ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేయాలి
కై లాస్‌నగర్: జిల్లాకేంద్రంలో గురువారం నిర్వహించనున్న సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్‌రెడ్డి అన్నారు. ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పదేళ్ల బీఆర్‌ఎస్ సర్కారు ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోలేదని ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతు భరో సా, రుణమాఫీ, సన్నబియ్యం, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, ఉచిత కరెంట్, రూ.500లకే గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్సుప్రయాణం వంటి అనేక సంక్షేమ పథఽకాలను అమలు చేస్తుందని గుర్తు చేశారు. రెండేళ్ల పాలనలో ప్రభుత్వం చేసిన మంచి పనులకు గుర్తుగా ప్రజా పాలన విజయోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆదిలాబాద్ మున్సిపల్ అభివృద్ధికి రూ.18కోట్లు ఇచ్చామన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి సీఎం సభను జయప్రదం చేసి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. ఇందులో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందన్, డీసీసీ అధ్యక్షుడు నరేశ్ జాదవ్, ఆదిలాబాద్, బోథ్, ఆసిఫాబాద్ అసెంబ్లీ ఇన్‌చార్జిలు కంది శ్రీనివాసరెడ్డి, ఆడె గజేందర్, శ్యాంనాయక్ , డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మాజీ ఎంపీ సోయం బాపూరావు పాల్గొన్నారు.
బోథ్: మండలకేంద్రంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో పి.సుదర్శన్‌రెడ్డి సమావేశం నిర్వహించారు. ఆయనకు నాయకులు స్వాగతం పలికారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిచేలా ప్రతీ కార్యకర్త కృషి చేయాలన్నారు.


