breaking news
apnea app
-
'శంఖారావం' చేస్తే..ఆ వ్యాధి తగ్గిపోతుందట..! అధ్యయనంలో వెల్లడి
శంఖం (Conch) అనేది భారతీయ సంస్కృతిలో పవిత్రత, శుభం, విజయానికి ప్రతీకగా భావిస్తారు. ఇది క్షీరసాగర మథనంలో ఉద్భవించిన 14 రత్నాలలో ఒకటిగా పేర్కొంటారు. అలాంటి శంఖాన్ని ఊదితే ఆ వ్యాధి నయమైపోతుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. తాజా అధ్యయనంలో ఇది వెల్లడైందని తెలిపారు. ఈ శంఖరావం ప్రయోజనాన్ని హైలెట్ చేసేలా పరిశోధనలో చాలా ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఇటీవల చాలామంది అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియాతో బాధపడుతున్నారు. అందుకు మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లే ప్రధాన కారణం అని చెబతున్నారు నిపుణులు. ఈ సమస్య ఉన్నవారికి నిద్రలో శ్వాస కొద్దిసేపు ఆగిపోతుంది. దాంతో మధ్యలో మెలుకవ వచ్చేస్తుంటుంది. కొన్నిసార్లు శ్వాసాగిపోయి గురకపెడుతుంటారు. దీని కారణంగా మధుమేహం, గుండుపోటు, రక్తపోటు వంటి దీర్ఘకాలిక జబ్బుల బారినపడతారని చెబుతున్నారు వెద్యులు. ఈ స్లీప్ ఆప్నియా కారణంగా చాలామంది కంటిపై కునుకనేది సరిగా ఉండదు. అందువల్ల ఉదయం చాలా అలసట, ఒక విధమైన నిద్ర ఆవరించడం వంటి సమస్యలు ఎదుర్కొంటారని చెబుతున్నారు. అయితే ఈసమస్యకు మందుల కంటే శంఖం చక్కగా చెక్పెడుతుందంట. శంఖారావంతో అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా నుంచి బయటపడొచ్చని చెబుతున్నారు పరిశోధకులు. గాలి వాయిద్యాలను వాయించడం మెరుగైన శ్వాసకు ఎలా సహాయపడుతుంది అనే దిశగా అధ్యయనం చేయగా..ఈ విషయం వెల్లడైందని తెలిపారు. అందుకోసం అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియాతో బాధపడుతున్న సుమారు 30 వ్యక్తులను రెండు గ్రూపులుగా విభజించారు. ఒక సముహం శఖం ఊదే సాంప్రదాయ భారతీయ శ్వాస వ్యాయమాన్ని అభ్యసించింది. అంటే శంఖం పూరించడం లాంటిది. మరొక సముహం లోతైన శ్వాస వాయామాలు చేశారు. అందులో శంఖం ఊదిన బృదం నిద్ర నాణ్యతలో గణనీయమైన మెరుగదల కనిపించిడాన్ని పరిశోధకులు గుర్తించారు. వాస్తవానికి ఈ స్లీప్ ఆప్నియాతో ఇబ్బంది పడేవాళ్లకి నిరంతర సానుకూల వాయుమార్గ పీడన యంత్రం లేదా CPAP వంటి ప్రామాణిక చికిత్సను అందిస్తారు. ఇందులో ఫేస్‌మాస్క్ ద్వారా గాలిని ఊదుతూ ఉండాల్సి ఉంటుంది. తద్వారా వాయుమార్గం తెరచుకుని ఈ సమస్య తగ్గుతుంది. అయితే దీన్ని చాలామంది రోగులు అసౌకర్యంగా భావించడమే కాకుండా ఇలా నిరంతరం చేయడంలో ఇబ్బంది పడుతున్నారట. అలాగాక ఈ శంఖ ఊదడం అనే సాంప్రదాయ యోగ శ్వాస వ్యాయామం ప్రకారం.. ఉచ్ఛ్వాసాన్ని వదులుతూ..సాధన చేస్తారు కాబట్టి చక్కటి విశ్రాంతితో కూడిన నిద్రపడుతుందట. ఈ పురాతన అభ్యాసం ఈ సమస్యకు చక్కని పరిష్కారమని వెల్లడించారు. అంతేగాదు శంఖ ఊదడం అనే వ్యాయామాలు శ్వాసకోశ కండరాలను బలోపేతం చేయగలవని, నిద్రలో వాయుమార్గాలను స్పష్టంగా తెరుచుకునేలా చేస్తుందని చెప్పుకొచ్చారు. స్లీప్ అప్నియా లక్షణాలను నిర్వహించడానికి ఈ శంఖారావం అనేది చక్కటి నివారిణి అని పేర్కొన్నారు పరిశోధకులు. ఈ అధ్యయనాన్ని భారతదేశంలోని జైపూర్‌లోని ఎటర్నల్ హార్ట్ కేర్ సెంటర్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నిర్వహించింది.(చదవండి: ఓపెన్‌గా మాట్లాడేస్తా.. అంటే కుదరదు..! నటి శ్రుతి హాసన్ ఎదుర్కొన్న చేదు అనుభవం..) -
నిద్రలేమిని గుర్తించే ఆప్నియా యాప్
వాషింగ్టన్: నేటి ఉరుకుల పరుగుల ప్రపంచంలో నిద్రలేమి పెద్దసమస్యగా మారింది. దీని వల్ల మనిషి దేహంలో అధిక రక్తపోటు, గుండెపోటు, హృద్రోగసమస్యలు, మధుమేహం, మానసిక ఒత్తిడి తదితర అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం అమెరికాలో ప్రతి 13 మందిలో ఒకరు నిద్రలేమితో బాధపడుతున్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ‘ఆప్నియా యాప్’ ను యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇటీవల దీని పనితీరుపై నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్‌లో ఈ యాప్ 98 శాతం మెరుగైన ఫలితాలు చూపించిందని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన ’నథానియల్ ఎఫ్. వాట్సన్’ తెలిపారు. ఆసుపత్రుల్లో నిద్రను అధ్యయనం చేసేందుకు వినియోగించే ‘పాలిసొమ్నోగ్రఫీ’ కన్నా మెరుగైన పనితీరును కనబరించిందని పేర్కొన్నారు. ఆండ్రాయిడ్, హెచ్‌టీసీ ఫోన్లలో ఇది పని చేస్తుంది. ఇందుకోసం మనిషి శరీరానికి ఎలాంటి సెన్సార్లు అతికించాల్సిన అవసరం లేదు. ఫోన్లో ఉండే రెండు మైక్రోఫోన్ల ద్వారా వెలువడే తరంగాలు మనిషి శ్వాసను ఎప్పటికప్పుడు పసిగడతాయి. వ్యక్తి నిద్రించే సమయంలో సెల్‌ఫోన్ పక్కనే ఉండాల్సిన పని లేదు. గదిలో మనిషికి మూడు అడుగుల దూరంలో ఉన్నా ఇది పనిచేస్తుంటుంది. మనం దీర్ఘనిద్ర, కలత నిద్ర, గురక తదితర కారణాల వల్ల శ్వాస తీసుకునే విధానంలో తేడా ఉంటుంది. ఆ సమయంలో శ్వాస ఆధారంగా మనం ఎలా నిద్రపోతున్నామో ఇది చెప్పేస్తుంది. దీంతో నిద్రలేమి సమస్యలు కనిపిస్తే వెంటనే వైద్యున్ని సంప్రదించి చికిత్స చేయించుకుంటే పలు అనారోగ్య సమస్యలను అధిగమించిన వారిమవుతాం. ఈ యాప్ ఇప్పటికిప్పుడు అందుబాటులో లేదు. మరో రెండు సంవత్సరాల్లోగా విడుదల చేయవచ్చని సమాచారం.