breaking news
Energy banking
-
గ్రిడ్ స్థిరీకరణకు స్టోరేజ్ సిస్టమ్
దేశరాజధాని ఢిల్లీలోని కిలోక్రీలో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (బీఈఎస్ఎస్)ను ప్రవేశపెట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఇండిగ్రిడ్, బీఎస్ఈఎస్ సహకారంతో అభివృద్ధి చేసిన ఈ స్టాండలోన్ యుటిలిటీ స్కేల్ సిస్టమ్ పవర్ గ్రిడ్‌ను స్థిరీకరించేందుకు తోడ్పడుతుందని పేర్కొన్నారు. దీనివల్ల దక్షిణ ఢిల్లీలోని దాదాపు లక్ష మంది నివాసితులకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు.బీఈఎస్ఎస్ ఎలా పనిచేస్తుంది?బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (బీఈఎస్ఎస్)ను 20 మెగావాట్లు/40 మెగావాట్‌హవర్ స్టోరేజీ సామర్థ్యం కలిగిన అత్యాధునిక వ్యవస్థ కోసం రూపొందించారు. ఇది భారీ ఇన్వర్టర్ మాదిరిగా పని చేస్తుంది. విద్యుత్ డిమాండ్ తక్కువగా ఉన్నప్పుడు ఆఫ్-పీక్ అవర్స్‌లో ఛార్జ్ అవుతుంది. డిమాండ్ పెరిగినప్పుడు తిరిగి గ్రిడ్‌కు విద్యుత్ సరఫరా అందిస్తుంది. దీనివల్ల విద్యుత్ వినియోగంలో హెచ్చుతగ్గులు లేకుండా ఉండేందుకు వీలవుతుంది. ఇది విద్యుత్ సరఫరా మౌలిక సదుపాయాలపై ప్రభావం, తద్వారా అంతరాయాలను తగ్గిస్తుంది.ప్రయోజనాలుబీఈఎస్ఎస్ విధానం స్థిరమైన విద్యుత్ సరఫరాను నిర్వహించడానికి సహాయపడుతుంది. సప్లైలో హెచ్చుతగ్గులను నిర్వహిస్తుంది. పీక్ అవర్స్‌లో సంప్రదాయ విద్యుత్ ఉత్పత్తిపై ఆధారపడటాన్ని నియంత్రిస్తుంది. పునరుత్పాదక సౌర, పవన విద్యుత్ నిర్వహణకు వీలు కల్పించడం ద్వారా ఈ వ్యవస్థ క్లీన్ ఎనర్జీ పరిష్కారాలకు మద్దతు ఇస్తుంది. వేలాది మంది నివాసితులకు నిరంతర విద్యుత్‌ను అందిస్తుంది. విద్యుత్ సరఫరాలో బ్లాక్అవుట్లను నివారిస్తుంది.ఇదీ చదవండి: రైతన్నపై ప్రకృతి ప్రకోపందక్షిణాసియాలో అతిపెద్ద బ్యాటరీ స్టోరేజ్పంపిణీ స్థాయిలో దక్షిణాసియాలోనే అతిపెద్ద బ్యాటరీ స్టోరేజ్ వ్యవస్థ ఇదేనని అధికారులు తెలిపారు. వాతావరణ మార్పులకు సంబంధించి పెరుగుతున్న ఆందోళనలు, స్థిరమైన విద్యుత్ పరిష్కారాలు అవసరం అవుతుండడంతో బీఈఎస్ఎస్ వంటి బ్యాటరీ స్టోరేజ్ విధానాలు ఆధునిక నగరాలకు కీలకమైన సాధనాలుగా మారుతున్నాయని చెప్పారు. -
ఇక కరెంటుకూ బ్యాంకులు
* సౌర విద్యుత్ వినియోగదారులకు ఎనర్జీ బ్యాంకింగ్ సౌకర్యం * విద్యుత్‌ను ‘డిస్కం’లకు ఇచ్చి అవసరమైనప్పుడు తిరిగి పొందవచ్చు * సౌర విద్యుత్ ఉత్పాదనను ప్రోత్సహించేందుకు వినూత్న ప్రయత్నం సాక్షి, హైదరాబాద్: రాము తన రూఫ్‌టాప్ సోలార్ సిస్టం ద్వారా 500 యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశాడు. సొంత వినియోగం పోగా 100 యూనిట్లను ‘ఎనర్జీ బ్యాంకు’లో జమ చేశాడు. మరుసటి నెలలో అవసరాలు పెరగడంతో ఎనర్జీ సేవింగ్స్ నుంచి 50 యూనిట్లను డ్రా చేసి వాడుకున్నాడు. సమీప భవిష్యత్తులో మనం ఇలాంటి ఘటనలను చూడబోతున్నాం. సంపాదనలో మిగులు డబ్బును బ్యాంకులో జమ చేసి అవసరమైనప్పుడు వినియోగించుకుంటున్నట్లే విద్యుత్‌ను సైతం దాచిపెట్టి అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. రాష్ట్రంలో సౌరవిద్యుత్ ఉత్పాదకతను పెంపొందించేందుకు విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ఈ వినూత్న సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. రాష్ట్రంలో సౌర విద్యుత్ ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు సరళీకృత విధానాలు, భారీ రాయితీలు, ప్రోత్సాహకాలతో డిస్కంలు ‘తెలంగాణ సౌర విద్యుత్ విధానం’ ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సౌర విద్యుత్ వినియోగదారుల కోసం ప్రవేశపెట్టిన ‘విద్యుచ్ఛక్తి బ్యాంకింగ్’ సదుపాయం అందరినీ ఆకర్షిస్తోంది. సొంత వినియోగం(కాప్టివ్), ఓపెన్ యాక్సెస్ (బహిరంగ విక్రయం), షెడ్యూల్డ్ కేటగిరీల వినియోగదారులకు ఏడాదిలో 12 నెలల పాటు ఈ సౌలభ్యం అందుబాటులో ఉండనుంది. స్వీయ వినియోగం/ప్రైవేటు సంస్థలకు విక్రయ డిమాండు తగ్గిపోయినా సౌర విద్యుత్ ప్రాజెక్టులు నిరాటంకంగా ఉత్పత్తిని కొనసాగించవచ్చు. ఉత్పాదనలో 100 శాతం విద్యుత్‌ను ఎనర్జీ బ్యాంక్‌లో దాచుకోవచ్చు. సౌర విద్యుత్ ప్రాజెక్టులపై భారీగా పెట్టుబడి పెట్టిన వినియోగదారులు నష్టపోకుండా డిస్కంలు ఈ వినూత్న సదుపాయాన్ని కల్పించాయి. దీనికి ప్రతిఫలంగా కేవలం 2 శాతం బ్యాంకింగ్ చార్జీలను వసూలు చేస్తాయి. ఏప్రిల్ నుంచి మార్చివరకు బ్యాంకింగ్ సంవత్సరంగా పరిగణిస్తారు. వినియోగదారులు ‘ఎనర్జీ బ్యాంకు’ నుంచి విద్యుత్‌ను తిరిగి పొందని పక్షంలో డిస్కంలు ఆ విద్యుత్‌ను తామే కొనుగోలు చేసినట్లు పరిగణిస్తాయి. విద్యుత్ నియంత్రణ సంస్థ నిర్ణయించిన సగటు విద్యుత్ కొనుగోలు ధర ప్రకారం వినియోగదారులకు డబ్బులు చెల్లిస్తాయి. సౌర విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయి థర్డ్ పార్టీ కొనుగోలుదారుడు లభించే వరకు ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను సైతం ఎనర్జీ బ్యాంకులో నిల్వ చేసుకోవచ్చు. ఎనర్జీ బ్యాంక్ అంటే స్వభావరీత్యా విద్యుత్ నిల్వ ఉండదు. ఉత్పత్తి చేసిన వెంటనే వినియోగించుకోవాల్సిందే. అప్పటికప్పుడు వినియోగించునే అవకాశం లేనప్పుడు (డిస్కంలకు) ఎనర్జీ బ్యాంకుకు ఇవ్వవచ్చు. ఆ విద్యుత్‌ను డిస్కంలు తమ వినియోగదారులకు సరఫరా చేస్తాయి. దీనికి బదులుగా అవసరమైనప్పుడు డిస్కంలు సౌర వినియోగదారులకు విద్యుత్‌ను ఇస్తాయి.