breaking news
defense walls
-
గ్రేట్ వాల్ ఆఫ్ బెజవాడ
కృష్ణవేణి... తెలుగింటి విరిబోణీ.. అంటూ సినీ కవుల పాటలు వినసొంపుగా ఉంటాయి. కృష్ణా నదికి వరద వస్తే విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ మీదకు వెళ్లి ఆ సోయగాన్ని చూడటం సామాన్యులకు ఓ మధురానుభూతి. కానీ విజయవాడ కృష్ణలంక తోతట్టు ప్రాంతాల వారు కృష్ణమ్మకు వరద వస్తుందంటేనే హడలెత్తిపోయేవారు. నదిని ఆనుకుని ఉన్న కృష్ణలంక, రాణిగారితోట, రామలింగేశ్వర నగర్, గౌతమి నగర్, బాలాజీ నగర్, భ్రమరాంబపురం, భూపేష్గుప్తా నగర్, తారకరామా నగర్, గీతానగర్, చలసాని నగర్, కోటి నగర్, పోలీస్ కాలనీ, రణదివె నగర్ తదితర కాలనీలు దశాబ్దాల పాటు వరద బాధిత ప్రాంతాలుగానే మిగిలిపోయాయి. ప్రకాశం బ్యారేజ్ నుంచి 3 లక్షల క్యూసెక్కుల నీరు కిందకు వదిలితే చాలు.. ఆ కాలనీలను వరద ముంచెత్తేది. ఇళ్లన్నీ నీట మునిగిపోయేవి. ఆ వెంటనే కొన్ని వస్తువులు, దుస్తులు తీసుకొని పిల్లలు, వృదు్థలతో సహా కృష్ణలంక గట్టు మీదకు చేరేవారు. అక్కడే టార్పాలిన్లు వేసుకుని వరద ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురుచూసేవారు. ఓ సారి వరద వస్తే వారం వరకూ కొనసాగేది. వర్షం, చలి మధ్య వీధి దీపాలు కూడా లేని ఆ గట్టు మీద చీకట్లోనే రోజులు వెళ్లదీయాల్సి వచ్చేది.దాదాపు 5 వేల కుటుంబాలు దశాబ్దాలపాటు అనుభవించిన దుస్థితి ఇది. వారందరూ రెక్కాడితేగానీ డొక్కాడని ముఠా కార్మికులు, రోజు కూలీలు, చిరు వ్యాపారులే. అటు పనులకు వెళ్లలేక ఇటు ఇళ్లలోకి వెళ్లలేక అవస్థలు పడేవారు. అయినా గతంలో ఏ ప్రభుత్వమూ వీరి కడగండ్లను పట్టించుకోలేదు. తమ బతుకులు ఇంతే అంటూ ఆ పేదలు కూడా నిస్పృహలో కూరుకుపోయారు.వరద వచ్చి నా ఇప్పుడు బెంగ లేదు20 ఏళ్లుగా కృష్ణలంక భూపేష్ నగర్లోనే ఉంటున్నాం. గతంలో చాలాసార్లు కృష్ణా నదికి వరదలు వచ్చాయి. చిన్న వరద వస్తే కుటుంబమంతా కట్టుబట్టలతో కృష్ణలంక గట్టు మీదకు వెళ్లిపోయేవాళ్లం. వంట సామాన్లు తీసుకునే అవకాశం కూడా ఉండేది కాదు. అయిదారురోజుల తరువాత వరద తగ్గితే ఇంటికి చేరేవాళ్లం. పాడై పోయిన ఇంటిని బాగుచేసుకొనేవాళ్లం. అన్ని సామాన్లు మళ్లీ కొనుక్కోవాల్సిందే. ఇంటి రిపేర్లు, అత్యవసరమైన సామాన్లకే అయిదారు నెలల సంపాదన ఖర్చయ్యేది. ఇక మా పరిస్థితి ఇంతే అనుకునే సమయంలో వైఎస్ జగన్ ప్రభుత్వం అద్భుతం చేసింది. కృష్ణా నదికి రక్షణ గోడ నిరి్మంచింది. మా ప్రాంతాలకు వరద ముప్పు పూర్తిగా తొలగిపోయింది. ఇప్పుడు కృష్ణా నదికి వరదలు వస్తున్నా నేను ఇంట్లోనే ధీమాగా ఉన్నాను. – వై. బాబూరావు, తాపీ మేస్త్రిజగన్ చేసిన మేలు జీవితాంతం గుర్తుంచుకుంటాం కృష్ణలంక ప్రజలు ఈ రోజు ఇంత ధైర్యంగా ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డే కారణం. కృష్ణా నదికి రక్షణ గోడ నిర్మించాలని గతంలో ఎన్నో ప్రభుత్వాలను వేడుకున్నాం. ఎవరూ పట్టించుకోలేదు. వరదలు వచ్చి నప్పుడు మంత్రులు, అధికారులు వచ్చి పరామర్శించి వెళ్లిపోయేవారు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేం కోరకుండానే కృష్ణా నదికి రక్షణ గోడ కట్టారు. అదీ అత్యంత పటిష్టంగా నిరి్మంచారు. మా కాలనీలకు ముంపు భయం పూర్తిగా తొలగిపోయింది. ఎంత వరద వచ్చి నా మాకు ఎలాంటి భయం లేదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన మంచిని ఈ ప్రాంతంలోని 3 లక్షల మంది జనాభా జీవితాంతం గుర్తుంచుకుంటా. – చిన్నపరెడ్డి వెంకటరెడ్డి, తారకరామ నగర్, విజయవాడ జగన్ దయతో ప్రశాంతంగా ఉన్నాం వైఎస్ జగన్మోహన్రెడ్డి రక్షణ గోడ కట్టబట్టే కృష్ణా నదికి ఇంత పెద్ద వరద వచ్చి నా మేం ప్రశాంతంగా ఉన్నాం. వరదలు వస్తే మా ఇళ్లన్నీ మునిగిపోయి రోడ్డున పడేవాళ్లం. రోడ్డు మీద మా బతుకులను ఎవరూ పట్టించుకునే వారే కాదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రక్షణ గోడ కట్టడంతోపాటు మా కాలనీలకు రోడ్లు కూడా వేసింది. – బి. రమణమ్మ, రాణిగారితోట, విజయవాడ వరదకు అడ్డుగా జగన్... అడ్డుకట్టగా రిటైనింగ్ వాల్మనసున్న పాలకుడు వస్తే పేదల కష్టాలకు శాశ్వత పరిష్కారం ఎలా చూపిస్తారో అనడానికి వైఎస్ జగనే ఏకైక ఉదాహరణ. కృష్ణలంక లోతట్టు ప్రాంతాల ప్రజల వరద కష్టాలను అడ్డుకట్ట వేసిన ఏకైక ముఖ్యమంత్రి. ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృష్ణా నది వెంబడి రిటైనింగ్ వాల్ నిర్మించాలన్న చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. విజయవాడలోని పద్మావతి ఘాట్ నుంచి యనమలకుదురు వరకు నదిని ఆనుకుని 5.66 కిలోమీటర్ల మేర పటిష్టమైన రక్షణ గోడ నిర్మించారు. మూడు దశల్లో మొత్తం రూ.474.51 కోట్లతో నిర్మించిన ఈ రక్షణ గోడ నేటి కృష్ణా నది భారీ వరద నుంచి లోతట్టు ప్రాంతాలను కాపాడే రక్షణ కవచంగా నిలిచింది. వైఎస్ జగన్ ఎంతో దూరదృష్టితో ఈ రక్షణ గోడ డిజైన్‌ను ఖరారు చేశారు. గత వందేళ్లలో కృష్ణా వరదలను పరిగణలోకి తీసుకుని.. 2009లో కృష్ణా నదికి వచ్చి న గరిష్ట వరద లెక్కలను ప్రామాణికంగా తీసుకున్నారు. 12 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి నా లోతట్టు ప్రాంతాలకు ఎలాంటి ముప్పు లేకుండా అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో పటిష్టమైన రక్షణ గోడ నిర్మించారు. వైఎస్ జగన్ దూరదృష్టే ప్రస్తుతం కృష్ణా నదికి 11లక్షల క్యూసెక్కుల వరద వచ్చి నా కృష్ణలంకలోని లోతట్టు ప్రాంతాల ప్రజలకు వరద మప్పు లేకుండా ధీమాగా ఉంచింది. -
రక్షణ గోడలు ఎందుకు విఫలమయ్యాయి?
