Top Stories
ప్రధాన వార్తలు
మీ భూమికి భద్రత.. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై బాబు దుష్ప్రచారం: సీఎం జగన్
సాక్షి, పుట్టపర్తి: ‘చంద్రబాబునాయుడు అవగాహన రాహిత్యంతో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై అబద్ధాలు వల్లించడం సిగ్గుచేటు. జగన్ భూములు లాక్కుంటున్నాడంటూ దుష్ప్రచారం చేయడం ఆయన దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం. పేదలకు భూములిచ్చేది జగన్ అయితే.. లాక్కునేది చంద్రబాబు అనే విషయం అందరికీ తెలుసు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌తో రైతులు ఎవరి చుట్టూ తిరగాల్సిన పని ఉండదు. భూ తగాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు వందేళ్ల తర్వాత భూముల రీ సర్వే చేపట్టాం. రైతుల భూముల భద్రతకు ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. ఎలాంటి వివాదం లేని టైటిల్స్ ప్రతి ఒక్కరి దగ్గరా ఉండాలన్నదే మీ బిడ్డ లక్ష్యం. అందుకనే టైటిల్ ఇన్సూరెన్స్ కూడా చేస్తున్నాం. రిజిస్ట్రేషన్ తర్వాత రైతులకే డాక్యుమెంట్లు అందజేస్తాం. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై అవగాహన లేకుండా చంద్రబాబు మాట్లాడటం దుర్మార్గం’ అని ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలోని అంబేడ్కర్ సర్కిల్లో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై ప్రచారంలో ఉన్న అపోహలను తొలగిస్తూ స్పష్టతనిచ్చారు.రిజిస్ట్రేషన్లపైనా చంద్రబాబు బురదరిజిస్ట్రేషన్లకు సంబంధించి కూడా చంద్రబాబు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. రిజిస్ట్రేషన్లు చేసేటప్పుడు ఫిజికల్ డాక్యుమెంట్లు ఇవ్వడం లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అయ్యా చంద్రబాబూ..! ఇప్పటివరకు ఏకంగా 9 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయి. దేశవ్యాప్తంగా అమలవుతున్న కార్డ్ 2 సాఫ్ట్వేర్ ద్వారా తొమ్మిది లక్షల రిజిస్ట్రేషన్లు చేయడమే కాకుండా ఆ తర్వాత డాక్యుమెంట్లు అన్నీ భూ యజమానులకే ఇచ్చాం. దీన్ని మరింత సులభతరం చేస్తూ.. ఏ ఒక్కరికీ సమస్య ఉండకూడదని, పత్రాలు రాసుకునేటప్పుడు తప్పులు ఉండకూడదని ఆ ఫార్మాట్ కూడా ఆన్లైన్లో అందుబాటులో ఉంచాం. ఎవరైనా అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా ఆ ఫార్మాట్ డౌన్లోడ్ చేసుకుని వివరాలు నింపి డాక్యుమెంట్లతో వెళితే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వేలి ముద్రలు లాంటి మిగతా ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ పూర్తి అయిన తర్వాత ఫిజికల్ డాక్యుమెంట్లు రైతులకే ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతోందని చంద్రబాబు తెలుసుకోవాలి. పెద్ద సంస్కరణ అవుతుంది..ఎన్నికల వేళ చంద్రబాబు యథేచ్ఛగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై అవగాహన లేకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. టీడీపీ నాయకులు ఐవీఆర్ఎస్ ద్వారా మీ ఇళ్లకు ఫోన్లు చేసి మీ భూములన్నీ జగన్ లాక్కుంటాడంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. ఇంత దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు అసలు మనిషేనా? మీ జగన్ భూములిచ్చేవాడే కానీ భూములు లాక్కునే వాడు కాదు. నీకు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటే తెలుసా చంద్రబాబూ? ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటే భూముల మీద సంపూర్ణ హక్కులు ఎల్లవేళలా రైతన్నలకు ఉండేటట్లు చేయడమే. చంద్రబాబు అవగాహన లేకుండా మాట్లాడుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ యాక్ట్ రాబోయే రోజుల్లో పెద్ద సంస్కరణ అవుతుంది. ఈరోజు ఎక్కడ భూమి కొనుగోలు చేయాలన్నా వివాదాలు తలెత్తుతున్నాయి. విస్తీర్ణం తక్కువ ఉండటం, సబ్ డివిజన్, సర్వే జరగకపోవడం, రికార్డులు అప్డేట్ కాకపోవడం తదితర సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. వీటన్నింటి కారణంగా భూ వివాదాలు పెరిగి రైతన్నలు, ప్రజలు కోర్టులు, అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోంది.వివాదాలు లేకుండా.. టైటిల్ ఇన్సూరెన్స్‌రాబోయే రోజుల్లో ఏ రైతూ, ఏ ఒక్కరూ వాళ్ల భూములు కోసం ఎవరి చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండకూడదు. భూ వివాదాలకు సంబంధించి ఏ కోర్టుకూ వెళ్లాల్సిన అవసరం రాకూడదు. ఆ భూముల మీద వారికి సంపూర్ణ హక్కులు కల్పిస్తూ వాటిపై ఏవైనా వివాదాలు ఉంటే ప్రభుత్వమే బాధ్యత వహిస్తుంది. ఆ భూముల మీద ఎలాంటి వివాదం లేదని గ్యారంటీ ఇస్తూ ఒక సంస్కరణ తేవాలన్నదే మీ జగన్ ఆలోచన. అందుకనే టైటిల్ ఇన్సూరెన్స్ కూడా చేస్తున్నాం. ఎలాంటి వివాదం లేని టైటిల్స్ ప్రతి ఒక్కరి దగ్గరా ఉండాలన్నదే మీ బిడ్డ లక్ష్యం. కానీ ఇది జరగాలంటే మొదట రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న సర్వే పూర్తి కావాలి. దేశంలో వందేళ్ల క్రితం ఆంగ్లేయుల హయాంలో భూముల సర్వే చేశారు. రైతుల కోసం ఈ రోజు మళ్లీ ప్రతి ఎకరా రీ సర్వే చేస్తున్నాం. 15 వేల మంది సర్వేయర్లను నియమించాం. ఉచితంగా సరిహద్దు రాళ్లను నాటి రికార్డులన్నీ అప్డేట్ చేస్తున్నాం. సబ్ డివిజన్ చేసి ఆ హక్కు పత్రాలను పదిలంగా రైతన్నలకు అందచేస్తున్నాం. రాష్ట్రంలో 17 వేలకు పైగా రెవెన్యూ గ్రామాలకుగానూ ఇప్పటివరకు 6 వేల రెవెన్యూ గ్రామాల్లో సర్వే పూర్తయ్యింది. మిగతా చోట్ల ఒకటిన్నర, రెండేళ్లలో సర్వే పూర్తవుతుంది.
తోడేళ్ళను తరిమే రోజు!
ఒక్కసారి మనం డెబ్బయ్యేళ్లు వెనక్కు వెళ్లాలి. వర్తమాన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మనల్ని ఆ జ్ఞాపకం వైపు బలవంతంగా నెడుతున్నాయి. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి 1953లో ఆంధ్ర రాష్ట్రం విడిపోయింది. తెలంగాణతో కలిసి ఇంకా ఆంధ్ర ప్రదేశ్‌గా అవతరించకముందు 1955లో శాసనసభకు మధ్యంతర ఎన్నికలు జరిగాయి. నాటి ఆంధ్ర రాష్ట్రం, నేటి ఆంధ్ర ప్రదేశ్ల భౌగోళిక స్వరూపం ఒక్కటే!ఆ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో కమ్యూనిస్టుల ప్రభంజనం కనిపించింది. అప్పటిదాకా ప్రపంచంలో ఎక్కడా కూడా కమ్యూనిస్టులు బ్యాలెట్ ద్వారా అధికారంలోకి వచ్చిన ఉదంతాలు లేవు. ఆ విషయంలో ఆంధ్ర రాష్ట్రం రికార్డు సృష్టించ బోతున్నదనే అంచనాలు వెలువడ్డాయి. ముఖ్యమంత్రిగా సుందరయ్య, హోంమంత్రిగా చండ్ర రాజేశ్వరరావు, ఆర్థిక మంత్రిగా మాకినేని బసవపున్నయ్య వగైరా పేర్లతో కేబినెట్ కూర్పుపై కూడా ప్రచారం జరిగింది. సరిగ్గా ఈ దశలోనే పెత్తందారీ ముఠా, వారి అజమాయిషీలోని మీడియా రంగప్రవేశం చేశాయి.అప్పట్లో దున్నేవానికే భూమి అనేది కమ్యూనిస్టుల నినాదం. ఆ మేరకు భూసంస్కరణలు అమలు చేస్తామని వారు వాగ్దానం చేశారు. ఇది చాలు పెత్తందార్లకు! వారి చేతుల్లో వున్న ‘ఆంధ్రపత్రిక’, ‘ఆంధ్రప్రభ’ వంటి ఆనాటి ప్రముఖ పత్రికలు ఆయుధాలు బయటకు తీశాయి. కమ్యూనిస్టులు గెలిస్తే రైతుల భూములను లాక్కుంటారు. కమ్యూనిస్టులు గెలిస్తే ప్రజల ఇళ్లలో ఉన్న డబ్బును, బంగారాన్ని ఎత్తుకుపోతారు. వృద్ధులు పని చేయలేరు కనుక వారిని ప్రత్యేక క్యాంపుల్లో పెడతారు లేదా చంపేస్తారు. రష్యాలో, చైనాలో ఇలాగే చేస్తున్నారు. చివరికి మీ భార్యల్ని కూడా జాతీయం చేస్తారు. కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్న మవుతుంది... ఈ రకమైన అభాండాలను అచ్చేసి అడ్డగోలుగా ప్రచారంలో పెట్టారు.ఈ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేంత పబ్లిసిటీ దన్ను ఆనాడు కమ్యూనిస్టులకు లేదు. వాళ్లకున్నది ‘విశాలాంధ్ర’ ఒక్కటే. పార్టీ ముద్ర కారణంగా దానికీ పరిమితులున్నాయి. ఇటువంటి నిస్సహాయ స్థితిలోనే మహాకవి శ్రీశ్రీ గుండెలోంచి తన్నుకొచ్చిన ఆక్రోశం చాలామందికి గుర్తున్నది. ‘పెట్టుబడికీ కట్టుకథకూ పుట్టిన విషపుత్రిక ఆంధ్రపత్రిక’ అని ఈసడించుకున్నారు. నాటి ‘ఆంధ్రపత్రిక’, ‘ఆంధ్రప్రభ’ల అరాచకాన్ని ఒక లక్షతో హెచ్చ వేస్తే నేటి ‘ఈనాడు’, ‘ఆంధ్రజ్యోతి’, ‘టీవీ5’, ‘ఏబీఎన్’, ‘ఈటీవీ’ల అరాచకం విలువెంతో తెలుస్తుంది. ఆ ప్రత్యేక సందర్భం తర్వాత∙నాటి పత్రికలు మళ్లీ తటస్థ స్థితికి చేరు కున్నాయి. కానీ మన యెల్లో మీడియా మాత్రం గత పదేళ్లుగా ఆదే యజ్ఞంలో తలమునకలై ఉన్నది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని పెత్తందారీ వర్గాల ప్రతినిధిగా, ప్రయోక్తగా, ప్రవక్తగా గడిచిన మూడు దశాబ్దాల్లో చంద్రబాబు ఇంతింతై అన్నట్టుగా ఇనుమడించడం మనకు తెలిసిన సంగతే. ఇదే కాలంలో మన యెల్లో మీడియా చంద్రబాబు తరఫున గ్రామ సింహాల పాత్రను పోషిస్తే, బదులుగా ఆయన వారికి సెక్యూరిటీ గార్డు పాత్రను పోషిస్తూ వస్తున్నారు. ఈ ముప్ప య్యేళ్లలో పధ్నాలుగేళ్లపాటు బాబు ముఖ్యమంత్రి పాత్రను పోషించారు. ఆయనకు వాలతుల్యుడనదగ్గ కిరణ్‌కుమార్ రెడ్డి కాంగ్రెస్ తరఫున నాలుగేళ్లు గద్దె మీద కూర్చున్నారు. రాష్ట్రంలోని పేదల అభ్యున్నతి కోసం, సాధికారత కోసం అమలైన కార్య క్రమాలన్నీ వీరి కాలం మినహా మిగిలిన సమయంలోనే జరగడం ఎవరైనా గమనించవచ్చు.ప్రజలందరికీ విద్య, వైద్యసేవలు అందజేయడం ప్రభుత్వ బాధ్యతగా నాగరిక సమాజం గుర్తిస్తున్నది. ఆ రంగాల్లో సేవలు ప్రభుత్వం బాధ్యత కాదని బాహాటంగా ప్రకటించి, వాటిని ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు నర్తనశాలగా మార్చిన అనాగరిక రాజకీయవేత్త చంద్రబాబు. ఫలితంగా ప్రభుత్వ బడులు కునారిల్లిపోయాయి. పేదలు, మధ్యతరగతి ప్రజలు తమ పిల్లల్ని ప్రైవేట్ బడులకు పంపి అప్పులపాలయ్యారు. నిరు పేదల బిడ్డలు చదువుకు దూరమయ్యారు. ఒక తరం పేద, మధ్యతరగతి వర్గాల కలలను కాటేసిన చరిత్ర చంద్రబాబుది. అలాగే ప్రైవేట్ వైద్యసేవల బలిపీఠాన్నెక్కి లక్షలాది కుటుంబాలు కృశించి, నశించిపోయాయి.వ్యవసాయం దండగనేది ఆయన చేసిన ఒక క్రూర పరిహాసం. ఫలితంగా రైతులు పిట్టల్లా రాలిపోవడం బాబు జమానాలోనే ప్రారంభమైంది. కల్తీ ఎరువులు, కల్తీ విత్తనాలు, నకిలీ మందులకు వ్యవసాయం వేదికైంది. రైతులను భూముల నుంచి వెళ్లగొట్టి వేల ఎకరాల భూములను కార్పొరేట్ శక్తులకు కైంకర్యం చేసే విధానాలను బాబు అవలంబించారు. ఈ క్రమంలోనే ఫిలిం సిటీ పేరుతో రామోజీ దాదాపు మూడువేల ఎకరాలు పోగేశారు. అన్నిరకాల భూచట్టాలూ రామోజీ భూదాహం ముందు చట్టుబండలయ్యాయి. వేలాది ఎకరాల్లో వ్యవసా యాన్ని అటకెక్కించి కార్పొరేట్ సంస్థలు కంచెలు వేసు కున్నాయి. పేదల జీవితాలను కాల్చుకుతింటున్న చంద్ర బాబులో పచ్చమీడియాకు ఓ విజనరీ కనిపించాడు.ఐదేళ్ల కింద ఆంధ్రప్రదేశ్‌లో ఒక తేడా వచ్చింది. చంద్రబాబుకూ, యెల్లో మీడియాకూ అది చిన్న తేడా ఏమీ కాదు. యెల్లో ‘విజనరీ’ విధానాలను కొత్త ముఖ్య మంత్రి జగన్మోహన్రెడ్డి తలకిందులు చేశారు. ప్రజలిచ్చిన అధికారం గుప్పెడుమంది పెత్తందార్ల కోసం కాదు, పురోగ మనం కోసం పోరాడుతున్న విశాల ప్రజానీకం కోసం అనేది ఆయన విధానం. జగన్మోహన్రెడ్డి విధానాలకు, మన పెత్తందారీ ఏజెంట్ల విధానాలకు ఘర్షణ ఏర్పడింది. పెత్తందార్ల కూటమి జగన్ ప్రభుత్వంపై యుద్ధాన్ని ప్రకటించింది. జగన్ ప్రభుత్వ విధానాల వల్ల ఊపిరి పీల్చుకున్న పేదవర్గాల ప్రజలు ఆయన వెనుక సైన్యంగా మోహరించారు. పేదలు – పెత్తందార్ల మధ్య మహాయుద్ధానికి ముహూర్తం ఖాయమైంది.ఈ అయిదేళ్ల కాలంలో జగన్ ప్రభుత్వంపై యెల్లో మీడియా సాగించిన దుష్ప్రచారం అన్ని రికార్డులనూ బద్దలు కొట్టింది. గోబెల్స్ బతికి వుంటే సిగ్గుపడి ఉండేవాడు. శ్రీశ్రీ బతికి ఉంటే ఏమని కామెంట్ చేసేవాడో ఊహించుకోవలసిందే. తిమ్మిని బమ్మిగా, బమ్మిని తిమ్మిగా ప్రచారం చేయని రోజు ఈ అయిదే ళ్లలో ఒక్కటీ లేదు. అయినా ప్రజాభిప్రాయాన్ని యెల్లో మీడియా పెద్దగా ప్రభావితం చేయలేకపోతున్నది. దీంతో వారిలో నిస్పృహ ఆవరించింది. అన్ని విలువల్నీ వదిలేశారు. వస్త్రవిసర్జన చేసి దిగంబర వీధినర్తనం మొదలుపెట్టారు. పోలింగ్ పది రోజులుందనగా తయారుచేసిన రెండు వింత కథల మీద ప్రాణం పెట్టుకుని పెద్ద ఎత్తున ప్రచారం మొదలుపెట్టారు. ఇందులో మొదటిది ఏమాత్రం క్రియేటివిటీ లేకుండా అల్లిన ఓ కట్టుకథ. ‘మీ భూమి మీది కాదు’ అనే పేరుతో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ‘బాధితుల’ కథనాలను ‘ఈనాడు’ అచ్చేసింది. చట్టం పేరులోనే దాని ప్రాముఖ్యత ఉన్నది. భూమిపై రైతుకున్న యాజమాన్య హక్కును గుర్తిస్తూ ప్రభుత్వం హామీ పడి ధ్రువీకరించే చట్టం. ఒకసారి ఈ చట్టం అమలులోకి వస్తే భూ వివాదాలు శాశ్వతంగా పరిష్కారమవుతాయి. దొంగ కాగితాలు సృష్టించి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లిస్తే చార్మినార్‌కు కూడా సేల్ డీడ్ ఇచ్చే అధ్వాన్నమైన పరిస్థితులు ఎన్నిసార్లు ఎదురు కావడం లేదు? నకిలీ డాక్యుమెంట్లతో బ్యాంకులను కొల్లగొట్టే దళారీల వృత్తాంతాలు ఎన్ని బయటకు రావడంలేదు? ఎన్ని వేల భూతగాదాలు కోర్టు వ్యాజ్యాల్లో దశాబ్దాల తరబడి నలిగి పోవడం లేదు? గొడవలతో ఎంత రక్తం పారి ఉంటుంది? ఎన్ని హత్యలు జరిగి ఉంటాయి? ఇదిగో ఇటువంటి వివాదాలను పరిష్కరించే సమగ్ర హక్కులను యజమానికి కల్పించి, అందుకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చేదే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్. ఇందులో భాగంగా మొదట భూముల సమగ్ర సర్వే జరుగుతోంది. గ్రామ ప్రజల సమక్షంలో సరిహద్దులను నిర్ధారించి రైతుకు పాస్‌బుక్ ఇవ్వడం జరుగుతుంది. వందేళ్ల తర్వాత సర్వే జరిపి యాజమాన్య హక్కును గుర్తిస్తూ ప్రభుత్వం ఇస్తున్న పాస్‌బుక్ ఇది. ఆ హక్కుకు ప్రభుత్వం ఇస్తున్న గ్యారంటీకి గుర్తుగా సర్వే జరిగిన కాలపు ప్రభుత్వాధినేతగా ముఖ్యమంత్రి ఫోటోను కూడా పాస్‌బుక్‌పై ముద్రిస్తున్నారు. దీన్ని కూడా టీడీపీ – యెల్లో మీడియా వివాదం చేయడం చూస్తున్నాము.అన్ని గ్రామాల్లో సర్వే పూర్తిగా జరిగిన తర్వాత చట్టం అమలుకు సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేసి, వాటిపై గ్రామసభల్లో చర్చలు జరిగిన తర్వాత తుది మార్గదర్శకాలు జారీ అవుతాయి. ఆ తర్వాతనే చట్టం అమల్లోకి వస్తుంది.ఇదంతా జరగడానికి ఇంకో ఏడాది పట్టవచ్చు. రెండేళ్లు పట్టవచ్చు. కేంద్ర ప్రభుత్వంలోని ‘నీతి ఆయోగ్’ సూచనలకు అనుగుణంగా ఈ చట్టం రూపకల్పన జరుగుతున్నది. అన్ని రాష్ట్రాల్లోనూ భూయజమానికి మేలు చేసే ఈ చట్టం వచ్చి తీరుతుంది. కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌ను ముందుకు కదిలించింది. దీన్ని వ్యతిరేకిస్తున్న యెల్లో కూటమి పార్టీ ఎన్డీఏలో భాగంగా ఉన్నది. కానీ ఇంత వరకు ఈ చట్టంపై తమ అభ్యంతరాలను కేంద్ర ప్రభుత్వంతో ప్రస్తావించకపోవడం తెలుగుదేశం అవకాశవాద వైఖరికి పరాకాష్ఠ. పచ్చమీడియా కూడా ఈ చట్టంపై ఒక్క మాటయినా కేంద్రం ప్రస్తావన చేయకపోవడం వెనకనున్న రహస్యమేమిటి?ఇక శనివారం నాడు ‘ఈనాడు’ రాసిన ‘మీ భూమి మీది కాదు’ అనే కల్పిత కథ జర్నలిజం ప్రమాణాలను పాతాళంలోకి తొక్కేసింది. ఇందులో ముగ్గురు బాధితుల పేర్లు రాశారు.అందులో అమలాపురం సుబ్బారావు ఒకరు. ఆయన భూమి ఎక్కడో చెప్పలేదు. సర్వే నెంబర్ తెలియదు. ఆయన భూమి తనదంటూ ఎవరో అధికారులకు దరఖాస్తు చేసుకున్నారట! ఆయనెవరో చెప్పలేదు. ఎవరికి దరఖాస్తు చేశాడో చెప్పలేదు. రెండేళ్ల తర్వాత సుబ్బారావు స్పందించలేదంటూ దరఖాస్తు చేసుకున్న వారి పేరు మీద భూమిని రాసేశారట! ఇదంతా ల్యాండ్ టైట్లింగ్ చట్టం మహత్యమట. అమల్లోకే రాని చట్టం రెండేళ్ల కిందనే పనిచేయడం ప్రారంభించిందని ‘ఈనాడు’ ఉవాచ!