● ఆస్పత్రికి తరలించిన సహోద్యోగులు
గంగవరం: మండలంలోని జగ్గంపాలెం గ్రామ సచివాలయంలో సర్వేయరుగా విధులు నిర్వహిస్తున్న ఇ.నాగార్జున మంగళవారం ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. గోకవరం మండల రామన్నపాలెం గ్రామ శివారులో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. అంతకుమందు ఆయన ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సహోద్యోగులకు చెప్పడంతో వారు అప్రమత్తమయ్యారు. లొకేషన్ తెలుసుకుని వెంటనే అక్కడికి చేరుకుని ప్రాణాపాయం నుంచి కాపాడారు. అప్పటికే చేతిని బ్లేడ్‌తో కోసుకోవడంతో రక్తస్రావంతో ఉన్నాడు. వెంటనే అతనిని సహోద్యోగులు గోకవరం పీహెచ్‌సీకి తీసుకువెళ్లారు. ఉన్నతాధికారుల వేధింపులు, వృత్తిపరమైన ఒత్తిడి తదితర సమస్యల కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సర్వేయర్ నాగార్జున తమకు వాట్సాప్‌లో పంపినట్టు సహోద్యోగులు తెలిపారు.