-
కాంగ్రెస్ అంటేనే మొండి చెయ్యి: కేటీఆర్ సెటైర్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్‌పై మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందన్నారు. కాంగ్రెస్ అంటేనే మొండి చెయ్యి అని మరోసారి తేలిపోయింది అంటూ ఘాటు విమర్శలు చేశారు.కాగా, కేటీఆర్ ట్విట్టర్ వేదికగా.. రుణమాఫీ అయిన రైతులకన్నా..కంటతడి పెట్టిన కుటుంబాలే ఎక్కువ అన్నివిధాలా అర్హత ఉన్నా..ఎందుకు రుణమాఫీ కాలేదో చెప్పెటోడు లేడు..రెండు సీజన్లు అయినా..రైతుభరోసా ఇంకా షురూ చెయ్యలేజూన్ లో వేయాల్సిన రైతుభరోసా.. ఆగష్టు దాటుతున్నా రైతుల ఖాతాలో వెయ్యలే..!!కౌలు రైతులకు.. ఇస్తానన్న రూ.15 వేలు ఇయ్యనే ఇయ్యలే..!!రైతు కూలీలకు.. రూ.12 వేల హామీ ఇంకా అమలు చెయ్యలే..!!కాంగ్రెస్ అంటేనే మొండి చెయ్యి అని మరోసారి తేలిపోయింది అంటూ ఘాటు విమర్శలు చేశారు. రుణమాఫీ అయిన రైతులకన్నా..కంటతడి పెట్టిన కుటుంబాలే ఎక్కువ అన్నివిధాలా అర్హత ఉన్నా..ఎందుకు రుణమాఫీ కాలేదో చెప్పెటోడు లేడు...రెండు సీజన్లు అయినా..రైతుభరోసా ఇంకా షురూ చెయ్యలేజూన్ లో వేయాల్సిన రైతుభరోసా.. ఆగష్టు దాటుతున్నా రైతుల ఖాతాలో వెయ్యలే..!!కౌలు రైతులకు.. ఇస్తానన్న… pic.twitter.com/9lmuLQaAKk— KTR (@KTRBRS) August 26, 2024 ఇదే సమయంలో రాష్ట్రంలో డెంగ్యూ మరణాలపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ వైపు రాష్ట్రంలో డెంగ్యూ మరణాలే లేవని ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు పత్రికల్లో డెంగ్యూతో జనం చనిపోతున్నారని రోజు వార్తలు వస్తున్నాయి. రెండు రోజుల క్రితమే డెంగ్యూ కారణంగా ఐదుగురు చనిపోయారని వార్తలు వచ్చాయి. ఈరోజు మరో ముగ్గురు చనిపోయినట్లు వార్తాపత్రికల్లో వార్తలు చూస్తున్నాం. మరి నిజాల్ని ప్రభుత్వం ఎందుకు దాచుతున్నట్లు?. ఆసుపత్రుల్లో సరిపడా మందులు కూడా లేవు లేవు. ఒకే బెడ్‌పై ముగ్గురు నుంచి నలుగురికి వైద్యం అందిస్తున్న పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం డెంగ్యూ సమస్య తీవ్రంగా ఉందని అంగీకరించి వెంటనే రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి అంటూ సీఎస్‌కు కోరారు. This is atrocious!Please initiate action @Collector_YDR https://t.co/2EvkS7RGnE— KTR (@KTRBRS) August 26, 2024 మరోవైపు.. అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారంపై కూడా కేటీఆర్ ప్రశ్నించారు.‘పసి పిల్లల ప్రాణాలతో కాంగ్రెస్ సర్కార్ చెలగాటం??. అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు ఆహారంగా కుళ్లిన గుడ్లు. భువనగిరి, పెద్దవాడ సమ్మద్ చౌరస్తా అంగన్వాడీ కేంద్రంలో.. ఆ కుళ్లిన గుడ్లు చిన్న పిల్లలు తింటే ఏంటి పరిస్థితి?. చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి ఎక్కడ?. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఏం చేస్తున్నట్లు?. ఓ వైపు గురుకులాల్లో మరణాలు.. మరోవైపు అంగన్వాడీల్లో అడుగడుగునా అలసత్వం. పిల్లల పాలిట యమపాశంగా తయారైన కాంగ్రెస్ సర్కార్? అంటూ ట్విట్టర్లో కామెంట్స్ చేశారు. -
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే టార్గెట్‌గా ‘హైడ్రా’
సాక్షి, హైదరాబాద్: ప్రజలు విష జ్వరాలతో బాధపడుతున్నా, రైతులు రుణమాఫీ కోసం ధర్నాలు చేస్తున్నా పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం.. డైవర్షన్ పాలిటిక్స్‌తో మైండ్‌గేమ్ ఆడుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ఆదివారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ప్రభుత్వం ‘హైడ్రా’పేరుతో డ్రామా నడుపుతోందని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే టార్గెట్‌గా రాజకీయ కుట్రలకు తెరలేపిందని విమర్శించారు. డెంగీ, మలేరియా, చికున్‌గున్యాతో ప్రజలు చనిపోతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు లేదన్నారు.తెలంగాణ ఉద్యమకారుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డిని ఇబ్బంది పెట్టేలా రాజకీయం నడుపుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ కండువా కప్పుకోకపోతే ఇబ్బంది పెడతాం.. అన్నట్లుగా రేవంత్ తీరు ఉందని మండిపడ్డారు. పటాన్చెరు ఎమ్మెల్యేపై అక్రమ మైనింగ్ కేసులు పెట్టారని, రూ.300 కోట్ల ఫైన్ వేసి నానా ఇబ్బందులు పెట్టి కాంగ్రెస్ కండువా కప్పారని అన్నారు. కాంగ్రెస్ కండువా కప్పగానే మైనింగ్ కేసు అటకెక్కిందని, ఇప్పుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డిని కూడా ఇబ్బందిపెట్టేలా అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పల్లాపై 6 కేసులు పెట్టారని, ఆయన భార్య, పిల్లలపై కూడా కేసులు పెట్టారని విమర్శించారు. అధికారం ఉందని రాత్రికి రాత్రే కూల్చడాలు సరికాదన్నారు. రాజకీయ కక్షలను విద్యాసంస్థలు, ఆసుపత్రులపై రుద్దవద్దని పేర్కొన్నారు. మంత్రులు రుణమాఫీపై కుంటిసాకులు చెపుతున్నారని, రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయమంటే స్పందించడం లేదని అన్నారు. రేవంత్ ప్రభుత్వం ఎనిమిది నెలల్లో రూ.65 వేల కోట్ల అప్పు చేసిందని, అంటే నెలకు రూ.8,125 కోట్ల చొప్పున వచ్చే ఐదేళ్లలో చేయబోయే అప్పు రూ.4.87 లక్షల కోట్లు అని లెక్కించారు. కాగా, బీఆర్ఎస్ ప్రభుత్వం 9 సంవత్సరాలలో రూ.4,26,000 కోట్ల అప్పు మాత్రమే చేసిందన్నారు. -
వాల్మీకి స్కాంలో ఉన్న కాంగ్రెస్ నేతలెవరు?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కర్ణాటకలో వాల్మీకి స్కాం తీగ లాగితే డొంకంతా తెలంగాణ కాంగ్రెస్ నేతల వైపు కదులుతోందని భారత్ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీ రామారావు (కేటీఆర్) ఆరోపించారు. తెలంగాణలోని కీలకమైన కాంగ్రెస్ నేతల హస్తం ఈ వ్యవహారంలో ఉన్నట్లు ఆధారాలు లభిస్తున్నప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. వాల్మీకి స్కామ్‌లో భారీగా అవినీతి జరిగిందని స్వయంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యనే అసెంబ్లీలో అంగీకరించిన నేపథ్యంలో ఈ స్కామ్‌లో ఉన్న వారందరి పేర్లు బయటకు రావాల్సి ఉందన్నారు. బీఆర్ఎస్ పార్టీ యూట్యూబ్ చానల్ ద్వారా ఆదివారం కేటీఆర్ మాట్లాడుతూ వాల్మీకి స్కాంకు సంబంధించి పలు ప్రశ్నలు సంధించారు. రూ. 