breaking news
middle aged man
-
మధ్యవయసు వారికి ఆహార ప్రణాళిక.. ఏమేం తినాలంటే..
మధ్యవయసు వారిలో శరీరంలో మార్పులు జరుగుతుంటాయి. ఇలాంటప్పుడు శరీరానికి తగినన్ని ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ అవసరం. ఈ సమయంలో గుండె ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ఎందుకంటే, ఈ వయసులో బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ సమస్యలు రావడం సాధారణం. సరైన ఆహారం తీసుకోవడం వల్ల గుండె వ్యాధుల రిస్క్ తగ్గుతుంది. ఎముకల దృఢత్వం పెరుగుతుంది. మహిళలకు మెనోపాజ్ తర్వాత ఆస్టియోపోరోసిస్ (Osteoporosis) వచ్చే ప్రమాదం ఎక్కువ. ఒత్తిడి, నిద్రలేమి, మూడ్ స్వింగ్స్ ఎక్కువ. పోషకాహారం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది, హార్మోన్ల సమతుల్యత కలుగుతుంది.వయసు పెరుగుతున్నకొద్దీ ఇమ్యూనిటీ తగ్గుతుంది. అందువల్ల విటమిన్–ఎ, ఇ, జింక్, ప్రొటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. అలాగే, పనితీరు మెరుగ్గా ఉండాలంటే సమతుల ఆహారం తప్పనిసరి. సింపుల్గా చెప్పాలంటే, మధ్య వయసులో సరైన పోషకాహారం తీసుకుంటే వృద్ధాప్యంలో వచ్చే సమస్యలు ఆలస్యం అవుతాయి, జీవన ప్రమాణం మెరుగుపడుతుంది. వారి పనితీరును బట్టి తీసుకునే ఆహారంలో చిన్న చిన్న మార్పులు ఉండవచ్చు.మధ్యవయసు వారి (40–59 సంవత్సరాలు)కి ఆహార ప్రణాళికకేలరీలు : పురుషులు : 2200–3000 కిలో కేలరీలుస్త్రీలు : 1800 – 2300ప్రొటీన్ : పురుషులు : సుమారు 41 గ్రాములు/రోజుమహిళలు : సుమారు 38 గ్రాములు/రోజుకొవ్వు : 20–40 గ్రాములు/రోజు (4.6–15.5%)కార్బోహైడ్రేట్స్ : 55–60%విటమిన్ – ఎ : పురుషులు : 1000 మైక్రో గ్రాములు/రోజుమహిళలు : 840 మైక్రో గ్రాములు/రోజువిటమిన్– ఇ : పురుషులు : 80 మి.గ్రా/రోజుమహిళలు : 65 మి.గ్రా/రోజుఐరన్ : పురుషులు : 17 మి.గ్రా/రోజుమహిళలు : 21 మి.గ్రా/రోజుకాల్షియం : పురుషులు : 1000 మి.గ్రా/రోజుమహిళలు : 1000 మి.గ్రా/రోజునీళ్లు : పురుషులు : 3.5 లీటర్లు / రోజుమహిళలు : 2.5 లీటర్లు / రోజుబ్రేక్ఫాస్ట్పండు: ఏదైనారోజుకు 1–2 సర్వింగ్స్ఇడ్లీ/ఉప్మా/దోశ – రోజుకు 2 సర్వింగ్స్సాంబార్ – (1–2) కప్పులుఉడికించిన గుడ్డు(గుడ్డు తెల్లసొన) – 1 సర్వింగ్మధ్యాహ్నం స్నాక్స్పండ్లు: ఆపిల్, అరటి, జామ, కమలా, పుచ్చకాయమొలకలు: 1 కప్పు / మఖానా (తామర గింజలు)బ్రౌన్ బ్రెడ్ టోస్ట్మధ్యాహ్న భోజనంఅన్నం (బ్రౌన్ రౌస్) 2 కప్పులు/ గోధుమ రొట్టె 1–2 జొన్న/సజ్జ రొట్టె (1–2 సర్వింగ్స్)ఉడికించిన కూరగాయలు + చికెన్ 100 గ్రాములులేదా ఉడికించిన వివిధ రకాల కూరగాయలు + గుడ్డు / పల్చని పప్పు / పనీర్ + పెరుగు 1 కప్పుసాయంత్రం స్నాక్స్పండ్లు 100 గ్రాములు / డ్రైఫ్రూట్స్మొలకలు / మజ్జిగ (1 గ్లాస్)రాత్రి భోజనంచపాతీ / బ్రౌన్ రైస్ – భోజనానికి సమానంగాఉడికించిన వివిధ రకాల కూరగాయలు+ఆకుకూరలు + చికెన్ / స్క్రాంబుల్ గుడ్డు / పనీర్ / పల్చని పప్పుచదవండి: యువత హెల్దీ డైట్ ప్లాన్.. ఈ పోషకాలు తప్పనిసరిమరికొన్ని... కూరగాయలు: రోజుకు 3– 4 సర్వింగ్స్ (కాల్చినవి / వండినవి)ధాన్యం: 6– 7 సర్వింగ్స్ (1 కప్పు = అన్నం/గోధుమ/ చిరు ధాన్యాలు)పాలు/పెరుగు: రోజుకు 2 సర్వింగ్స్ఆరోగ్యకరమైన కొవ్వులకు: 1 టేబుల్ స్పూన్ (నట్స్, గింజలు)ప్రొటీన్ ఆహారం: 1 సర్వింగ్.. మాంసం/చికెన్/గుడ్డుబీన్స్/పెసలు: రోజుకు 1–2 కప్పులు -
వృద్ధులు పెరుగుతున్నారు!
సాక్షి, హైదరాబాద్: చైనాను వెనక్కు నెట్టి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా రికార్డు సాధించాం. ఏ దేశంతో పోల్చి చూసినా... యువశక్తి అధికంగా ఉన్నది భారత్లోనే అని గొప్పగా చెప్పుకుంటున్నాం. అయితే మరో పదేళ్లలో ఈ లెక్క కూడా తప్పే అవకాశం ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా నియంత్రణకు పెరిగిన ప్రాధాన్యత దృష్ట్యా తెలంగాణలో యువతరం తగ్గుముఖం పడుతుండగా... వృద్ధుల సంఖ్య భారీగా పెరుగుతోంది.యువత తగ్గి మధ్యవయస్కూలు, వృద్ధుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగించే అంశంగా భావిస్తున్నారు. జాతీయ జనాభా కమిషన్ ఇచ్చిన లెక్కలతో సోమవారం తెలంగాణ ప్రణాళిక శాఖ విడుదల చేసిన రాష్ట్ర జనాభా గణాంకాల్లో వయసుల వారీగా జనాభా వృద్ధి, క్షీణత వివరాలు వెల్లడయ్యాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 3.50 కోట్ల జనాభా ఉండగా, 2026 నాటికి 3.86 కోట్లకు చేరుకుంటుందని కమిషన్ అంచనా వేసింది.2036 నాటికి 4.6 శాతం వృద్ధితో 3.94 కోట్లకు చేరనుంది. ఇందులో పురుషులు 1.97 కోట్లు కాగా, మహిళలు 1.96 కోట్లు. అయితే ఈ పెరిగే జనాభాలో 2021 నుంచి 2036 మధ్య 35 ఏళ్ల నుంచి 80 ఏళ్ల మధ్య వయసు్కల జనాభా గణనీయంగా పెరగబోతోంది. అదే కాలంలో 0 నుంచి 34 ఏళ్ల వయసు గల వారి వృద్ధి రేటు మైనస్ (–)లో ఉండటం గమనార్హం. 20 నుంచి 29 ఏళ్ల మధ్య వయసు్కలు 20 శాతానికి పైగా తగ్గుతున్నారు. చిన్నారులు, యువత తగ్గుముఖం ఓవైపు మధ్య వయస్కూలు, వృద్ధుల సంఖ్య రాబోయే పదేళ్లలో గణనీయంగా పెరుగుతుంటే... అదే స్థాయిలో యువశక్తి తగ్గుతుండడం ఆందోళన కలిగించే అంశం. 2021 నుంచి 2036 మధ్య కాలంలో 20–24 ఏళ్ల వయసు గల వారు 33.94 లక్షల నుంచి 26.26 లక్షలకు తగ్గనుంది. అంటే 22.6 శాతం తగ్గుదలగా నమోదవుతోంది. 