breaking news
krantimadhav
-
కొత్తరకం వినోదం
‘‘రెండు గంటలు కథ విన్న తర్వాతే ఈ చిత్రం చేయడానికి అంగీకరించా. స్క్రిప్ట్ మొత్తం పూర్తయిన తర్వాతే సెట్స్‌పైకి వెళుతున్నాం. ఈ చిత్రం నా కెరీర్లో పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అని హీరో సునీల్ అన్నారు. సునీల్, మియా జంటగా యునెటైడ్ మూవీస్ పతాకంపై క్రాంతిమాధవ్ దర్శకత్వంలో పరుచూరి కిరీటి నిర్మిస్తున్న కొత్త చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. దర్శకుడు మాట్లాడుతూ-‘‘ ‘మళ్లీ మళ్లీ ఇది రానిరోజు’ తర్వాత ఏడాది గ్యాప్ తీసుకుని చేస్తున్న చిత్రమిది. మంచి కామెడీ చిత్రం చేయాలనే తపనతో చేస్తున్నా. ఈ కథకు సునీల్ అయితేనే కరెక్ట్‌గా యాప్ట్ అవుతాడనిపించింది. ఇప్పటి వరకూ వచ్చిన సునీల్ సినిమాల్లోని వినోదం కన్నా ఇందులో కొత్తగా ఉంటుంది. ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్ చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: జిబ్రాన్. -
‘ఓనమాలు’ దర్శకుడితో సినిమా
‘అమ్మ చెప్పింది, గమ్యం, ప్రస్థానం, జర్నీ’... నటుడిగా శర్వానంద్ ఏంటో చెప్పడానికి ఈ నాలుగు సినిమాలు చాలు. సెలక్ట్టివ్గా సినిమాలు చేస్తూ దక్షిణాది ప్రేక్షకులందరికీ చేరువయ్యారు శర్వానంద్. ప్రస్తుతం ఆయన చేరన్ దర్శకత్వంలో ‘ఏమిటో ఈ మాయ’ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. నిత్యామీనన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోంది. ఇదిగాక మరో తమిళ చిత్రంలో కూడా నటిస్తున్నారాయన. ఇదిలావుంటే... ఈ సినిమాలతో పాటు మరో క్రేజీ ప్రాజెక్ట్‌కి శర్వా పచ్చజెండా ఊపారనేది ఫిలింనగర్ టాక్. ‘ఓనమాలు’ వంటి డీసెంట్ మూవీని ప్రేక్షకులకు అందించిన క్రాంతిమాధవ్ దర్శకత్వంలో ఆయన సినిమా చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ సినిమాలో కూడా కథానాయిక నిత్యామీననే అని తెలుస్తోంది. అగ్ర నిర్మాత కేఎస్ రామారావు ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు వినికిడి. క్రాంతిమాధవ్ కథ శర్వానంద్‌కి బాగా నచ్చడంతో ఈ చిత్రంలో నటించాలని ఆయన గట్టిగా నిర్ణయించుకున్నట్లు తెలిసింది. శర్వానంద్ నటించనున్న సినిమా అంటే.. ఆ సినిమాలో ఏదో కొత్తదనం ఉంటుందని ప్రేక్షకుల అంచనాలు. ‘ఓనమాలు’ ద్వారా విమర్శకుల ప్రశంసలందుకున్న దర్శకుడు క్రాంతిమాధవ్... ఈ చిత్రం ద్వారా ఎలాంటి ఫీట్ చేస్తారో చూడాలి. ఈ సినిమాకు సంబంధించిన మిగిలిన వివరాలు తెలియాల్సి ఉంది.