breaking news
Pre-school students
-
చిన్నారుల చదువుపై కోవిడ్ దెబ్బ.. నీతి ఆయోగ్ అధ్యయనం
సాక్షి, అమరావతి: దేశంలోని మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు పిల్లల చదువులపై కోవిడ్ మహమ్మారి తీవ్ర ప్రభావాన్ని చూపినట్లు నీతి ఆయోగ్ వెల్లడించింది. ప్రధానంగా లాక్డౌన్ సమయంలో ఈ వయస్సులోని పిల్లల చదువులు, ఆరోగ్య సంరక్షణ తదితర అంశాల్లో ఏర్పడిన అంతరాయాలపై నీతి ఆయోగ్ అధ్యయనం చేసింది. ఆ సమయంలో దేశంలోని అన్ని పాఠశాలలు, ప్రీస్కూల్స్, అంగన్వాడీ కేంద్రాలను మూసివేయాల్సి వచ్చింది. చిన్న పిల్లల వ్యక్తిగత విద్యను పూర్తిగా నిలిపేయడంతో మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు పిల్లల ప్రారంభ అభ్యాసానికి తీవ్ర అంతరాయం కలిగిందని అందులో తేలింది. ఈ వివరాలను డిసెంబర్ 2020 నుంచి ఫిబ్రవరి 2021 మధ్య సేకరించినట్లు నీతి ఆయోగ్ వెల్లడించింది. అందుబాటులోలేని దూరవిద్య ఇక కోవిడ్ సంక్షోభ సమయంలో పిల్లలు చదువుకోవడానికి వీలుగా దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు ఏడాదిపాటు దూరవిద్య అందించేందుకు చర్యలను చేపట్టాయి. ఆన్లైన్ ప్లాట్‌ఫాంలు, టీవీ, రేడియో ద్వారా ఈ ప్రయత్నాలు జరిగాయి. అయితే.. దేశంలోని చాలా కుటుంబాలకు ఈ దూరవిద్య అందలేలేని అధ్యయనం పేర్కొంది. 42 శాతం కుటుంబాల్లోని పిల్లలకు మాత్రమే కొంతమేర అభ్యసించే అవకాశం కలిగిందని, మిగతా కుటుంబాల పిల్లలకు లేదని తెలిపింది. ఉదా.. కోవిడ్‌కు ముందు ఆంధ్రప్రదేశ్‌లో దేశంలోనే అత్యధికంగా మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు పిల్లలు 84 శాతం మంది స్కూళ్లు, అంగన్వాడీ కేంద్రాల్లో చేరారని.. అయితే సంక్షోభ సమయంలో ఏపీలో కేవలం 29 శాతం కుటుంబాల్లోని పిల్లలకు మాత్రమే దూరవిద్య అందిందని ఆ నివేదిక తెలిపింది. అలాగే, రాజస్థాన్‌లో 23 శాతం మంది, తమిళనాడులో 17 శాతం మంది కుటుంబాల్లోని పిల్లలకు మాత్రమే ఈ అవకాశం దక్కింది. అయితే.. దేశంలోని వివిధ రాష్ట్రాల మధ్య దూరవిద్య సౌకర్యంలో అంతరాలున్నాయని, కొన్ని రాష్ట్రాల్లో దూర విద్య ఎక్కువ శాతం పిల్లలకు అందుబాటులో ఉండగా కొన్ని రాష్ట్రాల్లో తక్కువగా ఉందని నివేదిక పేర్కొంది. వీడియోల వైపు పిల్లల మొగ్గు 2020 మార్చి కోవిడ్ లాక్డౌన్ సమయంలో దేశంలోని ప్రతి ముగ్గురు పిల్లల్లో ఒకరు వీడియోలు చూడటానికి అలవాటుపడ్డారని.. టీవీ, ఫోన్ల వినియోగంతోపాటు కంప్యూటర్లో గేమ్‌లూ ఆడారని 41 శాతం పట్టణ తల్లిదండ్రులు తెలిపారు. కోవిడ్ కష్టకాలంలో ఒత్తిడి తీవ్రంగా ఎదుర్కొన్నట్లు 90 శాతం మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లు చెప్పారు. తమిళనాడులో 66 శాతం మంది, ఆంధ్రప్రదేశ్‌లో 64 శాతం, ఒడిశాలో 60 శాతం మంది 2021 జనవరి, ఫిబ్రవరిలో అత్యధిక ఒత్తిడికి లోనైనట్లు వారు వెల్లడించారు. పిల్లల వైద్యంపై కూడా.. మరోవైపు.. లాక్డౌన్ కారణంగా 2020 మార్చి–మే నెలల మధ్య తల్లి, నవజాత శిశువులు, పిల్లల ఆరోగ్య సేవలు కూడా గణనీయంగా తగ్గిపోయినట్లు ఆ అధ్యయనంలో తేలింది. ఆసుపత్రుల్లో కాన్పులు 21 శాతం తగ్గిపోగా ఆ స్థానంలో ఇంటివద్దే జరిగాయని.. అంతేకాక, ఆ సమయంలో గర్భిణీల ఆరోగ్య పరీక్షలూ నిలిచిపోయాయని నీతి ఆయోగ్ నివేదిక తెలిపింది. ఇక కోవిడ్ తొలినాళ్లలో రెండేళ్లలోపు పిల్లలకు టీకాలు వేయడంలో కొంత అంతరాయం ఏర్పడినప్పటికీ 86 శాతం పిల్లలకు వేశారు. పట్టణ ప్రాంతాల్లో 90 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 85 కుటుంబాల్లోని పిల్లలకు ఇవి అందినట్లు నివేదిక వెల్లడించింది. అలాగే, గ్రామీణ ప్రాంతాల్లో 94 శాతం, పట్టణ ప్రాంతాల్లో 93 శాతం కుటుంబాలు కోవిడ్ సమయంలో తమ పిల్లలకు ఇతర వైద్య సదుపాయాలు అందాయని తెలిపారు. -
అంగట్లో అంగన్ వాడీ సరుకులు!
సుభద్ర(బలిజిపేట రూరల్): ఒక వైపు పౌష్టికాహార వారోత్సవాలు.. మరోవైపు అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు అందించాల్సిన సరుకులు అంగడికి తరలిపోతున్నాయి. ఇదేమని అడిగితే సాక్షాత్తు అంగన్వాడీ కార్యకర్తే బియ్యం తానే అమ్మానని సమాధానమివ్వడం విశేషం. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని సుభద్ర ఒకటవనంబరు అంగన్వాడీ కేంద్రం నుంచి అక్రమంగా అంగట్లోకి తరలిస్తున్న 50 కిలోల బియ్యాన్ని గ్రామస్తులు శుక్రవారం పట్టుకున్నా రు. మండలంలోని పక్కి గ్రామానికి చెందిన వ్యాపారి గ్రా మంలోని అంగన్వాడీ కేంద్రం నుంచి బియ్యాన్ని తెస్తుండ గా పట్టుకున్నామని గ్రామస్తులు కర్రి అచ్యుతరావు, రంభ.కృష్ణ, చన్నమల్లి మహేష్, గంట ఎల్లనాయుడులు తెలిపారు. అంగన్వాడీ కేంద్రాన్ని సక్రమంగా తెరవడం లేద ని, పిల్లలకు పౌష్టికాహారం సక్రమంగా పంపిణీ చేయడం లేదని గ్రామంలోని చిన్న పిల్లల తల్లితండ్రులు తెలిపారు. కార్యకర్త నెలకు 20రోజులు గ్రామంలో ఉండదని మిగిలిన 10 రోజులు వచ్చినా సరుకులు సక్రమంగా పంపిణీ చేయడం లేదని ఆరోపించారు. ఇటువంటి కేంద్రాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశా రు. ఆ వ్యాపారి నుంచి మరిన్ని వివరాలు సేకరిస్తే బియ్యం విక్రయ వివరాలు చాలావర కు దొరికే అవకాశాలున్నాయని గ్రామస్తులు చెప్పారు. కేంద్రంలో ప్రీ స్కూలు పిల్లలు 21 మంది, ఏడు నెలల నుంచి 3 సంవత్సరాల లోపు వారు 25 మంది, గర్భిణి ఒకరు, బా లింతలు ఆరుగురు ఉన్నట్టు రికార్డులలో చూపుతున్నారు. కేంద్రాన్ని ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4 గంట ల వరకు నిర్వహించాల్పి ఉన్నప్పటికీ పిల్లలు లేక కేంద్రం వెలవెలబోతోంది. దీనిపై కార్యకర్త జి.హైమావతిని వివరణ కోరగా బియ్యం తానే అమ్మానని ఒప్పుకున్నారు. ‘హాజరు పట్టిలో 5వ తేదీ నాటి హాజరు వేయలేదు. ప్రీస్కూ లు విద్యార్థులకు వంటవండలేదని’ స్పష్టం చేశారు. మరికొన్ని బియ్యం తడిసి ముద్దయి పాడయ్యాయన్నారు.