
మాట్లాడుతున్న పీవో సూరజ్ ధనుంజయ్ గనోరే
చింతూరు: డివిజన్‌లో ప్రజా పంపిణీ వ్యవస్థపై ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చింతూరు ఐటీడీఏ పీవో సూరజ్ ధనుంజయ్ గనోరే హెచ్చరించారు. ఇప్పటికే కొన్ని ఫిర్యాదులు అందాయని ఆయన తెలిపారు. మంగళవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో జీసీసీ అధికారులు, ఎంఎల్‌ఎస్ ఇన్‌చార్జులు, రేషన్‌డీలర్లు, సంచార వాహనాల ఆపరేటర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంఎల్‌ఎస్ ఇన్‌చార్జులు నెలాఖరులోగా రేషన్ సరకులు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. ఐదవ తేదీలోగా సంచార వాహనాల ద్వారా అంగన్‌వాడీ కేంద్రాలకు, పాఠశాలలకు సరకులను చేరవేయాలన్నారు. ఎక్కడైనా అవకతవకలు జరిగినట్టు తన దృష్టికి వస్తే సహించేది లేదని, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి శివప్రసాద్, సహాయ పౌరసరఫరాల అధికారి శ్రీహరి, జిల్లా మేనేజర్ గణేష్‌కుమార్, జీసీసీ మేనేజర్ రాజారెడ్డి, తహసీల్దార్ సాయికృష్ణ పాల్గొన్నారు.
ఐటీడీఏ పీవో సూరజ్ ధనుంజయ్ గనోరే