breaking news
fullfill
-
హమ్మయ్యా.. అమ్మ కల నెరవేరింది
ఇంటిపట్టున ఉండి పిల్లాడి ఆలనాపాలన చూడాలనేది ఆమె కల. అయితే ఆమెది రెక్కాడితేగానీ డొక్కాడని జీవితం. పొద్దున పని కోసం బయటికి వెళితే ఏ రాత్రో ఇంటికి వచ్చేది. సెలవంటూ లేని పని. పరీక్ష ఫీజు కట్టలేని సందర్భంలో పిల్లాడిని పట్టుకొని ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. ఎన్నో కష్టాలు పడి పిల్లాడిని చదివించింది. పంజాబ్‌లోని లుథియానాకు చెందిన ఆ అబ్బాయి అయూష్ గోయల్ ఎకౌంటెంట్ అయ్యాడు. ఆ తరువాత ట్విట్టర్ కాపీరైటర్‌గా మంచి ఆదాయన్ని అర్జిస్తున్నాడు. అమ్మను పని మానిపించాడు. తాము ఉండే ఇరుకు గది నుంచి 2–బెడ్రూమ్ అపార్ట్‌మెంట్‌కు మారాడు. ‘ఇప్పుడు మా అమ్మ ఫుల్–టైమ్ మదర్’ అని తల్లి ఫొటోలను జత చేస్తూ ఆయూష్ గోయల్ ట్విట్టర్ లో చేసిన పోస్ట్ వైరల్ అయింది. ఎంతోమందిని కదిలించింది. -
దశాబ్దాల కల నెరవేర్చిన సీఎం జగన్
-
హంద్రీ – నీవా పూర్తి చేస్తాం
పుట్టపర్తి అర్బన్: హంద్రీ–నీవాను 2016 ఆఖరుకు పూర్తి చేసి రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పుట్టపర్తికి విచ్చేసిన ఆయన స్థానిక టీడీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో కష్టా, గోదావరి నదులను అనుసంధానం చేయడం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక చారిత్రక ఘట్టానికి తెర లేపారన్నారు. రాబోవు రోజుల్లో చెరువులను కూడా అనుసంధానం చేసి రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు నీటిని అందించాలన్న ధృడ సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. 2018 నాటికి పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు.ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చేసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు అసత్య ఆరోపణలు చేస్తున్నాయన్నారు. ఇటీవల ప్రకటించిన డిజిటల్ ఇండియా ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్‌కు మొదటి స్థానం తీసుకురావడంలో కషి చేసిన మంత్రిని టీడీపీ నాయకులు సన్మానించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పిట్టా ఓబులరెడ్డి, నాయకులు శ్రీరాంరెడ్డి,ఆదినారాయణరెడ్డి, చెన్నకేశవులు,కొనంకి గంగాధర్‌నాయుడు,ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ జయరాంనాయుడు తదితరులు పాల్గొన్నారు.