Type -1 diabetes
-
అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయిల్లోనే టైప్-1 డయాబెటిస్ ముప్పు ఎక్కువ
ఆధునికకాలంలో చాలామందిని వేధిస్తున్న సమస్య డయాబెటిస్. అయితే తాజా అధ్యయనంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అమ్మాయిల కంటే అబ్బాయిల్లోనే టైప్ 1 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని యూకే లోని యూనివర్శిటీ ఆఫ్ ఎక్సెటర్‌కి చెందిన పరిశోధనా బృందం వెల్లడించింది. చిన్నపిల్లలకు టైప్-1 డయాబెటిస్ (T1D) వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని ఈ అధ్యయనం కనుగొంది. తాజా అధ్యయనం ప్రకారం అమ్మాయిల్లో 10 ఏళ్ల తర్వాత టైప్ 1 మధుమేహం రిస్క్ గణనీయంగా తగ్గుతుంది. కానీ అబ్బాయిల్లో మాత్రం ఈ ముప్పు స్థిరంగా ఉంటుందని పరిశోధన వెల్లడించింది. సెక్స్ హార్మోన్లు పాత్ర పోషిస్తాయని పరిశోధన తెలిపింది. పురుషుల్లోని ఆటోఆంటిబాడీల అభివృద్ధితో దీనికి సంబంధం ఉండవచ్చని సూచించింది. రోగనిరోధక వ్యవస్థ, దీనికి సంబంధించిన ప్రోటీన్లైన్ ఆటోఆంటిబాడీ ఎక్కువున్న అబ్బాయిల్లో ప్రమాదం ఉందని అధ్యయనం చూపించింది. వీరు మెజారిటీ ఆటో ఇమ్యూన్ వ్యాధుల మాదిరిగా కాకుండా ఈ తరహా మధుమేహానికి ప్రభావితమవుతారని వెల్లడించింది.ఈ అధ్యయనంలో కంప్యూటర్, స్టాటిస్టికల్ మోడలింగ్ డేటా సాయంతో పరిశోధకులు టీఐడీ ఉన్న వ్యక్తుల 235,765 మంది బంధువులను పరిశీలించారు. ఇందులో మగవారిలో అధిక ఆటోయాంటిబాడీ స్థాయిలు ఉన్నట్లు కనుగొన్నారు (అమ్మాయిల్లో: 5.0శాతం, పురుషుల్లో: 5.4శాతం). అలాగే మగవారు మల్టిపుల్ యాంటిబాడీ ప్రతిరోధకాలకు పాజిటివ్ వచ్చే అవకాశం ఉన్నందున వీరిలో ఐదేళ్ల ముందే ఈ టీఐడీ వచ్చే అవకాశం ఉంది. పదేళ్ల వయస్సులో వచ్చే ప్రమాదంలో మార్పు టీనేజ్-సంబంధిత హార్మోన్లు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నఅధ్యయన బృందం మరింత పరిశోధన కోసం పిలుపునిచ్చింది. ఈ సంవత్సరం సెప్టెంబర్ 9-13 వరకు జరిగే స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో యూరోపియన్ అసోసియేషన్ వార్షిక సమావేశంలో ఈ ఫలితాలను ప్రెజెంట్ చేయనున్నారు. -
ఇక రోజూ ఇన్సులిన్ అవసరం లేదు!
