breaking news
karnataka village
-
బాత్రూంలో నక్కిన కుక్క.. ఇంతలో చిరుత ఎంట్రీ
బెంగళూరు: కర్ణాటకలోని బిలినెళ్లి అనే గ్రామంలోని ఓ ఇంటి మరుగుదొడ్డిలో బుధవారం ఓ వీధి కుక్కతో పాటు చిరుత పులి దర్శనమివ్వడం స్థానికంగా కలకలం రేపింది. ఇంటి యజమానురాలు బాత్రూం వెళ్దామని డోర్ తీయగా చిరుత, దాన్ని చూస్తూ భయంతో వణికిపోతున్న వీధి కుక్క దర్శనమివ్వడంతో వెంటనే అప్రమత్తమైన ఆమె.. డోర్‌కు గొల్లెం పెట్టి, పోలీసులకు సమాచారం చేరవేసింది. ఇంతకీ ఈ రెండు జంతువులు మరుగుదొడ్డిలోకి ఎలా చేరాయని ఆరా తీస్తే.. గ్రామంలో సంచరిస్తున్న వీధి కుక్క, అనుకోని అతిధి చిరుత కంట పడింది. దాని నుంచి తప్పించుకునే క్రమంలో వీధి కుక్క.. సమీపంలోని ఓ ఇంటి మరుగుదొడ్డిలో దాక్కుంది. ఆ కుక్క హమ్మయ్యా అనుకునే లోపు చిరుత దాన్ని వెంబడిస్తూ అదే బాత్రూంలోకి చేరింది. చిరుతను దగ్గరగా చూసిన కుక్క భయంతో వణికిపోతుండగా, ఇప్పుడెలా తప్పించుకుంటావు అన్నట్టుగా చిరుత గంభీరంగా కుక్క వైపు చూస్తుంది. ఇంతలో ఇంటి యజమానురాలు బాత్రూం డోర్ తీసి, పోలీసులకు సమాచారమిచ్చింది. హుటాహుటిన రంగప్రవేశం చేసిన పోలీసులు.. పులి బారి నుండి కుక్కను రక్షించి, పులిని బంధించాలని ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు బాత్రూం పైకప్పును తొలగించి రెస్క్యూ అపరేషన్ చేపడుతుండగా.. చిరుత అమాంతంపైకి ఎగిరి, గోడల మీదుగా దూకుతూ అక్కడి నుంచి తప్పించుకుంది. ఈ మొత్తం సన్నివేశాలన్నీ బాత్రూం డోర్ మధ్య సందుల్లో నుంచి స్థానికులు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. -
వర్షాలు పడలేదని... ఎంత పని చేశారు!
వర్షాలు పడటం లేదని కప్పల పెళ్లిళ్లు చేయించడం చూశాం. ఇంకా రకరకాల మూఢనమ్మకాలు కూడా ఉంటాయి. కానీ కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా పండరిహళ్లిలో వరుణదేవుడిని ప్రసన్నం చేసుకోడానికి ఓ పిల్లాడిని నగ్నంగా ఊరేగించారు. చిత్రదుర్గలో ఈ ఏడాది తీవ్రమైన కరువు తాండవించింది. కొన్ని నెలలుగా ట్యాంకర్లతోనే మంచినీరు సరఫరా చేయాల్సి వస్తోంది. దాంతో వర్షాల కోసం వరుణదేవుడిని ప్రసన్నం చేసుకోడానికి అక్కడి గ్రామస్తులు ముందుగా ఓ పిల్లాడిని నగ్నంగా చేసి, అతడికి పూలు పెట్టారు. వినాయకుడి విగ్రహం చేతికి ఇచ్చి, అది పట్టుకుని గ్రామంలో రోడ్లమీద తిరగాలని చెప్పారు. వాళ్లు ఎందుకలా చేస్తున్నారో అతడికి తెలియదు. పెద్దవాళ్లు కదాని వాళ్లు చెప్పినట్లు చేశాడు. అతడు విగ్రహాన్ని గ్రామ శివార్లకు తీసుకెళ్లి అక్కడ నీటిలో నిమజ్జనం చేశాడు. అలా వెళ్తున్నంత సేపు జనం ఆ పిల్లాడి తల మీద కుండలతో చల్లటి నీళ్లు పోస్తూనే ఉన్నారు. తర్వాత పిల్లాడికి కొత్త బట్టలు కొనిచ్చారు. ఇది బాలల హక్కులను ఉల్లంఘించడమేనని బాలల హక్కుల కమిషన్ చె బుతోంది. ఈ మొత్తం వ్యవహారాన్ని ఎవరో వీడియో తీయడంతో కర్ణాటక బాలల హక్కుల రక్షణ కమిషన్ దీనిపై చర్యలు తీసుకోడానికి సిద్ధమవుతోంది.