దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
ఉట్నూర్‌రూరల్: దివ్యాంగుల సంక్షేమానికి ప్ర భుత్వం చర్యలు చేపడుతుందని ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్ అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంను స్థానిక వికాసం పా ఠశాలలో బుధవారం ఘనంగా నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన కేక్ కట్ చేసి మా ట్లాడారు. దివ్యాంగులు అన్నిరంగాల్లో రాణించాలన్నారు. అనంతరం క్రీడల్లో ప్రతిభ కనబరి చిన విద్యార్థులను అభినందించి బహుమతి ప్రదానం చేశారు. ముందుగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఇందులో ఐటీడీఏ డీడీ అంబాజీ జాదవ్, ఏటీడీవోలు సదానందం, నిహారిక, జగన్, ఐటీడీఏ బీఈడి కళాశాల ప్రిన్సిపాల్ రాథోడ్ మాణిక్‌రావు, వివిధ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
ఆత్మస్థైర్యంతో రాణించేలా ప్రోత్సహించాలి
కై లాస్‌నగర్: దివ్యాంగుల్లోని లోపాలు ఎత్తిచూపకుండా వారిలో ఆత్మవిశ్వాసం నింపి అన్ని రంగాల్లో రాణించేలా ప్రోత్సహించాలని అదనపు కలెక్టర్ శ్యామలాదేవి అన్నారు. జెడ్పీ సమావేశ మందిరంలో బుధవారం అంతర్జాతీ య దివ్యాంగుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె దివ్యాంగ చిన్నారులతో కలిసి కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి మిల్కా, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్, డిప్యూటీ డీఎంహెచ్‌వో సాధ న , అధికారులు, దివ్యాంగులు, తదితరులు పాల్గొన్నారు.


