breaking news
Italy court
-
‘అగస్టా’ కేసులో ఫిన్మెకానికా చీఫ్‌కు క్లీన్చిట్
మిలన్: అగస్టావెస్ట్‌లాండ్ కుంభకోణం కేసులో హెలికాప్టర్ తయారీ సంస్థ ఫిన్మెకానికా సంస్థ మాజీ సీఈఓను ఇటలీ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. భారత ప్రభుత్వంతో కుదిరిన రూ.3,600 కోట్ల విలువైన వీవీఐపీ హెలికాప్టర్ల కుంభకోణంతో ఫిన్మెకానికా మాజీ సీఈవో గుసెప్పె ఒర్సికి సంబంధం లేదని ఇటలీ అప్పీల్ కోర్టు సోమవారం తేల్చింది. ఫిన్మెకానికా సోదర సంస్థ అయిన అగస్టావెస్ట్‌లాండ్ సీఈఓ బ్రూనో స్పాగ్నోలినీని నిర్దోషిగా పేర్కొంది. 12 వీవీఐపీ హెలికాప్టర్ల కొనుగోలుకు భారత రక్షణ శాఖ, అగస్టా కంపెనీకి మధ్య ఒప్పందం కుదిరిన సమయంలో (2010 ఫిబ్రవరిలో) ఒర్సి సంస్థలో కీలక బాధ్యతల్లో ఉన్నారు. తప్పుడు లెక్కలు చూపడంతోపాటు అవినీతికి పాల్పడ్డారనే కారణంతో 2014లో ఆయన్ను అరెస్టు చేశారు. -
అగస్టా తీర్పులో ‘కాగ్’
న్యూఢిల్లీ: అగస్టావెస్ట్‌ల్యాండ్ స్కాంకు సంబంధించి.. ఇటలీ కోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పులో భారత కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ (కాగ్) తన నివేదికలో పేర్కొన్న అనుమానాలనూ ఆధారంగా తీసుకుంది. అగస్టా మాతృసంస్థ ఫిన్మెకానికా అధిపతిని కోర్టు గత నెల దోషిగా ప్రకటించడం తెలిసిందే. 2013లో కాగ్ వినోద్‌రాయ్ ఇచ్చిన నివేదికలో.. ప్రభుత్వానికి అవసరమైన హెలికాప్టర్లు 19వేల అడుగుల ఎత్తులో ఎగరగలిగాలని రక్షణ శాఖ తొలుత నిర్ణయించిందని.. దాని ప్రకారం అగస్టా సంస్థకు అర్హత ఉండదని పేర్కొంది. ఆ సంస్థ హెలికాప్టర్లు ఎగరగలిగే ఎత్తు 15 వేల అడుగుల వరకే ఉందని తెలిపింది. అయితే.. పర్వతమయమైన ఉత్తర, ఈశాన్య ప్రాంతాల్లో విహరించేందుకోసం కొనాల్సిన హెలికాప్టర్లు ఎగరగలిగే ఎత్తు పరిమితిని తగ్గించారంది. కాగ్ పేర్కొన్న ఈ అంశాలను.. అప్పటి భారత వైమానిక దళ చీఫ్ త్యాగి అగస్టా సంస్థతో కుమ్మక్కయ్యారనేందుకు ఆధారాల్లో ఒకటి అని ఇటలీ కోర్టు ఉటంకించింది. హెలికాప్టర్లు ఎంతవరకూ ఎగరగలగాలి అనే సమాచారం ఆయనకు ముందస్తుగా తెలుసంది. త్యాగి, గుజ్రాల్‌లను మళ్లీ ప్రశ్నించనున్న సీబీఐ: ఈ స్కాంలో వైమానిక దళ మాజీ అధిపతి ఎయిర్ చీఫ్ ఎస్.పి.త్యాగి, మాజీ డిప్యూటీ ఎయిర్ చీఫ్ జె.ఎస్.గుజ్రాల్‌లను సీబీఐ మళ్లీ ప్రశ్నించనుంది. గుజ్రాల్‌ను శనివారం, త్యాగిని సోమవారం సీబీఐ ఎదుట హాజరు కావాల్సిందిగా వారికి తెలిపినట్లు సమాచారం.