breaking news
jangaon assembly constituency
-
కడియం.. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి : పల్లా రాజేశ్వర్‌రెడ్డి
వరంగల్: ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి హెచ్చరించారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మండలంలోని షోడాషపల్లి శివారులోని ఓ ఫంక్షన్ హల్లో వేలేరు, ధర్మసాగర్ మండలాల విస్తృత స్థాయి సన్నాహక సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి సుధీర్‌కుమార్‌ను గెలిపించి కడియం శ్రీహరికి కర్రుకాల్చి వాత పెట్టాలని పిలుపునిచ్చారు. మంత్రిగా పని చేసి ఘన్‌పూర్‌కు చేసిన పని ఒక్కటైనా చూపెట్టాలని సవాల్ చేశారు. ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ.. కడియం రాజీనామా చేసి వస్తే రాజకీయంగా బొందపెట్టడానికి పార, గడ్డపార రెడీగా ఉన్నాయన్నారు.కడియం శ్రీహరి ఓ నకిలీ దళితుడైతే, ఆయన కూతురు నకిలీ దళితురాలని మండిపడ్డారు. ఎంపీ అభ్యర్థి సుధీర్ కుమార్ మాట్లాడుతూ.. తనను ఎంపీగా గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. అధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. కడియం కావ్య తండ్రి చాటు బిడ్డ అని, అరూరి రమేశ్ కబ్జాదారుడని విమర్శించారు.కడియం శ్రీహరి, అరూరి రమేశ్ దొందూ దొందేనని విమర్శించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ చాడ సరిత, జెడ్పీ కో–ఆష్షన్ సభ్యురాలు జుబేదా లాల్, కార్పొరేటర్ ఆవాల రాధిక రెడ్డి, వైస్ ఎంపీపీ సంపత్, మండల అధ్యక్షుడు నర్సింగరావు, కో–ఆష్షన్ జానీ, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు. -
పొన్నాల ప్రయత్నాలు ఫలించేనా?
సాక్షి, న్యూఢిల్లీ: జనగామ అసెంబ్లీ సీటు విషయంలో హైడ్రామా నెలకొంది. కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య జనగామ సీటు కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాల్లో జనగామ సీటు విషయం తేల్చకపోవడంతో.. ఈ సీటును కోదండరామ్‌కు కేటాయించారని ప్రచారం సాగింది. దీంతో పొన్నాల రాహుల్‌గాంధీ వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారు. జనగామ సీటుపై రాహుల్ పొన్నాలకు హామీ ఇచ్చారనీ.. కోదండరామ్ వరంగల్ ఈస్ట్ నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జనగామపై స్పష్టత లేదు.. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ మీడియాతో శుక్రవారం ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ.. ‘జనగామ సీటు విషయంలో జరుగుతున్న పరిణామాలు సంతృప్తికరంగా లేవు. కాంగ్రెస్ అధిష్టానం ఇంకా ఎటూ తేల్చలేదు. సీట్ల పంపకం ఆలస్యమవడం కొంత నష్టం కలిగించేదే. ఈ రోజు సాయంత్రం టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఆర్సీ కుంతియా, పొన్నాలతో భేటీ అవుతాను’ అని తెలిపారు. ఏదేమైనా ప్రజాకూటమిగా ఎన్నికల్లో విజయం సాధించి కేసీఆర్ నిరంకుశ పాలనకు చరమగీతం పాడుతామని కోదండరామ్ ఆశాభావం వ్యక్తం చేశారు. టీజేఎస్ అభ్యర్థులకు రేపు బీ-ఫామ్‌లు ఇస్తామని తెలిపారు. టీజేఎస్ 8 సీట్లలో 6 సీట్లపై స్పష్టత వచ్చిందనీ, ఈ సాయంత్రం అభ్యర్థుల్ని ప్రకటిస్తామని తెలిపారు. చాడ వెంకట్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని కోదండరామ్ తెలిపారు. టీజేఎస్ బలంగా ఉన్న నియోజక వర్గాల్లో ఇద్దరం కలిసి ప్రచారం చేస్తామని వెల్లడించారు. ఒకటి, రెండు చోట్ల స్నేహపూర్వక పోటీ ఉంటుందని అన్నారు. ప్రచారం అనుకున్నంత వేగంగా సాగడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. -
జయమెవరిదో..!
