breaking news
Kadapa Peddadarga
-
వైభవంగా కడప పెద్దదర్గా గంధోత్సవం
కడప కల్చరల్: ప్రఖ్యాతిగాంచిన ఆధ్యాత్మిక క్షేత్రం కడప అమీన్‌పీర్ (పెద్ద) దర్గా ఉరుసు ఉత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా అర్ధరాత్రి దర్గా పీఠాధిపతి హజరత్ సయ్యద్‌షా ఆరీఫుల్లా హుస్సేనీ సాహెబ్ తన ఇంటి నుంచి గంధం కలశాన్ని తీసుకుని పకీర్ల మేళతాళాలు, ఖడ్గ విన్యాసాల మధ్య ఊరేగింపుగా దర్గా వద్దకు చేర్చారు. ఏఆర్ రెహమాన్ ప్రార్థనలు: ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ పెద్దదర్గా ఉరుసు ఉత్సవాల్లో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. తొలుత ఆయన పీఠాధిపతిని కలిసి ఆశీస్సులు పొందారు. -
9 నుంచి కడప పెద్దదర్గాలో ఉరుసు
కడప కల్చరల్: దేశంలోనే ప్రఖ్యాతి గాంచిన వైఎస్సార్ జిల్లా కడప పెద్దదర్గాలో వెలిసిన హజరత్ ఖ్వాజా సయ్యద్‌షా ఆరీఫుల్లా హుసేనీ చిష్ఠివుల్ ఖాద్రీ సాహెబ్ ఉరుసు ఉత్సవాలు ఫిబ్రవరి 9 నుంచి ఘనంగా నిర్వహించనున్నామని దర్గా పీఠాధిపతి హజరత్ సయ్యద్‌షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్ తెలిపారు. దర్గా ఆవరణలో శనివారం జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వారంరోజుల పాటు జరిగే ఉత్సవాలకు భక్తులు, జిల్లావాసులు ప్రభుత్వశాఖలు తమవంతుగా సహకారం అందించాలని కోరారు. కలెక్టర్ కేవీ సత్యనారాయణ మాట్లాడుతూ ఈ ఉత్సవాలను జిల్లా ఉత్సవాలుగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామన్నారు. ప్రత్యేకంగా కలెక్టరేట్లో కంట్రోల్ రూంను ఏర్పాటుచేసి పర్యవేక్షిస్తామని చెప్పారు. ఉత్సవాలలో భాగంగా ఫిబ్రవరి 10న గంథం, 11న ఉరుసు, 12న జాతీయస్థాయిలో ముషాయిరా, 13న ఖవ్వాలీ తదితర కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.