క్యాన్స‌ర్‌తో పోరాటం.. ఇప్పుడేవీ స‌రిగా గుర్తుండ‌ట్లేదు: హీరోయిన్‌ | Sonali Bendre Faces Difficulty Memorising Lines Post Cancer | Sakshi
Sakshi News home page

Sonali Bendre: క్యాన్స‌ర్ త‌ర్వాత క‌థ‌, డైలాగ్స్ ఏవీ గుర్తుండ‌ట్లేదు!

May 5 2024 7:27 AM | Updated on May 5 2024 12:18 PM

Sonali Bendre Faces Difficulty Memorising Lines Post Cancer

సోనాలి బింద్రె.. స్టార్ హీరోలంద‌రి స‌ర‌స‌న న‌టించిన ఈ ముద్దుగుమ్మ 2018లో క్యాన్స‌ర్ బారిన ప‌డింది. న్యూయార్క్‌లో చికిత్స అనంత‌రం కోలుకున్న ఆమె అప్ప‌టినుంచి క్యాన్స‌ర్‌పై అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఆ మ‌ధ్య ల‌వ్ యూ హ‌మేశా అనే సినిమాలో న‌టించింది. అలాగే ద బ్రోకెన్ న్యూస్ అనే వెబ్ సిరీస్‌లోనూ క‌నిపించింది. అయితే పెద్ద‌గా అవ‌కాశాలు మాత్రం రావ‌డంలేద‌నే చెప్పాలి.

న‌టి కావాల‌నుకోలేదు
తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో సోనాలి బింద్రె మాట్లాడుతూ.. నేను న‌టి కావాల‌ని ఎప్పుడూ అనుకోలేదు. అనుకోకుండా ఇండ‌స్ట్రీకి వ‌చ్చాను. ఇక్క‌డ స‌క్సెస్ చూసిన త‌ర్వాత న‌ట‌న‌పై ఆస‌క్తి పెంచుకున్నాను. కెరీర్ తొలినాళ్ల‌లో కంటే ఇప్పుడు లైన్స్ గుర్తుపెట్టుకోవ‌డ‌మే క‌ష్టంగా ఉంది. స్క్రిప్ట్ కూడా స‌రిగా గుర్తుండ‌టం లేదు. 90'స్‌లో స‌న్న‌గా ఉండేవాళ్ల‌కంటే బొద్దుగా ఉండేవాళ్ల‌కే ప్రాధాన్య‌త ఇచ్చేవారు' అని హీరోయిన్‌ చెప్పుకొచ్చింది.

చ‌ద‌వండి: వేధిస్తున్న నిర్మాత.. నిజాలు బయటపెట్టిన సీరియల్ నటి

Advertisement
 
Advertisement
Advertisement