breaking news
capital road construction
-
సీడ్ కేపిటల్‌కు 4,227 ఎకరాలు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సీడ్ కేపిటల్‌కు 4,227 ఎకరాల భూమి అవసరమని మాస్టర్ ప్లాన్‌లో పేర్కొన్నారు. ఇందులో ఏకంగా 2,861 ఎకరాలను ప్రైవేట్ కంపెనీలకే కేటాయించారు. ప్రభుత్వ పరిపాలన భవనాలకు 150 ఎకరాలు సరిపోతుందని పేర్కొంటూ బిజినెస్ పార్కులు, వాణిజ్య అవసరాలు, ప్రత్యేక అభివృద్ధి జోన్, మిశ్రమ వినియోగం రంగాలకు ఏకంగా 2,861 ఎకరాలను కేటాయిస్తూ ప్రణాళికను రూపొందించారు. ఈ మొత్తం భూమిని ప్రైవేట్ సంస్థలు, వ్యక్తులకు అభివృద్ధి పేరుతో 99 సంవత్సరాల పాటు లీజుకు ఇవ్వనున్నారు. అలాగే తుళ్లూరు దగ్గరలో తక్షణం 280 ఎకరాల భూమిని ఎలక్ట్రానిక్స్, హార్డ్‌వేర్, ఫుడ్, బేవరేజెస్, ప్రింటింగ్ తదితర పరిశ్రమలకు కేటాయించాల్సిందిగా ప్రణాళికలో స్పష్టం చేశారు. లింగాయపాలెం, ఉద్దండరాయ పాలెం, మందడ గ్రామాల్లోనే ప్రభుత్వ పరిపాలన భవనాలు వస్తాయని ప్రణాళికలో స్పష్టం చేశారు. ఈ గ్రామాల్లో నివ సించే వారికి సీడ్ కేపిటల్ బయట మూడు అంతస్థుల భవనాల్లో నివాసాలను ఏర్పాటు చేయాలని ప్రణాళికలో పేర్కొన్నారు. ఈ మూడు గ్రామాల్లో 29 హెక్టార్ల పరిధిలో 4,157 కుటుంబాలు నివసిస్తున్నట్లు తేల్చారు. వీరికి మూడు అంతస్థుల భవనాల్లో నివాసాలను కేటాయించాల్సి ఉందన్నారు. దీన్ని పారిశ్రామిక క్లస్టర్‌గా అభివృద్ధి చేయాలని ప్రణాళికలో పేర్కొన్నారు. సీడ్ కేపిటల్ భూమిని ఎకరాల లెక్కన రంగాల వారీగా కేటాయించారు. రాజధాని రోడ్లకు 693 ఎకరాల సేకరణ సాక్షి, హైదరాబాద్: సీడ్ కేపిటల్ ప్రాంతంలో విశాలమైన రోడ్లను నిర్మించేందుకు 693 ఎకరాల భూమి అవసరమని ప్రభుత్వం తేల్చింది. రాజధాని ప్రాంతంలో సమీకరించిన భూములు కాకుండా కేవలం రోడ్ల విస్తరణకు 277.27 హెక్టార్లు (693 ఎకరాలు) కావాలని భావిస్తోంది. సింగపూర్ ప్రణాళికను అనుసరించి విజయవాడ నుంచి అమరావతి వరకూ, మంగళగిరి నుంచి అమరావతి వరకూ మొత్తం 88 కి.మీ. మేర ఐదు కేటగిరీలుగా రోడ్లను నిర్మించేందుకు కసరత్తు మొదలైంది. ఇందుకు కన్సల్టెన్సీల సేవలు వినియోగించుకునేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. -
‘షెలాడియా’కి రాజధాని రోడ్ల నిర్మాణం!
కనకదుర్గ వారధి నుంచి భవానీపురం వరకు రోడ్డు నిర్మాణానికి కేంద్రం ఓకే! సాక్షి, హైదరాబాద్: ఏపీ నూతన రాజధాని ప్రాంతంలో రోడ్ల నిర్మాణానికి సంబంధించి సాధ్యాసాధ్యాలు(ఫీజిబులిటీ), డీపీఆర్‌ల తయారీ బాధ్యతలను కన్సల్టెన్సీకి అప్పగించనున్నారు. తొలుత కేంద్ర నిధులతో రాష్ట్రం చేపట్టే రోడ్ల నిర్మాణాన్ని కన్సల్టెన్సీకి అప్పగిస్తారు. విశ్వసనీయ సమాచారం మేరకు షెలాడియా కన్సల్టెన్సీకి ఈ పనులు అప్పగించనున్నట్టు తెలిసింది. ఇప్పటికే ఈ కన్సల్టెన్సీ రాజధాని ప్రాంతంలోని కనకదుర్గ వారధి నుంచి భవానీపురం వరకు ఎన్‌హెచ్-5, ఎన్‌హెచ్-9లను కలిపే 5 కిలోమీటర్ల జాతీయ రహదారికి 3 ఆప్షన్లతో ఫీజిబిలిటీ రిపోర్టు ఇచ్చింది. ఈ నివేదిక ప్రకారం కేంద్రం జాతీయ రహదారి నిర్మాణ బాధ్యతలను రాష్ట్రానికి అప్పగించింది. కనకదుర్గ వారధి నుంచి భవానీపురం వరకు 4 లేన్ల రహదారి విస్తరణతో పాటు దుర్గగుడి నుంచి భవానీపురం వరకు ఫ్లైవర్ నిర్మాణాన్ని సూచిస్తూ ఇచ్చిన ఆప్షన్-2కు కూడా కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఈ రోడ్డు నిర్మాణాన్ని కోరుతూ విపక్షంలో ఉన్న సమయంలో చంద్రబాబు ధర్నాలు చేయడం గమనార్హం. కాగా దీనికి సంబంధించి డీపీఆర్‌ను వెంటనే పంపాలని కూడా కేంద్రం సూచించింది. ఇదిలావుంటే, ఫీజిబిలిటీ రిపోర్టు ఇచ్చేందుకు ప్రభుత్వం షెలాడియా కన్సల్టెన్సీకి రూ.35 లక్షలను ఇప్పటికే చెల్లించింది. అయితే, ఈ రిపోర్టు సమర్పణకు ఆర్నెల్ల గడువు విధించడంతో రూ.55 లక్షలు చెల్లించనున్నట్టు సమాచారం. మరోపక్క, రాజధాని చుట్టూ 225 కి.మీ. మేర నిర్మించే ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కేంద్రం నిధులిచ్చేందుకు అంగీకరించడంతో ఫీజిబిలిటీ రిపోర్టు తయారీ బాధ్యత కూడా కన్సల్టెన్సీ చేతిలో పెట్టనున్నారు.