breaking news
Indian agencies
-
లద్దాఖ్ దగ్గరలో చైనా కొత్త ఎయిర్‌బేస్
న్యూఢిల్లీ: సరిహద్దు వద్ద ఉద్రిక్తతలు పూర్తిగా చల్లారకముందే చైనా మరో దుశ్చర్యకు దిగుతోంది. లద్దాఖ్‌లోని షాక్చే వద్ద చైనా నూతనంగా ఎయిర్‌బేస్‌ను అభివృద్ది చేస్తున్న విషయాన్ని భారతీయ ఏజెన్సీలు గమనించాయి. ఇది పూర్తయితే లైన్ఆఫ్ కంట్రోల్ పొడుగునా చైనాకు వైమానిక మద్దతు పెరగనుంది. షాక్చేలోని ఎయిర్‌బేస్‌ను పూర్తిస్థాయి మిలటరీ బేస్‌గా చైనా రూపుదిద్దుతోందని, ఫైటర్ ఆపరేషన్స్‌కు అనుకూలంగా దీన్ని మారుస్తోందని భారతీయ అధికారి ఒకరు చెప్పారు. ఎల్ఓసీ వద్ద గతేడాదిగా నెలకొన్న ఉద్రిక్తతలను ఈ చర్య మరింత ఎగదోస్తుందన్న ఆందోళనను వ్యక్తం చేశారు. యుద్దమే వస్తే తమ కన్నా వేగంగా భారతీయ వైమానిక దళం ఎల్ఓసీ వద్దకు చేరుకుంటుందని చైనా ఎప్పుడో గమనించింది. ఇందుకు సమాధానంగానే షాక్చే వద్ద మిలటరీ ఎయిర్‌బేస్‌ను అభివృద్ధి చేస్తోందని నిపుణులు భావిస్తున్నారు. ఖష్గర్, హోగాన్ మధ్యలో ఒక కొత్త బేస్‌ను కూడా చైనా నిర్మిస్తోంది. గతేడాది నుంచి సరిహద్దుకు దగ్గరలోని 7 చైనా ఎయిర్‌బేస్‌లపై భారతీయ ఏజెన్సీలు కన్నేసి ఉంచాయి. ఇటీవల కాలంలో ఈ బేస్‌లను మరింతగా బలోపేతం చేస్తున్నట్లు గమనించాయి. -
చెన్నై కేంద్రంగా ఐసిస్ కుట్ర
సిరియా వెళ్లేందుకు సిద్ధమైన 9 మంది ఒకరు కరీంనగర్‌కు చెందిన యువకుడు సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రంగా ఏర్పడిన జేకేహెచ్, జేకేబీహెచ్ మాడ్యూల్స్ గుట్టురట్టు కావడంతో ఐసిస్ చెన్నైపై కన్నేసింది. చెన్నై కేంద్రంగా యువతను ఆకర్షించి ప్రత్యేక మాడ్యూల్ ఏర్పాటుకు కుట్ర పన్నింది. ప్రాథమికంగా 9 మందితో ఏర్పడిన మాడ్యూ ల్లో రాష్ట్రంలోని కరీంనగర్‌కు చెందిన యువ కుడు ఉన్నాడు. భారత ఏజెన్సీలు గతేడాది అబుదాబి నుంచి డిపోర్టేషన్ ద్వారా తీసుకు వచ్చిన ముగ్గురి విచారణలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. దీంతో ఢిల్లీ ఎన్ఐఏ యూనిట్ గత నెల 26న తొమ్మిది మందిపై సుమోటో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. అబుదాబి నుంచి మాడ్యూల్: హైదరాబాద్‌లో ఐసిస్ గతేడాది 2 మాడ్యూల్స్‌ను తయా రుచేసింది. ఎన్ఐఏ అధికారులు ఈ గుట్టు రట్టు చేయడంతో ఐసిస్ చెన్నై కేంద్రంగా మాడ్యూల్‌ను ఏర్పాటుచేసుకుంది. అబుదాబి లో ఉంటూ ఐసిస్ కోసం పనిచేస్తున్న షేక్ అజర్ అల్ ఇస్లాం అబ్దుల్ సత్తార్ షేక్, మహ్మద్ ఫర్హాన్ మహ్మద్ ఇర్ఫాన్ షేక్, అద్నాన్ హుస్సేన్ మహ్మద్ హుస్సేన్‌లు ఆన్లైన్ ద్వారా ఈ మాడ్యూల్‌ను ఏర్పాటు చేశారు. ఐసిస్‌పై ఆసక్తి ఉన్నవారిని గుర్తించడం, వీరిలో ఉన్మాద భావాలు ప్రేరేపించడం, విధ్వంసాలు సృష్టిం చడానికి తగు శిక్షణ ఇవ్వడంతో పాటు ఆర్థిక వనరులూ సమకూర్చుకునే బాధ్యతల్ని ఈ మాడ్యుల్‌కు అప్పగించాలని ఈ త్రయం భావించింది. వీరిలో 8 మంది తమిళనాడుకు చెందిన వారు. వీరంతా 30 ఏళ్ల లోపు వయ స్కులే. వీరంతా సిరియా వెళ్లి ఐసిస్‌లో చేరేందుకు ఆసక్తి చూపించారు. డిపోర్టేషన్లో భారత్‌కు: ఈ లోపే కేంద్ర నిఘా వర్గాలు వీరి ఆచూకీ, వ్యవహారాలను కనిపెట్టాయి. భారత్‌లో ఐసిస్ విస్తరణకు కుట్రపన్ని, ప్రయత్నాలు చేస్తున్న వారి వివ రాలు అబుదాబి అధికారులకు ఇచ్చారు. అక్క డి అధికారుల సాయంతో గత నెలలో వీరిని డిపోర్టేషన్ (బలవంతంగా తిప్పిపంపడం) ద్వారా భారత్‌కు తీసుకువచ్చారు. -
మిస్టరీ మహిళ కోసం వేట..!
న్యూఢిల్లీ: ఆమె వయసు ఇప్పుడు 32. పేరు క్రిస్టీన్ బ్రెడో స్ల్పీడ్. చిరునామా ఫ్లాట్ నంబర్ 3, 10 చాప్ స్టోవ్ రోడ్, లండన్. డీటెయిల్స్ ఇంత క్లియర్ గా ఉన్నా ఇప్పటికీ ఆమె మిస్టరీ మహిళే. ఎందుకంటే ఈ వివరాలు ఒరిజినలా? ఫేకా? ఇంకా తెలియాల్సిఉంది. ప్రస్తుతం భారత రాజకీయాలను కుదిపేస్తోన్న అగస్టా వెస్ట్ లాండ్ కుంభకోణంలో ఈ మిస్టరీ మహిళదే ప్రధాన పాత్ర పోషించినట్లు భారత దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ఆమేరకు ఆమె గురించిన సమాచారాన్ని సేకరించేకొద్దీ క్రిస్టీన్.. వ్యవహారాలను చక్కబెట్టడంలో ఎంత నేర్పరో తెలుస్తోంది. ఇంతకీ ఆమె ఈ కుంభకోణంలోకి ఎలా ఎంటర్ అయిందంటే.. డెన్మార్క్ కు చెందిన క్రిస్టీన్ బ్రెడో చిన్నవయసులోనే వ్యాపార రంగంలోకి ప్రవేశించింది. 20 ఏళ్ల వయసులోనే బీటెల్ నట్ హోమ్ అనే బ్రిటిష్ కంపెనీలో షేర్ హోల్డర్ అయింది. ఈ సంస్థ యజమాని మరెవరోకాదు.. అగస్టా స్కామ్ లో భారత నేతలకు ముడుపులు ముట్టచెప్పడంలో ప్రధాన మధ్యవర్తిగా వ్యవహరించిన బ్రిటిష్ పౌరుడు క్రిస్టియన్ జేమ్స్ మిచెల్ ది. ఆయనకే చెందిన గ్లోబల్ సర్వీసెస్ సంస్థ(దీనిని దుబాయ్ కేంద్రంగా ఏర్పాటుచేశారు)లోనూ క్రిస్టీన్ ప్రధాన వాటాదారు. అలా వాళ్లిద్దరి మధ్య నెలకొన్న స్నేహమే క్రిస్టీన్ ను అగస్టా కుంభకోణంలోకి లాక్కొచ్చింది. జేమ్స్ మిచెల్ కు అత్యంత నమ్మకమైన మనిషిగా క్రిస్టీన్.. ఆయన తరఫున భారత నేతలతో మాట్లాడేదని, వ్యక్తిగంగానూ నిందితులను కలుసుకుందని దర్యాప్తు సంస్థలు ఒక అంచనాకు వచ్చాయి. 