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్రం మరోసారి పలు వివరాలు కోరింది. గతేడాది జూలైలో గోదావరికి వచ్చిన వరదల సందర్భంగా మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలకు పక్కన ఉన్న వరద రక్షణ గోడలు పంప్‌హౌస్‌లు, తదితరాలను రక్షించడంలో ఎందుకు విఫలమయ్యాయి? రక్షణ గోడలు నిబంధనల అనుగుణంగా ఎత్తును కలిగి ఉన్నాయా? బ్యారేజీలకు సంబంధించిన గట్టులు (సేఫ్టీ ఎంబ్యాక్‌మెంట్) పరిసర గ్రామాలకు రక్షణ కల్పించడంలో ఎందుకు విఫలమయ్యాయి?.. తదితర వివరాలను సమర్పించాలని పేర్కొంటూ కేంద్ర జలశక్తి శాఖ ఈ నెల 1న రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీకి లేఖ రాసింది. గోదావరి నదిపై కాళేశ్వరం ప్రాజెక్టుకు సమానంగా వరద ముప్పును కలిగి ఉన్న ఇతర ప్రాజెక్టులున్నాయా? ఆ ప్రాజెక్టులు ఎందుకు వరదను సమర్థవంతంగా ఎదుర్కోగలిగాయి? కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలు ఎందుకు విఫలమయ్యాయి? అనే సమాచారాన్ని సైతం అందించాలని కోరింది. ఇటీవల మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోగా, అన్నారం బ్యారేజీకి బుంగలు పడి నీళ్లు లీకైన విషయం తెలిసిందే. ఈ ఘటనల నేపథ్యంలోనే జలశక్తి శాఖ ఈ సమాచారం కోరినట్టు తెలుస్తోంది. అవగాహన ఉన్న అధికారిని పంపండి పంప్హౌసుల్లోని పంపింగ్ యూనిట్ల డిజైన్లు, ప్లేస్మెంట్ల (లొకేషన్)లో లోపాలు వంటి సమాచారాన్ని కూడా జలశక్తి శాఖ కోరింది. వరదల సమ యంలో పంప్‌హౌసుల్లో చేరిన నీళ్లను బయటకి తోడడంలో డీవాటరింగ్ పంప్‌లు ఎందుకు విఫలమయ్యాయి? వీటికి సంబంధించిన ఇన్లెట్ గేట్లు/వాల్‌్వలు ఎందుకు మొరాయించాయి ? అనే వివరాలను సమర్పించాలని ఆదేశించింది. సవరించిన డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)ను ఇవ్వాలని సూచించింది. ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర స మాచారాన్ని అందజేసేందుకు వీలుగా ఈ విషయంలో పూర్తి అవగాహన కలిగిన ఓ అధికారిని జలశక్తి శాఖకు డిప్యుటేషన్‌పై పంపాలని ఆదేశించింది. -
అరచేతిలో ప్రాణం..వాగుపై ప్రయాణం
ధ్వంసమవుతున్న వంతెన రక్షణ గోడలు పట్టించుకోని అధికారులు రాయికోడ్:మండల కేంద్రమైన రాయికోడ్ గ్రామ సమీపంలోని వాగుపై నిర్మించిన వంతెన రక్షణ గోడలు ధ్వంసం కావడంతో ప్రయాణం ప్రమాదకరంగా మా రింది. రాయికోడ్–చిమ్నాపూర్ ప్రధాన రహదారిపై ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించిన వంతెనకు ఇరువైపులా ఉన్న రక్షణ గోడ (రెయిలింగ్)కు ఇనుప చువ్వలు పైకి తేలి కాంక్రీటు పాడైంది. వాహనాలు నడిపేటప్పుడు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా వాహనాలు వంతెన కింద పడిపోయే ప్రమాదం ఉంది. ఎన్నో ఏళ్ల క్రితం ని ర్మించిన ఈ వంతెనపై ప్రయాణికులు భ యంభయంగా ప్రయాణిస్తున్నారు. ఇప్పటికైనా రక్షణ గోడలు నిర్మించాలని వాహనదారులు, ప్రయాణికులు కోరుతున్నారు. అలాగే ఎప్పుడో నిర్మించిన వంతెనను సంబంధిత శాఖల ఇంజనీర్లు పరిశీలించి వంతెనపై ప్రయాణం ఎంతవరకు భద్రమో తెలియజేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మండల పరిధిలోని రాయిపల్లి– కర్చల్ రహదారిపై రాయిపల్లి శివారులో ఉన్న మూలమలుపు ప్రాంతంలోని కల్వర్టు ధ్వంసమైంది. అక్కడ రోడ్డు కోతకు గురికావడంతో ప్రయాణం చేసేం దుకు వీల్లేకుండా ఉంది. దీంతో ఈ ప్రాం తంలో తరచుగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇక్కడ గతంలో పలు ప్రమాదాలు జరగడంతో పలువురు వా హన దారులు, ప్రయాణికులు గాయపడిన సంఘటనలూ ఉన్నాయి. కల్వర్టును నిర్మించి రోడ్డు మరమ్మతు చేయాలని ఎన్ని సార్లు మొర పెట్టుకున్నా ఫలితం లేదని కర్చల్, రాయిపల్లి, మామిడిపల్లి, ఇందూర్ తదితర గ్రామాలకు చెందిన వాహన దారులు వాపోతున్నారు. అధికారులు రోడ్డు, కల్వర్టులకు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. లోలెవల్ బ్రిడ్జిలతో ఇబ్బందులు మండలంలోని హుల్గేర, యూసుప్పూర్, రాయిపల్లి, కుసునూర్ గ్రామ శివార్లలోని వాగులపై గతంలో నిర్మించిన లో లెవల్ బ్రిడ్జిలతో ఇబ్బందులు వస్తున్నాయి. వర్షాకాలంలో బ్రిడ్జీలపై నుంచి పారుతుండటంతో రోజుల తరబడి వేరే గ్రామాలకు వెళ్లలేని పరిస్థితులు నెలకొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తరుచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి.. రాయిపల్లి గ్రామ శివారులోని మూలమలుపు వద్ద కల్వర్టు ధ్వంసమై రోడ్డు కోతకు గురికావడంతో ఈ ప్రాంతంలో తరచుగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా కల్వర్టు మరమ్మతుకు ఎటువంటి చర్యలు చేపట్టడంలేదు. – సంగమేశ్వర్, కర్చల్ గ్రామం రక్షణ గోడలు నిర్మించాలి.. రాయికోడ్ వంతెనకు రక్షణగా ఉన్న గోడలకు మరమ్మతు చేయాలి. ఇక్కడ రాత్రివేళల్లో ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. ప్రమాదం పొంచి ఉన్నందున రక్షణ గోడలను పటిష్టం చేసి ప్రయాణికుల భద్రతకోసం చర్యలు తీసుకోవాలి – రవికుమార్, డ్రైవర్ రాయికోడ్