naga peace pact
-
తుది ఘట్టంలో ‘నాగా చర్చలు’
వలస పాలకులు వదిలివెళ్లిన సమస్యల్లో అత్యంత సంక్లిష్టమైన నాగాలాండ్ సమస్యపై కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్లక్రితం ప్రారంభించిన శాంతి చర్చల ప్రక్రియ నేటితో ముగుస్తోంది. ఇంతవరకూ దేనిపైనా స్పష్టత లేనందువల్ల ఈ ప్రక్రియను మరికొంత కాలం కొనసాగించాలని నాగాలాండ్‌లోని భిన్న సంస్థలు కోరుతున్నాయి. కానీ కేంద్రం తన వైఖరేమిటో ఇంకా చెప్పలేదు. ఏడు దశాబ్దాలుగా నానుతూ, మూడు దశాబ్దాలుగా సంక్షోభాల మధ్యే భిన్న ప్రభుత్వాల హయాంలో శాంతి చర్చలు సాగుతూ ఈ నాగా సమస్య సవాలు విసురుతూనే ఉంది. తొలిసారి 1986లో ఆనాటి ప్రధాని రాజీవ్‌గాంధీ మిజో నేషనల్ ఫ్రంట్(ఎంఎన్ఎఫ్)తో శాంతి ఒప్పందంపై సంతకాలు చేశారు. ఆ తర్వాత 2015లో ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో అటువంటిదే కుదిరింది. దానిపై దాదాపు అన్ని పక్షాలూ హర్షం వెలిబుచ్చినా ఈశాన్య రాష్ట్రాల్లో... ముఖ్యంగా అస్సాం, మణిపూర్, అరుణా చల్‌ప్రదేశ్‌లలో ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అయితే దాన్ని ఒప్పందం అనకుండా, ఒప్పందానికి సంబంధించిన స్వరూపం(ఫ్రేమ్‌వర్క్) అని అప్పట్లో కేంద్రం ప్రకటించింది. ఆ స్వరూపానికి అను గుణంగా స్పష్టమైన విధివిధివిధానాలతో, సవివరమైన నిబంధనలతో ఒప్పందం కుదర్చుకుంటా మని చెప్పింది. అయితే అప్పటినుంచీ చర్చలు సాగుతూనే ఉన్నా ఇంతవరకూ ఒప్పందం తుది మెరుగులు దిద్దుకుందన్న సూచనలెక్కడా లేవు. భిన్న పక్షాలతో తాను సాగిస్తున్న చర్చలు ముగింపు దశకొచ్చాయని కేంద్రం తరఫున వారితో మాట్లాడుతున్న నాగాలాండ్ గవర్నర్ ఆర్ఎన్ రవి ఇటీవల చెప్పారు. కానీ ఉన్నట్టుండి మ్యువా పక్షం చేసిన ప్రకటన పెనుతుపాను రేపింది. నాగాలాండ్‌కు ప్రత్యేక జెండా, ప్రత్యేక రాజ్యాంగం ఉండాలన్నదే తమ కృతనిశ్చయమని దాని సారాంశం. ఒకపక్క కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే 370 అధికరణను ఉండరాదనుకున్న కేంద్రం ఇలాంటి డిమాండ్లకు తలొగ్గుతుందని ఎవరూ అనుకోరు. కానీ ఈ డిమాండ్ పెట్టడంలోనే మ్యువా పక్షం కఠిన వైఖరి అర్ధమవుతుంది. పైగా భారతీయులకూ, నాగాలకూ మధ్య పరస్పర సహజీవనం ఎప్పటినుంచో ఉన్నదని, ఉమ్మడి ప్రయోజనాల కోసం ఇకముందూ అది కొనసాగుతుందని తెలిపి సంచలనం రేపింది. అయితే రవి అంటున్నట్టు కేవలం చర్చల ప్రక్రియను సాగదీయడం ఒక్కటే మ్యువా ప్రకటన వెనకున్న లక్ష్యమా లేక ఇతరత్రా ఉద్దేశాలున్నాయా అన్నది చూడాల్సి ఉంది. కానీ సమస్య ఎంత జటిలమైనదో, అది ఏ స్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తున్నదో అటు మణిపూర్ ప్రభుత్వం, ఇటు అరుణాచల్ ప్రదేశ్‌లో వెలువడుతున్న ప్రకటనలే తార్కాణం. తమను ప్రభావితం చేసేలా ఎలాంటి నిర్ణయాలు ఉండటానికి వీల్లేదని ఆ రెండు రాష్ట్రాల్లోని విద్యార్థి సంఘాలు, ఇతర సంస్థలూ అంటు న్నాయి. ఎన్ఎస్సీఎన్–ఐఎం కోర్కెలు సాధారణమైనవి కాదు. నాగా ప్రజలు అధికంగా నివసిస్తున్న మణిపూర్‌లోని నాలుగు జిల్లాలు, అస్సాంలోని రెండు జిల్లాలు, అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలూ కలిపి విశాలం నాగాలాండ్ ఏర్పాటు చేయాలని అది కోరుతోంది. ఈ ప్రాంతాలన్నిటా మొత్తంగా 12 లక్షలమంది నాగా ప్రజలున్నారు. ఇక్కడ మాత్రమే కాదు... పొరుగునున్న మయన్మార్‌లో సైతం ఆ జాతి ప్రజలున్నారు. వివిధ ప్రభుత్వాలు ప్రదర్శిస్తున్న వివక్ష వల్ల తమ జాతి జనం నానా ఇబ్బందులూ పడుతున్నారని, తమ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు ధ్వంసమవుతున్నా యని ఐఎం ఆరోపిస్తోంది. దీనిపై ఆ సంస్థ మొదటినుంచీ గట్టిగా పట్టుబడుతున్నందునే 2015లో ఒప్పందం కుదిరిందన్న ప్రకటన వెలువడినప్పుడు అస్సాంతోపాటు మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో అనేక అనుమానాలు తలెత్తాయి. ఇప్పుడున్న భౌగోళిక సరిహద్దులేవీ మారవని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చినా అవి సమసిపోలేదు. కుదిరిన ఆ ఒప్పందంలోని అంశాలు బయటపెట్టాలని అప్పట్లో ఆ రాష్ట్రాలు కోరాయి. ఇప్పుడు ఆ మూడుచోట్లా బీజేపీ ప్రభుత్వాలు వచ్చాయి. కనుక ప్రభు త్వాలు మాట్లాడటం లేదుగానీ అక్కడి ప్రజా సంఘాలు డిమాండు చేస్తూనే ఉన్నాయి. అయితే సమస్య ఉన్నప్పుడు, అది అత్యంత సంక్లిష్టమైనది అయినప్పుడు పరిష్కార మార్గంలో అవరోధాలు ఉండటం సహజమే. అవి ఉన్నాయి కదా అని మొత్తం పరిష్కారం జోలికే పోకుండా ఉండటం మరిన్ని సమస్యలు తెచ్చిపెడుతుంది. ఏడు దశాబ్దాలుగా నాగాలాండ్ నెత్తుటి చరిత్రే దీనికి సాక్ష్యం. నాగాలాండ్‌లో ఎన్నో మిలిటెంట్ సంస్థలు ఆవిర్భవించాయి. అవి సాగించిన హింసవల్ల ఎందరో పౌరులు, మిలిటెంట్లు, భద్రతా బలగాలకు చెందినవారు మరణించారు. తరచు తెగల మధ్య ఘర్షణలు చెలరేగి వందలాదిమంది ఊచకోతకు బలయ్యారు. 60వ దశకంలో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ తొలిసారి తిరుగుబాటుదార్లతో న్యూఢిల్లీలో చర్చలకు సిద్ధపడ్డారు. అయితే తమకు కేటాయించిన హోటల్ గదులను ఒక విదేశీ బృందం కోసం ఖాళీ చేయించడంతో ఆగ్రహించిన తిరుగుబాటుదార్లు చర్చలకు స్వస్తిచెప్పి నిష్క్రమించారు. కేంద్రం తమకు సమాన స్థాయినిచ్చి మాట్లాడకపోతే చర్చల సమస్యేలేదని అప్పట్లో తిరుగుబాటుదార్లు ప్రకటించారు. అటుపై మిలిటెంట్ సంస్థల మధ్య ఉన్న విభేదాలను ఉపయోగించుకుని ప్రభుత్వాలు వాటిని బలహీనపరచడానికి ప్రయత్నించాయి. అయితే పాత సంస్థలు కనుమరుగవుతున్నా అంతకు మించిన శక్తితో కొత్తవి పుట్టుకొస్తున్నాయి. కేంద్రం గత కొంతకాలంగా మ్యువా పక్షంతోనూ, ఏడెనిమిది సంస్థలకు ప్రాధాన్యం వహిస్తున్న నాగా నేషనల్ పొలిటికల్ గ్రూప్(ఎన్‌ఎన్‌పీజీ)తోనూ విడివిడిగా చర్చిస్తోంది. ఐఎం వంటి సంస్థను చర్చలకు ఒప్పించడమే కాదు...ఫ్రేమ్‌వర్క్‌పై సంతకం కూడా చేయించిన కేంద్రం ఇప్పుడు చివరి దశలో అన్ని పక్షాలనూ తన దారికెలా తెచ్చుకుంటుందన్నది చూడాల్సి ఉంది. చర్చల ఉద్దేశం శాంతి స్థాపన కనుక, అది సాధ్యపడే వరకూ వాటిని కొనసాగించడమే ఉత్తమం. అప్పుడు మాత్రమే దీర్ఘకాలంగా ఈశాన్యాన్ని పీడిస్తున్న సమస్యకు అర్ధవంతమైన పరిష్కారం సాధ్య పడుతుంది. -
‘నాగా’తో శాంతి ఒప్పందం
నాగా తిరుగుబాటుదారులతో శాంతి ఒప్పందం కుదుర్చుకున్న భారత ప్రభుత్వం * ప్రధాని సమక్షంలో ఇరుపక్షాల సంతకాలు న్యూఢిల్లీ: నాగాలాండ్‌లో దశాబ్దాల అంతర్యుద్ధానికి అంతం పలికే దిశగా కేంద్రం చరిత్రాత్మక ముందడుగు వేసింది. తిరుగుబాటుకు నేతృత్వం వహిస్తున్న ‘నేషనలిస్ట్, సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్- ఇసాక్, మ్యువా(ఎన్ఎస్సీఎన్- ఐఎం)’ సంస్థతో శాంతి ఒప్పందం కుదుర్చుకుంది. ప్రధాని మోదీ సమక్షంలో సోమవారం ప్రభుత్వ ప్రతినిధి ఆర్ఎన్ రవి, ఎన్ఎస్సీఎన్- ఐఎం నేత టీ మ్యువా(79) ఆ శాంతి ఒప్పందంపై సంతకాలు చేశారు. నాగాలాండ్‌లో శాంతి నెలకొనే దిశగా వేసిన చరిత్రాత్మక అడుగుగా ఈ ఒప్పందాన్ని మోదీ అభివర్ణించారు. 16 ఏళ్లుగా దాదాపు 80 రౌండ్ల పాటు సాగిన చర్చల ఫలితంగా ఈ శాంతి ఒప్పందం రూపొందింది. అంతకుముందు 1997లో ఇరువర్గాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్‌ల్లో నాగా ప్రజలు అధికంగా ఉన్న ప్రాంతాలను ఏకం చేయాలన్న ఎన్ఎస్సీఎన్- ఐఎం డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరించిందా? లేదా? అన్న విషయం వెల్లడి కాలేదు. ఒప్పందం వివరాలను త్వరలో విడుదల చేస్తామని అధికార వర్గాలు వెల్లడించాయి. నాగా తీవ్రవాద సంస్థల్లో అతి పెద్దదైన ‘ఎన్ఎస్సీఎన్- ఐఎం’.. కేంద్రంతో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమలు చేస్తుండగా, ఖప్లాంగ్ నాయకత్వంలోని ‘ఎన్ఎస్సీఎన్ - కే’ హింసామార్గంలో ఉంది. ప్రత్యేక నాగాలాండ్ కోసం సాగిన పోరాటంలో 3 వేల మందికి పైగా చనిపోయారు. మొదట స్వతంత్ర నాగాలాండ్ కావాలని డిమాండ్ చేసిన తిరుగుబాటు దారులు.. తరువాత నాగా ప్రజల ప్రాబల్యం అధికంగా ఉన్న ప్రాంతాలనన్నింటినీ ఏకం చేయాలనే డిమాండ్‌ను ముందుకు తెచ్చారు. ఖప్లాంగ్ సంస్థతో కూడా 2001లో భారత ప్రభుత్వం కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకుంది. కానీ ఆ సంస్థ తరచుగా ఆ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. ముఖ్యంగా నాగాలాండ్, మణిపూర్లలో దాడులు, అవినీతి, అక్రమంగా పన్నుల సేకరణ, బలవంతంగా డబ్బుల వసూళ్లకు దిగుతూ సామాన్యులను ఇక్కట్లపాలు చేస్తున్నాయి. వలస పాలన అందించిన విషాద వారసత్వం.. మోదీ: శాంతి ఒప్పందంపై సంతకాల సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘ఈ రోజు ఒక సమస్యకు అంతం పలకడమే కాదు.. నూతన భవిష్యత్తు దిశగా ముందడుగు వేస్తున్నాం’ అన్నారు. నాగా ప్రజలనుద్దేశించి.. ‘గాయాలు మాన్పే, సమస్యలను పరిష్కరించే విషయాల్లోనే కాదు.. మీ గౌరవప్రతిష్టలను నిలుపుకునే మీ ప్రయత్నాల్లో కూడా భాగస్వాములవుతాం’ అని హామీ ఇచ్చారు. ఆరు దశాబ్దాల ఈ సంక్షోభం వలస పాలన అందించిన వారసత్వ విషాదమని మోదీ వ్యాఖ్యానించారు. ఎన్ఎస్సీఎన్ - ఐఎం నేతలు టీ మ్యువా, ఇసాక్ స్వులను ప్రశంసిస్తూ.. వారు చూపిన దార్శనికత, ధైర్య సాహసాల వల్లనే ఈ చరిత్రాత్మక ఒప్పందం సాధ్యమైందన్నారు. ‘నాగా ప్రజల ధైర్య సాహసాలు, పట్టుదల అనితర సాధ్యం.’ అని కొనియాడారు. భారత ప్రభుత్వం, నాగా ప్రజల సంబంధాల్లో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతోందన్న టీ మ్యువా.. మరిన్ని సమస్యలు ముందున్నాయని హెచ్చరించారు. ఈశాన్యరాష్ట్రాల్లో శాంతి నెలకొనడం, ఆ రాష్ట్రాల ఆర్థికాభివృద్ధికి కృషి చేయటం తమ ముందున్న ప్రధాన కర్తవ్యమన్నారు. ఇతర పార్టీల నేతలతో సమాలోచనలు.. ఈ ఒప్పందంపై సంతకాలు జరిపే ముందు.. పలు పార్టీల నేతలతో మోదీ మాట్లాడారు. వారిలో మాజీ ప్రధాని మన్మోహన్, కాంగ్రెస్ నేత ఖర్గే, ములాయం, మాయావతి, శరద్ పవార్, సీతారాం యేచూరి తదితరులున్నారు. మమత బెనర్జీ, జయలలిత, డీఎంకే నేత కరుణానిధి, జేడీఎస్ నేత దేవేగౌడ, నాగాలాండ్ గవర్నర్, రాష్ట్ర సీఎంతోనూ మాట్లాడారు. తిరుగుబాటు సంస్థలు... నాగా నేషనల్ కౌన్సిల్: 1940-1950కాలంలో రాజకీయరంగంలో ఉంది. నాగా నేషనల్ కౌన్సిల్(అడినో): తొలి నాగా రాజకీయ సంస్థ. నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్(ఇసాక్-ముయివా): 1980 జనవరి 31న ఏర్పాటైంది. నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్(ఖప్లాంగ్): మయన్మార్, భారత్‌లోని కొన్ని ప్రాంతాలను కలపాలటూ 1988లో ఏర్పాటైంది. నాగా ఫెడరల్ గవర్నమెంట్: 1970లలో సాగిన వేర్పాటువాద ఉద్యమం నాగా ఫెడరల్ ఆర్మీ: 1970లలో పనిచేసిన వేర్పాటువాద గెరిల్లా సంస్థ. -
నాగాలతో కేంద్రం శాంతి ఒప్పందం
-
విభజించి పాలించడం వల్లే ఈ సమస్య: మోదీ
-
విభజించి పాలించడం వల్లే ఈ సమస్య: మోదీ
బ్రిటిష్ పాలకులు అవలంబించిన 'విభజించి పాలించు' అనే విధానమే నాగాలాండ్‌లో సమస్యకు ప్రధాన కారణంగా నిలిచిందని, ఈశాన్యా రాష్ట్రాల శాంతిభద్రతలు, అక్కడి అభివృద్ధి తన ఎజెండాలో అత్యంత ప్రధానమని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. నాగాలతో అత్యంత కీలకమైన శాంతి ఒప్పందం కుదిరిన సందర్భంగా ఆయన తన అధికారిక నివాసమైన నెం.7 రేస్‌కోర్సు రోడ్డులో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. ఈ చారిత్రక సందర్భంలో వచ్చినవారందరికీ అభినందనలు అనారోగ్యం కారణంగా ఐసెక్ స్వు ఈ కార్యక్రమానికి రాలేకపోవడం దురదృష్టకరం నాగా రాజకీయ సమస్య దాదాపు 6 దశాబ్దాల పాటు ఇబ్బందిపెట్టింది దీంతో కొన్ని తరాల ప్రజలు బాగా ఇబ్బంది పడ్డారు ఐసెక్ సు, ముయివా లాంటివాళ్లు సహకరించడం వల్లే ఈ చారిత్రక ఒప్పందం కుదిరింది ఎన్ఎస్సీఎన్ దాదాపు రెండు దశాబ్దాల పాటు కాల్పుల విరమణ ఒప్పందాన్ని గౌరవించింది. అందుకు కృతజ్ఞతలు నేను నాగాలాండ్‌కు చాలాసార్లు వెళ్లాను. వాళ్లు చాలా అద్భుతమైన మానవత్వం చూపించారు బ్రిటిష్ పాలకుల కారణంగానే నాగా ప్రజలు ఇన్నాళ్లుగా దేశానికి దూరంగా ఉన్నారు వాళ్లు కావాలనే నాగాల గురించి భారతదేశంలోని ఇతర ప్రాంతాల వాళ్లకు చెడుగా చెప్పారు వాళ్ల విభజించి పాలించే లక్షణమే ఇలా చేసింది మహాత్మా గాంధీ లాంటి చాలామంది నాగాలను ప్రేమించారు, వాళ్ల సెంటిమెంట్లను గౌరవించారు ఆర్థికాభివృద్ధి, అభివృద్ధి చాలాకాలం పాటు అసలు జరగలేదు ఈశాన్య రాష్ట్రాల్లో శాంతిభద్రతలు, అభివృద్ధి నా ప్రాధాన్యాల్లో ముందున్నాయి నాగా నాయకులతో చర్చించేందుకు ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించాను వాళ్ల ఆలోచనలు, సెంటిమెంట్లను గౌరవిస్తూ.. ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు అన్ని విధాలా ముందుంటామని ఈ సందర్భంగా ప్రకటిస్తున్నా.