
చికిత్స పొందుతున్న బ్రాండిక్స్ కార్మికురాలు
అచ్యుతాపురం (అనకాపల్లి): బ్రాండిక్స్ ఆవరణలో పనులు ముగించుకొని ఇళ్లకు వెళుతున్న కార్మికుల బస్సులు పరస్పరం ఢీకొనడంతో పది మందికి పైగా గాయపడ్డారు. గురువారం జరిగిన ఈ ఘటనతో కార్మికులు ఆందోళనకు గురయ్యారు. గాయపడిన సత్య, కుమారి, రామలక్ష్మి, ధన, నాగలక్ష్మి, దేవి తదితరులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
ఒక బస్సు బ్రేక్ ఫెయిల్ అవ్వడం వల్లే ఈ ప్రమాదం సంభవించినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని, వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేయాలని సీఐటీయూ నాయకుడు ఆర్.రాము డిమాండ్ చేశారు.