హీరోతో 'బ్రహ్మముడి' సీరియల్ నటి నిశ్చితార్థం
మరో తెలుగు సీరియల్ నటి నిశ్చితార్థం చేసుకుంది. తోటి నటుడితో ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు ఫొటోలు పోస్ట్ చేయడంతో అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే సడన్ సర్ప్రైజ్ ఇచ్చేసరికి సదరు నటి అభిమానులు కాస్త కన్ఫ్యూజన్ అవుతున్నారా? ఇంతకీ ఈ నిశ్చితార్థం నిజమేనా? లేదంటే ఇంకేదైనా ఉందా?'బ్రహ్మముడి' సీరియల్లో అప్పు పాత్రతో గుర్తింపు తెచ్చుకుంది నైనిషా రాయ్. కొన్నాళ్ల ముందు వరకు బాయ్ కట్లో రౌడీ బేబీ తరహాలో ఆకట్టుకుంది. ఇప్పుడు పవర్ఫుల్ పోలీస్ పాత్ర చేస్తోంది. ఇవన్నీ పక్కనబెడితే సడన్‌గా తోటి నటుడు ఆశిష్ చక్రవర్తితో ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు పోస్ట్ పెట్టింది. 'మొత్తానికి మేం సాధించాం' అని క్యాప్షన్ పెట్టింది. చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న తర్వాత మా రోజు వచ్చింది. నాకు సపోర్ట్ సిస్టమ్‌గా ఉన్నందుకు థాంక్యూ ఆశిష్ చక్రవర్తి అని రాసుకొచ్చింది.(ఇదీ చదవండి: ఆ హాలీవుడ్ మూవీ చూస్తుంటే 'జెర్సీ' గుర్తొచ్చింది: నాగవంశీ)ఆశిష్ చక్రవర్తి విషయానికొస్తే.. ఇతడు కూడా ప్రస్తుతం తెలుగులో 'చామంతి' అనే సీరియల్ చేస్తున్నాడు. తమిళ సీరియల్స్‌లోనూ నటిస్తున్నాడు. నటుడు కాకముందు ఇతడు బాడీ బిల్డర్. మిస్టర్ మద్రాస్ 2018, మిస్టర్ ఇండియా చెన్నై 2017, మిస్టర్ చెన్నై ఇంటర్నేషనల్ 2019 తదితర టైటిల్స్‌ని గెలుచుకున్నాడు. మొన్నీమధ్యే జరిగిన 'సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్' షోలోనూ చామంతి సీరియల్ టీమ్ విజేతగా నిలవడంలో ఆశిష్ కీలక పాత్ర పోషించాడు.నిశ్చితార్థం విషయానికొస్తే.. కొందరు కొత్త జంటకు కంగ్రాట్స్ చెబుతుంటే.. మరికొందరు మాత్రం ఇది సీరియల్ కోసం అని అంటున్నారు. నైనిషాకు ఇదివరకే పెళ్లయిందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా ఈ విషయంపై అటు నైనిషా గానీ లేదంటే ఆశిష్ స్పందిస్తే తప్ప క్లారిటీ రాదు.(ఇదీ చదవండి: హీరో 'రవితేజ' కుటుంబంలో విషాదం) View this post on Instagram A post shared by Nainisha (@nainisha_rai)