12 హెలికాప్టర్ల కొనుగోలుకు సంబంధించిన డీల్ నిర్ణయం మొదలుకొని, పూర్తయ్యేవరకు ఆమె భారత్ కు పలుమార్లు వచ్చిపోవడం కూడా కుంభకోణంలో ఆమె పాత్రను నిర్ధారిస్తున్నాయి. భారత నేతల తరఫున మధ్యవర్తిత్వం వహించిన గౌతమ్ పారేఖ్ ను విచారించడం ద్వారా దర్యాప్తు సంస్థలు క్రిస్టీన్ కు సంబంధించిన వివరాలు సేకరించారు. 2010 ఫిబ్రవరిలో క్రిస్టీన్ ఇండియాకు వచ్చారు. అదేనెల 8న అగస్టా డీల్ కు సంబంధించిన ఒప్పందాలపై సంతకాలయ్యాయి. 15న ఇండియా నుంచి దుబాయ్ వెళ్లిన క్రిస్టీన్ అక్కడేఉన్న క్రిస్టియన్ మిచెల్ ని కలుసుకుంది. మళ్లీ 24న భారత్ కు వచ్చి బ్యాలెన్స్ వ్యవహారలు చక్కబెట్టింది. ఈ వ్యవహారానికి సంబంధించి ఇటలీ కోర్టు 2012లో విచారణకు ఆదేశించింది. దీంతో అదే ఏడాది డిసెంబర్ 30న క్రిస్టీన్ మరోసారి ఇండియాకు వచ్చి నిందితులను కలుసుకుంది. 2013 జనవరిలో దుబాయ్ వెళ్లి మిచెల్ కు ఇక్కడి(భారత్) వ్యవహారాలను తెలిపింది. 3,600 కోట్ల డీల్ ను కుదిర్చినందుకుగానూ ఫిన్ మెకానికా (అగస్టా వెస్ట్ లాండ్ బ్రాండ్ హెలికాప్టర్ల తయారీ సంస్థ) జాన్ మిచెల్ కు 26 మిలియన్ పౌండ్లు చెల్లించుకుంది. అందులో భారీ మొత్తం క్రీస్టీనాకు దక్కి ఉండొచ్చని అనుమానం. అయితే ఈ చెల్లింపుల వ్యవహారం, భారత నేతలకు లంచాలు ఇవ్వజూపడాన్ని నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. గాంధీ కుటుంబానికి సంబంధించిన నేతల పేర్లు చెప్పాలని సీబీఐ తనను ఒత్తిడి చేస్తున్నట్లు ఆరోపించారు. దర్యాప్తు సంస్థ మాత్రం మిచెల్ చెప్పేవన్నీ అబద్ధాలని కొట్టిపారేస్తోంది. క్రిస్టీన్ ను విచారించగలిగితే మరిన్ని చీకటి కోణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉండటంతో ఆమె కోసం వేట మొదలైంది. వీవీఐపీలు వినియోగించేందుకు 12 హెలికాప్టర్లు కొనాలనుకున్న భారత ప్రభుత్వం.. రోమ్ కేంద్రంగా పనిచేస్తోన్న ఆంగ్లో-ఇటాలియన్ కంపెనీ అగస్టా వెస్ట్ లాండ్ కు 3,600 కోట్ల కాంట్రాక్టును అప్పచెప్పింది. అయితే అసలు విలువలో భారీ మొత్తాన్ని లంచాల రూపంలో మింగేశారని, ఒప్పందం కుదుర్చుకునే విషయంలో మధ్యవర్తిత్వం చోటుచేసుకుందని, డీల్ మొత్తం అస్తవ్యస్తంగా ఉందంటూ ఇటాలియన్ కోర్టు దర్యాప్తునకు ఆదేశించడంతో అగస్టా కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దీంతో భారత్ లోనూ రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి.