
కొరియా ప్రతినిధులతో మంత్రి అమర్‌నాథ్
మహారాణిపేట : భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న వ్యాపార సంస్థలు ఆంధ్రప్రదేశ్‌ను ఎంచుకుంటున్నాయని ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. పారిశ్రామిక వేత్తలను ఆకర్షించే విధంగా రాష్ట్రంలో పారిశ్రామిక విధానం అమల్లో చేస్తున్నామన్నారు. అందుకే ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ఏపీని ఎంచుకుంటున్నారని చెప్పారు. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ నేతృత్వంలో కొరియా అధికారుల ప్రతినిధుల బృందం సోమవారం ప్రభుత్వ సర్య్కూట్ హౌస్‌లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ను మర్యాద పూర్వకంగా కలుసుకుంది. విశాఖపట్నంలో ఫుడ్ ప్రొసెసింగ్, టెక్స్‌టైల్స్, ఎంఎస్‌ఎంఈ పార్కులు ఏర్పాటు అంశంపై చర్చించామని మంత్రి అమర్‌నాథ్ తెలిపారు. వర్తక వాణిజ్యరంగంలో ఆంధ్రప్రదేశ్ సౌత్ ఏషియాకు ముఖ ద్వారంగా నిలిచిందని మంత్రి అమర్‌నాఽథ్ కొరియా బృందానికి వివరించారు. ఇరుదేశాల మధ్య వ్యాపార సంబంధాలు మరింత బలపడాలని మంత్రి అమర్‌నాఽథ్ ఆకాంక్షించారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ డైరెక్టర్ సృజన తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర పారిశ్రామిక విధానమే కారణం
కొరియా ప్రతినిధులతో మంత్రి అమర్ భేటీ