ఇక సాంబశివుడిది శ్రీకాకుళం జిల్లాలోని ఒక పల్లెనట! ఈ పల్లె పేరు చెబితే రామోజీ తల వెయ్యి ముక్కలవుతుంది కాబోలు. చెప్పలేదు! ఆయన భూమిని అమ్మడానికి వెళితే, ‘కొత్త రిజిస్టర్లో నీ పేరు లేద’ని అధికారులు చెప్పారట. అసలటు వంటి కొత్త రిజిస్టరు తమ దగ్గర ఏదీ లేదని అధికారులు ప్రకటించారు. గోవిందరెడ్డిది కర్నూలు జిల్లా. ఏ ఊరో చెప్పలేదు. ‘ఈనాడు’ ఆంధ్రా ఎడిషన్‌లోనే ఆయన గోవిందరెడ్డి. తెలంగాణ ఎడిషన్‌లో మాత్రం గోవిందయ్య. అంటే తెలంగాణకు వెళ్లిన ప్పుడల్లా ఆయన కులం తోకను కత్తిరించుకుంటాడు కాబోలు. ఆయన తన భూమిని తనఖా పెట్టాలనుకున్నాడట! బ్యాంకులో ఉండే డిస్ప్యూట్ రిజిస్టర్లో ఆయన పేరు ఉన్నదట! టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ దగ్గర క్లియరెన్స్ సర్టిఫికెట్ తెమ్మని బ్యాంకు వారు చెప్పారట. దాంతో గోవిందరెడ్డి ఉరఫ్ గోవిందయ్య ఆంధ్రాలో ఒకసారి, తెలంగాణలో ఒకసారి గొల్లుమన్నాడట! అసలు టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అనే పోస్ట్ అమల్లోకే రాలేదు. డిస్ప్యూట్ రిజిస్టరూ లేదు. చదివేవాడు వెర్రి వాడయితే... రాసేవాడు రామోజీ!పెన్షన్ల వ్యవహారంపై తెలుగుదేశం – యెల్లో మీడియాలు నడిపిస్తున్న వ్యవహారంలో మరో వింతకథ. వలంటీర్ వ్యవస్థకే ఈ పెత్తందార్లు వ్యతిరేకం. తమ వ్యతిరేకతను వాళ్లు దాచుకోనూ లేదు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను రాష్ట్ర ప్రజలు గమనించారు. ఇంటి దగ్గరే ఒకటో తారీఖు పొద్దున్నే వలంటీర్లు గత ఐదేళ్లుగా పింఛన్లు అంద జేస్తున్నారు. దాంతో అవ్వాతాతలు, దివ్యాంగులు భరోసాతో బతుకుతున్నారు. వలంటీర్లు విధుల్లో పాల్గొనకుండా చూడాలని తెలుగుదేశం పార్టీ తరఫున వారి ఏజెంటు నిమ్మగడ్డ రమేశ్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనికి యెల్లో మీడియా వంత పాడింది. దాంతో వలంటీర్లు పెన్షన్లు ఇవ్వకూడదని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఎన్నికల సంఘం సూచించింది.ఈసీ సూచనల మేరకు ఏప్రిల్‌లో విలేజ్ సెక్రటేరియట్లలో పెన్షన్లు అందజేశారు. దీనిపై వృద్ధుల్లో వ్యతిరేకత వచ్చింది. గాభరాపడ్డ తెలుగుదేశం బృందం మళ్లీ నిమ్మగడ్డను పంపించి బ్యాంకు ఖాతాల్లో జమ చేయించాలని ఈసీకి దరఖాస్తు పెట్టారు. ఈసీ సూచనలకు అనుగుణంగా మే నెలలో బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేశారు. ఇక వృద్ధుల బాధలు వర్ణనాతీతం. వారి శాపనార్థాలతో కంగారు పడిన యెల్లో ముఠా వృద్ధుల బాధలకు జగన్ ప్రభుత్వమే కారణమనే విష ప్రచారాన్ని మొదలుపెట్టింది. దొంగతనం చేసినవాడే ‘దొంగా దొంగా’ అని అరిచినట్టు! జగన్మోహన్రెడ్డి సభలకు మండుటెండల్లో కూడా వెల్లువెత్తుతున్న జనప్రవాహంతో కూటమి వణికిపోతున్నది. ఈ రెండు అంశాలపై అబద్ధాలను ప్రచారం చేసి గట్టెక్కాలన్న దింపుడు కల్లం ఆశ దానిలో కనిపిస్తున్నది.ఇంకో వారం రోజుల్లో పోలింగ్ జరగబోతున్నది. ఇది పేద వర్గాలకు అందివచ్చిన అద్భుతమైన అవకాశం. పేద బిడ్డల ఇంగ్లిష్ మీడియంను వ్యతిరేకిస్తున్న, వారి నాణ్యమైన చదువు లను వ్యతిరేకిస్తున్న పెత్తందార్లను చావచితక్కొట్టడానికి ఇదో అవకాశం. పేదల సాధికారతను, మహిళల సాధికారతను సహించలేకపోతున్న పెత్తందార్లను పరుగెత్తించడానికి ఇంకో వారం రోజుల్లో అమూల్యమైన అవకాశం ఉన్నది. బలహీన వర్గాలకు ఉన్నత పదవులు ఇస్తే, ఎక్కువ సంఖ్యలో ఎమ్మెల్యే టిక్కెట్లు, ఎంపీ టిక్కెట్లు కేటాయిస్తే ఓర్వలేకపోతున్న పెత్తందార్లకు బుద్ధి చెప్పడానికి ఇదో గొప్ప అవకాశం. అబద్ధాలనూ, అభూత కల్పనలనూ, కట్టుకథలనూ ప్రచారంలో పెడుతూ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడమే గాక సమాజంలో అశాంతిని రేకెత్తి స్తున్న పెత్తందారీ తోడేళ్లను తరిమి తరిమి కొట్టడానికి ఇంతకంటే మంచి అవకాశం ఏముంటుంది?వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com
AP Election Updates May 5th: ఏపీ ఎన్నికల అప్డేట్స్
Andhra Pradesh Election Updates 5th May...10:59 AM, May 5th, 2024ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై బాబు, పవన్ విష ప్రచారం: ఎమ్మెల్యే మల్లాది విష్ణుప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారుఐవీఆర్ఎల్ సర్వేలో తప్పుడు ప్రచారం చేస్తున్నారుమా ఫిర్యాదు పై ఈసీ స్పందించింది చర్యలకు సీఐడీకి సిఫారసు చేసిందిప్రజల భూమికి భద్రత కల్పించడమే ప్రభుత్వ ధ్యేయంసీఎం జగన్‌ను ఎదుర్కోలేక బాబు, పవన్ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు తప్పుడు ప్రచారాలు ఆపకపోతే క్రిమినల్ చర్యలు తప్పవుల్యాండ్ టైటిల్ యాక్ట్ మేం తెచ్చింది కాదునీతి ఆయోగ్ ద్వారా కేంద్రమే అన్ని రాష్ట్రాలకు సూచించింది టీడీపీ, జనసేన నేతలు మాట్లాడుతుంటే ఏపీ బీజేపీ నేతలు ఏం చేస్తున్నారు?కేంద్రం తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ బీజేపీ శాఖ ఎందుకు నోరుమూసుకుంది? ఏపీల ప్రచారానికి వస్తున్న మోదీ, అమిత్ షా సభల్లో చెప్పాలి10:51 AM, May 5th, 2024ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలుల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై కొన్ని పార్టీలు అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నాయిభూ రికార్డుల డిజిటలైజేషన్‌తో సమస్యల పరిష్కరించడానికి ఈ చట్టాన్ని తీసుకువస్తున్నారు.ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌తో ప్రజల ఆస్తులు లాగేసుకుంటారంటూ కావాలనే కొన్ని పార్టీలు ప్రచారం చేస్తున్నాయిల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి తెలియకపోతే మమ్మల్ని అడిగితే చెప్పేవాళ్లంఎన్నికల్లో మాతో భాగస్వామ్యం ఉన్న పార్టీలు ఇలా తప్పుడు ప్రచారం చేయడం మంచిది కాదుల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఇతర రాష్ట్రాల్లో అమలవుతుందిఎలా అయినా గెలవాలన్న ఆలోచనతో ప్రజలను భయభ్రాంతులను చేయడం మంచిది కాదుఈ దుష్ప్రచారంపై ఎన్నికల కమిషన్ కూడా సీఐడీ దర్యాప్తు వేసిందిజనసేన, తెలుగుదేశం మేనిఫెస్టో మాకు సంబంధం లేదుచంద్రబాబు చెప్తున్నా సూపర్ సిక్స్ కోసం చాలా డబ్బులు కావాలిచంద్రబాబు చెబుతున్న సూపర్ సిక్స్ పథకాలకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయిఆయన వాటిని అమలు చేయకపోతే ఆ నెపం మా పైకి వస్తుందిఅందుకే.. జనసేన, తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోతో మాకు సంబంధం లేదు8:56 AM, May 5th, 2024నేడు ఏపీకి అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్ రాకశ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం బత్తలపల్లి రోడ్డులోని సీఎన్బీ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార బహిరంగ సభలో ప్రసంగించనున్న అమిత్షావైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు, కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో జరిగే ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్న రాజ్‌నాథ్ సింగ్ 8:51 AM, May 5th, 2024అవన్నీ అపోహలేల్యాండ్ టైట్లింగ్ చట్టంతో భూములకు మరింత రక్షణఈ చట్టం అమల్లోకి వస్తే భూములు, ఆస్తులకు ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తుందిఅన్ని పత్రాలూ యజమానుల వద్దే ఉంటాయి.. ప్రభుత్వం వద్ద కేవలం రికార్డులేఈ చట్టం కోర్టు ద్వారాలు మూసేయదు.. కోర్టులకు వెళ్లే అవసరమే లేకుండా చేస్తుందిహక్కుల నిరూపణకు ఇప్పుడున్న చట్టాలు అంతిమ సాక్ష్యాలు కావుఅందుకే ఈ చట్టం అవసరమవుతోందిభూచట్టాల నిపుణుడు, నల్సార్ ప్రొఫెసర్ ఎం. సునీల్‌కుమార్7:37 AM, May 5th, 2024జనం.. జనం.. ప్రభంజనంసీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచార సభలకు పోటెత్తిన ప్రజానీకంహిందూపురంలో 43 డిగ్రీల ఎండనూ లెక్కచేయని జనంనియోజకవర్గ చరిత్రలో ఏ నాయకుడికి లేని రీతిలో బ్రహ్మరథంఈసారి హిందూపురం వైఎస్సార్సీపీదే అంటున్న రాజకీయ పరిశీలకులుపలమనేరులో వర్షాన్ని కూడా లెక్క చేయని ప్రజలునెల్లూరులో జననీరాజనం 7:25 AM, May 5th, 2024ల్యాండ్ టైట్లింగ్ చట్టం వ్యవహారం.. టీడీపీపై ఈసీ కొరడాదుష్ప్రచారంపై సీఐడీ దర్యాప్తుప్రజలను భయాందోళనలకు గురిచేయడంపై ఈసీ సీరియస్ ఎన్నికల నిబంధనలకు పాతరేస్తున్నారని మండిపాటు వైఎస్సార్సీపీ ఫిర్యాదుతో చర్యలు తీసుకున్న కమిషన్‌తక్షణం దీనిపై దర్యాప్తుచేసి నివేదిక ఇవ్వాలని ఆదేశం7:16 AM, May 5th, 2024కళ్లు గద్దెపై.. బుద్ధి భూమిలోల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై బరితెగించి అబద్ధాలులేని వ్యక్తులకు అన్యాయం జరిగిందంటూ రామోజీ ఆక్రోశం కల్పిత పాత్రలను సృష్టించి, ఏదో జరిగిపోయిందని ఆక్రందనరిజిస్టరే లేనపుడు అందులో కొందరి పేర్లు లేకపోవటం సాధ్యమా?చట్టం దేవుడెరుగు... చట్టానికి సంబంధించిన రూల్సే రాలేదని తెలీదా?రూల్స్ వచ్చాక.. వాటిపై సమగ్ర చర్చ జరిగిన తరవాతే తుది రూపుపైపెచ్చు రీసర్వే పూర్తయ్యాకే ఈ చట్టాన్ని అమలు చేయటం సాధ్యంఇప్పటికి 4 వేల గ్రామాల్లోనే రీ సర్వే పూర్తి.. ఇంకా 13 వేల గ్రామాల్లో పెండింగ్‌అది పూర్తయి.. రూల్స్ ఖరారయ్యాక కదా చట్టం అమలు గురించి మాట్లాడేది..అయినా అన్ని రాష్ట్రాలనూ అమలు చేయమంటున్నది కేంద్రమే కదా!అన్ని రాష్ట్రాలూ అమలు చేస్తేనే... ఇక్కడా చేస్తామని చెబుతున్న రాష్ట్రంమోదీ ముందు తల ఊపి.. బయట మాత్రం విష ప్రచారం చేస్తున్న బాబుబాబునెవరూ నమ్మటం లేదని గ్రహించి... మారీచుడి పాత్రలోకి రామోజీజనాన్ని భయపెట్టడానికి అబద్ధాలే అ్రస్తాలుగా మాయా యుద్ధంపోలింగ్ వరకూ ఈ ఒక్క అంశంమీదే మాట్లాడాలని ‘ఎల్లో’ తాఖీదుమిగతావన్నీ పక్కనబెట్టి విస్తృతంగా విష ప్రచారం చేస్తున్న పచ్చ మంద7:14 AM, May 5th, 2024బాబుకు భంగపాటు.. బెడిసికొట్టిన టీడీపీ అధినేత పన్నాగంబెడిసికొట్టిన టీడీపీ అధినేత పన్నాగంఓటర్లకు అరచేతిలో వైకుంఠం చూపించేందుకు కుతంత్రంలబ్ధిదారుల నమోదు పేరిట కుట్రఓటర్ల జాబితా వివరాల దుర్వినియోగంతీవ్రంగా స్పందించిన ఎన్నికల కమిషన్‌ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక7:12 AM, May 5th, 2024లాక్కునేవి కాదు..ఇచ్చే చేతులివి..నిషేధిత జాబితా నుంచి 35 లక్షల ఎకరాల తొలగింపుసీఎం జగన్ సంస్కరణలతో ‘రెవెన్యూ’లో సులభమైన పాలన వందల ఏళ్ల నాటి చిక్కుముళ్లకు పరిష్కారంచుక్కల భూములు, సర్విస్ ఈనాం, షరతుల గల పట్టా భూములకు విముక్తి27.41 లక్షల ఎకరాల అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులులంక భూములకు అసైన్మెంట్ పట్టాలుకుప్పలు తెప్పలుగా ఉన్న రెవెన్యూ సమస్యలన్నింటికీ పరిష్కారంనిరుపేదలకు 46 వేల ఎకరాల భూముల పంపిణీ శ్మశాన వాటికలు లేని దళిత వాడల కోసం 951 ఎకరాలుకొత్త రిజిస్ట్రేషన్ల విధానం.. ఆటో మ్యుటేషన్‌చరిత్ర సృష్టించిన 30.61 లక్షల ఇళ్ల పట్టాలకు రిజిస్ట్రేషన్ రెవెన్యూ శాఖ స్వరూపాన్ని మార్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు6:59 AM, May 5th, 2024మళ్లీ దోపిడీకి తెరపైకి..మాజీ ఎమ్మెల్యే అరాచకాలెన్నో!గోబెల్స్ ప్రచారంలో చంద్రబాబుకు తమ్ముడు వక్ఫ్ ఆస్తులు చెరబట్టి దోచేసిన ఘనుడుటిప్పు షాపింగ్ కాంప్లెక్స్ కేటాయింపులో చేతివాటంప్రతి పనికీ రేటుగట్టి వసూలు చేసిన చరిత్ర బెదిరింపులు, దౌర్జన్యాలు షరామామూలేఏకంగా పది క్రిమినల్ కేసులు 6:56 AM, May 5th, 2024మీ భూమికి భద్రత.. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై బాబు దుష్ప్రచారం: సీఎం జగన్‌చట్టంపై అవగాహన లేకుండా మాట్లాడటం సిగ్గుచేటుమీ భూములకు ప్రభుత్వం గ్యారంటీ..రిజిస్ట్రేషన్ తర్వాత రైతులకే డాక్యుమెంట్లుఅన్నదాతలు ఎవరి చుట్టూ తిరగాల్సిన పని ఉండదుభూ తగాదాలకు శాశ్వత పరిష్కారంగా వందేళ్ల తర్వాత రీసర్వేపేదలకు భూములిచ్చేది జగన్.. లాక్కునేది చంద్రబాబే
సునీత, షర్మిలకు కొండా రాఘవరెడ్డి సవాల్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్ వివేకా హత్య కేసులో ఛార్జ్‌షీట్ తీసుకుని రండి.. బహిరంగ చర్చకు సిద్ధమా.. ఎక్కడికైనా వస్తానంటూ సునీత, షర్మిలకు వైఎస్సార్టీపీ మాజీ నేత కొండా రాఘవరెడ్డి సవాల్ విసిరారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ నెల 11 లోపు తన సవాల్‌పై స్పందించాలన్నారు.‘‘షర్మిల స్పష్టంగా తెలుసుకుని వాస్తవాలు మాట్లాడాలి. నాడు షర్మిలను పాదయాత్ర చేయమని ఎవరూ అడగలేదు. వైఎస్ సోదరి విమలమ్మ మీ వెంట ఎందుకు లేరు?. వైఎస్ సోదరులు సైతం మీకు మద్దతు ఇవ్వడం లేదు. వివేకా మృతి తర్వాత ఎన్నిసార్లు ఆయన సమాధి వద్దకు వెళ్లారు’ అంటూ కొండా రాఘవరెడ్డి ప్రశ్నించారు.‘‘షర్మిల దుర్మార్గపు పనులు చేస్తున్నారు కాబట్టే.. కుటుంబం నుంచి కూడా ఆమెకు మద్దతు లేదు. రూ.వెయ్యి కోట్ల పని చేయనందుకే షర్మిల వ్యతిరేకంగా మారింది. వైఎస్ పేరును చెడ్డగొట్టడానికి షర్మిల కుట్రలు చేస్తోంది. సీఎం జగన్, పొన్నవోలుపై షర్మిల వ్యాఖ్యలు సరికాదు. షర్మిల ప్రచారానికి స్పందన లేక ఫ్రస్ట్రేషన్‌కు గురవుతుంది. బాబు, పవన్ స్క్రిప్ట్ షర్మిల చదువుతుంది. వైఎస్ విజయమ్మ మాట పెడచెవిన పెట్టినప్పుడే షర్మిల అంశం ముగిసింది’’ అని కొండా రాఘవరెడ్డి పేర్కొన్నారు.‘‘షర్మిల మోసాలు, అక్రమాలు బయట పెట్టడానికి నేను ఒక్కడిని చాలు. తెలంగాణలో షర్మిల వందల కుటుంబాలను మోసం చేశారు. జగన్, షర్మిల పెళ్లికి చంద్రబాబును వైఎస్ పిలిచారన్నది అబద్ధం. బాబు ఆడుతున్న ఆటలో షర్మిల పాచిక అయింది. వైఎస్ జగన్‌కు అద్ధం చూపడం దుర్మార్గం. ఒకసారి ఇంటికి వెళ్లి ఆ అద్ధంలో మీ ముఖం చూసుకోండి. తెలంగాణలో ఏం మాట్లాడారు. ఏపీలో మాట్లాడారో ఒకసారి చూసుకోండి. షర్మిలకు పిచ్చి ముదిరి నోటికొచ్చినట్లు మాట్లాడుతుంది’’ అని కొండా రాఘవరెడ్డి మండిపడ్డారు.
కెనడాలో భారతీయుల అరెస్ట్.. ప్రధాని ట్రూడో కీలక వ్యాఖ్యలు
అట్టావా: భారత్, కెనడా దేశాల మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. తాజాగా హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో ముగ్గురు భారత వ్యక్తుల అరెస్ట్‌పై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో స్పందిచారు. ఈ సందర్భంగా ట్రూడో.. తమ దేశ పౌరుల భద్రతకు కట్టుబడి ఉన్నామని కీలక వ్యాఖ్యలు చేశారు.కాగా, కెనడాలో శనివారం సిక్కు సంస్కృతి, వారసత్వాన్ని గుర్తుచేస్తూ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ట్రూడో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రూడో మాట్లాడుతూ..‘కెనడాలో చట్టబద్దమైన పాలన కొనసాగుతోంది. దేశపౌరుల రక్షణ, భద్రతకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. దేశంలో శక్తివంతమైన, స్వతంత్రతో కూడిన న్యాయవ్యవస్థ ఉంది. నిజ్జర్ హత్య తరువాత కెనడాలోని సిక్కు మతస్తులు అభద్రతకు లోనవుతున్నారు. హింస, వివక్షకు తావులేకుండా స్వేచ్ఛగా జీవించడం ప్రతీ కెనడా పౌరుడి హక్కు’ అంటూ కామెంట్స్ చేశారు.ఇక, అంతకుముందు ముగ్గురి అరెస్ట్‌పై భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్.శంకర్ మాట్లాడుతూ..‘ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించి జరుగుతున్న పరిణామాలు త్వరలో ఎన్నికలు జరగనున్న కెనడాలోని అంతర్గత రాజకీయాల కారణంగా తలెత్తుతున్నవేనని పేర్కొన్నారు. ఆ విషయాల్లో భారత్‌కు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అలాగే, ఆ ముగ్గురికి ఏదో గ్యాంగ్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయమై కెనడా పోలీసుల నుంచి సమాచారం కోసం వేచి చూస్తున్నాం. కానీ నేను గతంలో చెప్పినట్టు వాళ్లు కెనడాలో వ్యవస్థీకృత నేరాలను కొనసాగనిచ్చారు. అదే మాకు ఆందోళన కలిగిస్తోంది’ అంటూ వ్యాఖ్యలు చేశారు.
IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్‌గా..!
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా నిన్న (మే 4) జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లి రెండు భారీ రికార్డులు నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో 27 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 42 పరుగులు చేసిన విరాట్.. పొట్టి క్రికెట్లో 12500 పరుగులు పూర్తి చేసిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. అలాగే ఐపీఎల్ గెలుపుల్లో అత్యధిక పరుగులు (4039) చేసిన బ్యాటర్‌గా.. నాలుగు వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.పొట్టి క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు..క్రిస్ గేల్ (14562)షోయబ్ మాలిక్ (13360)కీరన్ పోలార్డ్ (12900)విరాట్ కోహ్లి (12536)అలెక్స్ హేల్స్ (12319)విజయాల్లో (ఐపీఎల్) అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు..విరాట్ కోహ్లి (4039)శిఖర్ ధవన్ (3945)రోహిత్ శర్మ (3918)డేవిడ్ వార్నర్ (3710)సురేశ్ రైనా (3559)మ్యాచ్ విషయానికొస్తే.. విరాట్, డుప్లెసిస్ (23 బంతుల్లో 64; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో గుజరాత్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. ఆర్సీబీ బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో 19.3 ఓవర్లలో 147 పరుగులకే చాపచుట్టేసింది. గుజరాత్ ఇన్నింగ్స్‌లో షారుక్ ఖాన్ (37), డేవిడ్ మిల్లర్ (30), రాహుల్ తెవాతియా (35) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. మిగతా ప్లేయర్లంతా చేతులెత్తేశారు. ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్, యశ్ దయాల్, విజయ్‌కుమార్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. కర్ణ్ శర్మ, గ్రీన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం 148 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ.. పవర్ ప్లేలో పట్టపగ్గాల్లేకుండా చెలరేగిపోయింది. తొలి ఆరు ఓవర్లలో 92 పరుగులు చేసిన ఆర్సీబీ.. ఆతర్వాత ఒక్కసారిగా పేకమేడలా కూలిపోయి ఆలౌటయ్యేలా కనిపించింది. అయితే దినేశ్ కార్తీక్ (21 నాటౌట్).. సప్నిల్ సింగ్ (15 నాటౌట్) సాయంతో ఆర్సీబీని విజయతీరాలకు చేర్చాడు. గుజరాత్ బౌలర్లలో జాషువ లిటిల్ 4 వికెట్లతో విజృంభించగా.. నూర్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ గెలుపుతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో భారీ జంప్ కొట్టి చివరి స్థానం నుంచి ఏడో స్థానానికి ఎగబాకింది. ఈ ఓటమితో గుజరాత్ తొమ్మిదో స్థానానికి పడిపోయింది.
వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
టైటిల్: ది కంజూరింగ్: ది డెవిల్ మేడ్ మీ డూ ఇట్నటీనటులు: వేరా ఫార్మిగా, పాట్రిక్ విల్సన్, సారా కేథరిన్ హుక్, జులియన్ హిలార్డ్, జాన్ నోబుల్, ఎజిన్ బొండురెంట్, రూయ్ ఓకోన్నూర్ తదితరులుదర్శకత్వం: మేఖేల్ చావ్స్నిర్మాణ సంస్థ: వార్నర్ బ్రదర్స్ఓటీటీ: అమెజాన్ ప్రైమ్హారర్ సినిమాలు అంటేనే క్రియేటివీటికి మారుపేరు. లేనిది ఉన్నట్లుగా ప్రేక్షకులను భయపెట్టేలా ఉంటాయి. కానీ ది కంజూరింగ్ మాత్రం అలాంటి హారర్ మూవీ కాదు. నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా వచ్చిన చిత్రం. అమెరికాలో జరిగిన ఓ హత్య ఆధారంగా రూపొందించారు. అసలు ఈ హత్య వెనుక ఉన్నది ఎవరు? దెయ్యమా? లేక మనుషులేనా? అన్నది తెలియాలంటే ది కంజూరింగ్ చూసేయాల్సిందే.హాలీవుడ్లో హారర్ సినిమాలకు కొదువే లేదు. గతంలో వచ్చిన అన్నా బెల్లె, ది నన్ వెన్నులో వణుకు పుట్టించే చిత్రాలే. మైఖేల్ చావ్స్ తెరకెక్కించిన ఈ హారర్ క్రైమ్ థ్రిల్లర్ కూడా అంతకుమించి ఉందనడంలో సందేహం లేదు. ఈ 21వ శతాబ్దంలో అత్యంత భయపెట్టే చిత్రాల్లో ది కంజూరింగ్ ఒకటని చెప్పొచ్చు. ఈ మూవీ చూశాక దెయ్యాలు కూడా చేతబడులు చేస్తాయా? అనే అనుమానం కచ్చితంగా వస్తుంది. అసలు దెయ్యం ఏంటి? చేతబడులు చేయడమేంటి? అనే డౌటానుమానం మొదలైందా? అయితే ఈ సినిమా చూస్తే కచ్చితంగా అర్థమవుతుంది. ఈ రియల్ క్రైమ్ థ్రిల్లర్ 1981 ప్రాంతంలో జరిగిన కథ. ఇందులో డేవిడ్ గ్లాట్జెల్, డెబ్బీ, ఆర్నె, లోరాయిన్, ఈడ్, క్యాస్టనర్, జూడీ వారెన్ పాత్రల చుట్టే కథ తిరుగుతుంది. మసాచుసెట్స్‌లోని ఓ ఫ్యామిలీలోని చిన్న పిల్లాడు(డేవిడ్ గ్లాట్జెల్)కి పట్టిన దెయ్యాన్ని విడిపించేందుకు భూతవైద్యుని వద్దకు వెళ్తారు. అదే క్రమంలో ఆ పిల్లాడిని విడిచిపెట్టిన ఆ దెయ్యం.. ఆర్నె అనే యువకుడి శరీరంలోకి వెళ్తుంది. ఆ తర్వాత దెయ్యం ఆవహించిన ఆర్నె తన యాజమానిని హత్య చేస్తాడు. దీంతో పోలీసులు ఆర్నెను అరెస్ట్ చేసి జైల్లో వేస్తారు. ఇలాంటి కేసు అమెరికాలోనే మొదటిదని న్యాయమూర్తి సైతం ఆశ్చర్యపోతారు. అదే క్రమంలో జైల్లో ఉన్న ఆర్నెను దెయ్యం తన అధీనంలోకి తెచ్చుకునేందుకు యత్నిస్తూనే ఉంటుంది. అయితే ఆ దెయ్యాన్ని నిలువరించేందుకు.. ఆర్నెను రక్షించేందుకు లోరాయిన్, ఈడ్ ప్రయత్నిస్తారు. కానీ ఆ క్రమంలోనే వారికి అసలు నిజం తెలుస్తుంది? అసలు లోరాయిన్, ఈడ్ ఎవరిని కలిశారు? వారికి తెలిసిన నిజమేంటి? ఆర్నెను వేధిస్తున్న దెయ్యం ఒకరా? ఇద్దరా? లేక ఆత్మనా అనే సస్పెన్ష్ చివరి వరకు ఆడియన్స్‌కు అర్థం కాదు.డిఫరెంట్ హారర్ థ్రిల్లర్ సినిమాలు అంటే ఇష్టపడేవారు ది కంజూరింగ్ ఎంచక్కా చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఈ చిత్రంలో దెయ్యం మనిషిని ఆవహించే సన్నివేశాలు మాత్రం ఒళ్లు గగుర్పొడ్చేలా ఉంటాయి. ప్రతి సీన్ నరాలు తెగే ఉత్కంఠను కలిగిస్తాయి. దెయ్యం ఆర్నెను తన అధీనంలోకి తెచ్చుకునే క్రమంలో వచ్చే దృశ్యాలు ఆడియన్స్ వెన్నులో వణుకు పుట్టిస్తాయి. ఈ క్రైమ్ థ్రిల్లర్‌లో క్లైమాక్స్ సీన్స్‌ను డైరెక్టర్ మరింత రియలిస్టిక్‌గా చూపించారు. అంతే కాకుండా చివర్లో ఓ బిగ్ ట్విస్ట్ ఉంటుంది. అదేంటనేది ది కంజూరింగ్ ది డెవిల్ మేడ్ మీ డూ ఇట్ చూడాల్సిందే. 2021లో వచ్చిన ఈ థ్రిలర్ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ చిత్రాన్ని చిన్నపిల్లల సమక్షంలో చూడవద్దని మనవి.
ల్యాండ్ టైట్లింగ్ చట్టం వ్యవహారం.. టీడీపీపై ఈసీ కొరడా
సాక్షి, అమరావతి: ప్రజలను భయాందోళనకు గురి చేస్తూ తప్పుడు సమాచారంతో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై తెలుగుదేశం పార్టీ చేస్తున్న దుష్ప్రచారం మీద ఎన్నికల సంఘం (ఈసీ) కొరడా ఝళిపించింది. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఏప్రిల్ 29న ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించిన ఈసీ టీడీపీ దుష్ప్రచారంపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని, అలా తీసుకున్న చర్యలపై తక్షణం నివేదిక ఇవ్వాలని మంగళగిరి సీఐడీ (సైబర్ సెల్) అడిషనల్ డీజీకి అడిషనల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఎంఎన్ హరీంధర ప్రసాద్ ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి వ్యతిరేకంగా తప్పుడు సమాచారంతో దురుద్దేశపూర్వకంగా లాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై ఐవీఆర్ఎస్ కాల్స్‌తో పాటు సామాజిక మాధ్యమాల్లో టీడీపీ ప్రచారం చేస్తోందంటూ వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. ఇందుకు తగిన ఆధారాలనూ సమర్పించింది. వివిధ ప్రాంతాల నుంచి వేర్వేరు నెంబర్ల ఐవీఆర్ కాల్స్ వస్తున్నాయని.. వాటిని లిఫ్ట్ చేయగానే.. ‘వైఎస్ జగన్ అధికారంలోకొస్తే మీ భూములు మీ పేరు మీద ఉండవు, జగన్ కాజేస్తాడు, ఒరిజినల్స్ ఆయన దగ్గర ఉంచుకుంటాడు, మీకు జిరాక్స్ కాపీలు వస్తాయి, కాబట్టి జగన్‌కు ఓటు వేయకుండా తెలుగుదేశంకు ఓటు వేయండి’.. అంటూ రికార్డ్ మెసేజ్‌లు వస్తున్నట్లు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. వీటికి సంబంధించిన వాయిస్ రికార్డులను వైఎస్సార్సీపీ ఈసీకి ఆధారాలుగా సమర్పించింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికల సంఘం ఆమోదంలేకుండా ఎలాంటి ప్రచారం చేయడానికి వీల్లేదని.. కానీ ఎటువంటి అనుమతుల్లేకుండా వివిధ చోట్ల నుంచి కాల్స్‌చేస్తూ ఇలా ప్రచారం చేయడం ఉల్లంఘన కిందకే వస్తుందని.. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు జారీచేసింది. ఎన్నికల సమరంలో అన్ని రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలు ఉండేలా చూడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉంటుందని, ఈ విధంగా చట్టాలపై తప్పుడు సమాచారంతో దుష్ప్రచారం చేస్తూ ప్రజల్లో భయాందోళనలను రేకెత్తిస్తున్న టీడీపీపై తక్షణం చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ తన ఫిర్యాదులో కోరింది
Weekly Horoscope: ఈ రాశివారికి ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి
మేషంఅదనపు ఆదాయం సమకూరి అవసరాలు తీరతాయి. సమస్యలు ఎదురైనా నేర్పుగా పరిష్కరించుకుంటారు. శ్రమకు ఫలితం దక్కుతుంది. ఆస్తి వ్యవహారాల్లో చికాకులు తొలగుతాయి. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ప్రత్యర్థులు మిత్రులుగా మారి చేయూతనందిస్తారు. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగులకు విధి నిర్వహణలో ప్రశంసలు. రాజకీయ, కళారంగాల వారికి సన్మానాలు. వారం చివరిలో మనశ్శాంతి లోపం. కుటుంబంలో ఒత్తిడులు. ఎరుపు, బంగారురంగులు, శివపంచాక్షరి పఠించండి.వృషభంకొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. పరపతి పెరుగుతుంది. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. వాహనాలు, భూములు కొంటారు. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాల విస్తరణలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. కళారంగం వారికి అన్నింటా విజయం. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో కలహాలు. నలుపు, ఆకుపచ్చరంగులు, అన్నపూర్ణాష్టకం పఠించండి.మిథునంఆర్థిక పరిస్థితి మొదట్లోకొంత నిరాశ కలిగించినా అవసరాలకు డబ్బు అందుతుంది. పనులు నెమ్మదిగా సాగుతాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆప్తుల నుంచి ఆహ్వానాలు రాగలవు. భూవివాదాలు తీరతాయి. ఆరోగ్యభంగం. వాహనసౌఖ్యం. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. వ్యాపారాలు అనుకున్న మేరకు లాభిస్తాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు. రాజకీయవర్గాలకు ముఖ్య సమాచారం. వారం చివరిలో ఒత్తిడులు. కుటుంబంలో సమస్యలు. ఆకుపచ్చరంగు,లేత గులాబీరంగు, కనకధారా స్తోత్రం పఠించండి.కర్కాటకంపనుల్లో పురోగతి కనిపిస్తుంది. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. గత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. రుణాలు చేయాల్సి వస్తుంది. ఎరుపు, చాక్లెట్ రంగులు, లక్ష్మీస్తోత్రాలు పఠించండి.సింహంముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. మీ అంచనాలు నిజమవుతాయి. ఆత్మీయుల సలహాలు స్వీకరిస్తారు. ఆస్తి వివాదాల పరిష్కారం. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు. ఉద్యోగులకు గందరగోళం నుండి విముక్తి. పారిశ్రామికవర్గాలకు కొన్ని సమస్యలు తీరతాయి. వారం ప్రారంభంలో మానసికఅశాంతి. కుటుంబంలో నిరాశ. తెలుపు, చాక్లెట్æరంగులు, రాఘవేంద్రస్తోత్రాలు పఠించండి.కన్యకొన్ని కార్యక్రమాలు నెమ్మదిగా సాగుతాయి. బంధువులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. మీలోని నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. ఒక ప్రకటన నిరుద్యోగులు, విద్యార్థులను ఆకట్టుకుంటుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపార విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగులకు విధులు ప్రశాంతంగా సాగిపోతాయి. కళారంగం వారికి యోగదాయకమైన కాలం. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. గులాబీ, పసుపు రంగులు, శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.తులపనులు కొంత నెమ్మదిగా సాగుతాయి. బంధువులు, మిత్రులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. నిరుద్యోగుల కల ఫలిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం పొందుతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు చిక్కులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు కార్యసిద్ధి. వారం చివరిలో ధనవ్యయం. కుటుంబంలో కొత్త వివాదాలు. తెలుపు, చాక్లెట్ రంగులు, నవగ్రహస్తోత్రాలు పఠించండి.వృశ్చికంకొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల సలహాలు పొందుతారు. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలకు హాజరవుతారు. మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. వాహనయోగం. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఈతిబాధలు తొలగుతాయి. కళారంగం వారికి సన్మానాలు. వారం చివరిలో మానసిక ఆందోళన. కుటుంబంలో ఒత్తిడులు. ఆకుపచ్చ, తెలుపు రంగులు, ఆదిత్య హృదయం పఠించండి.ధనుస్సుఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆసక్తికరమైన సమాచారం అందుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆలయ దర్శనాలు. ఇంటాబయటా అనుకూలం. ఇంటర్వ్యూలు అందుతాయి. సోదరులు, సోదరీలతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో ఆకస్మిక ప్రయాణాలు. అంచనాలలో పొరపాట్లు దొర్లుతాయి. ఆకుపచ్చ, తెలుపురంగులు, శివాలయ దర్శనం మంచిది.మకరంఅనుకున్న పనులు సజావుగా సాగుతాయి. మీపై వచ్చిన అభియోగాల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పరపతి పెరుగుతుంది. గృహ, వాహనయోగాలు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. పోటీపరీక్షల్లో విజయం. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు విధులలో భారం తగ్గుతుంది. రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం మధ్యలో కుటుంబంలో ఒత్తిడులు. శ్రమాధిక్యం. నీలం, లేత పసుపు రంగులు. నృసింహస్తోత్రాలు పఠించండి.కుంభంఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబ, ఆరోగ్య సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. బంధువులతో మాటపట్టింపులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. కొన్ని పనులు మధ్యలో విరమిస్తారు. విద్యార్థుల యత్నాలు మందగిస్తాయి. ప్రత్యర్థుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలలో లాభాలు అంతగా ఉండవు. ఉద్యోగులకు శ్రమాధిక్యం. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. నీలం, తెలుపు రంగులు, గణేశ్‌ను పూజించండి.మీనంఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. ప్రత్యర్థులు అనుకూలురుగా మారతారు. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. పారిశ్రామికవర్గాలకు మరింత అనుకూల పరిస్థితులు. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఆకుపచ్చ, తెలుపు రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
సునీత ‘స్టార్ ట్రెక్’!