మధుమేహం అనేది ఒక దీర్ఘకాలిక అనారోగ్య సమస్య. ఈ వ్యాధి ఒకసారి వస్తే ఎప్పటికీ నయం కాదు. ఎందుకంటే దీనిని పూర్తిగా నయం చేసే చికిత్స లేదు. అందుకే మధుమేహం రాకముందే అదుపులో ఉంచుకోవడం మంచిది. ఇక షుగర్ వ్యాధి వచ్చిందంటే ప్రతిరోజూ మందులు, ఇన్సులిన్ ఇంజెక్షన్లు వాడాల్సిందే. అయితే ఇకపై ఆ కష్టాలు కొంతవరకు తీరనున్నాయి. ప్రతిరోజూ కాకుండా వారంలో ఒకసారి మాత్రమే ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకుంటే సరిపోతుందట. సైంటిస్టులు జరిపిన క్లినికల్ ట్రయల్స్‌లో ఈ విషయం వెల్లడైంది. భారత్‌లో మధుమేహం దూకుడు పెంచుతోంది. ఏటా మధుమేహం బాధితుల సంఖ్య పెరుగుతోంది. దాదాపుగా 10 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని ‘లాన్సెట్’లో పబ్లిష్ చేసిన ఒక అధ్యయనంలో తేలింది. కేంద్ర ఆరోగ్య శాఖ నిర్వహించిన ఈ అధ్యయనంలో దాదాపు 13.6 కోట్ల మందికి ప్రీడయాబెటిస్ ఉందని అంచనా వేశారు. మనుషుల్లో తగినంత ఇన్సులిన్, హార్మోన్ తయారుకాకపోవడం లేదా ఆ పరిస్థితిలో సరిగ్గా ప్రతిస్పందించలేకపోవటం వల్ల హై బ్లడ్ షుగర్ వస్తుంది. లైఫ్ స్టైల్లో మార్పులు, ఫ్యామిలీ హిస్టరీ వల్ల ఈమధ్య కాలంలో తక్కువ వయసులోనే పలువురు మధుమేహం బారిన పడుతున్నారు. డయాబెటిస్‌ను నియంత్రణలో పెట్టకపోతే ప్రాణానికే ప్రమాదం ఉంది. కొన్నిసార్లు కిడ్నీ ఫెయిల్యూర్, కంటిచూపు పోవడం వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. అందుకే మధుమేహం రాకముందే పరిస్థితిని అదుపులో ఉంచుకోవడం మంచిది. మధుమేహం రెండు రకాలుగా ఉంటుంది. ఇందులో టైప్-2 డయాబెటిస్ సాధారణమైంది. ప్రతిరోజూ మందులు వాడితే సరిపోతుంది. ఇక టైప్-1 డయాబెటిస్ వారు మాత్రం జీవితాంతం ప్రతిరోజూ ఇన్సులిన్ తీసుకోవాల్సిందే. ఒకరోజూ ఇన్సులిన్ తీసుకోకపోయినా పరిస్థితి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు వీరికి కాస్త ఉపశమనం లభించనుంది. శాస్త్రవేత్తలు తాజాగా రూపొందించిన 'ఐకోడెక్' అనే ఇన్సులిన్‌తో కేవలం వారానికి ఒకసారి మాత్రమే ఇంజెక్షన్ తీసుకుంటే సరిపోతుంది. ఇది డైలీ తీసుకునే ఇన్సులిన్ షాట్స్‌కి సమానంగా ఉంటుందని క్లినికల్ ట్రయల్స్‌లో వెల్లడైంది. 'ఐకోడెక్' ఇన్సులిన్ రక్తంలో గ్లూకోజ్ లెవల్స్‌ను సమర్థవంతంగా నియంత్రించడంలో సహాయపడుతుందని తేలింది. టైప్-1 డయాబెటిస్తో బాధపడుతున్న 582 మంది రోగులపై ఈ ట్రయల్స్ నిర్వహించారు. వీరిలో సగం మందికి 'ఐకోడెక్' అనే ఇంజెక్షన్‌ను ఇవ్వగా, మిగతా సగం మందికి 'డెగ్లుడెక్' అనే సాధారణ ఇన్సులిన్ ఇంజెక్షన్(రోజూ వాడేది)ను ఇచ్చారు. దాదాపు 26 వారాల తర్వాత వీరి HbA1C(గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్)లెవల్స్‌ను పరిశీలించగా.. ఊహించని మార్పులను కనుగొన్నారు. డెగ్లుడెక్ ఇన్సులిన్‌తో పోలిస్తే తాజాగా శాస్త్రవేత్తలు కొనిపెట్టిన ఐకోడెక్ ఇన్సులిన్‌ను వాడిన వాళ్లలో హైపోగ్లైసీమిక్ (తక్కువ గ్లూకోజ్ స్థాయిలు) కాస్త ఎక్కువ ఉన్నప్పటికీ ఇదంత పెద్ద విషయం కాదని, ఈ రకమైన ఇన్సులిన్‌తో వారానికి ఒకసారి మాత్రమే ఇంజెక్షన్ తీసుకుంటే సరిపోతుందని వెల్లడించారు. -
మాత్రలతో మధుమేహానికి చెక్..!