180 కోట్లు దారిమళ్లాయి.. ఎన్నికలకు ముందు దాదాపు రూ.180 కోట్ల ప్రభుత్వ సొమ్ము, ప్రభుత్వ అకౌంట్ల నుంచి ఏ కారణం లేకుండా అక్రమంగా దారి మళ్లిందని ఆయన ఆరోపించారు. ఈ సొమ్ము ఎవరి ఖాతాలోకి బదిలీ అయిందో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని, అందులో రూ.45 కోట్లు హైదరాబాద్‌లోని 9 బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశారని, ఆ బ్యాంక్ ఖాతాలు ఎవరివో తేల్చాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ వ్యవహారం బయటకు రాగానే వాల్మీకి కార్పొరేషన్ అకౌంట్స్ సూపరింటెండెంట్ ఆత్మహత్య చేసుకోవటం మరింత అనుమానాలకు తావిస్తోందన్నారు. వీ6 పేరుతో ఉన్న బిజినెస్ సంస్థకు రూ.4.5 కోట్లు బదిలీ చేసినట్లు వార్తలు వస్తున్నాయని, అసలు ఆ సంస్థ యాజమాని ఎవరో ప్రజల ముందుంచాలని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆ డబ్బే వాడారా? మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఈ డబ్బే వాడినట్లుందని కేటీఆర్ అనుమానం వ్యక్తం చేశారు. వాల్మీకి స్కాం వ్యవహారంలో హైదరాబాద్‌లో సిట్, సీఐడీ, ఈడీ దాడులు నిర్వహించినప్పటికీ సీఎం రేవంత్ సహా కాంగ్రెస్ నేతలు మీడియాలో ఆ వార్తలు బయటకు రాకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో కొన్ని బార్లు, బంగారు దుకాణాల నుంచి భారీగా నగదు తీసుకొచ్చినట్టు సమాచారం ఉందని, ఆ బార్లు, బంగారం దుకాణాలను నడుపుతున్న వారితో కాంగ్రెస్ పారీ్టకి ఉన్న సంబంధం ఏమిటని ఆయన ప్రశ్నించారు. సిద్దిరామయ్యను తొలగిస్తే తెలంగాణ సర్కార్ కూలుతుందా? కర్ణాటక సీఎం సిద్దిరామయ్యను తొలగిస్తే తెలంగాణలో కూడా ప్రభుత్వం కూలిపోతుందని కర్ణాటక మంత్రి సతీష్ జారకిహోళి వ్యాఖ్యానించడం వెనుక ఆంతర్యం ఏమిటని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ వాల్మీకి స్కాంతోనే కర్ణాటక, తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య బంధం పెనువేసుకుందా అన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ స్కాంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలున్నట్లు ఆధారాలు కనబడుతున్నప్పటికీ ఈడీ ఎందుకు మౌనంగా ఉందో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. పార్లమెంటులో అవినీతిపై పెద్ద ఎత్తున మాట్లాడే రాహుల్ గాంధీ ఈ వాల్మీకి స్కాం విషయమై ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. వెంటనే రాహుల్ ఈ విషయంపై స్పందించాలని, మొత్తం వ్యవహారంలో ఉన్న పెద్ద చేపల పేర్లను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. -
ఆ స్కామ్‌తో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు లింకేంటి?.. కేటీఆర్ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: కర్ణాటకలో జరిగిన భారీ వాల్మీకి కుంభకోణంతో తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు లింక్ ఉందంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘‘హైదరాబాద్‌లోని 9 మంది బ్యాంకు ఖాతాదారులకు వాల్మీకి కార్పొరేషన్ డబ్బు రూ. 45 కోట్లు బదిలీ చేశారు. అవి ఎవరి అకౌంట్లు?. "V6 బిజినెస్" యజమాని ఎవరు, ఈ ఖాతాకు రూ. 4.5 కోట్లు ఎందుకు బదిలీ చేశారు?.’’ అంటూ కేటీఆర్ ప్రశ్నలు గుప్పించారు.‘‘లోక్‌సభ ఎన్నికల సమయంలో హైదరాబాద్‌లో నగదు విత్‌డ్రా చేయబడిన బార్లు, బంగారు దుకాణాలు ఎవరివి? కాంగ్రెస్ పార్టీతో వీరికి సంబంధం ఏమిటి?. హైదరాబాద్‌కు ఇన్ని లింకులు కనపడుతున్నా తెలంగాణ కాంగ్రెస్ నాయకులను ఎవరు కాపాడుతున్నారు? రాహుల్ గాంధీ ఈ స్కాం గురించి నోరు విప్పాలి’’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు.✳️ కర్ణాటకలో జరిగిన భారీ వాల్మీకి కుంభకోణంతో తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు లింక్!✳️ హైదరాబాద్‌లోని 9 మంది బ్యాంకు ఖాతాదారులకు వాల్మీకి కార్పొరేషన్ డబ్బు రూ. 45 కోట్లు బదిలీ చేశారు. అవి ఎవరి అకౌంట్లు?✳️ "V6 బిజినెస్" యజమాని ఎవరు, ఈ ఖాతాకు రూ. 4.5 కోట్లు ఎందుకు బదిలీ చేశారు?✳️… pic.twitter.com/0X1DiQIh4b— KTR (@KTRBRS) August 25, 2024 -
వారిని భయపెట్టాలనుకుంటున్నారు.. హైడ్రా కూల్చివేతలపై ఈటల ఫైర్
సాక్షి, వికారాబాద్: హైడ్రా కూల్చివేతలపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సామాన్యులను, మధ్యతరగతి వారిని భయపెట్టాలని చూస్తున్నారంటూ ధ్వజమెత్తారు. సామాన్య ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి నిద్ర లేకుండా చేస్తున్నారన్నారు. 40, 50 ఏళ్ల క్రితమే ఎఫ్టీఎల్లో పట్టా భూములకు ప్రభుత్వ అనుమతులతో సామాన్యులు ఇళ్లు కట్టుకున్నారు. సాహెబ్‌నగర్, సరూర్ నగర్, ఫాక్స్‌సాగర్ వద్ద ప్రభుత్వం అనుమతులు ఇచ్చి ఇళ్లు కట్టింది’’ అని ఈటల పేర్కొన్నారు.పెద్దవాళ్లవి కూల్చితే మంచిదే. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి వచ్చినప్పుడే పుట్టలేదు. వందల ఏళ్ల నుంచి ఉన్న పార్టీ. ఇప్పుడు ఏదో నాలుగు రోజులు హీరో అన్నట్లు హైడ్రామా చేస్తున్నారు. గతంలో అయ్యప్ప సొసైటీలో కూల్చివేతలు చేసి కేసీఆర్ ఫోజులు కొట్టారు’’ అంటూ ఈటల ఎద్దేవా చేశారు. -
హైడ్రాకు సవాల్.. జీహెచ్ఎంసీ ఆఫీసు కూల్చేస్తారా?: ఎంపీ అసద్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ‘హైడ్రా’ కూల్చివేతల అంశం హాట్ టాపిక్‌గా మారింది. హైదరాబాద్ కట్టడాల కూల్చివేతలపై ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. తాజాగా ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హుస్సేన్ సాగర్ వద్ద నిర్మించిన ప్రభుత్వ కార్యాలయాలను ఏం చేయబోతున్నారని ఆయన నిలదీశారు.కాగా, హైదరాబాద్ నగరంలో హైడ్రా కూల్చివేతలపై తాజాగా అసదుద్దీన్ స్పందించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన భవనాలను కూల్చి వేస్తున్న అధికారులు ఆ పరిధిలో నిర్మించిన ప్రభుత్వ కార్యాలయాలను కూడా కూల్చివేస్తారా?. హుస్సేన్ సాగర్ వద్ద నిర్మించిన ప్రభుత్వ కార్యాలయాల సంగతి ఏంటి?. అక్కడ నిర్మించిన ఆఫీసులను ఏం చేయబోతున్నారు. నెక్లెస్ రోడ్డును కూడా తొలగిస్తారా?. నెక్లెస్ రోడ్డు ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది కదా?. మరి దాన్ని కూడా తవ్వేస్తారా?. గ్రేటర్ మున్సిపల్ హైదరాబాద్ కార్యాలయం కూడా నీటి కుంటలో నిర్మించినదే. మరి జీహెచ్ఎంసీ కార్యాలయాన్ని కూడా కూల్చేస్తారా? అంటూ అసదుద్దీన్ ప్రశ్నించారు. దీంతో, అసద్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.మరోవైపు.. అక్రమ కట్టడాల కూల్చివేతపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌ను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. ఎలాంటి ఒత్తిడి వచ్చినా చెరువుల్లోని అక్రమ నిర్మాణాలను కూల్చేవేయాలనే నిర్ణయించాం. అలాగే, ప్రత్యక్షంగా ప్రభుత్వంలో భాగస్వాములైన వారి కట్టడాలను కూడా కూల్చివేస్తాం. చెన్నై, ఉత్తరాఖండ్, వయనాడ్‌లో ఏం జరిగిందో అందరూ చూశారు. చెరువుల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత భవిష్యత్ తరాల కోసం చేపట్టాం. ఎలాంటి ఒత్తిడి వచ్చినా చెరువుల్లోని అక్రమ నిర్మాణాలను కూల్చేవేయాలనే నిర్ణయించాం. అందుకే హైడ్రాను ఏర్పాటు చేశాం. అక్రమ నిర్మాణాలు వదిలేస్తే నేను ప్రజాప్రతినిధిగా విఫలమైనట్టే. అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు అందరూ సహకరించాలి. ఎవరు ఎంత ఒత్తిడి తెచ్చినా చెరువులను ఆక్రమించిన వారి భరతం పడతాం. చెరువుల్లో అక్రమ నిర్మాణాలను వదిలేది లేదు. రాజకీయం కోసమో.. నాయకులపై కక్ష కోసం కూల్చివేతలు చేయడం లేదు. చెరువుల ఆక్రమణదారుల్లో ప్రభుత్వాలను ప్రభావితం చేసేవారు కూడా ఉన్నారు. ప్రత్యక్షంగా ప్రభుత్వంలో భాగస్వాములైన వారు కూడా ఉండవచ్చు. హైడ్రా తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగుతుందన్నారు. -