ముప్పై ఏళ్లు సాగిన అమెరికన్ స్పేస్ షటిల్స్ శకం 2011లో ముగిసింది. ఇక 1960ల నాటి సోవియట్ సోయజ్ కేప్సూల్ ఓ పాతబడ్డ డొక్కు వ్యోమనౌక. కొద్దిపాటి మార్పులతో ‘ఐదో తరం సోయజ్’తో నెట్టుకొస్తున్నా అదీ ని్రష్కమించే వేళయింది. సొంత నౌకల్లో వ్యోమగాముల్ని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపడానికి అమెరికా ఆర్థికంగా వెనకడుగు వేసింది. రష్యా సైతం స్పేస్ టూరిస్టులకు టికెట్లమ్మి ఆ సొమ్ముతో ‘ఐఎస్ఎస్ బండి’ నడుపుతోంది. ఈ నేపథ్యంలో మున్ముందు అంతరిక్ష కేంద్రానికి మానవసహిత యాత్రలు, పెట్టుబడులు, పరిశోధన, చంద్ర–అంగారక యాత్రలు... అన్నింట్లోనూ ప్రైవేటైజేషన్‌దే హవా కానుంది! ప్రైవేటు రంగమే రోదసిని ఏలబోతోంది. ప్రభుత్వరంగ పాత్ర క్రమంగా కేవలం ప్రోత్సాహం, సహకారం, కాస్తో కూస్తో నిధులకే పరిమితమవుతోంది. రెండు అధునాతన ప్రైవేటు వ్యోమనౌకలు (స్పేస్ కేప్సూల్స్) అంతరిక్షాన్ని అందుకోవడానికి సిద్ధమయ్యాయి. భూమికి 400 కిలోమీటర్ల ఎత్తున కక్ష్యలో పరిభ్రమిస్తున్న అంతరిక్ష కేంద్రానికి రాకెట్ల సాయంతో వ్యోమగాముల్ని తీసుకెళ్లనున్నాయి. ‘ఎక్స్’ బాస్ ఇలాన్ మస్క్ కంపెనీ ‘స్పేస్ ఎక్స్’ రూపొందించిన ‘క్రూ డ్రాగన్’ కేప్సూల్ ఇప్పటికే ఫాల్కన్ రాకెట్లతో అంతరిక్ష కేంద్రానికి రాకపోకలు సాగిస్తోంది. సరుకులతో పాటు వ్యోమగాములనూ చేరవేస్తోంది. ప్రపంచ అతి పెద్ద ఏరో స్పేస్ కంపెనీల్లో ఒకటైన ‘బోయింగ్’ కూడా తాజాగా ‘సీఎస్టీ–100 స్టార్‌లైనర్’ వ్యోమనౌకతో మే 6న తొలి మానవసహిత రోదసీ యాత్రతో రంగప్రవేశం చేస్తోంది. భారతీయ మూలాలున్న అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ ముచ్చటగా మూడోసారి అంతరిక్ష కేంద్రానికి పయనమవడం ఈ యాత్రలో మరో విశేషం... మన సునీత హ్యాట్రిక్! సునీతా విలియమ్స్. ఇండియన్ అమెరికన్ ఆస్ట్రోనాట్. ముద్దుపేరు సునీ. 11 ఏళ్ల విరామం అనంతరం 58 ఏళ్ల వయసులో మూడోసారి రోదసికి వెళ్లబోతున్నారు. అమెరికన్ నేవీ కెపె్టన్ (రిటైర్డ్) సునీతకు అనుభవమే మనోబలం. ఆమెను నాసా 1998లో వ్యోమగామిగా ఎంపిక చేసింది. సునీత తండ్రి ఇండియన్ అమెరికన్ దీపక్ పాండ్యాది ముంబై. తల్లి అర్సలిన్ బోనీ స్లోవేన్–అమెరికన్. సునీత 1965లో అమెరికాలో జని్మంచారు. యునైటెడ్ లాంచ్ అలయెన్స్ రాకెట్ ‘అట్లాస్–5’ శీర్షభాగంలో అమర్చిన బోయింగ్ ‘స్టార్‌లైనర్’ వ్యోమనౌకలో ఈ నెల 6న రాత్రి 10:34కు (భారత కాలమానం ప్రకారం 7వ తేదీ ఉదయం 8:04కు) ఫ్లోరిడాలోని కేప్ కెనవరల్ నుంచి సునీత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయల్దేరనున్నారు. నాసా వ్యోమగామి బుచ్ విల్మోర్ కూడా ఈ యాత్రలో పాల్గొంటారు. వీరిద్దరూ ఐఎస్ఎస్లో వారం గడిపి తిరిగొస్తారు. సునీత 2006 డిసెంబరు 9న తొలిసారి ఐఎస్ఎస్ కు వెళ్లారు. 2007 జూన్ 22 దాకా రోదసిలో గడిపారు. నాలుగు సార్లు స్పేస్ వాక్ చేసిన మహిళా వ్యోమగామిగా రికార్డు నెలకొల్పారు. రెండోసారి 2012 జులై 14 నుంచి 127 రోజులపాటు ఐఎస్ఎస్లో గడిపారు. మూడుసార్లు స్పేస్ వాక్ చేశారు. రెండు మిషన్లలో మొత్తం 50 గంటల 40 నిమిషాలు స్పేస్ వాక్ చేశారు. బోయింగ్... గోయింగ్! అమెరికా స్పేస్ షటిల్స్ కనుమరుగయ్యాక అంతరిక్ష యాత్రల కోసం రష్యా సోయజ్ రాకెట్–వ్యోమనౌకల శ్రేణిపైనే నాసా ఆధారపడింది. కానీ ఒక్కో వ్యోమగామికి రష్యా ఏకంగా రూ.700 కోట్లు చొప్పు న వసూలు చేస్తోంది. దాంతో వ్యోమనౌకల అభివృద్ధి కోసం నాసా 2014లో బోయింగ్‌కు 4.2 బిలియన్ డాలర్లు, (రూ.35 వేల కోట్లు), స్పేస్ ఎక్స్‌కు 2.6 బిలియన్ డాలర్ల (రూ.21,680 కోట్లు) కాంట్రాక్టులు కట్టబెట్టింది. స్పేస్ ఎక్స్ తన ‘క్రూ డ్రాగన్’ స్పేస్ కేప్సూల్‌లో 2020 నుంచే వ్యోమగాములను తీసుకెళ్తోంది. బోయింగ్ ‘క్రూ స్పేస్ ట్రాన్సో్పర్టేషన్ (సీఎస్టీ)–100 స్టార్ లైనర్’ మాత్రం వెనుకబడింది. ఎట్టకేలకు ఈ నెల 6న తొలి మానవసహిత ప్రయాణ పరీక్షకు సిద్ధమైంది. అంతరిక్ష కేంద్రంతో అనుసంధానం (డాకింగ్), భూమికి తిరుగు పయనం, స్టార్ లైనర్ వ్యవస్థల సామర్థ్యాన్ని ఈ పరీక్షలో పరిశీలిస్తారు. ఈ యాత్ర జయప్రదమైతే మానవసహిత అంతరిక్ష యాత్రలకు దానికి లైసెన్స్ లభిస్తుంది. – జమ్ముల శ్రీకాంత్
తప్పక చదవండి
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- క్యాన్సర్‌తో పోరాటం.. ఇప్పుడేవీ సరిగా గుర్తుండట్లేదు: హీరోయిన్
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్‌కు సంబంధంలేదన్న జయశంకర్
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
సినిమా
వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
టైటిల్: ది కంజూరింగ్: ది డెవిల్ మేడ్ మీ డూ ఇట్నటీనటులు: వేరా ఫార్మిగా, పాట్రిక్ విల్సన్, సారా కేథరిన్ హుక్, జులియన్ హిలార్డ్, జాన్ నోబుల్, ఎజిన్ బొండురెంట్, రూయ్ ఓకోన్నూర్ తదితరులుదర్శకత్వం: మేఖేల్ చావ్స్నిర్మాణ సంస్థ: వార్నర్ బ్రదర్స్ఓటీటీ: అమెజాన్ ప్రైమ్హారర్ సినిమాలు అంటేనే క్రియేటివీటికి మారుపేరు. లేనిది ఉన్నట్లుగా ప్రేక్షకులను భయపెట్టేలా ఉంటాయి. కానీ ది కంజూరింగ్ మాత్రం అలాంటి హారర్ మూవీ కాదు. నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా వచ్చిన చిత్రం. అమెరికాలో జరిగిన ఓ హత్య ఆధారంగా రూపొందించారు. అసలు ఈ హత్య వెనుక ఉన్నది ఎవరు? దెయ్యమా? లేక మనుషులేనా? అన్నది తెలియాలంటే ది కంజూరింగ్ చూసేయాల్సిందే.హాలీవుడ్లో హారర్ సినిమాలకు కొదువే లేదు. గతంలో వచ్చిన అన్నా బెల్లె, ది నన్ వెన్నులో వణుకు పుట్టించే చిత్రాలే. మైఖేల్ చావ్స్ తెరకెక్కించిన ఈ హారర్ క్రైమ్ థ్రిల్లర్ కూడా అంతకుమించి ఉందనడంలో సందేహం లేదు. ఈ 21వ శతాబ్దంలో అత్యంత భయపెట్టే చిత్రాల్లో ది కంజూరింగ్ ఒకటని చెప్పొచ్చు. ఈ మూవీ చూశాక దెయ్యాలు కూడా చేతబడులు చేస్తాయా? అనే అనుమానం కచ్చితంగా వస్తుంది. అసలు దెయ్యం ఏంటి? చేతబడులు చేయడమేంటి? అనే డౌటానుమానం మొదలైందా? అయితే ఈ సినిమా చూస్తే కచ్చితంగా అర్థమవుతుంది. ఈ రియల్ క్రైమ్ థ్రిల్లర్ 1981 ప్రాంతంలో జరిగిన కథ. ఇందులో డేవిడ్ గ్లాట్జెల్, డెబ్బీ, ఆర్నె, లోరాయిన్, ఈడ్, క్యాస్టనర్, జూడీ వారెన్ పాత్రల చుట్టే కథ తిరుగుతుంది. మసాచుసెట్స్‌లోని ఓ ఫ్యామిలీలోని చిన్న పిల్లాడు(డేవిడ్ గ్లాట్జెల్)కి పట్టిన దెయ్యాన్ని విడిపించేందుకు భూతవైద్యుని వద్దకు వెళ్తారు. అదే క్రమంలో ఆ పిల్లాడిని విడిచిపెట్టిన ఆ దెయ్యం.. ఆర్నె అనే యువకుడి శరీరంలోకి వెళ్తుంది. ఆ తర్వాత దెయ్యం ఆవహించిన ఆర్నె తన యాజమానిని హత్య చేస్తాడు. దీంతో పోలీసులు ఆర్నెను అరెస్ట్ చేసి జైల్లో వేస్తారు. ఇలాంటి కేసు అమెరికాలోనే మొదటిదని న్యాయమూర్తి సైతం ఆశ్చర్యపోతారు. అదే క్రమంలో జైల్లో ఉన్న ఆర్నెను దెయ్యం తన అధీనంలోకి తెచ్చుకునేందుకు యత్నిస్తూనే ఉంటుంది. అయితే ఆ దెయ్యాన్ని నిలువరించేందుకు.. ఆర్నెను రక్షించేందుకు లోరాయిన్, ఈడ్ ప్రయత్నిస్తారు. కానీ ఆ క్రమంలోనే వారికి అసలు నిజం తెలుస్తుంది? అసలు లోరాయిన్, ఈడ్ ఎవరిని కలిశారు? వారికి తెలిసిన నిజమేంటి? ఆర్నెను వేధిస్తున్న దెయ్యం ఒకరా? ఇద్దరా? లేక ఆత్మనా అనే సస్పెన్ష్ చివరి వరకు ఆడియన్స్‌కు అర్థం కాదు.డిఫరెంట్ హారర్ థ్రిల్లర్ సినిమాలు అంటే ఇష్టపడేవారు ది కంజూరింగ్ ఎంచక్కా చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఈ చిత్రంలో దెయ్యం మనిషిని ఆవహించే సన్నివేశాలు మాత్రం ఒళ్లు గగుర్పొడ్చేలా ఉంటాయి. ప్రతి సీన్ నరాలు తెగే ఉత్కంఠను కలిగిస్తాయి. దెయ్యం ఆర్నెను తన అధీనంలోకి తెచ్చుకునే క్రమంలో వచ్చే దృశ్యాలు ఆడియన్స్ వెన్నులో వణుకు పుట్టిస్తాయి. ఈ క్రైమ్ థ్రిల్లర్‌లో క్లైమాక్స్ సీన్స్‌ను డైరెక్టర్ మరింత రియలిస్టిక్‌గా చూపించారు. అంతే కాకుండా చివర్లో ఓ బిగ్ ట్విస్ట్ ఉంటుంది. అదేంటనేది ది కంజూరింగ్ ది డెవిల్ మేడ్ మీ డూ ఇట్ చూడాల్సిందే. 2021లో వచ్చిన ఈ థ్రిలర్ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ చిత్రాన్ని చిన్నపిల్లల సమక్షంలో చూడవద్దని మనవి.
ప్రముఖ నిర్మాణ సంస్థకు ఇళయరాజా నోటీసులు.. అసలేం జరిగిందంటే?
ఇటీవల కాలంలో ప్రముఖ సంగీ త దర్శకుడు ఇళయరాజా వ్యవహారం వివాదాస్పదంగా మారిందనే చెప్పాలి. తాను సంగీతం అందించిన పాటలకు చెందిన సర్వహక్కులు తనవే అన్నట్లు ఆయన వ్యవహార ధోరణిని తప్పుబడుతున్నారు. తాజాగా నటుడు రజనీకాంత్ చిత్ర నిర్మాతకు సంగీత దర్శకుడు ఇళయరాజా నోటీసులు జారీ చేశారు. దీనికి రజనీకాంత్ ఎలా స్పందించారో తెలుసా?రజనీకాంత్ తాజాగా నటిస్తున్న చి త్రం వేట్టైయాన్. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ కీలకపాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని జై భీమ్ చిత్రం ఫేమ్ జ్ఞానవేల్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీంతో రజనీకాంత్ తాను 151వ చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో సీన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ నెలలో సెట్ పైకి వెళ్లనున్నట్లు దర్శకుడు ఇంతకు ముందే తెలిపారు. కాగా దీనికి కూలీ అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఇటీవలే ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశా రు.కాగా ఇందులో డిస్కో డిస్కో అనే పాట చోటు చేసుకుంటుందట. ఇదే ఇప్పుడు వివాదంగా మారింది. ఈ పాటకు ఇంతకు ముందు రజినీకాంత్ హీరోగా నటించిన తంగమగన్ చిత్రానికి తాను రూపొందించిన వావా పక్కమ్ వా పాట ట్యూన్‌నే మార్చి రూపొందించారని.. అందుకు తన అనుమతి తీసుకోలేదని ఇళయరాజా సన్ పిక్చర్స్ సంస్థకు నోటీసులు పంపారు. కాగా వేట్టైయాన్ చిత్రం కోసం ముంబాయి వెళ్లిన రజనీకాంత్ శనివారం చెన్నైకు తిరిగొచ్చారు. ఈ సందర్భంగా చెన్నై విమానాశ్రయంలో ఇళయరాజా నోటీసుల వ్యవహారం గురించి పాత్రికేయులు రజనీకాంత్‌ను ప్రశ్నించగా.. అది చిత్ర నిర్మాణ సంస్థకు ఇళయరాజాకు సంబంధించిన సమస్య అని ఆయన పేర్కొన్నారు.
వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
జీవితంలో అప్ అండ్ డౌన్లు సహజం. ఎప్పుడూ విజయాలే కాదు అప్పుడప్పుడూ అపజయాలు కూడా ఎదురవుతుంటాయి. అంత మాత్రాన వారి పని అయిపోయిందని భావించకూడదు. సినిమా రంగంలోనూ ఇలాంటివి నిత్యం జరుగుతూ ఉంటాయి. పూజాహెగ్డే కెరీర్ చూస్తే 12 ఏళ్ల క్రితం ముగముడి అనే చిత్రం ద్వారా కథానాయికగా కోలీవుడ్లోకి ప్రవేశించారు. ఆ చిత్రం నిరాశ పరచడంతో ఆమె చాప్టర్ ముగిసిందనే ప్రచారం జరిగింది. అయితే ఒక ద్వారం మూసుకుపోతే మరో ద్వారం తెరుచుకుంటుంది అంటారు. ఈమె విషయంలో అదే జరిగింది. కోలీవుడ్‌లో తొలి చిత్రమే అపజయం పాలైనా, టాలీవుడ్లో అవకాశాలు తలుపు తట్టాయి.స్టార్ హీరోయిన్ఒక లైలా కోసం అనే చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చారు. అల వైకుంఠపురంలో, అరవింద సమేత, మహర్షి తదితర చిత్రాల విజయాలు పూజాను స్టార్ హీరోయిన్ను చేశాయి. అయితే ఆ తరువాత నటించిన రాధేశ్యామ్, ఆచార్య, తమిళంలో నటించిన బీస్ట్, హిందీలో సల్మాన్‌ఖాన్‌తో నటించిన కిసి కా భాయ్ కిసికీ జాన్ వంటి చిత్రాలు అపజయం పాలవ్వడంతో పూజాహెగ్డే గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది. తరువాత అవకాశాలు కూడా దూరం అయ్యాయి.చిన్న గ్యాప్అలా ఈ అమ్మడికి గ్యాప్ వచ్చింది. అయితే అది చిన్నగ్యాప్ అనే అని చెప్పవచ్చు. ఇప్పుడు మళ్లీ వరుసగా టాలీవుడ్లో అవకాశాలు తలుపు తడుతున్నాయి. ఇకపోతే తమిళంలో ఒక వెబ్ సిరీస్‌లో నటించడానికి ఈ అమ్మడు పచ్చజెండా ఊపినట్లు తాజా సమాచారం. ఇంతకు ముందు ఇమైకా నొడిగళ్, డీమాంటి కాలనీ వంటి హిట్ చిత్రాలను తెరకెక్కించిన అజయ్ జ్ఞానముత్తు ఒక వెబ్ సిరీస్‌ను రూపొందించనున్నారు. ఇందులో పూజాహెగ్డే ప్రధాన పాత్రను పోషించనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ప్రస్తుతం ఆమె హిందీలో దేవ సినిమా చేస్తున్నారు.చదవండి: క్యాన్సర్ తర్వాత కథ, డైలాగ్స్ ఏవీ గుర్తుండట్లేదు!
నాకు కాబోయే వాడికి ఇది రెండో పెళ్లి.. అయితే ఏంటి?: వరలక్ష్మి
వరలక్ష్మి శరత్‌కుమార్... టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ యాక్టర్‌గా మారిపోయింది. క్రాక్, నాంది, యశోద, వీరసింహారెడ్డి, కోటబొమ్మాళి పీఎస్, హనుమాన్.. ఇలా వరుసగా అన్నీ విజయాలే అందుకుంది. ఇటీవలే ఆమె ప్రధాన పాత్రలో నటించిన శబరి చిత్రం రిలీజైంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ మీడియకు ఇంటర్వ్యూ ఇచ్చిన వరలక్ష్మి తనకు కాబోయే భర్త గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది.ఆ క్వాలిటీ నచ్చింది'నికోలయ్‌కు, నాకు మధ్య అనుకోకుండా ప్రేమ పుట్టింది. అతడు నా వృత్తిని గౌరవిస్తాడు. సినిమాలు ఆపేసి ఇంట్లో కూర్చో అని ఎన్నడూ చెప్పలేదు. పైగా తను నన్ను చూసి గర్వపడతాడు. నాతో పాటు షూటింగ్‌కు వచ్చి ఖుషీ అవుతుంటాడు. నేను చేసే పనిని ఎంజాయ్ చేస్తాడు. ఆ క్వాలిటీ నాకు బాగా నచ్చింది. నా జీవితాన్ని అతడితో పంచుకోవాలనిపించింది. ఇద్దరం ఒకరికొకరం సపోర్ట్ చేసుకుంటాం.అదే ఆయన చేసే పనిఅతడు గ్యాలరిస్టు.. అంటే పెద్దపెద్ద కళాకారులు వేసే పెయింటింగ్స్‌ను కొనుక్కుంటూ అమ్ముతుంటాడు. అదే ఆయన చేసే పని! నా భర్తకు ఇదివరకే పెళ్లయిందని వార్తలు రాశారు. అది నిజమే! అయినా తనకు ఆల్రెడీ పెళ్లయితే తప్పేముంది? దీని గురించి మాట్లాడేవారికి ఒకటే చెప్తున్నా.. మీ పని మీరు చూసుకోండి.డబ్బు కోసమే పెళ్లి?అందరూ ఐశ్వర్యరాయ్, బ్రాడ్పిట్లేం కాదు. ముందు మీ ముఖాలు మీరు చూసుకోండి. మీరు ఏం అనుకుంటున్నారనేది నాకవసరమే లేదు. నా లైఫ్ నా ఇష్టం. డబ్బుల కోసమే పెళ్లి చేసుకుంటోందని కూడా అన్నారు. డబ్బు నా దగ్గర కూడా ఉంది. ఆయన దగ్గర తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు. మీకు నచ్చింది అనుకోండి.. డోంట్ కేర్' అని వరలక్ష్మి శరత్‌కుమార్ చెప్పుకొచ్చింది. చదవండి: రెండు సార్లు ప్రేమలో విఫలమైన హీరో.. ఆ ఇద్దరి హీరోయిన్ల వల్లే?
ఫొటోలు
Tanya Sharma: వియత్నాంలో హిందీ బుల్లితెర నటి సమ్మర్ వెకేషన్ (ఫోటోలు)
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పలమనేరు: ఉప్పొంగిన అభిమాన సంద్రం (ఫొటోలు)
భార్యాభర్తలిద్దరూ స్టార్ క్రికెటర్లే.. అతడు కాస్ట్లీ.. ఆమె కెప్టెన్!(ఫొటోలు)
క్రీడలు
ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
ఐపీఎల్లో ఇవాళ డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. మధ్యాహ్నం జరిగే మ్యాచ్‌లో పంజాబ్, చెన్నై సూపర్ కింగ్స్.. రాత్రి మ్యాచ్‌లో లక్నో, కేకేఆర్ తలపడనున్నాయి. మధ్యాహ్నం మ్యాచ్‌కు ధర్మశాల మైదానం వేదిక కానుండగా.. రాత్రి మ్యాచ్ లక్నో హోం గ్రౌండ్ అటల్ బిహారీ స్టేడియంలో జరుగనుంది.పంజాబ్, సీఎస్కే మ్యాచ్ విషయానికొస్తే.. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే సీఎస్కే ఈ మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాల్సి ఉంది. చెన్నై ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో ఐదు విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌తో కలిపి చెన్నై మరో నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇతర జట్లతో పోటీ లేకుండా ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే చెన్నై ఇకపై ఆడబోయే అన్ని మ్యాచ్‌ల్లో గెలవాల్సి ఉంటుంది. చెన్నై మే 10న గుజరాత్, 12న రాజస్థాన్ రాయల్స్, 18న ఆర్సీబీతో తలపడాల్సి ఉంది.పంజాబ్ విషయానికొస్తే.. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగే విజయాలు సాధించి, ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. పంజాబ్ ఈ మ్యాచ్‌తో పాటు తదుపరి ఆడబోయే మూడు మ్యాచ్‌ల్లో గెలిచినా ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కుతుందని చెప్పలేని పరిస్థితి ఉంది. టెక్నికల్‌గా పంజాబ్ ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నప్పటికీ అనధికారికంగా కష్టమే అని చెప్పాలి. తదుపరి మ్యాచ్‌ల్లో పంజాబ్.. ఆర్సీబీ (మే 9), రాజస్థాన్ రాయల్స్ (మే 15), సన్‌రైజర్స్ (మే 19) జట్లను ఢీకొట్టాల్సి ఉంది.హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే.. ఇరు జట్లు ఇప్పటివరకు 29 మ్యాచ్‌ల్లో ఎదురెదురుపడగా.. సీఎస్కే 15, పంజాబ్ 14 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి. ఇరు జట్లు ఇదే సీజన్లో చివరిసారిగా తలపడ్డాయి. మే 1న జరిగిన ఆ మ్యాచ్‌లో పంజాబ్ సీఎస్కే 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.తుది జట్లు (అంచనా)..పంజాబ్: జానీ బెయిర్‌స్టో, ప్రభ్‌సిమ్రన్ సింగ్, రిలీ రోసోవ్, సామ్ కర్రన్ (కెప్టెన్), జితేష్ శర్మ (వికెట్‌కీపర్), శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ, హర్‌ప్రీత్ బ్రార్, కగిసో రబాడ, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్. [ఇంపాక్ట్ ప్లేయర్: అర్ష్‌దీప్ సింగ్].సీఎస్కే: అజింక్య రహానే, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), డారిల్ మిచెల్, మొయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని, సమీర్ రిజ్వీ, శార్దూల్ ఠాకూర్, రిచర్డ్ గ్లీసన్, తుషార్ దేశ్‌పాండే. [ఇంపాక్ట్ సబ్: మతీష పతిరణ]లక్నో-కేకేఆర్ మ్యాచ్ విషచయానికొస్తే.. ఇరు జట్లు ప్లే ఆఫ్స్ రేసులో దూసుకుపోతున్నాయి. కేకేఆర్ ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో ఏడింట గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉండగా.. లక్నో 10లో 6 మ్యాచ్‌లు గెలిచి మూడో స్థానంలో కొనసాగుతుంది. కేకేఆర్ తదుపరి ఆడబోయే నాలుగు మ్యాచ్‌ల్లో మరో రెండు మ్యాచ్‌లు గెలిచినా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించనుండగా.. లక్నో నాలుగులో కనీసం మూడు మ్యాచ్‌లైనా గెలిస్తే ఫ్లే ఆఫ్స్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంటుంది. లక్నో నాలుగులో మూడింట గెలిస్తే ఇతర జట్ల జయాపజయాలతో పని లేకుండా సేఫ్‌గా ఫైనల్ ఫోర్కు చేరుకుంటుంది.కేకేఆర్ తమ తదుపరి మ్యాచ్‌ల్లో ముంబై ఇండియన్స్ (మే 11), గుజరాత్ (మే 13), రాజస్థాన్ రాయల్స్‌తో (మే 19) తలపడాల్సి ఉండగా.. లక్నో సన్‌రైజర్స్ (మే 8), ఢిల్లీ (మే 14), ముంబై ఇండియన్స్ (మే 17) జట్లను ఢీకొట్టాల్సి ఉంది. హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే.. లక్నోపై కేకేఆర్ స్పష్టమైన ఆధిక్యత ప్రదర్శించినట్లు తెలుస్తుంది. ఇరు జట్లు ఇప్పటివరకు 4 మ్యాచ్‌ల్లో ఎదురెదురుపడగా.. కేకేఆర్ 3, లక్నో ఒక మ్యాచ్‌లో గెలుపొందాయి. ఇరు జట్ల మధ్య చివరసారిగా జరిగిన మ్యాచ్‌లో కూడా కేకేఆరే పైచేయి సాధించింది. ఏప్రిల్ 14న జరిగిన ఆ మ్యాచ్‌లో కేకేఆర్ 8 వికెట్ల తేడాతో లక్నోను చిత్తు చేసింది.తుది జట్లు (అంచనా)..లక్నో: కేఎల్ రాహుల్ (కెప్టెన్/వికెట్‌కీపర్), మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, అష్టన్ టర్నర్, ఆయుష్ బదోని, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, మొహ్సిన్ ఖాన్, యశ్ ఠాకూర్కేకేఆర్: ఫిలిప్ సాల్ట్ (వికెట్‌కీపర్), సునీల్ నరైన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి
Gukesh Dommaraju: అతను.. ఒత్తిడిని అధిగమించే 'ఎత్తులమారి'!