ఇటీవలి కాలంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరూ మధుమేహంతో సతమతమవుతున్నారు. తీపి తినాలనుకుంటే నోరు కట్టేసుకోవడమే కాదు.. తరచూ చెకప్‌లు చేయించుకోవడం, ఇన్సులిన్ స్థాయిని అదుపులో ఉంచేందుకు ఇంజక్షన్లు తీసుకోవడం వంటి అంశాలు షుగర్ పేషంట్లకు మరింత కష్టతరంగా మారుతున్నాయి. అయితే ఇన్సులిన్ మాత్రలను అందుబాటులోకి తేవడం ద్వారా తరచూ ఇంజక్షన్ తీసుకోవాల్సిన అవసరాన్ని తప్పించి.. వారి ఇబ్బందుల్ని కాస్తైనా దూరం చేయొచ్చని తాజా పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. ఇన్సులిన్‌ను మాత్రల రూపంలో అందించేందుకు తాము జరిపిన పరిశోధనలు సత్ఫలితాలను ఇస్తున్నాయని హార్వర్డ్ జాన్ పాల్సన్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ అప్లైడ్ సైన్సెన్ బయాలజీ ప్రొఫెసర్ సమీర్ మిత్రగొట్రి అంటున్నారు. అయితే కడుపులో ఉండే ఆమ్లాలు జీర్ణవ్యవస్థలోకి చేరకముందే ఇన్సులిన్‌ను నిర్వీర్యం చేయడం వల్ల మాత్రలు పూర్తి స్థాయిలో ప్రభావం చూపలేవన్నారు. ‘ఇన్సులిన్ మాత్రను పేగు లోపలి పంపించవచ్చు. కానీ ప్రొటీన్ల రవాణాను అడ్డుకునే విధంగా పేగు నిర్మాణం రూపొంది ఉండటం వల్ల అది పేగు గోడలను దాటలేదన్నారు. పేగు గోడలపై ఉన్న శ్లేష్మ పొర గుండా ఇన్సులిన్‌ను పంపించి రక్తంలోకి ప్రవహించేలా చేయడం కూడా సవాలుతో కూడుకున్న పని’ అని ఆయన వివరించారు. అయితే ఆమ్లాలను తట్టుకునే తొడుగు ఉండే మాత్రలను తయారు చేయడం ద్వారా సమస్యను అధిగమించవచ్చని పేర్కొన్నారు. దీంతో ఇన్సులిన్ మాత్రలు చిన్న పేగులను చేరే వరకూ ఇన్సులిన్‌ను విడుదల చేసే అవకాశం ఉండదు గనుక రక్తంలోకి సులభంగా ప్రవేశపెట్టవచ్చన్నారు. ఇన్సులిన్ మాత్రల ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఆరు మధుమేహ రహిత ఎలుకలపై పరిశోధనలు చేసినట్లు ఆయన తెలిపారు. ఇందులో మూడింటికి మాత్రల రూపంలో, మిగిలిన వాటికి ఇంజక్షన్ ద్వారా ఇన్సులిన్ అందించినట్లు తెలిపారు. అయితే మాత్రలు ఇచ్చిన ఎలుకల్లో రక్తంలోని గ్లూకోజ్ స్థాయి రెండు గంటల్లోపే 38 శాతానికి పడిపోయిందని.. ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా తగ్గుతూ 10 గంటల్లో 45 శాతానికి చేరిందన్నారు. ఇంక్షన్ ఇచ్చిన ఎలుకల్లో గ్లూకోజ్ స్థాయి గంటలోపే 49 శాతానికి పడిపోయినట్లు గుర్తించామన్నారు. ఇన్సులిన్ మాత్రల ప్రభావ శీలతను అంచనా వేసేందుకు ఈ పరిశోధనలు సరిపోవని, వివిధ జంతువులపై పరిశోధనలు చేయడం ద్వారా పురోగతి సాధించే అవకాశం ఉందని తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను తాజా జర్నల్‌లో సమీర్ మిత్రగొట్టి పొందుపరిచారు. అయితే మధుమేహ చికిత్సకు నోటి ద్వారా ఇన్సులిన్ అందించే ప్రక్రియలో ఏర్పడే సైడ్ ఎఫెక్ట్స్ ను రూపుమాపేందుకు లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. -
టైప్-1 డయాబెటిస్‌కు చికిత్స ఉందా?