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య బరిలో ఉన్న జనగామ అసెంబ్లీ నియోజకవర్గం ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. అదృష్టం కలిసి వచ్చి టీపీసీసీ చీఫ్ అయిన పొన్నాలకు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. తెలంగాణలో కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలుస్తుందన్న ఉత్కంఠ కన్నా జనగామ ముఖచిత్రం ఎలా ఉండబోతుందన్న విశ్లేషణలే ఎక్కువయ్యాయి. హింగె మాధవరావు, జనగామ: పొన్నాల లక్ష్మయ్య మరోసారి ఎన్నికల బరిలో దిగారు. నాలుగుసార్లు గెలిచిన పొన్నాల ఈసారి టీపీసీసీ అధ్యక్షుడిగా బరిలోకి దూకారు. వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యే గా, పదేళ్లు మంత్రిగా పనిచేసిన ఆయన సహజంగా ఉండే వ్యతిరేకతను దాటేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణవాదం, తెలంగాణ ఏర్పాటు, అభివృద్ధి అంశాలు ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనున్నాయి. పొన్నాలను గెలిపిస్తే నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. మరోవైపు జనగామ నియోజకవర్గ అభివృద్ధికి పొన్నాల చేపట్టిన కార్యక్రమాలేవీ కార్యరూపం దాల్చకపోవడం ఆయనకు ప్రతికూల అంశంగా మారింది. నియోజకవర్గంలో ఐదు రిజర్వాయర్లు, నాలుగు పెద్ద జలాశాయాల ద్వారా దేవాదుల నీటిని ఇక్కడికి తరలించే బృహత్తర కార్యక్రమం ఇప్పటి వరకు పూర్తి కాలేదు. దీనికితోడు కాంగ్రెస్ కార్యదర్శులు ఇద్దరు రెబెల్ అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. వీరు ఉపసంహరించుకుంటారా పోటీలో కొనసాగుతారా అనేది ఆసక్తికరంగా ఉంది. దూసుకెళ్తున్న ముత్తిరెడ్డి టీ పీసీసీ చీఫ్‌పై గెలవాలన్న పట్టుదలతో టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు పావులు కదుపుతున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పొన్నాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఏనాడూ పాల్గొనలేదని.. కేసీఆర్ వల్లే తెలంగాణ వచ్చిందని చెబుతూ ప్రచారంలో ముందంజలో ఉన్నారు. కసిగా ‘కొమ్మూరి’ గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో పొన్నాల చేతిలో ఓటమికి గురై.. ఫలితం విషయంలో వివాదం చోటుచేసుకున్న కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి ఇప్పుడు బీజేపీ నుంచి బరిలో ఉన్నారు. ఈసారి ఎలాగైనా పొన్నాల ను ఓడించాలనే కసితో ఉన్నారు. ఇక వైఎస్సార్ సీపీ నుంచి బరిలో ఉన్న వజ్రోజు శంకరాచారి వైఎస్సార్ సంక్షేమ పథకాలే ఎజెండాగా ముందుకు వెళ్తున్నారు. వైఎస్ అభిమానులు తనకు అండగా ఉంటారన్న ధీమాను ఆయన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ పథకాలే తనను గెలిపిస్తాయనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నాయకుడు మండలి శ్రీరాములు ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గం జనగామ ఎవరెన్నిసార్లు గెలిచారు: కాంగ్రెస్ - 9, సీపీఎం-2, టీడీపీ-1, పీడీఎఫ్-1, సీపీఐ-1 తొలి ఎమ్మెల్యే: సయిద్ ఏ హుస్సేన్ (పీడీఎఫ్) ప్రస్తుత ఎమ్మెల్యే: పొన్నాల లక్ష్మయ్య (కాంగ్రెస్) రిజర్వేషన్: జనరల్ నియోజకవర్గ ప్రత్యేకతలు: రాజకీయ చైతన్యం గల నియోజకవర్గం. మైనార్టీ ఓట్ల ప్రభావం. బీసీ ఓటర్లు అధికం. ప్రస్తుతం బరిలో నిలిచింది: 24 ప్రధాన అభ్యర్థులు వీరే.. పొన్నాల లక్ష్మయ్య (కాంగ్రెస్) కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి (బీజేపీ) ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి (టీఆర్ఎస్) వజ్రోజు శంకరాచారి (వైఎస్సార్సీపీ) - జనగామలో మిగిలిన అభివృద్ధి పనులు పూర్తి చేస్తా. - కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో పగలే నిరంతరాయంగా 7 గంటల కరెంటు సరఫరాకు చర్యలు తీసుకుంటా. - ఐటీఐఆర్‌లో జిల్లాకు లక్ష ఉద్యోగాలు కల్పిస్తా. - నియోజకవర్గంలోని రిజర్వాయర్ల నిర్మాణాలు పూర్తి చేస్తా. - జనగామకు దేవాదుల గోదావరి జలాలు తెప్పిస్తున్న ఘనత కాంగ్రెస్‌దే - పొన్నాల లక్ష్మయ్య - రైతులకు సాగునీరు అందిస్తా.. గోదావరి నీళ్లను ప్రతి ఇంటికీ అందించి తాగునీటి సమస్యను పరిష్కరిస్తా. - జనగామలోని.53/1 సర్వే నెంబర్లో గత 40 ఏళ్లుగా నివాసం ఉంటున్న వాళ్లకు ఆర్నెళ్లల్లో - ఇళ్ల పట్టాలు ఇప్పిస్తా.. - వైద్య సదుపాయాలు మెరుగుపరుస్తా.. మౌలిక వసతులను కల్పిస్తా . జనానికి అందుబాటులో ఉంటా. - విద్యాభివృద్ధికి, పరిశ్రమల ఏర్పాటుకు చొరవ చూపుతా.. - కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి నే.. గెలిస్తే.. - మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటా - వైఎస్ ఆశయ సాధన కోసం పాటుపడతా.. - రైతాంగానికి సాగునీరందించేందుకు పనిచేస్తా.. తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపడతా - ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తా.. - ఇళ్లు.. పింఛన్లు.. రేషన్‌కార్డులు.. తదితర సమస్యల పరిష్కారం కోసం పాటుపడతా. - వజ్రోజు శంకరాచారి - చిన కోటూరు రిజర్వాయర్ నుంచి వస్తున్న కలుషిత నీటి నుంచి ప్రజలకు ఊరట కల్పిస్తా. జనగామలోని తాగునీటి సమస్యను పరిష్కరిస్తా. - ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటా. - ఆయకట్టుకు సాగునీరందించేందుకు చర్యలు తీసుకుంటా - అన్ని గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తా, అభివృద్ధికి జనం మద్దతుతో కృషి చేస్తా. - ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఇదేనా ‘సత్తా’..! ఆయనో మాజీ ఐఏఎస్ అధికారి... ప్రస్తుతం ఓ పార్టీకి అధినేత... ‘అవినీతిని నిర్మూలిద్దాం. సమగ్ర అభివృద్ధికి పాటుపడి సత్తా చాటుదాం’ అనేది ఆయన నినాదం. కానీ తాను ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలో సీడీపీ(నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమం) నిధులు పైసా ఖర్చు చేయలేదు. పదవీకాలం ముగియనుండడంతో ఈ నిధులిక ఖర్చుచేసే అవకాశం కూడా లేదు. సీడీపీ కింద ప్రతి నియోజకవర్గానికి ఏటా రూ.కోటి విడుదల చేస్తుంది. ఇందులో సగం నిధులు ఎమ్మెల్యే సొంతంగా గుర్తించిన పనులకు వినియోగించాలి. మిగతా సగం నిధులు ఇన్చార్జి మంత్రి అనుమతితో ఖర్చు చేయాలి. కూకట్పల్లి శాసనసభ్యుడు, లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణకు 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఎమ్మెల్యే కోటా కింద రూ.49.75లక్షలు, ఇన్చార్జి మంత్రి కోటా కింద రూ.49.75 లక్షల చొప్పున మొత్తం రూ.99.5 లక్షలు విడుదలయ్యాయి. వీటిని ఖర్చు చేయకపోవడంతో ఖజానాలో మూలుగుతున్నాయి. జేపీ ఎమ్మెల్యే కోటాలో 9 పనులను, ఇన్చార్జి మంత్రి కోటాలో మరో 16 పనులను ప్రతిపాదించినా వాటి పురోగతిని పట్టించుకోలేదు. - సాక్షి, రంగారెడ్డి జిల్లా