breaking news
The first State Conference
-
'కేసీఆర్ సమాధానం చెప్పాలి'
హైదరాబాద్: మంత్రి వర్గం నుంచి రాజయ్యను తొలిగించడంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు సమాధానం చెప్పాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. ఆయన మంగళవారమిక్కడ మాట్లాడుతూ...రాజయ్య బర్తరఫ్ పార్టీ అంతర్గతం కాదని, దాని వెనుక ఉన్న మతలబు ప్రజలకు తెలియాలన్నారు. భారత్ లో అమెరికా అధ్యక్షుడు ఒబామా పర్యటన వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని విమర్శించారు. ఇంటింటికి సీపీఎం కార్యక్రమానికి మంచి ఆదరణ లభించదని, ఇప్పటి వరకు ప్రజల నుంచి రూ. 1.20 కోట్ల విరాళాలు వచ్చాయని తమ్మినేని తెలిపారు. ఫిబ్రవరి 16 నుంచి తెలంగాణలో జరగబోయే మహాసభలకు అంతా సిధ్దమని తమ్మినేని చెప్పారు. -
ఫిబ్రవరి 26 నుంచి తెలంగాణ సీపీఎం తొలి మహాసభలు
హైదరాబాద్: తెలంగాణ సీపీఎం తొలి రాష్ట్ర మహాసభలు వచ్చే ఫిబ్రవరి 26 నుంచి మార్చి 1 వరకు హైదరాబాద్‌లో జరగనున్నాయి. ఈ నెల 15న సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ఆహ్వానసంఘం సమావేశం జరగనుంది. వచ్చే జనవరి 20 నుంచి ఫిబ్రవరి 10 వరకు రాష్ట్రంలోని మొత్తం పార్టీ కేడర్‌ను హైదరాబాద్‌కు తీసుకొచ్చి 3 వేల దళాలతో రాష్ట్ర మహాసభల ప్రచార కార్యక్రమాలను నిర్వహించనున్నారు. రాజధానిలోని కనీసం 10 లక్షల ఇళ్లకువెళ్లి సీపీఎం కార్యక్రమాల గురించి, మహాసభల గురించి కరపత్రాలు, ఇతర ప్రచార కార్యక్రమాలతో తెలియజేయనున్నట్లు ఆ పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ‘సాక్షి’కి చెప్పారు. మార్చి 1న నిజాం కాలేజీలో బహిరంగసభను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా 50 వేల మందితో నగరంలో కవాతును నిర్వహిస్తామన్నారు. కాగా, వచ్చే ఏడాది ఏప్రిల్ 15-19 తేదీల మధ్య విశాఖపట్టణంలో సీపీఎం జాతీయమహాసభలు జరగనున్నాయి. ఈ విషయమై చర్చించేందుకు తెలంగాణ, ఏపీ శాఖల సెక్రటేరియట్ భేటీ ఆదివారం ఎంబీభవన్‌లో జరిగింది.