అక్రమ నిర్మాణాలు ఎవరు కట్టినా కూల్చడమే: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: నగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌ను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. ఎలాంటి ఒత్తిడి వచ్చినా చెరువుల్లోని అక్రమ నిర్మాణాలను కూల్చేవేయాలనే నిర్ణయించినట్టు చెప్పుకొచ్చారు. అలాగే, ప్రత్యక్షంగా ప్రభుత్వంలో భాగస్వాములైన వారి కట్టడాలను కూడా కూల్చివేస్తామని కామెంట్స్ చేశారు.కాగా, సీఎం రేవంత్ ఆదివారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘హైదరాబాద్ లేక్ సిటీ. గండిపేట, ఉస్మాన్ సాగర్.. హైదరాబాద్ దాహార్తిని తీర్చుతున్నాయి. కొందరు ధనవంతులు చెరువుల పక్కనే ఫాంహౌస్‌లు కట్టుకున్నారు. చెరువుల్లో శ్రీమంతులు ఫాంహౌస్‌లు కట్టుకున్నారు. డ్రైనేజీలను చెరువుల్లో కలుపుతున్నారు. ఆ ఫాం హౌస్‌ల నాలాలు గండిపేటలో కలిపారు. హైదరాబాద్‌ను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. చెన్నై, ఉత్తరాఖండ్, వయనాడ్‌లో ఏం జరిగిందో అందరూ చూశారు. చెరువుల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత భవిష్యత్ తరాల కోసం చేపట్టాం. ఎలాంటి ఒత్తిడి వచ్చినా చెరువుల్లోని అక్రమ నిర్మాణాలను కూల్చేవేయాలనే నిర్ణయించాం. అందుకే హైడ్రాను ఏర్పాటు చేశాం.అక్రమ నిర్మాణాలు వదిలేస్తే నేను ప్రజాప్రతినిధిగా విఫలమైనట్టే. అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు అందరూ సహకరించాలి. ఎవరు ఎంత ఒత్తిడి తెచ్చినా చెరువులను ఆక్రమించిన వారి భరతం పడతాం. చెరువుల్లో అక్రమ నిర్మాణాలను వదిలేది లేదు. ఆక్రమణదారుల చెర నుంచి చెరువులకు విముక్తి కలిగిస్తాం. రాజకీయం కోసమో.. నాయకులపై కక్ష కోసం కూల్చివేతలు చేయడం లేదు. చెరువుల ఆక్రమణదారుల్లో ప్రభుత్వాలను ప్రభావితం చేసేవారు కూడా ఉన్నారు. ప్రత్యక్షంగా ప్రభుత్వంలో భాగస్వాములైన వారు కూడా ఉండవచ్చు. సమాజాన్ని ప్రభావితం చేసేవారు ఉండొచ్చు. కానీ, నేను ఎవరినీ పట్టించుకోను. హైడ్రా తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగుతుంది. భవిష్యత్ తరాలకు ప్రకృతిని అందించాలి’ అంటూ కామెంట్స్ చేశారు. -
హైడ్రా పేరుతో వేధింపులు.. ఇదేం రాజకీయం: హరీష్ ఫైర్
సాక్షి, తెలంగాణభవన్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టేలా కాంగ్రెస్ సర్కార్ రాజకీయాలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయంగా ఎదుర్కోలేక వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.కాగా, హరీష్ రావు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ నేతలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ప్రతిపక్షాలను కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ చేసింది. కాంగ్రెస్ కండువా కప్పుకోండి.. లేదంటే టార్గెట్ చేస్తాం అంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. హైడ్రా పేరుతో రాత్రికి రాత్రే కూల్చివేతలు చేస్తున్నారు. మానసికంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై రాజకీయ కుట్రతోనే ఆరు కేసులు నమోదు చేశారు. రాజేశ్వర్ రెడ్డిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. గతంలోనే ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లో లేవని పల్లా విద్యాసంస్థలకు అనుమతి ఇచ్చారు. రెవెన్యూ, ఇరిగేషన్ సంయుక్త సర్వే చేసి రిపోర్టు ఇచ్చాయి. అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నిర్మాణాలకు ఎన్వోసీ ఇచ్చారు. హెచ్ఎండీఏ అనుమతితోనే పల్లా.. విద్యా సంస్థల నిర్మాణం చేశారు. ఆసుపత్రులు, విద్యా సంస్థలపై రాజకీయ కక్ష సాధింపులు వద్దు. రాజకీయంగా ఎదుర్కొలేకనే పల్లాపై వేధింపులకు దిగుతున్నారు. హైడ్రాను కేవలం రాజకీయంగా కక్ష సాధింపులకు మాత్రమే వాడుకుంటుందని ఆరోపించారు.ఇక, అంతకుముందు పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణకు చెందిన విద్యా సంస్థలను కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ చేసింది. నాదం చెరువులో ఒక్క ఇంచ్ అక్రమ నిర్మాణం ఉన్నట్టు తేలితే నేనే కూల్చివేస్తాను. అన్ని అనుమతులు తీసుకుని మా విద్యా సంస్థల నిర్మాణం చేపట్టాం. నాపై రాజకీయ కక్ష సాధింపు చేస్తున్నారు. మాపై ఇప్పటికే ఆరు కేసులు నమోదయ్యాయి అంటూ కామెంట్స్ చేశారు. -
హైడ్రా పేరుతో హైడ్రామా.. కూల్చివేతలపై కిషన్ రెడ్డి మండిపాటు
సాక్షి, న్యూఢిల్లీ: హైడ్రా కూల్చివేతలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో హైడ్రా పేరుతో ప్రభుత్వం హైడ్రామా నడిపిస్తోందని మండిపడ్డారు. గతంలో అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన ప్రభుత్వమే ఇప్పుడు కూల్చివేతలు చేస్తోందని విమర్శలు గుప్పించారు. అప్పుడు ఎలా అనుమతులు ఇచ్చారని, అక్రమ నిర్మాణాలకు రోడ్డు, విద్యుత్ సదుపాయము, నీటి సదుపాయం ఎలా కల్పించారని ప్రశ్నించారు.ఈ మేరకు ఢిల్లీలో కిషన్ రెడ్డి శనివారం మాట్లాడుతూ.. అక్రమ నిర్మాణాలకు రోడ్లను నిర్మించి సదుపాయాలు ఎలా కల్పించారని ప్రశ్నించారు. ఇప్పుడు అవన్నీ కూడా లోతుగా చర్చించాల్సిందేనని అన్నారు. ఏ చర్యలైనా, చట్టమైనా అందరికీ సమానంగా వర్తింప చేయాలని, ఇష్టం వచ్చినట్లు చేస్తామంటే సరికాదని హితవు పలికారు. గతంలో అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
కేటీఆర్‌కు నిరసన సెగ.. మహిళా కమిషన్ వద్ద ఉద్రికత్త