25–29 మధ్య వయస్సు గల యువతరం 2021లో 34.16 లక్షలు ఉంటే, 2036 నాటికి 19.3 శాతం తగ్గి 27.57 లక్షలకు చేరుకుంటుంది.ఇదే క్రమంలో 30 నుంచి 34 సంవత్సరాల వయస్సు గల వారు 33.50 లక్షల నుంచి 30.33 లక్షలకు(–9.5 శాతం) చేరుకోనున్నారు. యువతతో పాటు 0 నుంచి 4 ఏళ్ల వయస్సు గల చిన్నారుల సంఖ్య 2036 నాటికి ఏకంగా 25 శాతం తగ్గుతుండగా, 5నుంచి 9 వయస్సు గల వారు 20 శాతం తగ్గనున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 10–14 మధ్య కౌమార వయసు జనాభాతోపాటు 15–19 మధ్య టీనేజ్ వయసు గల యువతీయువకులు కూడా 17 శాతానికి పైగా తగ్గుతారని జాతీయ జనాభా కమిషన్ పేర్కొంది. -
వడదెబ్బ... 108 డిగ్రీల జ్వరం
న్యూఢిల్లీ: ఢిల్లీని చుట్టుముట్టిన వడగాలులు ఒక మధ్యవయస్కుడి ప్రాణం తీశాయి. వడదెబ్బతో ఆస్పత్రిలో చేరిన అతడి శరీర ఉష్ణోగ్రత చూసి వైద్యులు హుతాశులయ్యారు. అతని శరీర ఉష్ణోగ్రత సాధారణం కంటే 10 డిగ్రీలు ఎక్కువ ఉండటం గమనార్హం. సోమవారం రాత్రి జరిగిన ఘటన వివరాలను రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రి డాక్టర్ రాజేశ్ శుక్లా వెల్లడించారు. ‘‘ బిహార్లోని దర్భాంగా పట్టణానికి చెందిన 40 ఏళ్ల వ్యక్తి సోమవారం ఢిల్లీలో వడదెబ్బకు గురయ్యారు. వెంటనే ఆర్ఎంఎల్ ఆస్పత్రిలో చేరారు. ఆయన శరీర ఉష్ణోగ్రత 108 డిగ్రీ ఫారన్హీట్కు చేరుకోవడం చూసి ఆందోళనకు గురయ్యాం. ఆయనను ఎలాగైనా కాపాడాలని శతథా ప్రయతి్నంచాం. కానీ శరీరంలో అతివేడి కారణంగా ఆయన మూత్రపిండాలు, కాలేయం విఫలమయ్యాయి. ఇలా వెంటవెంటనే పలు అవయవాలు వైఫల్యం చెందడంతో ఆయన కన్నుమూశారు’ అని డాక్టర్ వివరించారు. ఒకే ఆస్పత్రిలో 2 గంటల్లో 16 మరణాలు పట్నా: ఉగ్ర ఉష్ణోగ్రత బిహార్లోని ఒకే ఆస్పత్రిలో 16 మంది ప్రాణాలను బలితీసుకుంది. గురువారం ఔరంగాబాద్లోని జిల్లా ఆస్పత్రిలో ఈ విషాద ఘటన జరిగింది. గురువారం అక్కడ 44, బుధవారం 48.2 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇంతటి వేడికి తాళలేక జనం పిట్టల్లా రాలిపోయారు. చాలా మంది అక్కడి జిల్లా ఆస్పత్రిలో చేరగా గురువారం రెండు గంటల వ్యవధిలో 16 మంది చనిపోయారు. -
7 ఏళ్ల బాలికను 4.5 లక్షలకు కొని.. ఆపై ఊరికి దూరంగా తీసుకెళ్లి
జైపూర్: వందల ఏళ్ల క్రితం బాల్య వివాహాలు, ముసలివాళ్లు బాలికను వివాహం చేసుకోవడం వంటి దారుణాలు జరిగేవి. ప్రస్తుతం ఇటువంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే అడపాతడపా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. తాజాగా రాజస్థాన్లోని ధోల్పూర్ జిల్లా మానియా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో 7 మైనర్ బాలికను మధ్య వయస్కుడైన 38 ఏళ్ల వ్యక్తి వివాహం చేసుకున్న దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం... ఏడు సంవత్సరాల వయసున్న బాలికను మధ్యవయస్కుడైన వ్యక్తి కొనుగోలు చేసి ఆపై వివాహం చేసుకున్నట్లు తమకు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు బృందంగా ఏర్పడి బాలిక ఉంటున్న గ్రామానికి చేరుకున్నారు. అయితే వాళ్లు ఊరి బయట నిర్జన ప్రదేశంలో ఇల్లు కట్టుకుని నివసిస్తున్నట్లు తెలిసింది. పోలీసులు ఇంట్లోకి ప్రవేశించగానే మెహెందీ చేతులకు పూసుకుని, పాదాల మీద పారణి పూసుకుని అమాయకత్వంతో ఆ బాలిక ఆడుకుంటూ కనిపించింది. పోలీసులు బాలికను విచారించే ప్రయత్నం చేసినా ఆమె ఏమీ చెప్పలేకపోయింది. నిందితుడిని విచారించగా 4.50 లక్షలు ఆమె తండ్రికి చెల్లించి బాలికను కొనుగోలు చేసినట్లు అతను ఒప్పుకున్నాడని పోలీసులు చెప్పారు. ఈ ఘటనలో ఎవరెవరు ఉన్నారు, ఎంత మంది ప్రమేయం ఉందనే దానిపై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: Hyderabad: మొండెం లేని మహిళ తల ఎవరిదో తెలిసింది -
కూతురు రక్షణకై తెగించిన తండ్రి
బామర్: బలవంతంగా తన మైనర్ కూతురును ఓ 35 ఏళ్ల వ్యక్తికి కట్టబెట్టాలని చూసిన ఖాప్ పంచాయతీకి వ్యతిరేకంగా ఓ తండ్రి కోర్టు మెట్లెక్కాడు. ఖాప్ పంచాయతీ పెద్దలు చేసిన హెచ్చరికలు సైతం లెక్క చేయకుండా అతడు ఎంతో సాహసంతో కోర్టును ఆశ్రయించాడు. ఫలితంగా కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేయడంతో ఈ ఘటనకు సంబంధించి మొత్తం 17మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్లోని బామర్ జిల్లాలోగల గుంగా గ్రామంలో గనరాం ప్రజాపత్ అనే వ్యక్తికి ఓ మైనర్ కూతురు ఉంది. ఆమెను 35 ఏళ్ల వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయాలని బెదిరించడమే కాకుండా అలా చేయకుంటే రూ.25లక్షల ఫైన్ కట్టాలని, సామాజిక బహిష్కరణ ఎదుర్కోవాలని ఈ నెల 1న తీర్పు చెప్పారు. దీంతో ఏం చేయాలో పాలుపోని గనరాం ధైర్యం ఇదే 6న కోర్టు మెట్లెక్కాడు. తనకు జరిగిన అన్యాయం కోర్టుకు పిటిషన్ రూపంలో వివరించాడు. గత ఏడాది కూడా లీలారాం అనే వ్యక్తికి తన కూతురును ఇవ్వాలని ఇబ్బందులు పెట్టారని కోర్టుకు వివరించాడు. దీంతో కోర్టు ఆ ఖాప్ పంచాయతీ పెద్దలపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. సాధారణంగా ఖాప్ పంచాయతీల తీర్పులను ఉల్లంఘిస్తే సాంఘిక బహిష్కరణతోపాటు, రాళ్లతో కొట్టి చంపించడం, కాల్పిపారేయడంలాంటి వికృత చర్యలు చేస్తుంటారు. వీటన్నింటికీ భయపడకుండా ఆ ప్రాంతంలోని ఓ సగటు తండ్రి చేసింది గొప్ప సాహసమే.