హోమియో కౌన్సెలింగ్ టైప్-1 డయాబెటిస్ అంటే ఏమిటి? మా పిల్లవాడికి టైప్-1 డయాబెటిస్ అన్నారు. దీని గురించి వివరించి, మావాడు పాటించాల్సిన ఆహార నియమాలు వివరించండి. - నరేంద్రకుమార్, విజయవాడ పిల్లల్లో సాధారణంగా 15 ఏళ్ల లోపు వారిలో వచ్చే చక్కెర వ్యాధిని టైప్-1 డయాబెటిస్ అంటారు. టైప్-1 డయాబెటిస్ అంటే ఇందులో క్లోమగ్రంథి అస్సలు పనిచేయదు. అంటే క్లోమగ్రంథి తయారు చేయాల్సిన ఇన్సులిన్ శరీరంలో అస్సలు ఉండదు. లక్షణాలు: టైప్-1 డయాబెటిస్ హఠాత్తుగా వస్తుంది. రక్తంలో గ్లూకోజు ఆర్నెల్ల నుంచి పన్నెండు నెలల్లోపు 100-500 పెరగవచ్చు. ఆకలి, దాహం వేయడం, మూత్రవిసర్జనకు ఎక్కువసార్లు వెళ్తుంటారు. రోగనిరోధకశక్తి తగ్గడంతో తరచూ ఇన్ఫెక్షన్ల బారిన పడుతుంటారు. ఎదుగుదల తగ్గుతుంది. చిన్నపిల్లల్లో డయాబెటిస్ ఉంటే పాటించాల్సిన ఆహార నియమాలు: పిల్లల్లో ఎలాంటి ఆహార నియమాలు వద్దు 15-25 మధ్య వయసువారు లావుగా ఉంటేనే బరువు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే జంక్‌ఫుడ్ తగ్గించుకోవాలి. ఇన్సులిన్ నిరోధకత రక్తంలో ట్రైగ్లిజరైడ్స్‌ను పెంచుతుంది కాబట్టి ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉంటే ఆహారంలో పిండిపదార్థాలు తగ్గించుకోవాలి 5-15 ఏళ్ల వయసువారికి ఎలాంటి ఆహారనియమాలు పెట్టకూడదు. వారి ఎదుగుదల కోసం వాళ్ల బరువుకు తగినట్లు ఎన్ని క్యాలరీలు అవసరమవుతాయో డైటీషియన్‌ను సంప్రదించి వారు చెప్పినట్లు పాటించాలి. త్వరగా జీర్ణమయ్యే పిండి పదార్థాలను వాడాలి. మార్కెట్లో దొరికే పిజ్జా, బర్గర్, ఐస్‌క్రీమ్స్, నూడుల్స్, బిస్కెట్లు వాడకూడదు.పిల్లల ఎదుగుదలకు ఆహారం ఎంతోముఖ్యం. కాబట్టి తల్లిదండ్రులు ఆహారం విషయంలో ఆంక్షలు విధించడం, ఆహారాన్ని తగ్గించి, వ్యాయామాలను పెంచడం చేస్తే అసలే పిల్లల్లో తక్కువగా ఉండే రోగనిరోధకశక్తి మరింత తగ్గుతుంది. దీనికితోడు క్షయవ్యాధి వచ్చే ప్రమాదం ఉంది. చికిత్స: హోమియోలో టైప్-1కు అద్భుతమైన వైద్యం అందుబాటులో ఉంది. ఇన్సులిన్‌తోపాటు హోమియో మందులు ఇవ్వడం వల్ల పిల్లల్లో రోగనిరోధకశక్తి పెరుగుతుంది. మీరు మీ బాబుకు హోమియో చికిత్స ఇప్పిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. - డాక్టర్ టి.కిరణ్ కుమార్ డైరక్టర్,పాజిటివ్ హోమియోపతి,విజయవాడ, వైజాగ్