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర మహిళా కమిషన్ ఆఫీసుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు. ఈ క్రమంలోనే కేటీఆర్ వ్యాఖ్యలకు వ్యతిరేకరంగా నిరసనలు తెలుపుతున్నారు.కాగా, రాష్ట్ర మహిళా కమిషన్(బుద్ధ భవన్) ఆఫీసు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్న మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా కేటీఆర్‌ను కమిషన్ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మహిళా కమిషన్ ముందు వివరణ ఇచ్చేందుకు ఆఫీసుకు వచ్చిన కేటీఆర్ ఆరోజు ఆఫీసుకు వచ్చారు. కేటీఆర్ వస్తున్న నేపథ్యంలో మహిళా కాంగ్రెస్ నేతలు కమిషన్ వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. అనంతరం, కేటీఆర్ అక్కడికి చేరుకోగానే మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు కేటీఆర్ వాహనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు. కేటీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహిళలకు కేటీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో, అక్కడే ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు.. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో, బందోబస్తులో ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో అక్కడ తోపులాట, ఉద్రికత్త చోటుచేసుకుంది. ఈ తోపులాటలో పలువురు గాయపడినట్టు తెలుస్తోంది. మరోవైపు.. బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగినట్టు కూడా సమాచారం. -
రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలి
నిర్మల్ చైన్‌గేట్: రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివ రకు ఎంతమందికి రు ణమాఫీ చేసిందో శ్వేత పత్రం విడుదల చే యాలని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వ ర్‌రెడ్డి డిమాండ్ చేశా రు. ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరి పంట రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ ఆర్డీవో కార్యాలయం ఎదుట శుక్రవారం బీజేపీ ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేశారు.ఈ సందర్భంగా మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇప్పటి వరకు సగం మందికి మాత్రమే రుణమాఫీ జరిగిందని చెపుతుంటే, సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం పూర్తిస్థాయిలో రుణమాఫీ జరిగిందని ఒట్లు వేస్తూ దేవుళ్లను కూడా మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ నెలాఖరులోపు రైతులందరికీ రుణమాఫీ చేయకుంటే హైదరాబాద్‌లోని ధర్నాచౌక్‌లో నిరవధిక నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు.కొర్రీలొద్దు.. కోతలొద్దు: రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి కొర్రీలు, కోతలు లేకుండా తక్షణమే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని ఆదిలాబాద్ ఎంపీ నగేశ్ డిమాండ్ చేశారు. రైతు దీక్షలో ఆయన మాట్లాడుతూ, అందరి రుణాలు మాఫీ అయ్యేవరకు రైతుల పక్షాన పోరాడతామన్నారు. కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోవడంతో ఎంతోమంది రైతులు రుణమాఫీకి దూరమయ్యా రన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు అంజు కుమార్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మోహన్‌రావు పటేల్ పాల్గొన్నారు. -
చేతకాని సన్నాసి సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రంలో ఎక్కడా చారాణా రుణమాఫీ కాలేదు. ఆ తప్పు.. ఈ చేతకాని సన్నాసి సీఎం రేవంత్‌రెడ్డిది. రేవంత్‌రెడ్డీ నీ భాషలోనే చెబుతున్నా.. నువ్వు మగాడివైతే..బ్యాంకు అధికారులు, వ్యవసాయ అధికారులను అడ్డం పెట్టుకొని కాదు.. పోలీసు సెక్యూరిటీ లేకుండా ఊళ్లలోకి రా..నువ్వు ఏ ఊరికి పోదామో చెప్పు. అక్కడికి వెళ్లి రుణమాఫీ అయ్యిందా అనే విషయాన్ని అడుగుదాం’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు. కాంగ్రెస్ వారు ఊళ్లలోకి వస్తే తరిమికొట్టాలన్న ఆలోచనతో రైతులు ఉన్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.అయితే రుణమాఫీ విషయంలో పోలీసులు, వ్యవసాయ అధికారులను తప్పు పట్టాల్సిన పనిలేదని, ఆ తప్పు సీఎం రేవంత్‌దే అన్నారు. తిరుమలగిరిలో బీఆర్ఎస్ ధర్నా శిబిరంపై జరిగిన దాడి, బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ శ్రేణుల దాడులు, పోలీసు నిర్లక్ష్య వైఖరిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ సీనియర్ నేతలు శుక్రవారం డీజీపీ జితేందర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఇతర నాయకులతో కలిసి డీజీపీకి వినతిపత్రం ఇచ్చారు. రుణమాఫీ జరిగిన తీరుపై ముఖ్యమంత్రి సొంత ఊరు కొండారెడ్డిపల్లికి పోయిన ఇద్దరూ మహిళా జర్నలిస్టుల పైన, ఇతర జర్నలిస్టులపైన దాడి చేసిన తీరుపై కూడా ఫిర్యాదు చేశారు.అనంతరం డీజీపీ కార్యాలయ ఆవరణలో కేటీఆర్, జగదీశ్‌రెడ్డిలు మీడియాతో మాట్లాడారు. తుంగతుర్తిలో ప్రజాస్వామ్యపద్ధతిలో శాంతియుతంగా చేస్తున్న రైతు నిరసన దీక్షపై కాంగ్రెస్ గుండాలు ఆకస్మికంగా రాళ్లు, సుతిలి బాంబులతో దాడి చేశారని కేటీఆర్ ఆరోపించారు. ‘మా వారు తిరగబడి ఉంటే కాంగ్రెస్ నాయకులు ఒక్కరు కూడా మిగలరు. కానీ శాంతియుతంగా నిరసన తెలపాలనే మేం ప్రతిఘటనకు పాల్పడలేదు’ అన్నారు. రుణమాఫీపై ప్రజల్లోకి పోయి సమాధానం చెప్పలేని దద్దమ్మ రేవంత్‌రెడ్డిఅని, క్షేత్రంలో తిరగాల్సిన సీఎం ంఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారని ఎద్దేవా చేశారు.కొండారెడ్డిపల్లిలో దాడికి గురైన మహిళా జర్నలిస్టులకు సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారం ఒక పార్టీకి శాశ్వతం కాదని, పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించొద్దని కేటీఆర్ సూచించారు. తిరుమలగిరి ఘటనలో దాడి చేసిన వారిపై కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. డీజీపీని కలిసినవారిలో ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, మాజీ ఎమ్మెల్యేలు డా.గాదరి కిశోర్, ఆర్.రవీంద్రకుమార్, చిరుమర్తి లింగయ్య, ఎన్.భాస్కర్‌రావు, కంచర్ల భూపాల్‌రెడ్డి, బూడిద బిక్షమయ్యగౌడ్, నోముల భగవత్ తదితరులు పాల్గొన్నారు. వాళ్లవి ముందు కూల్చండి ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో ఉన్న అన్ని నిర్మాణాలను కూల్చాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన పొంగులేటి, వివేక్, కేవీపీ, మధుయాష్కీ వంటి నేతల భవనాలను కూల్చేసి.. ఆ తర్వాత సామాన్యుల భవనాలను కూల్చేయండి అని పేర్కొన్నారు. ‘చలో ఢిల్లీ కాదు..చలో పల్లె’ చేపట్టాలి రుణమాఫీ జరగక లక్షలాది మంది రైతులు రగిలిపోతుంటే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాత్రం ఢిల్లీ యాత్రలు చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. సీఎం రేవంత్ ‘చలో ఢిల్లీ’కి బదులుగా ‘చలో పల్లె’ చేపట్టాలని సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో పేర్కొన్నారు. డెంగీ మరణాలు, పెరుగుతున్న నేరాలు, రైతుల ఆందోళనలు రాష్ట్రంలో పాలన గాడి తప్పడాన్ని సూచిస్తున్నాయన్నారు. విపత్కర పరిస్థితుల్లో సీఎం, మంత్రులు పార్టీ అధిష్టానం ఆశీస్సుల కోసం పాకులాడకుండా ప్రజల నడుమకు వెళ్లాలని సూచించారు. లేనిపక్షంలో తెలంగాణ సమాజం ఏదో ఒక రోజు సీఎం కుర్చీ లాగేస్తుందని కేటీఆర్ హెచ్చరించారు. -
ఈ ఇద్దరిలో ఎవరో?
మంత్రివర్గ విస్తరణపై అస్పష్టత రాష్ట్ర కాంగ్రెస్ నేతలంతా ఉత్సుకతతో ఎదురుచూస్తున్న మంత్రివర్గ విస్తరణపై ఏఐసీసీ పెద్దలు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. తాజా భేటీలో మంత్రివర్గ కూర్పుపై అభిప్రాయ సేకరణకు పరిమితమైన అధిష్టానం.. దానిపై మరోమారు చర్చిద్దామంటూ వాయిదా వేసినట్లు తెలిసింది. పీసీసీ అధ్యక్షుడి నియామకమయ్యాక దీనిపై చర్చిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇక బీఆర్ఎస్ నుంచి పారీ్టలో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావ్, కాలె యాదయ్య, సంజయ్‌కుమార్, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిలకు సంబంధించి కొన్ని డిమాండ్లు ఉన్నాయంటూ.. వీరికి కార్పొరేషన్ పదవులు కట్టబెట్టాలనే ప్రతిపాదనను హైకమాండ్ ముందు రాష్ట్ర నేతలు ఉంచినట్లు తెలిసింది. దీనికి హైకమాండ్ అంగీకరించినట్లు సమాచారం. సాక్షి, న్యూఢిల్లీ: టీపీసీసీకి కొత్త అధ్యక్షుడి ఎంపిక వ్యవహారంలో కాంగ్రెస్ అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చింది. తెలంగాణ పార్టీ పగ్గాలను బీసీ నేతకు అప్పగించాలనే అభిప్రాయానికి ఢిల్లీ పెద్దలు వచ్చి నట్లు తెలుస్తోంది. రాష్ట్ర నేతలు వెలిబుచ్చిన అభిప్రాయాలు, సామాజిక సమీకరణాలు పరిగణనలోకి తీసుకున్న హైకమాండ్.. బీసీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేతలైన మహేశ్‌కుమార్ గౌడ్, మధుయాష్కీ గౌడ్‌లలో ఒకరికి పీసీసీ అధ్యక్ష పదవి కట్టబెట్టే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. శుక్రవారం ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ పార్టీ ముఖ్యులతో జరిగిన చర్చల్లో పీసీసీ అధ్యక్షుడి ఎంపిక కసరత్తు ఓ కొలిక్కి వచ్చిందని, ఏ క్షణమైనా ప్రకటన వెలువడే అవకాశం ఉందని ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. పీసీసీ అధ్యక్షుడి నియామక ప్రక్రియ పూర్తయిన తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, జిల్లాల వారీ ప్రాతినిధ్యం, సామాజిక సమీకరణలు, పారీ్టలో పనిచేసిన అనుభవం ఆధారంగా కొత్త మంత్రులపై నిర్ణయం ఉంటుందని సమాచారం. సుదీర్ఘ చర్చలు..: కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎంపికతో పాటు ప్రభుత్వంలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న కేబినెట్ పదవుల భర్తీపై గత నెల రోజులుగా తీవ్ర కసరత్తు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటికే పలుమార్లు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్‌గాం«దీ, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌లతో చర్చలు జరిపారు. మరోవైపు అధిష్టానం కూడా ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిల అభిప్రాయాన్ని తీసుకుంది.తాజాగా ఆయా అంశాలపై చర్చించేందుకు శుక్రవారం ఢిల్లీ వచ్చిన రేవంత్‌రెడ్డి, భట్టి, ఉత్తమ్‌లు పార్టీ ప్రధాన కార్యాలయంలో ఖర్గే, రాహుల్‌గాం«దీ, కేసీలతో మరోమారు భేటీ అయ్యారు. సుమారు రెండు గంటల పాటు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా అధిష్టానం ముఖ్య నేతలతో విడివిడిగా కూడా సమావేశమై వారి అభిప్రాయాలు తెలుసుకుంది. చర్చకు వచ్చిన ఆరు పేర్లు పీసీసీ పదవికి ప్రధానంగా ఆరుగురు నేతల పేర్లపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. బీసీ సామాజికవర్గం నుంచి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్, ఎస్సీ సామాజికవర్గం నుంచి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, ఎస్టీ సామాజికవర్గం నుంచి ఎంపీ బలరాం నాయక్, ఓసీ సామాజికవర్గం నుంచి మంత్రి శ్రీధర్‌బాబుల పేర్లను పరిశీలించినట్లు సమాచారం. అయితే రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రతిపక్ష పారీ్టలను ధీటుగా ఎదుర్కోవాల్సిన ఆవశ్యకతతో పాటు సామాజిక సమీకరణాలు దృష్టిలో ఉంచుకుని బీసీ సామాజికవర్గ నేతలకే పదవి కట్టబెట్టాలనే నిర్ణయానికి వచ్చారు.ముఖ్యంగా బీసీ నేతలకు కేంద్ర ప్రభుత్వ, పార్టీ పదవుల్లో బీజేపీ మొదటి ప్రాధాన్యత ఇస్తూ వారిని మచ్చిక చేసుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు పరిగణనలోకి తీసుకుని బీసీ వర్గ నేతలవైపే హైకమాండ్ పెద్దలు మొగ్గు చూపినట్లు తెలిసింది. వారిలో పార్టీ కార్యకలాపాల్లో మొదటినుంచీ చురుగ్గా ఉన్న మహేశ్‌గౌడ్ వైపు మెజార్టీ నేతలు మొగ్గు చూపగా, ఆయన ప్రస్తుతం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉండటంతో పాటు ఎమ్మెల్సీగా కొనసాగుతున్న దృష్ట్యా, మధుయాష్కీ పేరును పరిశీలించాలని మరికొందరు నేతలు అభిప్రాయపడినట్లు తెలిసింది.అయితే దీనిపై నిర్ణయాధికారం తమకు అప్పగించాలని, ఎవరి పేరును ప్రకటించినా పార్టీ నేతలంతా కలిసి పనిచేయాలని హైకమాండ్ పెద్దలు సూచించినట్లు తెలిసింది. మరోవైపు ఓసీ, ఎస్టీ, ఎస్సీ సామాజిక వర్గాలకు సైతం ప్రాధాన్యం ఇచ్చేలా ముగ్గురు వైస్ ప్రెసిడెంట్లను నియమించాలనే దానిపై భేటీలో ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. -
రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్దాం.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర డీజీపీ జితేందర్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ సీనియర్ నాయకులు శుక్రవారం మధ్యాహ్నం కలిశారు. డీజీపీ కార్యాలయంలో తుంగతుర్తి రైతులపై, గురువారం సీఎం రేవంత్ సొంతూరు కొండారెడ్డిపల్లిలో ఇద్దరు మహిళా జర్నలిస్టులపై జరిగిన దాడులపై డీజీపీకి కేటీఆర్ ఫిర్యాదు చేశారు. దాడులకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు.రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలపైనా డీజేపీకి ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో బాంబుల సంస్కృతి తిరిగి తీసుకువస్తున్నారని నేతలు ఆరోపించారు. పోలీసుల స్వయంగా ధర్నా శిబిరంపైన దాడి చేయడం టెంట్ పీకి వేయడం వంటి కార్యక్రమాల పైన అభ్యంతరం వ్యక్తం చేశారు.రాష్ట్రవ్యాప్తంగా కొంతకాలంగా పోలీసులు అత్యుత్సాహంతో ప్రవర్తిస్తున్నారని డీజేపీకి తెలియజేశారు. రాజకీయ ప్రమేయం జోక్యం వలన ప్రతిపక్ష నాయకులపైన పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని, హింసిస్తున్నారని తెలిపారు. కొండా సురేఖ పుట్టినరోజు వేడుకల్లో పోలీస్ అధికారులు పాల్గొనడం గుర్తుచేశారు.అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. రుణమాఫీ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. దీనిపై శాంతియుతంగా బీఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టిందని తెలిపారు. తిరుమలగిరిలో తమ నాయకుడు కిశోర్ ధర్నా చేస్తే.. పోలీసుల సమక్షంలోనే కాంగ్రెస్ కమూకలు దాడి చేశాయని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో హింస సరికాదని హితవు పలికారు. పోలీసుల సమక్షంలో కిరాయి మూకలు దాడి చేశాయని, పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రజలను భయబ్రాంతులను చేస్తున్నారని అన్నారు. ‘పోలీసులు మంత్రుల బర్త్ డేకార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. హైడ్రా పరిధిలో ఉన్న కాంగ్రెస్ నేతల ఫార్మ్ హౌస్‌లను కూల్చాల్సిందే. మంత్రి పొంగులేటికి అంత శ్రమ అవసరం లేదు. శాటిలైట్ ఇమేజెస్ ఉన్నాయి. మీ ఫార్మ్ హౌస్ కూల్చాలో లేదో రంగనాధ్ డిసైడ్ చేస్తారు. రేపు మహిళా కమీషన్ ముందు హాజరవుతా.నిన్న ప్రజాస్వామ్యబద్దంగా బిఆర్ఎస్ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండలంలో రైతులు ధర్నా చేస్తుంటే 50 మంది కాంగ్రెస్ నేతలు దాడి చేశారు. స్థానిక పోలీసు యంత్రాంగంతో కుమ్మక్కు అయ్యి దాడి చేశారు. సుతిల్ బాంబులు వేసి దాడులకు పాల్పడ్డారు. దాడులకు పోలీసులు మద్దతు తెలపడం అంటే రేవంత్ రెడ్డి దుర్మార్గపు పాలనకు పరాకాష్ట. రుణమాఫీపై రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్దాం..రేవంత్ రెడ్డి ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నాడు. సీఎం రేవంత్ రెడ్డి స్వంత గ్రామంలో ఇద్దరు మహిళా జర్నలిస్టులపై కాంగ్రెస్ వాళ్లు దాడులు చేశారు. కొండారెడ్డిపల్లి నుండి కల్వకుర్తి వరకు మహిళా జర్నలిస్టులను వాళ్ళను వెంబడించారు. సీఎం రేవంత్ రెడ్డిని ఏమీ అన్నారని వాళ్లపై దాడులు చేశారు. రేవంత్ రెడ్డి సిగ్గుంటే ఏ ఊరుకు వస్తావో చెప్పు. నేను వస్తా. రుణమాఫీ ఏ ఊరులో సంపూర్ణంగా జరిగిందో రేవంత్ రెడ్డి చెప్పాలి. సీఎంకు పరిపాలించే సత్తా లేదు. ఇద్దరు మహిళా జర్నలిస్టులపై జరిగిన దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు. -
కాంగ్రెస్‌ను విమర్శించే అర్హత బీఆర్ఎస్కు లేదు: మంత్రి పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: లక్ష రుణమాఫీ చేసేందుకు బీఆర్ఎస్కు ఐదేళ్లు పట్టిందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి. ఐదేళ్లైనా లక్ష రుణమాఫీ చేయని బీఆర్ఎస్కు కాంగ్రెస్‌ను విమర్శించే అర్హత ఉందా? అని ప్రశ్నించారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా రైతు రుణమాఫీ చేశామని తెలిపారు.ఈ మేరకు హైదరాబాద్‌లో శుక్రవారం మంత్రి మాట్లాడుతూ.. కేసీఆర్ ధనిక రాష్ట్రం అని అన్నారు కానీ.. ఖజానా మొత్తం ఖాళీగా ఉందని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన కొత్తలో అప్పు చూసి షాక్ అయ్యామని అన్నారు. దుబారా ఖర్చులు తగ్గించి రైతును రాజును చేసే పనిలో పడ్డామని చెప్పారు తమది రైతు ప్రభుత్వమని పేర్కొన్నారు. రెచ్చగొట్టేలా మాట్లాడుతున్న మాజీ మంత్రుల మాటలను ప్రజలు పట్టించుకోవద్దని సూచించారు.‘ఎన్ని ఇబ్బందులున్నా రుణమాఫీ చేశాం. మిగతా ఖర్చులు తగ్గించుకుని రైతులకు మేలుచేశాం. రూ. 2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్న రైతులు పైన ఉన్న మొత్తంచెల్లిస్తే రుణమాఫీ అవుతుంది. బీఆర్ఎస్లా మేం రూ. వేల కోట్లు దోచుకోలేదు. ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని ముందే చెప్పాంకేటీఆర్ ఆరోపణలకు కౌంటర్రేవంత్పైకేసు పెట్టినప్పుడు ఎఫ్ఐఆర్లో కేటీఆర్ ఇల్లు అని పెట్టారు. ఇప్పుడా ఇల్లు నాది కాదు అని కేటీఆర్ అంటున్నారు. నాపై అవాకులు చెవాకులు పేలుతున్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులే బఫర్ జోన్లో పాంహౌజ్ కట్టుకున్నారు. మీలాగా మీరు ఉండే ఇల్లు నాది కాదు అని చెప్పనునా ఇళ్ళు బఫర్ జోన్లో ఉన్నా.. ఎఫ్టీఎల్లో ఉన్నా మొత్తం పడగొట్టండి. కేటీఆర్ చౌకబారు విమర్శలు మానుకోండి.. కేటీఆర్ విమర్శలకు కట్టుబడి ఉండాలి. కొత్త టేప్ తెచ్చుకుని కొలవండి. నిబంధనలకు విరుద్ధంగా ఉంటే కూల్చాలని హైడ్రా అధికారులను ఆదేశిస్తున్నా’ అని తెలిపారు. -
బీఆర్ఎస్, బీజేపీ విలీనం ఎప్పటికీ జరగదు: ఎంపీ అర్వింద్
