రెండు నాటు తుపాకీలు స్వాధీనం: ఇద్దరి అరెస్ట్ | Sakshi
Sakshi News home page

రెండు నాటు తుపాకీలు స్వాధీనం: ఇద్దరి అరెస్ట్

Published Thu, Aug 20 2015 8:19 PM

Two arrested by having of Guns

ఆళ్లగడ్డ టౌన్(కర్నూలు): అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రెండు నాటు తుపాకీలు స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు జిల్లా అహోబిలం పరిధిలోని అటవీ ప్రాంతంలో ఉన్న మారెమ్మ దేవాలయం సమీపంలో చంచు పామిలేటి(38), చంచు నారాయణ(40) అనే ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో.. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రెండు నాటు తుపాకీలు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
 
Advertisement