
పోలీసులకు పట్టుబడిన గంజాయి స్మగ్లర్లు
కొయ్యూరు: నాలుగు కిలోల గంజాయితోపాటు ముగ్గురి నిందితులను అరెస్టు చేశామని మంప ఎస్‌ఐ లోకేష్‌కుమార్ తెలిపారు. బూదరాళ్ల శివారున మంగళవారం వాహనాలు తనిఖీ చేస్తుండగా, ఒడిశాలోని సప్పర్లమెట్ట నుంచి తీసుకువస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. తమన చూసి పారిపోయందుకు ప్రయత్నించగా వెంబడించి పట్టుకున్నామన్నారు. కొత్తపేటకు చెందిన జనపాటి శివ, తలడం సత్యనారాయణమూర్తి, నిమ్మపాడుకు చెందిన గొల్లూరి కామేశ్వరరావులను అరెస్టు చేసి ద్విచక్ర వాహనాన్ని, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు.