంచ్‌ల సంక్షేమ కార్యవర్గ సభ్యుడు, దామనాపల్లి పంచాయతీ సర్పంచ్ కుందరి రామకృష్ణ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ గతేడాది నవంబరు 13న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేసిందన్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ నిధులు ఆయా పంచాయతీల ఖాతాల్లో జమకాలేదన్నారు. 25 కోట్ల రూపాయలు జమ కావల్సి ఉందన్నారు. ఈ విషయంపై ఇప్పటికే పంచాయతీ రాజ్ కమిషనర్‌కు వినతి పత్రం ఇచ్చామన్నారు. ఈ నెలాఖరుతో ఆర్థిక సంఘం ముగియనున్న నేపథ్యంలో నిధులను తక్షణమే జమ చేయాలని కోరారు.