యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు
కైలాస్‌నగర్: ఆదిలాబాద్ నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరైంది. రూ.200 కోట్లతో అత్యాధునిక వసతులతో నిర్మించేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 2న జీవో జారీ చేసింది. సీఎం రేవంత్‌రెడ్డి ఆదిలాబాద్ పర్యటన నేపథ్యంలో ప్రతిష్టాత్మక స్కూల్ మంజూరు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. నియోజకవర్గంలోని నిరుపేద విద్యార్థులకు కేజీ టు పీజీ వరకు ఒకే చో ట నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ స్కూళ్లకు శ్రీకారం చుట్టింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు మూడు మంజూరు కాగా తాజాగా నాలుగోది ఆదిలాబాద్ నియోజకవర్గానికి మంజూరైంది. ఈ పాఠశాల నిర్మాణం కోసం పట్టణంలోని నిషాన్‌ఘాట్‌లో 30 ఎకరాల స్థలాన్ని అధికారులు ఇది వరకే గుర్తించి ప్రభుత్వానికి ప్రతిపాదననలు పంపించిన విష యం విదితమే. పాఠశాల మంజూరుపై ఎమ్మెల్యే పాయల్ శంకర్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జీలు హర్షం వ్యక్తం చేశారు.


