
గాలికొండ ఆర్బీకే వద్ద రాయితీ విత్తనాలనుఅందజేస్తున్న ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి
గూడెంకొత్తవీధి: రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోందని పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అన్నారు. మండలంలోని గాలికొండ, అమ్మవారి దారకొండ పంచాయతీల్లో శుక్రవారం ఆమె పర్యటించారు. రాయితీపై వ్యవసాయశాఖ పంపిణీ చేస్తున్న మేలురకపు వరి విత్తనాలను గాలికొండ ఆర్బీకే వద్ద రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో విత్తనాలకోసం రైతులు ఎదురు చూసేవారన్నారు. ఇప్పుడు గ్రామాల్లో వారి చెంతకే విత్తనాలు వచ్చి చేరుతున్నాయని చెప్పారు. రైతులు వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ బోయినకుమారి, వైఎస్సార్‌సీపీ ఎస్టీసెల్ జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి లక్ష్మణ్, ఈవోపీఆర్డీ పాపారావు, సర్పంచ్‌లు బుజ్జిబాబు,రామకృష్ణ, తాగునీటి సరఫరా విభాగం జేఈ భగవంతరావు, పంచాయతీ కార్యదర్శులు వెంకటరమణ, శ్రీనివాస్, రెడ్డి నాయకులు, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి