breaking news
mla gadari kishore
-
బీజేపీ కుట్రలో పావులా మారొద్దు..
సాక్షి, హైదరాబాద్: బలమైన ప్రాంతీయ పార్టీలను విచ్ఛిన్నం చేయడమే లక్ష్యంగా బీజేపీ కుట్రలు చేస్తోందని ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్ ఆరోపించారు. ఈ కుట్రలో మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పావుగా మారొద్దని హితవు పలికారు. ఆదివారం నల్లగొండలో జరిగిన బహిరంగ సభలో బీజేపీపై ప్రవీణ్‌కుమార్ ఒక్క మాట కూడా మాట్లాడలేదని విమర్శించారు. కేసీఆర్ ఇచ్చిన ప్రోత్సాహం వల్లే గురుకుల సొసైటీలో ప్రవీణ్ రాణించిన విషయం గుర్తుంచుకోవాలని సూచించారు. అంతా తనవల్లే జరిగిందని డబ్బా కొట్టుకుంటున్నారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భాస్కర్‌రావు, శానంపూడి సైదిరెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్‌తో కలసి సోమవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కిశోర్ మాట్లాడుతూ.. ఏ పార్టీలోనైనా చేరే హక్కు ప్రవీణ్‌కు ఉందని, అయితే కేసీఆర్‌పై ఇష్టారీతిన మాట్లాడితే మాత్రం సహిం చేది లేదని హెచ్చరించారు. ఏనుగెక్కి ప్రగతిభవన్‌కు వెళ్తానంటూ ప్రవీణ్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ఉత్తరప్రదేశ్‌లో బీఎస్పీ ఎవరి చేతుల్లో ఉందో తెలుసా అని ప్రశ్నించారు. గతంలోనూ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పార్టీలు పెట్టి ఏమయ్యారో అందరికీ తెలుసని, ప్రగతిభవన్‌కు సుస్థిరంగా వెళ్లేది ‘కారు’మాత్రమేనని వ్యాఖ్యా నించారు. మేధావి ముసుగులో దళితులకు అన్యాయం చేయొద్దని హితవు పలికారు. దళితబంధు పథకం చూసి కేసీఆర్‌ను విమర్శించే వారిలో భయం మొదలైందని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ లాంటి పథకాలు ఒక్కటి కూడా లేదని ఎమ్మెల్యే సైదిరెడ్డి అన్నారు. దళితవర్గాలకు నష్టం చేసే కుట్రలకు ప్రవీణ్‌కుమార్ లాంటి వారిని బీజేపీ వాడుకుంటోందని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. -
రేవంత్‌రెడ్డికి జీవితాంతం చిప్పకూడే: పల్లా
సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో ఇప్పటికే నెల రోజులు జైల్లో గడిపిన టీటీడీపీ నేత రేవంత్‌రెడ్డి తన తీరు మార్చుకోకపోతే జీవితాంతం జైలులో చిప్పకూడు తినక తప్పదని శాసన మండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి హెచ్చరించారు. కోస్గిలో టీడీపీ పాదయాత్ర ముగింపు సందర్భంగా ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుపై రేవంత్‌రెడ్డి అనుచిత విమర్శలు చేశారని మండిపడ్డారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌తో కలసి గురువారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో టీడీపీ దీపం ఆరిపోయే దశలో ఉందని, ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్న చందంగా రేవంత్ వ్యవహార శైలి ఉందని ఎద్దేవా చేశారు. -
టీఆర్ఎస్లో చేరిన కంబాలపల్లి కృష్ణ
శాలిగౌరారం: మండలంలోని గురుజాల గ్రామానికి చెందిన బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి కంబాలపల్లి కృష్ణ బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆదివారం టీఆర్ఎస్లో చేరారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ నేతృత్వంలో సూర్యాపేట జిల్లాలోని జాజిరెడ్డిగూడెం పర్యటనలో ఉన్న రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీశర్రెడ్డిల సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ మేరకు సాయంత్రం ఇక్కడ ఆయన ఈ విషయాన్ని విలేకరులకు తెలిపారు.బంగారు తెలంగాణ నిర్మాణంలో పాలుపంచుకునేందుకే టీఆర్ఎస్లో చేరినట్లు కృష్ణ తెలిపారు.