
వాగులో పడవపై గాలింపు
● కుటుంబ సభ్యుల అనుమానం
● గాలింపు ముమ్మరం
ఎటపాక: మండలంలోని తోటపల్లి వాగులో గన్నవరం గ్రామానికి చెందిన ఒక రైతు గల్లంతయ్యాడు. గ్రామానికి చెందిన కర్రి సత్యనారాయణ(60) సోమవారం పశువులు మేపేందుకు తోటపల్లి వాగు అవతలికి వెళ్లాడు. ఈ నేపథ్యంలో సాయంత్రం గోదావరికి వరద పెరగడంతో తోటపల్లి వాగులోకి నీరు పోటెత్తింది. పశువులు మేపేందుకు వెళ్లిన సత్యనారాయణ చీకటి పడినా ఇంటికి రాకపోవడంతో కుటుంభ సభ్యులు వాగు పరివాహక ప్రాంతాల్లో వెతికారు. పశువులు మాత్రమే రాత్రి 10 గంటలకు ఇంటికి చేరాయి. దీంతో పశువులతోపాటు సత్యనారాయణ వాగు దాటే క్రమంలో గల్లంతై ఉంటాడని కుటుంభ సభ్యులు భావిస్తున్నారు. మంగళవారం ఉదయం కూడా పడవలు, ఈతగాళ్లతో వరద నీటిలో గాలించినప్పటికీ ఎటువంటి లభ్యం కాలేదు.