సూపర్ సిరీస్ మెన్స్ విజేత శ్రీకాంత్
ఇండియన్ ఓపెన్ సూపర్ సిరీస్ పురుషుల సింగిల్స్ టైటిల్ ను తెలుగు తేజం శ్రీకాంత్ సొంతం చేసుకున్నాడు. ఆదివారం అక్సెల్సెన్ (డెన్మార్క్)తో జరిగిన హోరాహోరీ మ్యాచ్‌లో 18- 21, 21- 13, 21- 12 తేడాతో ఫైనల్స్ విజేతగా నిలిచాడు.
మరోవైపు మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్ వన్ సైనా నెహ్వాల్ ఇండియన్ సూపర్ సిరీస్ టైటిల్ ను సొంతం చేసుకుంది. దీంతో బ్యాడ్మింటన్‌లో తెలుగు రాష్ట్రాలకు చెందిన క్రీడాకారుల ప్రతిభ మరింతగా ఇనుమడించింది.