30 నవంబర్, 2017.. అండర్–11 జాతీయ చాంపియన్‌గా నిలిచిన అబ్బాయిని ‘నీ లక్ష్యం ఏమిటి?’ అని ప్రశ్నిస్తే.. ‘చెస్‌లో ప్రపంచ చాంపియన్ కావడమే’ అని సమాధానమిచ్చాడు. సాధారణంగా ఆ స్థాయిలో గెలిచే ఏ పిల్లాడైనా అలాంటి జవాబే చెబుతాడు. అతను కూడా తన వయసుకు తగినట్లుగా అదే మాట అన్నాడు. కానీ ఆరున్నరేళ్ల తర్వాత చూస్తే అతను వరల్డ్ చాంపియన్ కావడానికి మరో అడుగు దూరంలో నిలిచాడు. ఆ కుర్రాడిలోని ప్రత్యేక ప్రతిభే ఇప్పుడు ఈ స్థాయికి తీసుకొచ్చింది.పిన్న వయసులో భారత గ్రాండ్‌మాస్టర్‌గా గుర్తింపు పొందడం మొదలు వరుస విజయాలతో వరల్డ్ చాంపియన్‌కు సవాల్ విసిరే చాలెంజర్‌గా నిలిచే వరకు అతను తన స్థాయిని పెంచుకున్నాడు. ఆ కుర్రాడి పేరే దొమ్మరాజు గుకేశ్. చెన్నైకి చెందిన ఈ కుర్రాడు ఇటీవలే ప్రతిష్ఠాత్మక వరల్డ్ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో చాంపియన్‌గా నిలిచి తానేంటో నిరూపించుకున్నాడు. తనకంటే ఎంతో బలమైన, అనుభవజ్ఞులైన గ్రాండ్మాస్టర్లతో తలపడి అతను ఈ అసాధారణ ఘనతను సాధించాడు.క్యాండిడేట్స్‌తో విజేతగా నిలిచిన అత్యంత పిన్న వయస్కుడిగా కూడా రికార్డు నమోదు చేశాడు. ఈ ఏడాది చివర్లో.. చైనా ఆటగాడు డింగ్ లారెన్తో జరిగే పోరులోనూ గెలిస్తే అతను కొత్త జగజ్జేత అవుతాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 37 ఏళ్లుగా భారత నంబర్‌వన్‌గా ఉన్న దిగ్గజ క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్‌ను దాటి మన దేశం తరఫున అగ్రస్థానాన్ని అందుకున్నప్పుడే గుకేశ్ ఏమిటో ప్రపంచానికి తెలిసింది. ఇప్పుడు అదే జోరులో సాధించిన తాజా విజయంతో ఈ టీనేజర్ చెస్ చరిత్రలో తనకంటూ కొత్త అధ్యాయాన్ని లిఖించుకున్నాడు.‘త్యాగం’.. తనకు నచ్చని పదం అంటారు గుకేశ్ తండ్రి రజినీకాంత్. తల్లిదండ్రులు, పిల్లల మధ్య ఉండే అనుబంధానికి త్యాగం అనే మాటను జోడించడం సరైంది కాదనేది ఆయన అభిప్రాయం. గుకేశ్ క్యాండిడేట్స్ టోర్నీలో విజేతగా నిలిచిన తర్వాత అతని కోసం తల్లిదండ్రులు ఎంతో కష్టపడ్డారని, వారు త్యాగాలు చేశారని చెబుతుంటే ఆయనలా స్పందించారు. చెన్నైలో స్థిరపడిన తెలుగువారు ఆయన. రజినీకాంత్ ఈఎన్టీ వైద్యుడు కాగా, గుకేశ్ తల్లి పద్మ మైక్రోబయాలజిస్ట్‌గా ఒక ఆస్పత్రిలో పని చేస్తున్నారు. గుకేశ్‌తో పాటు టోర్నీల కోసం ప్రయాణించేందుకు ఆయన చాలాసార్లు తన వృత్తిని పక్కన పెట్టి మరీ కొడుకు కోసం సమయం కేటాయించాల్సి వచ్చిందనేది వాస్తవం.‘పిల్లలను పోషించడం తల్లిదండ్రుల బాధ్యత. వారి పిల్లలు అభివృద్ధిలోకి వచ్చేలా పేరెంట్స్ కాక ఇంకెవరు శ్రమపడతారు! నేను గుకేశ్‌లో ప్రతిభను గుర్తించాను. అందుకు కొంత సమయం పట్టింది. ఒక్కసారి అది తెలిసిన తర్వాత అన్ని రకాలుగా అండగా నిలిచాం. నాకు టెన్నిస్ అంటే పిచ్చి. దాంతో మా అబ్బాయిని అందులోనే చేర్పిద్దాం అనుకున్నాను. కానీ బాబు చెస్‌లో ఆసక్తి చూపిస్తున్నాడని నా భార్య చెప్పింది.ప్రధాని మోదీ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌తో..అంతే.. ప్రోత్సహించేందుకు మేం సిద్ధమైపోయాం. చెన్నై చుట్టుపక్కల ఎన్ని టోర్నీలు జరుగుతాయి, ఎలాంటి శిక్షణావకాశాలు ఉన్నాయి, వేరే నగరాలకు వెళ్లి ఎలా ఆడాలి.. ఇలా అన్నీ తెలుసుకున్నాం.. ప్రోత్సహించాం.. అబ్బాయి చదరంగ ప్రస్థానం మొదలైంది’ అని రజినీకాంత్ అన్నారు. గుకేశ్ క్యాండిడేట్స్ గెలిచిన సమయంలో అతని పక్కనే ఉన్న ఆ తండ్రి ఆనందం గురించి వర్ణించేందుకు మాటలు సరిపోవు. విజయానంతరం చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో దిగినప్పుడు గుకేశ్‌ను హత్తుకొని తల్లి కళ్లు చెమర్చాయి.అంచనాలకు అందకుండా రాణించి..కొన్నాళ్ల క్రితం వరకు కూడా క్యాండిడేట్స్ టోర్నీకి గుకేశ్ అర్హత సాధించడం సందేహంగానే కనిపించింది. వరుసగా కొన్ని అనూహ్య పరాజయాలతో అతను వెనకబడ్డాడు. చివరకు చెన్నై గ్రాండ్‌మాస్టర్స్ టోర్నీ గెలవడంతో అతనికి అవకాశం దక్కింది. అయితే టోర్నీకి ముందు.. గుకేశ్ గెలవడం కష్టమంటూ చెస్ దిగ్గజం మాగ్నస్ కార్ల్సన్ చేసిన వ్యాఖ్య తనపై కాస్త సందేహాన్ని రేకెత్తించింది. అంచనాలు అన్నీ నిజం కావు కానీ కార్ల్సన్ చెప్పడంతో మనసులో ఎక్కడో ఒక మూల కాస్త సంశయం.సాధారణంగా గుకేశ్ టోర్నీలు ఆడే సమయంలో ప్రతి రోజూ రెండుసార్లు తన తల్లికి ఫోన్ చేసేవాడు. గేమ్ ఓడినప్పుడైతే ఇంకా ఎక్కువసేపు మాట్లాడాలని కోరేవాడు. అప్పుడా అమ్మ.. తన కొడుకుకి.. క్రీడల్లో పరాజయాలు ఎదురైనా మొక్కవోని దీక్షతో మళ్లీ సత్తా చాటి పైకెగసిన పలువురు దిగ్గజ క్రీడాకారుల గురించి చెబుతూ స్ఫూర్తినింపేది. ఆ ప్రయత్నం ఇటీవల రెండు సార్లు ఫలితాన్నిచ్చింది. క్యాండిడేట్స్‌కు అర్హత సాధించడానికి ముందు ఓటములు ఎదురైనప్పుడు మళ్లీ అతను ఆత్మవిశ్వాసం సాధించి పట్టుదలగా బరిలోకి దిగేందుకు ఇది ఉపకరించింది.రెండోసారి ఈ మెగా టోర్నీలో ఏడో రౌండ్లో అలీ రెజా చేతిలో ఓటమి తర్వాత అమ్మ మాటలు మళ్లీ ప్రభావవంతంగా పనిచేశాయి. గుకేశ్ స్వయంగా చెప్పినట్లు ఆ ఓటమే తన విజయానికి టర్నింగ్ పాయింట్‌గా మారింది. క్యాండిడేట్స్ టోర్నీ 14 రౌండ్లలో ఈ ఒక్క గేమ్‌లోనే ఓడిన అతను ఆ తర్వాత తిరుగులేకుండా దూసుకుపోయాడు. గుకేశ్ వాళ్లమ్మ మాటల్లో చెప్పాలంటే.. గతంలో టోర్నీలో ఒక మ్యాచ్ ఓడితే ఆ తర్వాతి రౌండ్లలో అతని ఆట మరింత దిగజారేది. పూర్తిగా కుప్పకూలిపోయేవాడు. కానీ ఇప్పుడు గుకేశ్ ఎంతో మారిపోయాడు. నిజానికి 17 ఏళ్ల వయసులో ఇంత పరిపక్వత అంత సులువుగా రాదు. ఒక ఓటమి నుంచి పాఠాలు నేర్చుకొని మళ్లీ సమరోత్సాహంతో బరిలోకి దిగడాన్ని అతను నేర్చుకున్నాడు.ఆత్మవిశ్వాసంతో..గుకేశ్ గతంలో ఏ ప్రశ్ననైనా అవును, కాదు అంటూ రెండేరెండు జవాబులతో ముగించేవాడు. కానీ ఇప్పుడు విజయాలు తెచ్చిన ఆత్మవిశ్వాసం అతని వ్యక్తిత్వంలోనూ ఎంతో మార్పు తెచ్చింది. క్యాండిడేట్స్‌కు అర్హత సాధించడానికి ముందు అతనికి 24 గంటలూ చెస్ ధ్యాసే. మరో జీవితమే లేకుండా పోయింది. కానీ టోర్నీ సన్నాహకాల్లో భాగంగా అతను చెస్‌తో పాటు ఇతర అంశాల్లో కూడా సమయం వెచ్చించాడు. యోగా, టెన్నిస్ ఆడటం, సినిమాలు, మిత్రులను కలవడం, తగినంత విశ్రాంతి.. ఇలా అన్ని రకాలుగా అతను తనను తాను మలచుకున్నాడు. ఈ కీలక మార్పు కూడా అతని విజయానికి ఒక కారణమైంది.తల్లిదండ్రులతో..ఒత్తిడిని అధిగమించి..గుకేశ్‌కు ఇది తొలి క్యాండిడేట్స్ టోర్నీ. ఈ టోర్నీలో అతను అందరికంటే చిన్నవాడు కూడా. ప్రత్యర్థుల్లో కొందరు నాలుగు లేదా ఐదుసార్లు ఈ టోర్నమెంట్లో ఆడారు. రెండుసార్లు విజేతైన ఇవాన్ నెపొమినియాచి కూడా ఉన్నాడు. కానీ వీరందరితో పోలిస్తే గుకేశ్ ఒత్తిడిని సమర్థంగా అధిగమించాడు. పైగా ఇందులో రెండో స్థానం వంటి మాటకు చాన్స్ లేదు. అక్కడ ఉండేది ఒకే ఒక్క విజేత మాత్రమే.‘టొరంటోకు నేను ఒకే ఒక లక్ష్యంతో వెళ్లాను. టైటిల్ గెలవడం ఒక్కటే నాకు కావాల్సింది. ఇది అంత సులువు కాదని నాకు తెలుసు. నా వైపు నుంచి చాలా బాగా ఆడాలని పట్టుదలగా ఉన్నాను. ప్రత్యర్థులతో పోలిస్తే నా ఆటలో కూడా ఎలాంటి లోపాలు లేవనిపించింది. అందుకే నన్ను నేను నమ్మాను’ అని గుకేశ్ చెప్పాడు. అయితే గుకేశ్ తల్లిదండ్రులు మాత్రం అతని విజయంపై అతిగా అంచనాలు పెట్టుకోలేదు. ఇక్కడి అనుభవం.. వచ్చే క్యాండిడేట్స్ టోర్నీకి పనికొస్తే చాలు అని మాత్రమే తండ్రి అనుకున్నారు. కానీ వారి టీనేజ్ అబ్బాయి తల్లిదండ్రుల అంచనాలను తారుమారు చేశాడు.అండర్ 12 వరల్డ్ చాంపియన్‌గా.. , క్యాండిడేట్స్ టోర్నీ గోల్డ్ మెడల్‌తో.. సవాల్‌కు సిద్ధం..గుకేశ్ ఐదేళ్ల క్రితం 12 ఏళ్ల 7 నెలల 17 రోజుల వయసులో గ్రాండ్‌మాస్టర్ హోదా సాధించి ఆ ఘనతను అందుకున్న రెండో అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. దానికే పరిమితం కాకుండా ఒక్కో మెట్టు ఎక్కుతూ జూనియర్ నుంచి సీనియర్ స్థాయి వరకు సరైన రీతిలో పురోగతి సాధిస్తూ వరుస విజయాలు అందుకున్నాడు.ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అత్యుత్తమంగా 8వ స్థానానికి చేరిన అతను 2700 ఎలో రేటింగ్ (ప్రస్తుతం 2743) దాటిన అరుదైన ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు. వేర్వేరు వ్యక్తిగత టోర్నీలు గెలవడంతో పాటు ఆసియా క్రీడల్లో భారత జట్టు రజతం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. 2022లో జరిగిన చెస్ ఒలింపియాడ్‌లో తొలి 8 గేమ్‌లలో ఎనిమిదీ గెలిచి ఎవరూ సాధించని అరుదైన రికార్డును సాధించాడు. వరల్డ్ చాంపియన్‌షిప్ టైటిల్ కోసం ప్రస్తుత విజేత, చైనాకు చెందిన డింగ్ లారెన్తో గుకేశ్ తలపడతాడు.31 ఏళ్ల డింగ్‌కు మంచి అనుభవం ఉంది. 2800 రేటింగ్ దాటిన ఘనత పొందిన అతను చైనా చెస్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఆటగాడు. ఒక దశలో వరుసగా 100 గేమ్‌లలో ఓటమి ఎరుగని రికార్డు అతనిది. అయితే ఇప్పుడు గుకేశ్ చూపిస్తున్న ఆట, ఆత్మవిశ్వాసం, సాధన కలగలిస్తే డింగ్ని ఓడించడం అసాధ్యమేమీ కాదు. — మొహమ్మద్ అబ్దుల్ హాది
బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
తొలి ఎనిమిది మ్యాచ్‌లలో ఒక విజయం, ఏడు పరాజయాలు... అంతా లెక్కలోంచి తీసేసిన వేళ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పుంజుకుంది. ప్రత్యర్థి వేదికపై గత రెండు మ్యాచ్‌లు గెలిచిన ఆర్సీబీ ఇప్పుడు సొంతగడ్డపై చెలరేగి విజయాల ‘హ్యాట్రిక్’ సాధించింది. పట్టికలో మూడు స్థానాలు ఎగబాకి పదినుంచి ఏడుకు చేరింది. అయితే తాజా విజయంలో కాస్త ఉత్కంఠను పెంచి చివరకు గెలుపుతీరం చేరింది. ముందుగా తమ పేలవ ఆటను కొనసాగిస్తూ టైటాన్స్ 147 పరుగులకే పరిమితమైంది. సులువైన ల„ ్యాన్ని ఛేదించే క్రమంలో ఆర్సీబీ స్కోరు 92/0...ఇక మిగిలింది లాంఛనమే అనుకున్న తరుణంలో 25 పరుగుల వ్యవధిలో 6 వికెట్లు పడ్డాయి. కానీ తడబాటును అధిగమించి మరో 38 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. బెంగళూరు: చిన్నస్వామి మైదానంలో అభిమానులకు ఆర్సీబీ ఆనందం పంచింది. శనివారం జరిగిన కీలక పోరులో బెంగళూరు 4 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ 19.3 ఓవర్లలో 147 పరుగులకే ఆలౌటైంది. షారుఖ్ ఖాన్ (24 బంతుల్లో 37; 5 ఫోర్లు, 1 సిక్స్), రాహుల్ తెవాటియా (21 బంతుల్లో 35; 5 ఫోర్లు, 1 సిక్స్), డేవిడ్ మిల్లర్ (20 బంతుల్లో 30; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) జట్టు స్కోరులో తలా ఓ చేయి వేశారు. అనంతరం బెంగళూరు 13.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. ఫాఫ్ డుప్లెసిస్ (23 బంతుల్లో 64; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు), విరాట్ కోహ్లి (27 బంతుల్లో 42; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) తొలి వికెట్‌కు 35 బంతుల్లోనే 92 పరుగులు జోడించి విజయాన్ని సులువు చేశారు. జోష్ లిటిల్‌కు 4 వికెట్లు దక్కాయి. టపటపా... సిరాజ్ బౌలింగ్ ధాటికి గుజరాత్ బ్యాటింగ్ ఆరంభంలోనే తడబడింది. తన తొలి రెండు ఓవర్లలో సాహా (1), గిల్ (2)లను సిరాజ్ అవుట్ చేయగా, సుదర్శన్ (6)ను గిల్ వెనక్కి పంపించాడు. దాంతో పవర్‌ప్లేలో గుజరాత్ 23 పరుగులకే పరిమితమైంది. ఈ దశలో షారుఖ్, మిల్లర్ కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ మిల్లర్‌ను అవుట్ చేసి ఈ 61 పరుగుల భాగస్వామ్యానికి కరణ్ తెర దించగా...లేని పరుగు కోసం ప్రయత్నించి షారుఖ్ రనౌట్ కావడంతో పరిస్థితి మళ్లీ మారిపోయింది. ఆ తర్వాత తెవాటియా కాస్త దూకుడుగా ఆడటంతో గుజరాత్ ఈ మాత్రం స్కోరైనా సాధించగలిగింది. కరణ్ శర్మ వేసిన 16వ ఓవర్లో తెవాటియా వరుసగా 4, 6, 4, 4 బాదాడు. యశ్ దయాళ్ ఒకే ఓవర్లో రషీద్ (18), తెవాటియాను అవుట్ చేసి దెబ్బ కొట్టగా...వైశాక్ వేసిన ఆఖరి ఓవర్ తొలి మూడు బంతుల్లో ఒకే స్కోరు వద్ద గుజరాత్ మూడు వికెట్లు కోల్పోయింది. మెరుపు భాగస్వామ్యం... ఛేదనలో బెంగళూరు చెలరేగిపోయింది. ఓపెనర్లు కోహ్లి, డుప్లెసిస్ బౌండరీలు బాదుతూ వేగంగా లక్ష్యం దిశగా సాగిపోయారు. మోహిత్ వేసిన తొలి ఓవర్లో కోహ్లి 2 సిక్స్‌లు కొట్టగా, లిటిల్ వేసిన తర్వాతి ఓవర్లో డుప్లెసిస్ 3 ఫోర్లు, సిక్స్ కొట్టాడు. మానవ్ వేసిన తర్వాతి ఓవర్లోనూ సిక్స్, ఫోర్ కొట్టిన డుప్లెసిస్...మోహిత్ ఓవర్లో 4 ఫోర్లు బాది 18 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. మానవ్ ఓవర్లో కోహ్లి 2 సిక్స్‌లు కొట్టగా...లిటిల్ వేసిన తర్వాతి ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ బాది అదే జోరులో డుప్లెసిస్ అవుటయ్యాడు. 6 ఓవర్లు ముగిసే సరికి 92 పరుగులు సాధించిన ఆర్సీబీ...ఐపీఎల్లో తమ అత్యుత్తమ పవర్‌ప్లే స్కోరును నమోదు చేసింది. అయితే డుప్లెసిస్ వెనుదిరిగిన తర్వాత బ్యాటింగ్ బృందం తడబడింది. కొంత ఉత్కంఠ నెలకొన్నా... దినేశ్ కార్తీక్ (12 బంతుల్లో 21 నాటౌట్; 3 ఫోర్లు), స్వప్నిల్ సింగ్ (9 బంతుల్లో 15 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ఏడో వికెట్‌కు అభేద్యంగా 35 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. స్కోరు వివరాలు గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాహా (సి) కార్తీక్ (బి) సిరాజ్ 1; గిల్ (సి) వైశాక్ (బి) సిరాజ్ 2; సుదర్శన్ (సి) కోహ్లి (బి) గ్రీన్ 6; షారుఖ్ (రనౌట్) 37; మిల్లర్ (సి) మ్యాక్స్‌వెల్ (బి) కరణ్ 30; తెవాటియా (సి) వైశాక్ (బి) దయాళ్ 35; రషీద్ (బి) దయాళ్ 18; విజయ్‌శంకర్ (సి) సిరాజ్ (బి) వైశాక్ 10; మానవ్ (సి) స్వప్నిల్ (బి) వైశాక్ 1; మోహిత్ (రనౌట్) 0; నూర్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (19.3 ఓవర్లలో ఆలౌట్) 147. వికెట్ల పతనం: 1–1, 2–10, 3–19, 4–80, 5–87, 6–131, 7–136, 8–147, 9–147, 10–147. బౌలింగ్: స్వప్నిల్ సింగ్ 1–0–1–0, సిరాజ్ 4–0–29–2, యశ్ దయాళ్ 4–0–21–2, గ్రీన్ 4–0–28–1, విజయ్‌కుమార్ వైశాక్ 3.3–0–23–2, కరణ్ శర్మ 3–0–42–1. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: కోహ్లి (సి) సాహా (బి) నూర్ 42; డుప్లెసిస్ (సి) షారుఖ్ (బి) లిటిల్ 64; జాక్స్ (సి) షారుఖ్ (బి) నూర్ 1; పటిదార్ (సి) మిల్లర్ (బి) లిటిల్ 2; మ్యాక్స్‌వెల్ (సి) మిల్లర్ (బి) లిటిల్ 4; గ్రీన్ (సి) షారుఖ్ (బి) లిటిల్ 1; కార్తీక్ (నాటౌట్) 21; స్వప్నిల్ (నాటౌట్) 15; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (13.4 ఓవర్లలో 6 వికెట్లకు) 152 వికెట్ల పతనం: 1–92, 2–99, 3–103, 4–107, 5–111, 6–117. బౌలింగ్: మోహిత్ శర్మ 2–0–32–0, జోష్ లిటిల్ 4–0–45–4, మానవ్ సుథర్ 2–0–26–0, నూర్ అహ్మద్ 4–0–23–2, రషీద్ ఖాన్ 1.4–0–25–0. ఐపీఎల్లో నేడుపంజాబ్ X చెన్నైవేదిక: ధర్మశాలమధ్యాహ్నం 3: 30 గంటల నుంచిలక్నో X కోల్‌కతావేదిక: లక్నోరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం
గాయంతో ఐపీఎల్ మిగతా మ్యాచ్‌కు మయాంక్ దూరం
పదునైన పేస్ బౌలింగ్‌తో ఈ ఐపీఎల్లో వెలుగులోకి వచ్చిచన మయాంక్ యాదవ్ మిగతా సీజన్‌కు దూరమయ్యాడు. పక్కటెముకల గాయంతో బాధపడుతున్న ఈ లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ మిగిలిన మ్యాచ్‌లు ఆడే అవకాశం లేదని జట్టు కోచ్ జస్టిన్ లాంగర్ వెల్లడించాడు. తొలిసారి ఐపీఎల్ బరిలోకి దిగిన 21 ఏళ్ల మయాంక్ తొలి రెండు మ్యాచ్‌లలో అద్భుత ప్రదర్శన కనబర్చాడు. లక్నో విజయాల్లో కీలక పాత్ర పోషించి ఐపీఎల్లో ఆడిన తొలి రెండు మ్యాచ్‌లలో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచిన తొలి ఆటగాడిగా నిలిచాడు. ప్రతీ మ్యాచ్‌లో 150 కిలోమీటర్లకు పైగా వేగంతో బౌలింగ్ చేస్తూ సత్తా చాటిన అతను గాయంతో మూడో మ్యాచ్ మధ్యలో తప్పుకున్నాడు. ఆ తర్వాత లక్నో ఆడిన ఐదు మ్యాచ్‌లకు దూరమైన అతను కోలుకొని ముంబైతో మ్యాచ్‌లో మళ్లీ బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్‌లో తన నాలుగో ఓవర్లో ఒక బంతి వేయగానే గాయం తిరగబెట్టడంతో మెదానం వీడాడు. లక్నో ప్లే ఆఫ్స్‌కు చేరితే మయాంక్ ఆడే అవకాశాలు ఉన్నాయని భావించినా... ఇప్పుడు ఆ అవకాశం లేదని తేలిపోయింది.