సాక్షి,నిజామాబాద్: బీఆర్ఎస్ బీజేపీలో ఎప్పటికీ విలీనం కాదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ స్పష్టం చేశారు. ఇది కొందరు చేస్తున్న ప్రచారం మాత్రమేనని కొట్టిపారేశారు. శుక్రవారం(ఆగస్టు23) అర్వింద్ నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్, కేటీఆర్, కవితను బీజేపీ ఎప్పటికీ దగ్గరకు రానివ్వదని చెప్పారు.తనకు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం నాందేడ్ జిల్లా ఇంఛార్జ్ బాధ్యతలు అప్పగించారని తెలిపారు. ‘బీజేపీ సిద్ధాంతాలకు, విలువలకు కట్టుబడే వారిని, పార్టీని గెలిపించేవారినే రాష్ట్ర బీజేపీ అధ్యకుడిగా ఎంపికచేయాలి. పార్టీ అభ్యర్థులను ఎన్నికలలో గెలిపించే సత్తా ఉన్నవారికి నాయకత్వ భాధ్యతలను అప్పగించాలి. రైతు రుణమాఫీ అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయింది. సీఎం రేవంత్ రెడ్డి రొటేషన్ చక్రవర్తిలా రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. పదేళ్లు ప్రజలను మోసం చేసిన కేసీఆర్ ఏమయ్యాడో అందరికీ తెలుసు. కేసీఆర్‌కు రేవంత్ కు తేడా లేదని ప్రజలు ఇప్పటికైనా గమనించాలి. రుణమాఫీలో పనికిమాలిన కండిషన్లు పెట్టి రైతులను దగా చేశారు. సంపూర్ణ రుణమాఫీ కోసం రేపు రైతు సంఘాలు రైతులు ఆర్మూరులో చేపడుతున్న మహాధర్నాకు బీజేపీ మద్దతు ఇస్తుంది’అని అర్వింద్ తెలిపారు. -
TG: కొత్త పీసీసీ చీఫ్ ఖరారు ! ముగిసిన ఏఐసీసీ కీలక భేటీ
సాక్షి,ఢిల్లీ: తెలంగాణ కొత్త పీసీసీ చీఫ్ ఎంపిక, కేబినెట్ విస్తరణపై శుక్రవారం(ఆగస్టు23) ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ హైకమాండ్ కీలక సమావేశం ముగిసింది. కొత్త పీసీసీ అధ్యక్ష పదవిపై ఈ సమావేశంలో ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ మహేష్‌కుమార్‌గౌడ్‌కు పీసీసీ చీఫ్ పదవి దక్కే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై రేపో మాపో అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. పీసీసీ రేసులో మధు యాష్కి, ఎస్టీ సామాజిక వర్గం నుంచి బలరాం నాయక్ , ఎస్సీ సామాజిక వర్గం నుంచి సంపత్ , అడ్లూరి లక్ష్మణ్ ఉన్నారు. పీసీసీ చీఫ్ ఎంపికతో పాటు కేబినెట్ విస్తరణపైనా ఏఐసీసీ సమావేశంలో చర్చించారు. సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ , సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం తెలంగాణ పీసీసీ చీఫ్‌గా సీఎం రేవంత్‌రెడ్డి కొనసాగుతున్నారు. -
ఇద్దరూ ఇద్దరే..! తగ్గేదేలే..!!
తెలంగాణలో విగ్రహాల పేరుతో సాగుతున్న రగడ చాలా అభ్యంతరకరంగా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి కాని... బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఇద్దరు నోటికి వచ్చినట్టు మాట్లాడడం పద్ధతిగా లేదు. తెలంగాణ సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలని రేవంత్ ప్రభుత్వం తలపెట్టింది. దానిని కేటీఆర్ వ్యతిరేకించారు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించి తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతామని ప్రకటించారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నేతలు స్పందించారు. మిగతా వారి సంగతి ఏలా ఉన్నా సీఎం స్థానంలో ఉన్న రేవంత్ మాటలు మరి దురుసుగా ఉన్నాయి. 'నీ అయ్య విగ్రహం కోసం దేశం కోసం ప్రాణం ఇచ్చిన రాజీవ్ గాంధీ విగ్రహం తీసివేస్తావా... నీకు అధికారం అనేది కలలో మాట. రాజీవ్ గాంధీ విగ్రహం దగ్గరకు పోతే వీపు చింతపడు అయితది. రాజీవ్ గాంధీ విగ్రహం తీయాడానికి తారిఖు చెప్పు. మా జగ్గన్నకు చెబుతా. ఆయన వచ్చి అక్కడ ఉంటాడు అప్పుడు తెలుస్తది అంటూ అక్కడ ఆగకూండా రాజీవ్ గాంధీ విగ్రహంను ముట్టుకుంటే.. చెప్పు తెగకపోతే చూస్తా" అని హెచ్చరించారు.కేటీఆర్ అసలు ఈ వివాదాన్ని లేవనెత్తాల్సిన అవసరం లేదు. ఒక వేళ అభ్యంతరం ఉంటే రాజీవ్ గాంధీ విగ్రహం అక్కడ పెట్టవద్దని... తెలంగాణ తల్లి విగ్రహంను ఏర్పాటు చేయాలని చెప్పవచ్చు. ఇప్పటికే మేధావులు పలువురు ఆ సూచన చేసారు. అంత వరకు ఆగకుండా కేటీఆర్ ఏకంగా రాజీవ్ విగ్రహాన్ని అధికారంలోకి వస్తే తొలగిస్తామని అంటూ... కాంగ్రెస్‌ను రెచ్చగోట్టారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి మరి అన్యాయంగా కేసీఆర్ ప్రస్తావన తెచ్చి అవమానించిన తీరు బాగాలేదు. "పోద్దున్న నుంచి రాత్రి వరకు తాగి ఫార్మ్ హౌస్ లో పోర్లాడే కేసీఆర్ విగ్రహం సచివాలయం ముందు ఉండాలా అంటూ దారుణంగా మాట్లాడారు". అంతే కాక వాళ్ల అయ్య పోయేది ఎప్పుడు... వీడు పెట్టేది ఏప్పుుడు అంటూ పరుష భాషను వాడడం ఏ మాత్రం సరికాదు. ఇది ఆయన హోదాకు ఏ మాత్రం తగదు.ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ ఏట్లాపడితే అట్లా మాట్లాడి హైలైట్ అయ్యేవారు. ఇప్పటికి అలాంటి పంథాను కొనసాగించాలని అనుకుంటే తెలంగాణ సమాజం హర్షించదు. అనవసరంగా కేసీఆర్ పేరు బయటకు తీసుకువచ్చి అది కూడా పిల్లల ముందు మాట్లడడం చాలా ఎబ్బెట్టుగా ఉంది. ఎంత కాదు అన్న కేసీఆర్... పదేళ్ల పాటు సీఎంగా పనిచేశారు అనే విషయం మర్చిపోకుడదు. తెలంగాణ రాష్ట్ర సాధనకు ఉద్యమాన్ని నడిపి దేశం అంతటి దృష్టిని కేసీఆర్ ఆకర్షించారు. ఈ రోజు రేవంత్ సీఎంగా ఉన్నారంటే అది కేసీఆర్ తెలంగాణ ఉద్యమ ఫలితమే కదా! ఓడిపోయినంత మాత్రాన కేసీఆర్ విలువ తగ్గుతుందా! కేసీఆర్ కూడా గతంలో కొన్నిసార్లు అభ్యంతరకరంగా మాట్లడిన సందర్భరాలు లేకపోలేదు. అయినప్పటికి రేవంత్ కామెంట్స్ శ్రుతిమించాయని చెప్పకతప్పదు.ఇక్కడ విషయం ఏమిటంటే ఇంకా నాలుగేళ్ల వరకు ఎన్నికలు జరగవు. అప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టే రాజీవ్ గాంధీ విగ్రహం జోలికి ఎవరు వెళ్లరు. అలాంటిది రాజీవ్ విగ్రహంను టచ్ చేయి... చెప్పు తెగుద్ది అంటూ రేవంత్ మాట్లడాల్సిన అవసరమే లేదు. ఒక పక్క బీఆర్ఎస్కు మళ్లీ అధికారం రాదు అంటునే... రేవంత్ ఈ కామెంట్స్ చేయాల్సిన అవసరం ఏముంది? అయితే కేటీఆర్ వ్యాఖ్యల పుణ్యామా అని రేవంత్ సర్కార్‌కు ఒక ఐడియా వచ్చినట్టు అయ్యింది. వెంటనే సచివాలయంలోనే తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామని... స్థలాన్ని కూడా పరిశీలించారు.