breaking news
pre paid
-
ఆ పాపులర్ ‘జియో ప్లాన్’ ఇక లేదు
Reliance Jio New Plan: ఆధునిక కాలంలో ఎక్కువమంది వినియోగించే నెట్‌వర్క్‌లలో రిలయన్స్ జియో (Reliance Jio) ఒకటని అందరికి తెలుసు. అయితే ఇప్పుడు సంస్థ ఇప్పటి వరకు అందించిన ఒక ప్రీపెయిడ్ ప్లాన్ నిలిపివేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. కంపెనీ ఇప్పటి వరకు అందిస్తున్న రూ. 119 ప్లాన్ నిలిపివేసి, ఆ స్థానంలో రూ. 149 ప్లాన్ తీసుకువచ్చింది. సాధారణంగా రూ. 119తో రీఛార్జ్ చేసుకుంటే 14 రోజుల పాటు అన్లిమిటెడ్ కాల్స్ మాత్రమే కాకుండా, ప్రతి రోజూ 1.5 జీబీ డేటా, 100 మెసేజులు చేసుకోవడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు ఈ ప్లాన్ స్థానంలో కొత్త ప్లాన్ పుట్టుకొచ్చింది. రూ. 119 స్థానంలో వచ్చిన రూ. 149 ప్లాన్ వ్యాలిడిటీ ఇప్పుడు 20 రోజుల వరకు ఉంటుంది. అలాగే రోజుకి 1 జీబీ డేటాతో సహా 100 మెసేజిలు చేసుకోవచ్చు. అంతే కాకుండా ఈ ప్లాన్ ద్వారా యూజర్లు జియో టీవీ యాప్, జియో సినిమాల్లో కార్యక్రమాలను చూసే అవకాశం ఉంటుంది. ఇదీ చదవండి: ఖరీదైన కారు కొన్న పుష్ప నటుడు - ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు! ఇదిలా ఉండగా.. ఇటీవల జియో తన యూజర్లకు నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌తో మొదటిసారి రెండు ప్లాన్స్ లాంచ్ చేసింది. దీంతో ఒక ప్లాన్ రూ. 1099 (84 రోజుల వ్యాలిడిటీ) కాగా, మరో ప్లాన్ రూ. 1499 (84రోజుల వ్యాలిడిటీ). ఈ రెండింటిలోనూ వినియోగదారుని లభించే డేటా ప్యాక్ వేరువేరుగా ఉంటుందని గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ మొబైల్స్ ప్లాన్ ధర రూ. 149 కాగా, బేసిక్ ప్లాన్ ధర రూ. 199గా ఉంటుంది. -
త్వరలో ప్రీ-పెయిడ్ కరెంట్ విధానం
-
ముందే బాదుడు...
సాక్షి, హైదరాబాద్: ఇకపై వినియోగదారులు ముందుగానే కరెంటు బిల్లు కట్టాల్సి ఉంటుంది! ఆ మొత్తానికి కరెంటును వాడుకున్న వెంటనే సదరు వినియోగదారుడి ఇంటికి సరఫరా నిలిచిపోతుంది. మళ్లీ రీ-చార్జ్ చేసుకుంటేనే విద్యుత్ వెలుగులను పొందుతారు. ఇదే ప్రీ-పెయిడ్ విధానం. దీన్ని త్వరలో అమలు చేసేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు సిద్ధమవుతున్నాయి. ప్రీ-పెయిడ్ మీటర్ల విధానాన్ని ప్రవేశపెట్టాలని కేంద్రం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అధికారులు దీనిపై కసరత్తు చేస్తున్నారు. విద్యుత్ బకాయిలు కోట్లలో పేరుకుపోతుండటం, సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం, దొంగ కరెంటు వినియోగం.. తద్వారా విద్యుత్ సరఫరా, పంపిణీ(టీ అండ్ డీ) నష్టాలు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో ప్రీ-పెయిడ్ మీటర్ల విధానాన్ని కేంద్రం తెరమీదకు తెచ్చింది. ఈ మేరకు రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శు(సీఎస్)లకు కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శి ప్రదీప్ కె. సిన్హా లేఖ రాశారు. ముందుగా ప్రభుత్వ కార్యాలయాలు, మునిసిపాలిటీలు, పంచాయతీల్లో అమలు చేయాలని ఆదేశించారు. అనంతరం మిగిలిన వినియోగదారులకూ వర్తింపజేయాలని పేర్కొన్నారు. ప్రస్తుతం వినియోగిస్తున్న ప్రీ పెయిడ్ ఫోన్ల తరహాలోనే.. ఈ ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లు పనిచేస్తాయి. ఒక్కో వినియోగదారుడికి ప్రీ పెయిడ్ సిమ్‌ను డిస్కంలు మంజూరు చేస్తాయి. ఈ సిమ్‌కు ప్రత్యేక నంబర్ ఉంటుంది. దీన్ని ముందుగా కావాల్సిన మొత్తంతో రీచార్జి చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ సిమ్‌ను మీటర్లో అమర్చిన వెంటనే కరెంటు సరఫరా అవుతుంది. ఈ సిమ్‌లో బ్యాలెన్స్ అయిపోగానే ఆటోమేటిక్‌గా కరెంటు సరఫరా నిలిచిపోతుంది. మళ్లీ సిమ్‌లో రీచార్జి చేయించుకుంటేనే కరెంటు సరఫరా తిరిగి ప్రారంభమవుతుంది. అయితే, ఈ విధానం ద్వారా... నెలనెలా చాంతాడంత క్యూలో నిలబడి విద్యుత్ బిల్లు చెల్లించడం, గడువులోగా చెల్లించలేదనే కారణంగా కనెక్షన్లు తొలగించడం వంటి సమస్యల నుంచి వినియోగదారులకు ఊరట లభిస్తుంది. తమకూ బకాయిల భారం తప్పుతుందని విద్యుత్ పంపిణీ సంస్థలు అంటున్నాయి. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో కలిపి వివిధ ప్రభుత్వ కార్యాలయాలు సుమారు రూ. 1,300 కోట్ల మేరకు విద్యుత్ చార్జీలను బకాయి పడిన విషయాన్ని గుర్తు చేస్తున్నాయి. అయితే ఈ మీటర్ల కొనుగోలుకు అయ్యే వ్యయ భారాన్ని విద్యుత్ చార్జీల రూపంలో మళ్లీ వినియోగదారులపైనే మోపుతారని విద్యుత్ రంగ నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం సాధారణ మీటర్లు వెయ్యి నుంచి రెండు వేల రూపాయలు చెల్లిస్తే లభిస్తున్నాయి. కానీ ప్రీ పెయిడ్ మీటర్లకు రూ. 5 వేల నుంచి రూ. 7 వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది. రెండు రాష్ట్రాల్లో కలిపి కేవలం గృహ విద్యుత్ కనెక్షన్లే రెండు కోట్లకుపైగా ఉన్నాయి. ఒక్కో మీటరుకు సగటున రూ. 6 వేలు లెక్కించినా... రూ. 12 వేల కోట్లకుపైగా నిధులను మీటర్ల కొనుగోలుకు వెచ్చించాల్సి ఉంటుందని నిపుణుల అంచనా. దీంతో ఈ భారాన్ని చార్జీల పెంపుతో జనంపైనే వేయడం ఖాయమన్న ఆందోళన వ్యక్తమవుతోంది.