breaking news
chopper deal
-
'ఇమేజ్ కాపాడుకునే కట్టుకథ అది'
తిరువనంతపురం: కాంగ్రెస్ పార్టీపై కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ మరోసారి విమర్శల దాడి పెంచారు. అగస్టా వెస్ట్ లాండ్ సంస్థను బ్లాక్ లిస్ట్‌లో పెట్టామని, దానిని ఎన్డీయే ప్రభుత్వం ఎత్తివేసి తిరిగి ఆహ్వానిస్తుందని కాంగ్రెస్ చెప్పిన మాటలన్నీ కేవలం కట్టుకథ అన్నారు. సొంత ఇమేజ్ ను కాపాడుకునేందుకు చేసుకునే ఒక ప్రయత్నం మాత్రమేనని చెప్పారు. చాపర్ల కొనుగోలులో అవకతవకలు జరిగినట్లు తెలిసిన వెంటనే తాము అగస్టా వెస్ట్ ల్యాండ్ సంస్థను బ్లాక్ లిస్ట్‌లో చేర్చామని రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అరుణ్ జైట్లీ ఆయన మాటలు తప్పుబట్టారు. మే 16న కేరళలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్డీయే విజన్ విడుదల కోసం వెళ్లిన ఆయన అక్కడ మాట్లాడారు. అగస్టా ఒప్పందం లంఛం తీసుకొని చేసిన చర్య అని ఆరోపించారు. లంఛాలు ఇచ్చారన్న విషయం ఇప్పటికే స్పష్టమైందని, అయితే అది ఎవరికి అందిందన్నది తేల్చడమే తమ ఉద్దేశం అని చెప్పారు. ఈ ఒప్పందాన్ని ప్రభావితం చేసిన వారే లంఛం తీసుకుని ఉంటారు తప్ప కొత్తవారికి అది ముట్టే అవకాశం లేదని అన్నారు. -
చాపర్ల కొనుగోలులో అవినీతి నిజమే!
► స్పష్టం చేసిన ఇటాలియన్ హైకోర్టు ► ఎస్పీ త్యాగి హస్తం ఉందని వెల్లడి రోమ్ వీవీఐపీ హెలికాప్టర్ల కొనుగోలు వ్యవహారంలో అవినీతి చోటుచేసుకుందని, అందులో భారత వైమానిక దళం మాజీ చీఫ్ ఎస్పీ త్యాగి హస్తం కూడా ఉందని ఇటాలియన్ హైకోర్టు స్పష్టం చేసింది. 2010లో జరిగిన ఈ ఒప్పందంలో 66-99 కోట్ల రూపాయల వరకు నిధులను అక్రమంగా భారతీయ అధికారుల ఖాతాల్లోకి మళ్లించినట్లు రుజువైందని కోర్టు చెప్పింది. మిలన్ హైకోర్టు ఇచ్చిన 225 పేజీల తీర్పులో, ప్రత్యేకంగా త్యాగి పాత్ర గురించి 17 పేజీలలో వివరించారు. వీవీఐపీల కోసం అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్లనే కొనుగోలు చేయాలని వైమానిక దళం నిర్ణయం తీసుకోవడంలో త్యాగి పాత్ర చాలా ఉందని కోర్టు చెప్పింది. అయితే దీనిపై స్పందించేందుకు త్యాగి నిరాకరించారు. ఇటాలియన్ హైకోర్టు ఇచ్చిన తీర్పు పూర్తి పాఠాన్ని ఇంగ్లీషులో చూసిన తర్వాతే తాను మాట్లాడతాన్నారు. ఈ కేసులో తాను నిర్దోషినని ఆయన అంటున్నారు. అయితే అసలు ఆ కోర్టు ఎదుట త్యాగి విచారణకు హాజరు కాలేదు. ప్రస్తుతం ఆయనపై భారతదేశంలో సీబీఐ, ఈడీ కూడా విచారణ జరుపుతున్నాయి. రూ. 3,565 కోట్ల విలువైన అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ల కొనుగోలు విషయంలో భారతీయ అధికారులకు లంచాలు ముట్టాయని మిలన్ హైకోర్టు స్పష్టం చేసింది. లంచాలు, అవినీతి వ్యవహారాలను రుజువు చేయలేమంటూ అంతకుముందు ఇదే విషయమై ఇటలీలోని దిగువకోర్టు ఇచ్చి తీర్పును మిలన్ హైకోర్టు కొట్టేసింది. నగదుతో పాటు ఆన్లైన్ నగదు బదిలీలు కూడా త్యాగి, ఆయన కుటుంబ సభ్యులకు చేరాయని తెలిపింది. 2005-07 సంవత్సరాల మధ్యకాలంలో త్యాగి భారత వైమానిక దళం అధిపతిగా ఉన్నారు. అప్పుడే వీవీఐపీ హెలికాప్టర్ల ఒప్పందం జరిగింది.