ఉరి వేసుకుని హమాలీ ఆత్మహత్య
ఆదిలాబాద్ : కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన హమాలీ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా తిర్యాణి మండలం గోమగాని గ్రామంలో గురువారం జరిగింది. వివరాలు .. హమాలీగా పనిచేస్తున్న మేడిశెట్టి తిరుపతి(30) కుటుంబ కలహాలతో జీవితంపై విరక్తి చెంది ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలిసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
(తిర్యాణి)