breaking news
Football World Cup winner
-
మారడోనా డిశ్చార్జి
బ్యూనస్ ఎయిర్స్: అర్జెంటీనా సాకర్ దిగ్గజం, 1986 ఫుట్‌బాల్ ప్రపంచకప్ చాంపియన్ కెప్టెన్ డీగో మారడోనా ఆసుపత్రి నుంచి గురువారం డిశ్చార్జి అయ్యాడు. ఈ విషయాన్ని అతని వ్యక్తిగత వైద్యుడు, న్యూరాలజిస్ట్ లియోపోల్డో లుఖ్ వెల్లడించారు. మెదడులోని నాళాల మధ్య రక్త సరఫరాలో ఇబ్బంది తలెత్తడంతో మారడోనాకు గత వారం ‘సబ్డ్యూరల్ హెమటోమా’ శస్త్రచికిత్స నిర్వహించారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయినప్పటికీ అతను కోలుకునేందుకు ఇంటివద్ద చికిత్స కొనసాగిస్తామని లుఖ్ చెప్పారు. ఇటీవలే 60వ పడిలో అడుగుపెట్టిన మారడోనా... తొలుత డిప్రెషన్, ఎనీమియా, డీహైడ్రేషన్ లక్షణాలతో ‘లా ప్లాటా’ నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. పరీక్షల అనంతరం సబ్డ్యూరల్ హెమటోమా నిర్ధారణ కావడంతో అతన్ని స్థానిక ఓలివోస్ క్లినిక్‌లో చేర్పించి వెంటనే శస్త్ర చికిత్స నిర్వహించారు. -
ఫుట్‌బాల్ ప్రపంచ కప్ విజేతకు 215 కోట్లు
వచ్చే ఏడాది జరిగే ఫుట్‌బాల్ ప్రపంచ కప్ విజేతకు నగదు బహుమతిని భారీగా పెంచారు. చాంపియన్ జట్టు 215 కోట్ల రూపాయల్ని సొంతం చేసుకోనుంది. 2010లో దక్షిణాఫ్రికాలో జరిగిన ప్రపంచ కప్‌లో కంటే ఈ నగదు బహుమతి 17 శాతం ఎక్కువ. ప్రపంచ ఫుట్‌బాల్ గవర్నింగ్ బాడీ ఫిఫా ఈ మేరకు ప్రకటించింది. రన్నరప్‌గా నిలిచిన జట్టుకు దాదాపు 154 కోట్లు ఇవ్వనున్నారు. ఇక మూడో స్థానంలో నిలిచిన జట్టుకు 135 కోట్లు, టోర్నీలో పాల్గొనే 32 జట్లకు తలా 9 కోట్ల రూపాయల చొప్పున అందజేయనున్నారు. ప్రపంచ కప్‌నకు బ్రెజిల్ ఆతిథ్యమివ్వనుంది.