బిజినెస్
దేశమంతా నిరాశ.. అక్కడ మాత్రం ఊరట!
దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఈరోజు కొనుగోలుదారులను నిరాశకు గురి చేశాయి. క్రితం రోజున భారీగా తగ్గి ఆనందం కలిగించిన బంగారం ధరలు ఈరోజు (మే 4) మళ్లీ స్వల్పంగా ఎగిశాయి.హైదరాబాద్, విశాఖపట్నం సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.100 పెరిగి రూ.65,850 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల బంగారం కూడా రూ.100 పెరిగి రూ. 71,830 లను తాకింది.ఇతర ప్రధాన నగరాల్లో ఇలా..➤ ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.100 ఎగిసి రూ.66,000 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.100 పెరిగి రూ.71,980 లకు చేరింది. ➤ ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.100 పెరిగి రూ.65,850 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల స్వర్ణం రూ.100 పెరిగి రూ.71,830 వద్దకు ఎగిసింది.➤ బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.100 పెరిగి రూ.65,850 వద్దకు, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం రూ.100 ఎగిసి రూ.71,830 లకు చేరుకుంది.చెన్నైలో తగ్గింపుదేశమంతా ఇతర ప్రధాన నగరాల్లో బంగారం ధరలు పెరుగుదలను చూడగా చెన్నైలో మాత్రం కాస్త తగ్గి కొనుగోలుదారులకు ఊరట కలిగించాయి. ఇక్కడ 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.150 తగ్గి రూ.66,000 లకు చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం రూ.160 తగ్గి రూ.72,000 లకు దిగొచ్చింది.
పాతదాన్ని తుక్కుగా మారిస్తే కొత్త వాహనానికి రాయితీ..ఎంతంటే..
కాలంచెల్లిన వాహనాలను తుక్కుగా మార్చి వాటిస్థానంలో కొత్త వాటిని కొనుగోలు చేసే వారికి ప్రభుత్వం ప్రోత్సాహకాలను ప్రకటించింది. వెహికల్ స్క్రాపేజ్ పాలసీ ప్రకారం..పాత వ్యక్తిగత వాహనాన్ని తుక్కుగా మార్చి కొత్తది కొనుగోలు చేయాలనుకునే వారు వాహన ధరలో లేదా రోడ్డు పన్నులో 25 శాతం వరకు రాయితీ పొందవచ్చు. అదే వాణిజ్య వాహనాలకు 15 శాతం రాయితీ పొందే వీలుంది.ఫిట్నెస్ లేని, కాలం చెల్లిన వాహనాలను దశలవారీగా తొలగించి వాయు కాలుష్యాన్ని తగ్గించడం, ఆటోమొబైల్ రంగాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా ఈ స్క్రాపేజ్ విధానాన్ని తీసుకొచ్చారు. భారతీయ రోడ్లపై గత 15 ఏళ్లగా 5 కోట్ల ప్రైవేట్ మోటారు వాహనాలు రోడ్లపై తిరుగుతున్నాయని అంచనా. దాంతో గణనీయమైన వాయు కాలుష్యం ఏర్పడుతోంది. కాలంచెల్లిన ఈ వాహనాలను తుక్కుగా మార్చాల్సి ఉంటుంది. వాహనదారులు తిరిగి కొత్తవాటిని కొనుగోలు చేసేలా వారికి ప్రోత్సాహకాలు, రాయితీలు అందిస్తున్నారు. ఇప్పటికే ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు.తుక్కుగా మార్చిన వాహనం విలువలో 10-25శాతం కొత్త వాహన ధరల్లో లేదా రోడ్డు పన్ను చెల్లింపులో రాయితీ ఇస్తున్నట్లు ప్రభుత్వం చెప్పింది. వాణిజ్య, ప్రైవేట్ వాహనాలకు వేర్వేరు కాలాలు నిర్ణయించారు. ప్రభుత్వ వెహికల్ స్క్రాపింగ్ విధానం ప్రకారం.. పెట్రోల్ లేదా డీజిల్ ఇంధనంతో నడిచే వ్యక్తిగత వాహనాలను 15 ఏళ్ల తర్వాత మళ్లీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తిరిగి రెన్యువల్ అయిన తర్వాత 5 ఏళ్లు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. 20 ఏళ్ల తర్వాత వాహనాన్ని వినియోగించాలనుకుంటే ప్రతి ఐదేళ్లకు ఒకసారి తప్పనిసరిగా ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోవాలి. ఇదీ చదవండి: అగ్ని ప్రమాదం.. చిన్నపాటి ఖర్చుతో మరింత భద్రం!దిల్లీ-ఎన్సీఆర్కు ఈ నిబంధనల్లో మార్పులున్నాయి. అక్కడ పెట్రోల్ వాహనాలకు గరిష్ట వయోపరిమితి 15 ఏళ్లు కాగా, డీజిల్ వాహనాలకు గరిష్ట వయోపరిమితి 10 ఏళ్లు. దిల్లీ రోడ్లపై పరిమితికి మించి పాత కారు కనిపిస్తే రూ.10,000 చెల్లించాల్సి ఉంటుంది. దాంతోపాటు ఆ వాహనాన్ని నేరుగా స్క్రాపింగ్ కోసం పంపించాలి.
Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ కంపెనీలలో లేఆఫ్‌ల పరంపర కొనసాగుతూనే ఉంది. ఆర్థిక అనిశ్చితి, ప్రాజెక్ట్‌లు తగ్గిపోవడం వంటి కారణాలతో ఖర్చులు తగ్గించుకునేందుకు అనేక కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. టెక్ కంపెనీల్లో లేఆఫ్‌లకు సంబంధించి షాకింగ్ రిపోర్ట్ ఒకటి వెల్లడైంది. ఒక్క ఏప్రిల్ నెలలోనే 21 వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించాయి టెక్ కంపెనీలు.layoffs.fyi ప్రచురించిన తాజా డేటా ప్రకారం.. టెక్నాలజీ రంగంలోని 50 కంపెనీల నుండి ఒక్క ఏప్రిల్ నెలలోనే 21,473 మంది ఉద్యోగులు ఉద్వాసనకు గురయ్యారు. ఈ ఏడాది లేఆఫ్‌ల ధోరణికి ఏప్రిల్ నెల తొలగింపులు అద్దం పడుతున్నాయి. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి కనీసం ఇప్పటి వరకూ 271 కంపెనీలు 78,572 మంది ఉద్యోగులను తొలగించాయి. జనవరిలో 122 కంపెనీలలో 34,107 ఉద్యోగాల కోతలు జరిగాయి. ఫిబ్రవరిలో 78 కంపెనీలు 15,589 మందిని తొలగించాయి. ఇక మార్చిలో 37 కంపెనీల్లో 7,403 మంది ఉద్యోగాలను కోల్పోయారు. మార్చి నుంచి ఏప్రిల్‌కు ఒక్క నెలలో ఉద్యోగుల తొలగింపులు మూడు రెట్లు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.ఏప్రిల్‌లో టెక్ తొలగింపులుయాపిల్ ఇటీవల 614 మంది ఉద్యోగులను తొలగించింది. ఇది మొదటి ప్రధాన రౌండ్ ఉద్యోగ కోత.పైథాన్, ఫ్లట్టర్, డార్ట్‌లో పనిచేస్తున్న వారితో సహా వివిధ టీమ్‌లలో గణనీయమైన సంఖ్యలో ఉద్యోగులను గూగుల్ తొలగించింది.అమెజాన్ క్లౌడ్ కంప్యూటింగ్ విభాగంలో వందలాది ఉద్యోగాలను తగ్గించింది.ఇంటెల్ దాని ప్రధాన కార్యాలయంలోని దాదాపు 62 మంది ఉద్యోగులను లేఆఫ్ చేసింది. ఎడ్టెక్ కంపెనీ బైజూస్ సుమారు 500 మంది ఉద్యోగులను తొలగించింది.ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా అత్యధికంగా 14 వేల మందిని లేఆఫ్ చేసింది.ఓలా క్యాబ్స్ దాదాపు 200 ఉద్యోగాలను తొలగించింది. హెల్త్ టెక్ స్టార్టప్ హెల్తీఫైమ్ దాదాపు 150 మంది ఉద్యోగులను తొలగించింది. గృహోపకరణాలను తయారు చేసే వర్ల్‌పూల్ సుమారు 1,000 మందిని లేఆఫ్ చేసింది.టేక్-టూ ఇంటరాక్టివ్ కంపెనీ తమ వర్క్‌ఫోర్స్‌లో దాదాపు 5% మందిని తొలగించింది. నార్వేలోని టెలికాం కంపెనీ టెలినార్ 100 మంది ఉద్యోగులను తొలగించింది.
అగ్ని ప్రమాదం.. చిన్నపాటి ఖర్చుతో మరింత భద్రం!
రూ.లక్షలు ఖర్చుపెట్టి ఇల్లు కట్టుకుంటాం. నచ్చిన విధంగా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసుకుంటాం. భద్రంగా ఉండేలా ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం. అనుకోకుండా అగ్ని ప్రమాదం జరిగితే విలువైన వస్తువులు కాలిపోవడంతోపాటు కొన్నిసార్లు మనుషుల ప్రాణాలు పోవచ్చు. ఫైరింజన్ సిబ్బందికి సమాచారం అందించినా వారు వచ్చేలోపు ప్రమాదం మరింత తీవ్రస్థాయికి చేరవచ్చు. అసలే వేసవికాలం ఇలాంటి ప్రమాదాలకు ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఇళ్లు నిర్మించుకున్న తర్వాత కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మరింత రక్షణగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇంటితోపాటు కంపనీలు, షాపింగ్‌మాల్స్, భవనాల్లో తప్పకుండా ఫైర్ ఎక్స్టింగ్విషర్లు ఉపయోగించాలంటున్నారు. వీటికోసం చేసే చిన్నపాటి ఖర్చుతో ఇంటికి మరింత భద్రత కల్పించవచ్చని చెబుతున్నారు. వాటిని ఎంచుకునేముందు కనీస అవగాహన తప్పనిసరని అభిప్రాయపడుతున్నారు.మంటలను ఆర్పేందుకు ఉపయోగించే ఫైర్ ఎక్స్టింగ్విషర్లు చాలా రకాలుగా ఉంటాయి.స్టాండర్డ్ వాటర్: కాగితం, కార్డ్బోర్డ్, ప్లాస్టిక్, కలప, ఫ్యాబ్రిక్‌కు అంటిన మంటలను అదుపు చేయవచ్చు.డ్రైవాటర్ మిస్ట్: నీటి రేణువులను పొడి సూక్ష్మకణాలుగా మార్చి మంటపై చల్లుతుంది.వెట్ కెమికల్: మంటలపై సబ్బు ద్రావణాన్ని చల్లుతుంది. కొవ్వులు, వంట నూనెల వల్ల సంభవించే మంటలను అదుపు చేయవచ్చు. పౌడర్: పెట్రోల్, డీజిల్, గ్యాసోలిన్ నుంచి వచ్చే మంటలు, మీథేన్, ప్రొపేన్, బ్యూటేన్ వంటి వాయువుల వల్ల ఏర్పడే వాటినిక ఆర్పవచ్చు. కార్బన్ డైయాక్సైడ్: పెట్రో ఉత్పత్తులు, విద్యుత్తు వల్ల కలిగే మంటలు తగ్గించవచ్చు.వాటర్ మిస్ట్ టైప్ ఫైర్: వరండాలు, వంట గదిలో వాడుకోవచ్చు. ఇది మంటపై నీటిని స్ప్రే చేస్తుంది.
వీడియోలు
టీడీపీది కావాలనే దుష్టప్రచారం..
బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్
లీడర్ VS చీటర్స్
ముస్లిం రిజర్వేషన్లపై చంద్రబాబుకు సీఎం జగన్ సవాల్
పారిపోయిన సీఎం రమేష్
IVRS కాల్స్ ద్వారా టీడీపీ బెదిరింపులు రంగంలోకి సీఐడీ..
చంద్రబాబును ఏకిపారేసిన కొడాలి నాని..
కూటమి మేనిఫెస్టో కాదు...టీడీపీ మేనిఫెస్టో..
సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..
గడప గడపకు వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం
ఫ్యామిలీ
టిష్యూ బ్రెడ్..అచ్చం రుమాలి రోటీ లా..!
బ్రెడ్లలో వెరైటీ వెరైటీలను చూశాం. అలాగే వాటితో తయారు చేసే రకరకాల వంటకాలను కూడా చూశాం. కానీ బ్రెడ్‌ని ఏదో టిష్యూ పేపర్ అంతా లైట్‌వైట్‌గా పల్చగా ఉండే బ్రెడ్‌ని చూశారా. అసలు దీన్ని చూడగానే అలా ఎలా చేశారా అని ఆశ్చర్యపోతారు. అందుకు సంబంధించిన ఒక వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దక్షిణ కొరియా ఈ టిష్యూ బ్రెడ్‌ని తయారు చేసి అమ్మేస్తుంది. ఇది భారత్‌లో ఉండే రుమాలీ రోటీ మాదిరిగా ఉంది. అక్కడ బేకరి వాళ్లు టిష్యు బ్రెడ్‌లా పలచటి పొరలాంటి స్లైస్‌లు మాదిరిగా వచ్చేందుకు ప్రత్యేకమైన పిండిని ఉపయోగిస్తుంది. కాల్చేటప్పుడు సాధారణ బ్రెడ్లానే ఉంటుంది. కానీ స్లైస్‌లు మాత్రం టిష్యూలు మాదిరిగా ఉంటాయి. చూసేందుకు చక్కని ఆకృతిలో ఉండి తియ్యటి రుచిని కలిగి ఉంటాయట. వెన్న రాస్తే వచ్చే పొరలమాదిరిగా అతి సున్నితంగా ఉన్నాయి ఆ బ్రెడ్ స్లైస్‌లు. అందువల్ల దీన్ని రుమాలీ రోటీతో పోల్చారు. ఎందుకంటే రుమాలీ పల్చటి పెద్ద రోటీలా ఉంటుంది. నోట్లో వేసుకుంటే ఈజీగా కరిపోయేలా ఉంటుంది. నిజానికి ఈ రుమాలీ రోటీ మొఘల్ యుగం నుంచి ప్రసిద్ధి చెందాయి. పాకిస్థాన్‌లో కూడా ఈ రోటీలు బాగా ఫేమస్. వీటిని వాళ్లు లాంబూ రోటీలు అని పిలుస్తారు. పంజాబీలో దీని అర్థం పొడవైనది అని. ఆ తర్వాత ఈ రుమాలీ రోటీల్లో రకరకాల స్పైసీ కర్రీని ఉంచి రోల్ చేసి తయారు చేసే వివిధ రెసీపీలు తయారు చేయడం మొదలు పెట్టారు. నిజానికి నాటి చెఫ్‌లు అదనప్పు నూనెను పీల్చుకునేందుకు ఈ రుమాలీ రోటీలు ఉపయోగించేవారట. ఇక నాటి రాజులు కూడా ఈ రోటీలను చేతి రుమాలు మాదిరిగా భోజనం తర్వాత చేతులను శుభ్రం చేయడానికి వినియోగించేవారట. ఆ తర్వాత క్రమేణ అదే తినేవంటకంగా రూపాంతరం చెందిందని పాకశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. View this post on Instagram A post shared by 마이시즌|미식 공간 소개 (@my_season___) (చదవండి: పెళ్లి రోజున ఇలాంటి గిఫ్ట్‌లు కూడా ఇస్తారా!..ఊహకే రాని బహుమతి!)
మధిర టు తిరుపతి.. ‘సారూ.. ఆ రైలేదో చెబితే ఎక్కుదామని..!'
‘సారూ..’ అన్న శబ్దం నా చెవి గూబను కాస్త గట్టిగానే చరిచింది. నా భార్యతో మాటలకు మధ్యలో కామా పెట్టి, ఎవరాని అటు దిరిగి చూశాను. వయస్సు అర్ధసెంచరీకి అవతలిగట్టు. అరవై ఏళ్లవరకూ ఉండొచ్చు. మాసిన చొక్కాకు అక్కడక్కడా చిన్నపాటి చిరుగులు. కింద లుంగీ.. ఇంకొంచెం పెద్ద చిరుగులతో చొక్కాను డామినేట్ చేస్తోంది. నెత్తిన జుట్టు దుమ్మును పులుముకొని చిందరవందరగా వుంది. కుడికాలికి పిక్క మునిగే వరకు కట్టు. కట్టుకట్టి చాలారోజులైందన్నట్టు తెల్లటి కట్టు మట్టి పులుముకొని కనిపించింది. మనిషిని చుట్టుముట్టిన పేదరికం ఛాయలు.‘ఏంటన్నట్లు?’ అతనివైపు చూశాను. ‘సారూ.. నేను హైదరాబాద్‌కు పొయ్యే రైలెక్కాలి. ఆ రైలేదో చెబితే ఎక్కుదామని..!’ బతిమిలాడుతున్నట్లు మాట, అభినయం. ‘సరే చెబుతా! అక్కడ కూర్చోనుండు’ పక్కనే ఉన్న అరుగు చూపించి అన్నాను. ‘మర్చిపోవద్దు సారూ.. నీ కాళ్లు మొక్కుతా’ అంటూ మరింత దగ్గరగా వచ్చి నా కాళ్లపైకి వంగాడు.అతన్నుంచి జారి మందు వాసన నా ముక్కు పుటాలను తాకింది.ముఖం చిట్లించి ‘చెప్పాను కదా.. అక్కడ కూర్చో, రైలొచ్చినప్పుడు చెబుతా’ కాస్త విసుగ్గా అన్నాను.‘గట్లనే సారూ ..’ రెండడుగులు వెనక్కువేసి నిలుచున్నాడు.నేను, నా భార్య హైదరాబాద్ వెళ్లేందుకు బాపట్ల రైల్వేస్టేషన్ లో రైలు కోసం వెయిట్ చేస్తున్నాము. మా కూతురు, అల్లుడు హైదరాబాదులో కాపురంపెట్టి నెలన్నర. ప్రసవం పూర్తయి బిడ్డకు జన్మనిచ్చాక అయిదవ నెల వచ్చేవరకు కూతురు గాయత్రి మాతోనే ఉంది. అప్పటికే మనవడు గిర్వాన్ కాస్త వొళ్లుచేశాడు. కాళ్లు, చేతులు హుషారుగా ఆడించడం, కనుగుడ్లు పెద్దవిచేసి చూడడం, బోర్లా తిరగడం, మనం నవ్వితే.. నిశితంగా పరిశీలించి నవ్వడం, హెచ్చరికలకు స్పందించడం మొదలు పెట్టాడు.మనవడి మురిపెంలో అయిదు నెలలు అయిదు రోజుల్లా గడిచాయి. అల్లుడిది ప్రైౖవేటు కంపెనీలో ఉద్యోగం. తానెలాగోలా బాబును సగదీరుకుంటానని చెప్పి కూతురు హైదరాబాద్‌కు వెళ్లిపోయింది. మనవడి జ్ఞాపకాలు మరువలేక బుడ్డోన్ని చూడాలని నా శ్రీమతి తహతహలాడిపోయింది. నాకూ కాస్త అలానే ఉన్నా బయటపడలేని స్థితప్రజ్ఞత.ఇంతలో ఆరవనెల అన్నప్రాశన అని కూతురు కబురుపెట్టింది. కాగలకార్యం కాలం తీర్చినట్లు హైదరాబాద్ ప్రయాణం ఖరారైంది. రాత్రి పది గంటలకు సింహపురి ట్రైన్ లో ప్రయాణం. మనవడి కోసం బట్టలు, పెద్ద దోమతెరతో పాటు ఏమేమి తీసుకురావాలో కూతురు రెండు రోజులుగా పదేపదే లిస్ట్ చదివింది. నా శ్రీమతి.. కూతురు వద్దన్న వాటిని కూడా బ్యాగుల్లో బలవంతంగా కూర్చి ఉరువుల సంఖ్యను అయిదుకు పెంచింది.‘బయలుదేరేటప్పుడు, రైలు ఎక్కేటప్పుడు బ్యాగులను కౌంట్ చేయండి’ అన్న కూతురు ముందుచూపు సూచనలతో ఉరువులు లెక్కగట్టి రైల్వేస్టేషన్‌కు చేరుకునేసరికి రాత్రి తొమ్మిదిన్నర గంటలైంది. ప్లాట్‌ఫారంపై మరోమారు బ్యాగులు లెక్కగట్టి సంతృప్తి చెందాక అక్కడే ఉన్న అరుగుపై కూర్చుంది మా ఆవిడ. రైలు రావడానికి అరగంట సమయముంది. ‘అన్నీ సర్దావా? ఏవైనా మరచిపోయావా?’ అన్నమాటకు ‘గుర్తున్నకాడికి’ అంది. ఇంతలో కూతురు ఫోన్ . లగేజీల ప్రస్థానంపై ఆరా.ఆమె కొడుకు అన్నప్రాశన కోసం తీసుకున్న వెండి గిన్నె, స్పూన్, గ్లాసు ఎక్కడ మరచి పోతామో? అన్నది ఆమె టెన్షన్ . ఒకపక్క రైళ్ల రాకపోకల అనౌన్స్మెంట్లు, ప్రయాణికుల ఉరుకులు, పరుగులు. రైళ్లు ఎక్కి, దిగే ప్రయాణికుల రద్దీతో ప్లాట్‌ఫారాలు సందడిని నింపుకోగా, ఈ మధ్యే రంగులద్దుకున్న రైల్వేస్టేషన్ రాత్రిపూట ఎల్ఈడీ కాంతుల వెలుగుల్లో కన్నులకింపుగా కనపడుతోంది.‘సార్.. సార్’ అంటూ పెరుగెత్తుకుంటూ వచ్చాడు మళ్ళీ ఆ వ్యక్తి. ‘ఏమిటన్నట్లు?’ చూశాను.‘రైలు వస్తున్నట్టుంది సార్! హైదరాబాద్ దేనా?’ అన్నాడు. సీరియస్‌గా ముఖం పెట్టి ‘నువ్వెక్కడికెళ్లాలి?’ అన్నాను. ‘హైదరాబాద్ పొయ్యే రైలుకే సార్’‘ఎక్కడ దిగాలి?’ ఊరి పేరు చెప్పాడు. ఏపీ సరిహద్దులో ఉన్న తెలంగాణా రాష్ట్రానికి చెందిన ఊరు.‘మేమూ ఆ రైలుకే వెళుతున్నాము, మాతో పాటు ఎక్కుదువులే’ అన్నాను. ‘దండాలు దొరా.. ఈ ఒక్క సాయం చెయ్యి.. మా అయ్య కదూ’ అని మరీ వంగి కాళ్లను తాకుతూ దండం పెట్టాడు. మందు వాసన నాతోపాటు పరిసరాలనూ పలకరిస్తోంది. నేను వెనక్కు తగ్గాను. ‘మర్చిపోబాకు సారూ రైలు రాగానే నాకు చెప్పు.. ఏమీ అనుకోకు’ అంటూ చేతులు జోడించాడు.తను పదేపదే దగ్గరగా రావడం నన్ను మరింతగా ఇబ్బంది పెడుతోంది. కోపం, చిరాకు తెప్పిస్తోంది. ‘సరే.. చెబుతానన్నా గదా, రైలు రాంగానే చెబుతా, పొయ్యి అరుగు మీద కూర్చో’ అన్నాను.‘కోప్పడకు సారూ.. మరచిపోతావేమోనని చెపుతాండాలే ’ కొంచెం దూరం జరిగాడు. మరికొద్దిసేపట్లో గూడూరు– సింహపురి ఎక్స్‌ప్రెస్ మూడవ నంబర్ ప్లాట్పారంపైకి రానుందని తెలుగు, ఇంగ్లిష్, హిందీలో అనౌన్స్మెంట్. అప్పటికే కిక్కిరిసిన జనం అలర్ట్ అయ్యారు. రైలు వస్తుందంటూ తోటి ప్రయాణికులతో చర్చలు. కొందరు షాపుల్లో వాటర్ బాటిళ్లు కొంటున్నారు, ఇంకొందరు పిల్లలకు బిస్కెట్లు, కూల్‌డ్రింక్స్ కొనిపిస్తున్నారు, మరికొందరు ఫోన్లో రైలు వచ్చిందంటూ ఇంటికి కబురు చెబుతున్నారు, కొందరు బయలుదేరుతున్నామంటూ గమ్యంలోని వారికి సమాచారం చేరవేస్తున్నారు. ప్రయాణికుల కోలాహలం పెరిగింది.మరోమారు నా భార్య మా లగేజీ బ్యాగులు లెక్కగట్టింది. మా కూతురు కౌంటింగ్ సూచనల ప్రభావం ఆమెను వీడనట్లుంది. ‘బ్యాగులు అన్నీ ఉన్నాయా?’ అన్న అర్థం వచ్చేలా ఆమెవైపు చూశాను. ఈసారి ఆమె నవ్వింది. ‘సార్..సార్ ఇదో టీ తీసుకోండి, వేడివేడి టీ..’ పరుగులాంటి నడకతో వచ్చాడు ఆ వ్యక్తి. సీరియస్‌గా చూశాను. ‘మీ కోసమే తెచ్చాను, టీ తాగండి సర్’ అన్నాడు. నాకు కోపం నసాలానికెక్కింది. చుట్టుపక్కల ప్రయాణికుల దృష్టి చాలాసేపటి నుంచి మా ఇద్దరిపైనే ఉంది. ప్రతిసారీ అతను వేరెవరి దగ్గరకు వెళ్లకుండా నావద్దకు వచ్చి బతిమిలాడుతుండడంతో అందరూ ఆసక్తిగా తిలకిస్తున్నారు. మరోమారు అందరూ నావైపు చూశారు. కోపం కంట్రోల్ చేసుకున్నాను.‘ఇప్పుడే ఇంట్లో అన్నం తిని వస్తున్నాను, ఇప్పుడు టీ తాగను, నువ్వు తాగు’ ఒక్కో అక్షరం గట్టిగా నొక్కి పలికుతూ కళ్లెర్ర చేశాను.నా ఆగ్రహం పసిగట్టినట్లున్నాడు, దూరంగా వెళ్లి టీ తాగి అక్కడే నిల్చున్నాడు. ట్రైన్ వస్తోందంటూ మరోమారు అనౌన్్సమెంట్. ప్లాటుఫారంపై డిస్ప్లేలలో రైలు నంబర్, బోగీ నంబర్లు వేస్తున్నారు. అది చూసి ప్రయాణికుల్లో హడావుడి. అటూ ఇటూ వేగంగా కదులుతున్నారు. ‘సార్ రైలొచ్చిందా?’ ఈసారి కాస్త దూరం నుంచే అడిగాడు ఆ వ్యక్తి.‘ఆ.. వస్తాంది. ఇక్కడే ఉండు ఎక్కుదాం’ అన్నాను. ‘సరే.. సరే’ అంటూ నాకు దగ్గరగా వచ్చి నిల్చున్నాడు.నా భార్య మరోమారు బ్యాగులను చూపుడు వేలితో లెక్కించడం కనిపించింది. రైలు కూతతోపాటు దాని వెలుతురు తోడుగా ప్లాట్ఫారం పట్టాలపైకి భారంగా వచ్చి ఆగింది. మేమున్న దగ్గరకి కొంత అటు ఇటుగా మేము ఎక్కాల్సిన బీ–5 ఏసీ స్లీపర్ బోగి ఉంది. నా భార్య, నేను చెరో రెండు బ్యాగులు చేతికి తీసుకున్నాం. ఆదరబాదరగా వచ్చి ‘ఇటివ్వు తల్లీ’ అంటూ నా భార్య చేతిలోని రెండు బ్యాగులు తీసుకున్నాడా వ్యక్తి. ఆమె ఇంకో బ్యాగు తీసుకుంది. నా వెంటే బ్యాగులు మోసుకొచ్చాడు. బోగీలో మాకు కేటాయించిన సీట్ల వద్ద బ్యాగులు పెట్టాను. నా భార్యకు సీటు చూపించి కూర్చోబెట్టి.. ‘నీది యే బోగి?’ అడిగాను ఆ వ్యక్తిని. ‘నాదిక్కడ కాదు సారూ..’ అన్నాడు. ‘పద నీ బోగీలో దిగబెడతా’ అన్నాను. ‘నాదిక్కడ కాదులే సారూ..’ అన్నాడు మళ్లీ. ‘ఏదీ.. నీ టిక్కెట్ చూపించు? సీటెక్కడో చెబుతా’ అన్నాను. ‘టికెట్ లేదు సారూ..’ అన్నాడు.‘అదేంటి! టికెట్ తీసుకోలేదా?’ ‘లేదు సారూ.. అయినా మాకెందుకు సారూ టికెట్, మమ్మల్ని టికెట్ అడగరులే’ అన్నాడు. ‘టీసీ వచ్చి చెక్ చేస్తే?’ ‘అది మీకు సారూ.. మాకు కాదులే’ నసగుతూ అన్నాడు‘ఎందుకు?’ అన్నట్లు చూశాను. ‘నేను అడుక్కునేటోన్ని సారూ.. మాకు టిక్కెట్ గట్ల లేదులే’ అన్నాడు. ఆశ్చర్యమేసింది. మాసిన బట్టలు, ఆహార్యం చూస్తే అచ్చమైన పల్లెటూరి అమాయకుడిలా ఉన్నాడు తప్పించి మరీ అడుక్కునేవాడిలా కనిపించలేదు.‘నువ్వు అడుక్కుంటావా?’ అన్నాను. ‘అవును సారూ.. నేను బిచ్చగాన్ని’ అన్నాడు.నాముందు దాదాపు గంటపాటు రైల్వేస్టేషనులో ఉన్నాడు, నాకే టీ ఇవ్వబోయాడు, ఎవ్వరినీ డబ్బులు అడుక్కోలేదు. మనస్సు ఏదోలా అయ్యింది. తను అబద్ధం చెబుతున్నాడేమో! ‘నిజం చెప్పు నువ్వు అడుక్కుంటావా?’ అడిగాను. ‘నిజం సారూ.. నేను బిచ్చగాన్నే, ఆరేళ్లుగా అడుక్కుంటున్నాను’ అన్నాడు. ‘అంతకుముందు?’‘రైతును సారూ’ అన్నాడు. ఉలిక్కి పడ్డాను. తనవైపు తేరిపార చూశాను. రైతు కుటుంబంలో పుట్టిన నాకు తన మాటలు మనస్సులో అలజడి సృష్టించాయి. నా భార్యకు మళ్లీ వస్తానని చెప్పి తనతో పాటు బోగీల వెంట నడుస్తున్నాను. నాగటి చాళ్లలో నడచినట్లు కాలి పాదాలు తొసుకుతున్నాయి. సరిగ్గా అడుగులు వేయలేకపోతున్నాను. మనసుదీ అదే స్థితి. మెదడు గతితప్పింది.‘యే.. టిఫినీ.. టిఫినీ.. ఇడ్లీ వడా, ఇడ్లీ వడా... సార్ వాటర్.. వాటర్, కూల్‌డ్రింక్స్..’రైలు బోగీల్లో అరుపుల గోల. నా మనసు ఘోషపై ధ్యాసపెట్టిన నా చెవులు వాటిని పట్టించుకోలేదు. ఎలాగోలా జనరల్ కంపార్ట్మెంట్ కొచ్చాను. ఖాళీగా ఉన్న సీటుపై కూర్చున్నాను. ‘కూర్చో’ ఆ వ్యక్తికి సీటు చూపించాను.‘పర్లేదు సారూ నేను నిలుచుంటా’ అన్నాడు. చెయ్యిపట్టి కూర్చోబెడుతూ ‘నీ పేరు..?’ అడిగాను. ‘సోమయ్య సారూ..’‘నీ కథ వినాలని ఉంది చెప్పు సోమయ్యా..’ అన్నాను. ఒక్కక్షణం.. మొదలుపెట్టాడు.‘మాది మధిర దగ్గర పల్లెటూరు సారూ. చిన్న రైతు కుటుంబం. ఒక కొడుకు, ఒక కూతురు. రెండెకరాల మెట్ట. వానొస్తేనే పైరు, లేకుంటే బీడు. రెక్కలు గట్ల కట్టెలు జేసుకొని పని చేసేటోల్లం. అప్పులతో పెట్టుబడి, కరువులతో కష్టాలు. ఒక పంటొస్తే నాలుగు పంటలు పొయ్యేటియి. వడ్డీలు పెరిగొచ్చి అప్పులు కుప్పబడె. తీర్చే దారి దొరక్కపాయ.ఎదిగొచ్చిన కూతురును ఇంట్లో పెట్టుకోలేంగద సారూ.. ఎకరం అమ్మి బిడ్డ పెండ్లిజేస్తి. నా కష్టం పిల్లోడికొద్దని వాన్ని డిగ్రీ దాకా చదివిస్తి. అప్పులోల్లు ఇంటిమీద పడి ఆగమాగం జేస్తిరి. నానా మాటలు పడితి. అయి భరించలేక ఉరిపోసుకుందామని తీర్మానం జేసుకుంటి. భార్యా, కొడుకు దావలేని రీతిన వీధిన పడ్తరని మనసు మార్చుకుంటి. సేద్యం ఇక కుదిరేకత లేదని తీర్మానం జేసుకుంటి. ఉన్న అప్పు వడ్డీలతో గలిపి అయిదు లక్షలకు ఎగబాకె. ఎకరం అమ్మి లొల్లిజేసేటోల్లకు కొంత అప్పుగడ్తి. మా ఊర్లో నా దోస్తుగాల్లు కొందరు సేద్యం ఎత్తిపెట్టి చిన్నచిన్న యాపారాలకు బొయ్యి బాగానే సంపాదిస్తున్నారు. వో దినం నా బాధ వారికి మొరపెట్టుకుంటి.‘మాతో వస్తావా?’ అనిరి. అట్టే అని జెప్పి వొకనాడు వాల్లతో పాటు తిరుపతి రైలెక్కితి. ఎట్టోకట్ట గడ్డనెయ్యి స్వామీ అని ఎంకన్న స్వామికి మొక్కుకుంటి. తిరపతి బొయ్యి చూస్తే నా దోస్తుగాల్లు జేసే యాపారం బిచ్చమెత్తకోవడమని తెలిసె సారూ. పొద్దున లేచింది మొదలు రాత్రి దాకా అడుక్కోడమే. ‘ఇదేందయ్యా ఇట్టాంటిదానికి దెస్తిరే’ అని తొలిరోజు మనసురాక యాతనపడితి.కలోగంజో కలిగిన కాడికి నలుగురికి పెట్టినోల్లం, ఇప్పుడు అడుక్కునే రోజులొచ్చే అని కుమిలిపోతి. అప్పుతీర్చాల, కొడుకును దారిలో పెట్టాల. మనకాడ యేముందని యేం యాపారం జేస్తాం! మనసుకు నచ్చజెప్పుకుంటి. ఆ రోజు నుంచి అడుక్కోడం మొదలు పెడ్తి సారూ. రెండువారాలు బిచ్చమెత్తడం ఇంటికి రాడం, రెండు రోజులుండి మల్లీ పోడం, నెలాఖరుకు రావడం రెండు రోజులుండి మల్లీ పోడం. ఆరేండ్ల కాలం గడచిపాయ దొరా.’మనసు బాధను పంచుకొనేదానికి దోస్తానా దొరికిండనుకున్నాడేమో? ఏకబిగిన తన కథ చెప్పాడు సోమయ్య. మనసును పిండేసే కథ. నేలను కదలించే కథ. కొన్ని నిమిషాలపాటు మా మధ్యన మాటల్లేవు. అంతా నిశ్శబ్దం. రైలు ఇనప చక్రాల రోదనా నా చెవికెక్కడం లేదు.కొద్దిసేపటి తరువాత.. ‘ఇప్పుడెలా ఉంది పరిíస్థితి’ అడిగాను. ‘బాగుందిసారూ .. అప్పులు తీర్చాను, ఊర్లో పాత ఇంటిని రిపేర్ చేసుకున్నాను. కొడుకు హైదరాబాద్‌లో కంపెనీలో చేరాడు’ చెప్పాడు.‘రైతుగా పదిమందికి పెట్టినోడివి బిచ్చమెత్తడం ఇబ్బందిగా లేదా సోమయ్యా..’ ‘ఎందుకుండదు సారూ.. ఎదుటి మనిషి ముందు చేయిచాచగానే కొందరు చీదరించుకుంటారు, కొందరు పనిజేసుకొని బతకొచ్చుగా అంటారు. కొందరు అసహ్యంగా చూస్తారు. కొందరైతే నానాతిట్లు తిడతారు’ అన్నాడు.‘మాటలు పడ్డప్పుడు బాధనిపించదా?’ అన్నాను.‘అనిపిస్తుంది సారూ.. కచ్చితంగా అనిపిస్తుంది. అలా అనిపించినప్పుడల్లా రైతుగా నేను పడిన కష్టాలు కళ్ల ముందేసుకుంటాను. పంట కోసం తెచ్చిన అప్పులు గట్టమని అప్పులిచ్చినోల్లు తిట్టిన తిట్లు గుర్తుకు తెచ్చుకుంటాను. తోటి మనిషన్న జాలి లేకుండా ఇంటి మీదకొచ్చి పరువు బజారుకీడ్చినప్పుడు పడ్డ యాతన గుర్తుకు తెచ్చుకుంటాను.పెండ్లాన్ని అమ్మైనా బాకీ తీర్చాలన్న మాటలకు గుండెపగిలి ఏడ్చిన ఏడుపు గుర్తుకు తెచ్చుకుంట సారూ. చుట్టుపక్కోల్లు గుమిగూడి ఓదార్చకుండా మాట్లాడిన వెకిలి మాటలకు పడ్డ యాతన, వేదన గుర్తుకు తెచ్చుకుంటా, ఆ మాటలు పడలేక ఉరిపోసుకొని చచ్చిపోదామనుకున్న రోజులు యాదికి తెచ్చుకుంట. ఆ కష్టాలు, అవమానాల కంటే బిచ్చమెత్తుకొనేటప్పుడు పడే మాటలు సిన్నయిగా అగుపిస్తాయి సారూ. రైతుగా ఉన్న నాటి కష్టాలతో పోలిస్తే ఇప్పటి నొప్పి గుండెను పిండదు సారూ.’సోమయ్య మాటలు ఆర్ద్రంగా మారాయి. చొక్కా చెరుగుతో కళ్లను తుడుచుకున్నాడు. నా కళ్లకు సోమయ్య మసగ్గా కనపడుతున్నాడు. మనస్సు బాధగా మూలిగింది. ‘సోమయ్యా .. ఉద్యోగం చాలించి నేనూ రానా..’ ఆయన మనస్సు తేలిక చేయాలన్న ఉద్దేశంతో అన్నాను. ఒక్కసారి నావైపు చూసి చిన్నగా నవ్వాడు. ‘మీకెందుకు సారూ ఆ కర్మ? ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు’ అన్నాడు. ‘అవును సోమయ్యా! తిరుపతికే ఎందుకు వెళ్లడం అంతదూరం?’ అన్నాను.‘భక్తులు దేశం నలుమూలల్నుంచి వచ్చేతావు సారూ, పాపాలు చేసి పుణ్యం పట్టకపోయేటందుకు మొక్కులతో వస్తరు, దండిగా డబ్బులతో వస్తరు, ఖర్చుపెట్టేందుకు సిద్దపడే వస్తరు, దేవుడికింత , మాకింత’ చెప్పాడు. ‘అయితే బిక్షమెత్తి పాపులకు పుణ్యం పంచే దేవుడి ఉద్యోగం అన్నమాట’ అన్నాను. ‘ఊరుకొండి సారూ.. వెంకన్నస్వామే దేవుడు, నేను కాదు’ నవ్వుతూ అన్నాడు. సోమయ్యలో నవ్వు చూశాను. కొంచెం బాధ తగ్గింది. సెల్‌ఫోన్ లో టైమ్ చూశాను. పన్నెండు కావస్తోంది. ఎవరిగోడూ పట్టని సింహపురి ఎక్స్‌ప్రెస్ విజయవాడ దాటి మధిర వైపు వేగంగా పరుగెడుతోంది.‘మీరెల్లిపడుకోండి సారూ.. మేడం ఒక్కరే ఉంటారు, నేను ఇంకో గంటలో దిగిపోతా ’ అన్నాడు. ‘అవును సోమయ్యా.. నువ్వు బాపట్లలో ఎందుకున్నావు?’ అన్నాను. ‘తిరపతిలో తొందరతొందరగా రైలెక్కాను సారూ.. తీరాచూస్తే అది మావూరి దగ్గర ఆగదంట. అందుకే ఇక్కడ దిగాను, దసరా పండక్కు కొడుకు, కూతురు పిల్లలు ఊరికి వచ్చిండ్రు సారూ.. రేపే పండగ, మల్లీ రైలెక్కడ పోగొట్టుకుంటానో అని బయపడి మిమ్మిల్ని ఇబ్బంది పెట్టాను’ అన్నాడు.‘సరే’ అని లేచాను. ఇప్పుడు సోమయ్య దగ్గర నాకు మందు వాసన రావడం లేదు, మట్టి వాసన వస్తోంది, రైతు చమట వాసన వస్తోంది. చేయి కలిపాను. పాలకుల ఆదరణ కరువై వో రైతు కాడిదించాడు. వందల మంది జనం ఆకలి ఆర్తనాదాలు నా చెవుల్లో మారు మోగుతున్నాయి. అన్యమనస్కంగానే నా బోగీవైపు అడుగులు వేశాను. — బిజివేముల రమణారెడ్డి
Namita Dubey: నిజమైన యాక్టర్స్.. తమ పాత్ర గురించే ఆలోచిస్తారు!
నమితా దుబే.. చాలామంది నటీమణుల్లాగానే ఆమే మోడలింగ్ నుంచి నటనవైపు మళ్లింది. స్మాల్ అండ్ సిల్వర్ స్క్రీన్స్ మీద వచ్చిన గుర్తింపుతో ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్ మీద అవకాశాలను అందుకుంటోంది. తన హావభావాలతో వీక్షకులను అలరిస్తోంది.నమితా పుట్టిపెరిగింది లక్నోలో. వాళ్ల నాన్న వినయ్ప్రియ్ దుబే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. నమితా.. ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజ్‌లో బిఏ ఇంగ్లిష్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది. తర్వాత ముంబై వెళ్లి టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో సోషల్ వర్క్‌లో పీజీ చేసింది.చదువైపోయాక ‘వరల్డ్ వెల్ఫేర్ చిల్డ్రన్ ట్రస్ట్’లో కొన్నాళ్లు, ‘సలామ్ బాలక్ ట్రస్ట్’లో కొన్నాళ్లు ఉద్యోగం చేసింది. ఆ సమయంలోనే మోడలింగ్ చాన్స్ వచ్చింది. ఒక యాడ్‌లో అయిదు నిమిషాలు నటించినందుకు 20 వేల పారితోషికం అందుకుంది. అది ఆమెకు తన కెరీర్‌నే యాక్టింగ్ ఫీల్డ్కి షిఫ్ట్ చేసుకునేంత ఉత్సాహాన్నిచ్చింది.నటనారంగంలో కొనసాగేముందు తన అభినయ కళకు మెరుగులు దిద్దుకోవాలనుకుని ‘జెఫ్ గోల్డెన్‌బర్గ్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్’లో చేరింది. ట్రైన్డ్ యాక్ట్రెస్‌గా బిందాస్ చానెల్ సీరియల్ ‘యే హై ఆషిరీ’తో స్మాల్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది. అందులోని ‘రాధిక’రోల్‌తో ఆమె పాపులర్ అయింది. అది ఆమెకు సోనీ, కలర్స్ లాంటి ఇతర టాప్ చానెల్స్‌లో అవకాశాలను తెచ్చిపెట్టింది.టీవీ గుర్తింపు నమితాకు సినిమా చాన్స్‌నూ ఇచ్చింది.. ‘మై తేరా హీరో’లో. అందులో ఆమె చేసింది చిన్న పాత్రే అయినా బాలీవుడ్ ఫిలిం మేకర్స్ దృష్టిలో పడేలా చేసింది. తత్ఫలితం.. అలంకృత శ్రీవాస్తవ దర్శకత్వం వహించిన లేడీ ఓరియెంటెండ్ మూవీ ‘లిప్‌స్టిక్ అండర్ మై బుర్ఖా’లో మంచి పాత్ర దక్కడం. ఇలా టీవీ సీరియల్స్, సినిమాలతో బిజీగా ఉంటున్న సమయంలోనే ‘యాస్పిరెంట్స్’ అనే సిరీస్‌తో ఓటీటీలోనూ నటించే ఆపర్చునిటీ వచ్చింది. ఆ వెబ్ సిరీస్ ఎంత ఫేమస్ అయిందో.. అందులోని ‘ధైర్య’ భూమికతో ఆమే అంతే ఫేమస్ అయ్యి ఓటీటీ వీక్షకుల అభిమాన నటిగా మారిపోయింది. "ఇంపార్టెంట్ రోల్ దొరికితే చాలు.. అది సీరియలా.. సిరీసా.. సినిమానా అని చూడను. నాకు తెలిసి నిజమైన యాక్టర్స్ ఎవరైనా తమ పాత్ర గురించి ఆలోచిస్తారు తప్ప దాన్ని ప్రదర్శించే వేదిక గురించి కాదు!" – నమితా దుబే
Health: మెనోపాజ్ వల్ల హార్మోన్స్ సమస్యా? అయితే ఇలా చేయండి!
మెనోపాజ్ వల్ల హార్మోన్స్ తగ్గిపోతాయి కదా.. దాని ప్రభావం ఆరోగ్యం మీద పడకుండా ఉండటానికి మాత్రల ద్వారా హార్మోన్స్‌ను రీప్లేస్ చేయవచ్చా? – జి. సోనీ, సిద్ధిపేటమెనోపాజ్ తరువాత హార్మోన్స్ డెఫిషియెన్సీ వల్ల సైడ్ఎఫెక్ట్స్, ఇబ్బందులతో చాలామంది బాధపడుతుంటారు. వాటిని తగ్గించడానికి చాలామంది హెచ్ఆర్టీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారిప్పుడు. అయితే దీనిని డాక్టర్ పర్యవేక్షణలోనే తీసుకోవాలి. అదికూడా వైద్య పరీక్షల అనంతరం. ఈ హెచ్ఆర్టీ అందరికీ సరిపడకపోవచ్చు.ఈ హార్మోన్స్ థెరపీతో ముఖ్యంగా హాట్ ఫ్లషెస్, రాత్రిళ్లు చెమటలు పట్టడం, మూడ్ స్వింగ్స్, వెజైనా పొడిబారిపోవడం వంటి సమస్యలను పరిష్కరించవచ్చు. ఆస్టియోపొరాసిస్ అంటే ఎముకలు గుల్లబారడం వంటి సమస్యనూ నివారిస్తుందీ హెచ్ఆర్టీ. ఈ సింప్టమ్స్ అన్నీ మెనోసాజ్ వచ్చిన కొన్నినెలలకు కనపడతాయి. ట్రీట్మెంట్ మొదలుపెట్టాక కనీసం మూడు నెలలు అయితే కానీ దాని ప్రభావం కనిపించదు.ఒకవేళ ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తే డోస్, ప్రిపరేషన్ మార్చేయవచ్చు. అయితే బ్రెస్ట్ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్, అంతకుముందు బ్లడ్ క్లాట్స్ ఉన్నా, హై బీపీ, లివర్ ప్రాబ్లమ్ ఉన్నవారిలో హెచ్ఆర్టీ సురక్షితం కాదు. హెచ్ఆర్టీలో హార్మోన్స్‌ను సింగిల్ డోస్‌గా కానీ.. కంబైన్డ్ డోస్ టాబ్లెట్స్‌గా కానీ ఇస్తారు. ఇవి ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్స్‌తో ఉంటాయి. స్కిన్ పాచెస్, జెల్స్, పెసరీస్ కూడా ఉంటాయి. హెచ్ఆర్టీకి ప్రత్యామ్నాయాలు కూడా ఉన్నాయి.జీవనశైలిలో మార్పులు అంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, పోషకాహారం తీసుకోవడం, మసాలా ఆహారపదార్థాలు, టీ, కాఫీ, ఆల్కహాల్ వంటివాటికి దూరంగా ఉంటూ.. తాజా ఆకుకూరలు, బాదం పప్పు, అక్రోట్స్, సోయా బీన్స్ వంటివి తీసుకుంటూంటే మెనోపాజ్ సింప్టమ్స్ అంతగా బాధించవు.. తగ్గుతాయి కూడా.ఇవి చదవండి: Health: లోయర్ బ్యాక్ పెయిన్‌తో ఇబ్బందా! ఆలస్యం చేశారో??
క్రైమ్
డిప్యూటీ సీఎం బూడి హత్యకు కుట్ర
దేవరాపల్లి (అనకాపల్లి జిల్లా): డిప్యూటీ సీఎం, వైఎస్సార్సీపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడు ఇంటి వద్ద డ్రోన్ కెమెరాతో నలుగురు రెక్కీ నిర్వహించడం వివాదాస్పదమైంది. గ్రామస్తులు వారిని పట్టుకుని, తమ నేత బూడి ముత్యాలనాయుడుç ßæత్యకు కుట్ర పన్నారని ఆరోపిస్తూ పోలీసులకు అప్పగించారు. ముత్యాలనాయుడు ప్రత్యరి్థ, బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ జోక్యం చేసుకోవడంతో వివాదం ముదిరింది.రాత్రి వరకు హైడ్రామా నడిచింది. దేవరాపల్లి మండలం తారువలోని బూడి ఇంటి చుట్టూ శనివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో డ్రోన్‌తో రెక్కీ నిర్వహించారు. అరగంటకు పైగా ముత్యాలనాయుడు ఇంటి పరిసరాల్లో డ్రోన్ చక్కర్లు కొట్టడంతో అనుమానం వచ్చిన గ్రామస్తులు డ్రోన్ ఆపరేటర్లను ఆరా తీశారు. పొంతన లేని సమాధానం చెప్పడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ డి.నాగేంద్ర గ్రామానికి చేరుకుని డ్రోన్, బీజేపీ జెండా సహా హైదరాబాద్‌కు చెందిన డ్రోన్ ఆపరేటర్ చిలకల పాండురంగారావు, అసిస్టెంట్ ఆపరేటర్ పొట్టి సాయికృష్ణ, చొప్ప గంగాధర్, కొమర అప్పారావులను అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లారు. తన హత్యకు కుట్ర పన్నారని, అనుమతులు లేకుండా తన ఇంటి చుట్టూ డ్రోన్‌తో రెక్కీ నిర్వహించారని ముత్యాలనాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎం రమేష్ ఎదురుదాడి విషయం తన అనుచరుల ద్వారా తెలుసుకున్న సీఎం రమేష్ డ్రోన్ ఆపరేటర్లను తారువ గ్రామస్తులపై ఎదురు ఫిర్యాదు ఇవ్వాలని సూచించారు. సాయంత్రం 4 గంటల సమయంలో అనుచరులు, టీడీపీ కార్యకర్తలతో దేవరాపల్లి పోలీసుస్టేషన్‌కు చేరుకున్నారు. తమ కార్యకర్తలపై దాడి చేసిన బూడి వర్గీయులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ముత్యాలనాయుడు ఇంటి వద్దకు వెళ్లేందుకు సీఎం రమేష్ సిద్ధం కాగా.. పోలీసులు నిరాకరించారు. రౌడీమూకల మాదిరిగా పోలీసులను నెట్టుకుంటూ తన వెంట ఉన్న పచ్చ దండుతో రమేష్ తారువకు వెళ్లారు. ముత్యాలనాయుడి మరో ఇంటి వద్దకు (ఆ ఇంట్లో ఎన్నికల్లో పోటీ చేస్తున్న ముత్యాలనాయుడి కుమారుడు రవికుమార్ ఉంటున్నారు) వెళ్లగా.. రమేష్ వస్తున్న విషయం తెలుసుకుని ముత్యాలనాయుడు ఆ ఇంటి వద్ద తన అనుచరులతో బైఠాయించారు. ఈ ఇల్లు కూడా తన పేరిట ఉందని, ఎవరొస్తారో చూస్తానని హెచ్చరించారు. విషయం తెలుసుకుని అవాక్కయిన సీఎం రమేష్ తన అనుచరులతో కలిసి హనుమాన్ ఆలయం ముందు మెట్లపై కూర్చుండి పోయారు. తారువ గ్రామస్తులు, వైఎస్సార్సీపీ శ్రేణులు అక్కడికి చేరుకుని తమ ఊళ్లో రౌడీ రాజకీయం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. పోలీసులు వెళ్లిపోవాలని కోరడంతో సీఎం రమేష్ పోలీసు జీపు ఎక్కారు. దీంతో రమేష్ ఎక్కిన జీపునకు అడ్డంగా గ్రామస్తులు బైఠాయించారు. గూండాగిరీ చేసిన సీఎం రమేష్ బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు. దీంతో అరగంటకు పైగా సీఎం రమేష్ ఎక్కిన పోలీసు వాహనం నిలిచిపోయింది. ఆ వాహనాన్ని గ్రామస్తులు చుట్టముట్టడంతో సీఎం రమే‹Ù, అతని అనుచరవర్గం భయంతో వణికిపోయారు. పోలీసులు అతికష్టంపై రమేష్ ఎక్కిన వాహనాన్ని ముందుకు పంపించగా.. గ్రామస్తులు మాత్రం ఊరి పొలిమేర దాటే వరకు వెంబడించారు.
షా డీప్‌ఫేక్ ప్రసంగం వీడియో సృష్టికర్త అరెస్టు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగ వీడియోను డీప్‌ఫేక్‌గా సృష్టించిన వ్యక్తిని ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి అరెస్టు చేశారు. అమిత్ షా వీడియోను ఏఐసీసీ సోషల్ మీడియా విభాగం జాతీయ సమన్వయకర్త అరుణ్‌రెడ్డి డీప్‌ఫేక్ చేశారని పోలీసులు నిర్ధారించారు. దీని వెనక కాంగ్రెస్ ప్రముఖుల హస్తం ఏమైనా ఉందా అనే కోణంలో విచారణ చేపట్టారు.సృష్టించి.. సర్క్యులేట్ చేసి..మెదక్‌లో ఏప్రిల్ 23న నిర్వహించిన సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ మళ్లీ అధికారంలోకి వస్తే మతప్రాతిపదికన అమలవుతున్న ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని ప్రకటించారు. కానీ ఆ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను అరుణ్‌రెడ్డి ఎడిట్ చేసి తాము అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఎత్తేస్తామని షా అన్నట్లుగా యాడ్ చేశారని ఢిల్లీ పోలీసులు చెప్పారు. అనంతరం ఆ వీడియోను ఏఐసీసీ, ఎన్ఎస్యూఐ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అన్ని వాట్సాప్ గ్రూపుల్లో అరుణ్‌రెడ్డి పోస్ట్ చేశారని పేర్కొన్నారు.కేంద్ర హోంశాఖ ఫిర్యాదుతో..షా డీప్‌ఫేక్ వీడియోను వీక్షించిన నెటిజన్లు బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అలాగే దీనిపై ఏఐసీసీ అధ్యక్షు డు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సహా మరికొందరు పార్టీ నేత లు స్పందించారు. బీజేపీ అధికారంలోకి వస్తే కచ్చితంగా ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరుగుతుందని వారు బహిరంగ సభల్లో చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన కేంద్ర హోంశాఖ ఇండియన్ సైబర్ క్రైం కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) ద్వారా ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై గత నెల 28న ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసు లు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నేడు మరో అరెస్టుకు అవకాశం..వీడియో సృష్టికర్త అరుణ్‌రెడ్డి కాగా దాన్ని వైరల్ చేసింది మాత్రం తెలంగాణకు చెందిన వ్యక్తేనంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘ఎక్స్’ ఇప్పటికే ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులకు నివేదించింది. దీంతో ఇందుకు సంబంధించిన ఆధారాలను ఆదివారంలోగా తమకు సమర్పించాలని ‘ఎక్స్’తోపాటు ‘ఫేస్బుక్’ను పోలీసులు కోరారు. ఆదివారంలోగా ఆ డీప్‌ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో తొలిసారి పోస్ట్ చేసిన వ్యక్తిని గుర్తించి అరెస్టు చేయనున్నారు.
రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
వైద్యో నారాయణో హరిః అంటాం. వైద్యులు దేవుళ్లతో సమానమని అర్థం.అలాగే రోగులకు సేవచేసే నర్సులని దైవదూతలుగా భావిస్తాం. నిస్సార్థంగా, కుటుంబ సభ్యులకంటే మిన్నగా వారు చేసే సపర్యలు రోగులకు ఎక్కడలేని ఊరటనిస్తాయి. కానీ ఒక నర్సుమాత్రం దీనికి పూర్తి భిన్నంగా ప్రవర్తించింది. రాక్షసిలా మారి రోగులను పొట్టన బెట్టుకుంది. ఎక్కడ ఏంటి వివరాల కోసం ఈ కథనాన్ని చదవండి..!అమెరికాలోని పెన్సిల్వేనియాలో హీథర్ ప్రెస్డీ (41) అనే నర్సుకు ఏకంగా 760 సంవత్సరాల జైలు శిక్ష పడింది. మూడు హత్య కేసుల్లో దోషిగా తేలడంతో ఆమెకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. మూడు జీవిత కాలాలు అంటే 760 సంవత్సరాల జైలు శిక్షను విధించారు.మూడేళ్ల పాటు ప్రాణాంతకమైన ఇన్సులిన్ ను అధిక మోతాదులతో ఇవ్వడంతో 17 మంది రోగులు ప్రాణాలు కోల్పోయినట్టుప్రెస్డీపై ఆరోపణలు నమోదైనాయి. మూడు హత్యలు, 19 హత్యాయత్నాల్లో నేరాన్ని అంగీకరించింది. ఈ కేసుల్లో దోషిగా తేలడంతో ఆమెకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది కోర్టు.ప్రెస్డీ 22 మంది రోగులకు అధిక మొత్తంలో ఇన్సులిన్ ఇచ్చినట్లు అభియోగాలు మోపారు. వీరిలో చాలా మంది రోగులు మోతాదు తీసుకున్న వెంటనే లేదా కొంత సమయం తరువాత మరణించారు. బాధితులు 43 నుండి 104 ఏళ్ల వయసు ఉంటుంది.ఇద్దరు రోగులను చంపినందుకు ఆమెపై తొలుత గత ఏడాది మేలో అభియోగాలు నమోదు కాగా, తర్వాత జరిగిన పోలీసు విచారణలో మరిన్ని విషయాలు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ప్రాథమిక అభియోగాలు నమోదు చేసిన అనంతరం ఆమె నర్సింగ్ లైసెన్స్ రద్దు చేశారు. ‘‘ఆమెకు ఏ జబ్బూ లేదు. మతిస్థిమితమూ లేదు. ఆమెది దుష్ట వ్యక్తిత్వం. ఆమె నా తండ్రిని చంపిన రోజు ఉదయం ఆమె కూృరమైన ముఖంలోకి చూశాను'’ అంటూ బాధిత కుటుంబ సభ్యుల్లో ఒకరు కోర్టుకు తెలిపారు.రోగులు, సహోద్యోగులు పట్ల కూడా ఆమె దురుసుగా ప్రవర్తించేదని విచారణ అధికారులు గుర్తించారు. అంతేకాదు ప్రెస్డీ తన తల్లికి ఏప్రిల్ 2022 – మే 2023 మధ్య కాలంలో రోగుల పట్ల తన అసంతృప్తిని మెస్సేజ్‌లను పంపించిందట.ఇన్సులిన్ అధిక మోతాదు హైపోగ్లైసీమియాకు దారితీస్తుంది, హృదయ స్పందనను పెంచుతుంది. గుండెపోటుకు కూడా దారితీస్తుంది. చివరికి ప్రాణాలను కూడా తీస్తుంది.
కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
విదేశాల్లో బిడ్డ దగ్గరకు వెళ్లి ఆనందంగా ఉన్న సమయంలో దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయిన ఘటన విషాదాన్ని నింపింది. కెనడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇండియాకు చెందిన దంపతులు, వారి మూడు నెలల మనవడు దుర్మరణం చెందారు. ఆ కారులో ఉన్న చిన్నారి తల్లిదండ్రులు కూడా తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. టొరంటోకు తూర్పున 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న విట్బీలోని హైవే 401పై ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై విచారాన్ని వ్యక్తం చేసిన ఒట్టావాలోని భారత హైకమిషన్ మృతులకు సంతాపాన్ని తెలియజేసింది.ఏం జరిగిందంటే ఇండియాకు చెందిన మణివణ్ణన్(60) మహాలక్ష్మి(55) దంపతులు ఎజాక్స్‌లో ఉంటున్న మనవడిని చూసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో అందరూ కలిసి బయటికి వెళ్లగా మృత్యువు వారిని కబళించింది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం . బోమన్‌విల్లేలో మద్యం దుకాణంలో చోరీ చేసిన ఇద్దరు నిందితులను పోలిసులు వెంబడించారు. పోలీసులను నుంచి తప్పించు కునే క్రమంలో హైవేపై వ్యాన్‌లో రాంగ్రూట్లో వెళుతూ వారు పలు కార్లను ఢీకొట్టారు. ఇందులో బాధితుల కారు కూడా ఉంది. ఈ ఘటనలో నిందితుల్లో ఒకరు ఘటనా స్థలంలోనే మరణించాడు. చిన్నారి తల్లిదండ్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ,తల్లి ఐసీయూలో ఉందని ఒంటారియో స్పెషల్ ఇన్వెస్టిగేషన్స్ యూనిట్ (SIU) తెలిపింది.‘‘ఎప్పటిలాగే ఆ హైవేపై కారులో వెళుతున్నాను ఇంతలో నిందితులు రాంగ్రూట్లో ఎదురుగా వచ్చారు. ఆరు కార్లను ఢీకొట్టారు. ఏం జరుగుతుందో అర్థం కాలేదు ఆ క్షణం నా కళ్లను నేనే నమ్మలేకపోయాను’’ ఈ ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డ ఓ ప్రత్యక్ష సాక్షి మరోవైపు ఘటనపై కెనడా పోలీసులు ముమ్మర దర్యాప్తు ప్రారంభించారు. యాక్సిడెంట్ ఎలా జరిగిందనేది ఆరా తీస్తున్నారు. ప్రత్యేక బృందాలతో వివిధ కోణాలలో కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషాద ఘటనపై టొరొంటోలోని భారతీయ కాన్సులేట్ విచారం వ్యక్తం చేసింది. బాధిత కుటుంబానికి సంతాపం తెలియజేసింది. ఈ ఘటనపై కెనడా అధికారులతో టచ్‌లో ఉన్నామని బాధిత కుటుంబానికి అన్నిరకాలుగా అండగా ఉంటామని పేర్కొంది.