డిసెంబర్ తొమ్మిది నాటికి అంటే సోనియా గాంధీ పుట్టిన రోజు నాటికి తెలంగాణ తల్లి విగ్రహం పెడతామని ప్రకటించారు. తెలంగాణ తల్లి విగ్రహాలకు సంబంధించి ఇంత కాలం క్రెడిట్ అంతా కేసీఆర్‌దే అని చెప్పాలి. తెలుగు తల్లి బదులు తెలంగాణ తల్లి విగ్రహాలను తయారు చేయించి అనేక చోట్ల ప్రతిష్టించేలా చర్యలు తీసుకున్నారు. బీఆర్ఎస్ ఆఫీసులో కూడా తెలంగాణ తల్లి విగ్రహం ఉంటుంది. ఎందువల్లో కాని సచివాలయంలో మాత్రం ఏర్పాటు చేయలేదు. ఇప్పుడు ఆ అవకాశాన్ని రేవంత్ వాడుకుంటున్నారు.ఇక రేవంత్ కామెంట్స్‌పై కేటీఆర్ కూడా ఘాటుగానే స్పందించారు. ఇందులోను అధ్వాన్నపు భాషా మాట్లడడం మర్యాదగా లేదు. తాము అధికారంలోకి రాగానే సచివాలయం పరిసరాల్లో ఉన్న చెత్తను ఊడ్చిపారేస్తామని కేటీఆర్ అనడం పద్దతి కాదు. రాజీవ్ గాంధీ ఒక మాజీ ప్రధాని అన్నది గుర్తించుకోవాలి. రేవంత్, కేటీఆర్ రగడలో సంబంధం లేని రాజీవ్ గాంధీ, కేసీఆర్‌ల పేర్లు తీసుకుని వారిద్దరిని అవమానిస్తూ మాట్లాడి స్థాయిని దిగజార్చుకున్నారు. రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కూడా చీఫ్ మినిస్టర్ బధులు.. చీప్ మినిష్టర్ అని అనడం, డిల్లీ గులాం అనడం రేవంత్ మానసిక రుగ్మత నుంచి త్వరగా కోలుకోవాలని కేటీఆర్ కామెంట్ చేశారు. మిగతా విషయాలు ఎలా ఉన్నా చెత్త అన్న పదాన్ని వాడడం కేటీఆర్ తప్పు అయితే... కేసీఆర్‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడం రేవంత్ తప్పు అని చెప్పాలి.అధికారం కొల్పోయిన బాధ కేటీఆర్‌కు ఉండవచ్చు. అయినా ఆయన కొంత సంయమనం పాటించి ఉంటే... వివాదం ఇక్కడి దాకా వచ్చేది కాదు. అదే టైంలో ఛాన్స్ దోరికింది కదా అని మాజీ సీఎం కేసీఆర్‌ను బూతులు తిట్టిన మాదిరిగా రేవంత్ మాట్లడడం ఆయన అధికార అహంకారాన్ని సూచిస్తుంది. ఈ పరిణామాలు అన్నిటిని గమనిస్తే రేవంత్, కేటీఆర్ ఇద్దరూ మానసిక రుగ్మతతో ఉన్నారన్న అభిప్రాయం ప్రజలలో కలుగుతుంది. తెలంగాణ సమాజానికి కాని, తెలుగు ప్రజలకు కాని వీరి వ్యాఖ్యలు ఏ మాత్రం అదర్శవంతం కాదు. నేతలు తమను ప్రజలు మెచ్చుకునేలా మాట్లాడాలి కాని... ఆసహ్యించుకునేలా మాట్లడితే వారికే నష్టం. కాకపోతే బీజేపీకి చోటు ఇవ్వకుండా, కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య డైలాగ్ వార్ నడుపుతుండడమే కొసమెరుపు.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
ఢిల్లీలో రేవంత్.. పీసీసీ చీఫ్ రేసులో ఆ ముగ్గురు?
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. నేడు కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో సీఎం రేవంత్ భేటీ కానున్నారు. కాగా, రాష్ట్ర పీసీసీ నూతన అధ్యక్ష పదవితోపాటు, మంత్రి వర్గ విస్తరణపై కాంగ్రెస్ పెద్దలతో చర్చించనున్నారు. మరోవైపు.. శుక్రవారం తెల్లవారుజామునే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీకి బయలుదేరారు.ఇక, గురువారం రాత్రి సీఎం రేవంత్ రెడ్డితోపాటు పార్టీ కోర్ కమిటీ సభ్యులైన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపా దాస్ మున్సీలు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు. ఈ సందర్భంగా నేడు ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో నూతన పీసీపీ చీఫ్, కేబినెట్ విస్తరణ, రైతులకు రుణమాఫీ చేసిన అంశాన్ని రాహుల్ గాంధీకి సీఎం రేవంత్ వివరించనున్నారు.పీసీసీ రేసులోకి కొత్త పేర్లు..ఇక, తెలంగాణ పీసీసీ చీఫ్ రేసులో కొత్త పేర్లు వినిపిస్తున్నాయి. సీఎం దక్షిణ తెలంగాణకి చెందిన వ్యక్తి కావడంతో ఉత్తర తెలంగాణ నేతకి పీసీసీ చీఫ్ ఇవ్వాలనే డిమాండ్ పార్టీలో వినిపిస్తున్నట్టు సమాచారం. సీఎం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ నేతలకే పీసీసీ ఇవ్వాలంటున్నారు. దీంతో, ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాల నుండి ఒక్కో పేరుతో షార్ట్ లిస్ట్ చేసినట్టు తెలుస్తోంది.వారి పేర్లు ఇలా.. ఎస్సీ సామాజికవర్గం నుండి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్.ఎస్టీ సామాజిక వర్గం నుండి బలరాం నాయక్.బీసీ సామాజిక వర్గం నుండి మధు యాష్కీ.ఇదిలా ఉండగా.. నేటి సమావేశంలోనే కేబినెట్ విస్తరణపై కూడా చర్చించే అవకాశం ఉంది. సీఎంతో సహా ఇప్పుడున్న 12 మంది మంత్రులకు అదనంగా మరో నలుగురిని మంత్రి మండలిలోకి తీసుకునేందుకు ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో మంత్రి పదవులను ఆశిస్తున్న ఎమ్మెల్యేలలో సుదర్శన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, ప్రేమసాగర్ రావు, మదన్ మోహన్ రావు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పరిగి రామ్మోహన్ రెడ్డి, గడ్డం వివేక్, శ్రీహరి ముదిరాజ్, బాలునాయక్, రామచంద్రనాయక్ ఉన్నారు. ఎమ్మెల్సీలు అమీర్ అలీఖాన్, కోదండరాం తదితరులు ఉన్నారు. -
రుణమాఫీపై చర్చకు సిద్ధమా?
జనగామ: కాంగ్రెస్ తొలుత రైతులకు ఇచ్చిన హామీ మేరకు పంట రుణమాఫీ చేసినట్టు భావిస్తే.. సీఎం రేవంత్‌రెడ్డి తనతో చర్చకు సిద్ధమా? అని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సవాల్ విసిరారు. సంపూర్ణ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ చౌరస్తా పోలీస్ కంట్రోల్ రూం ఏరియాలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ధర్నాలో హరీశ్‌రావు పాల్గొన్నారు.ఎక్కడైనా తేదీ ఖరారు చేసి కబురు పంపిస్తే జనగామ ఎమ్మెల్యే పల్లాను వెంట బెట్టుకుని వస్తామని.. ఆ దమ్ము, ధైర్యం సీఎంకు ఉందా? అని హరీశ్ అన్నారు. జనగామకు వచ్చి కొమురవెల్లి మల్లన్న, వరంగల్‌కు వెళ్లి భద్రకాళి, ములుగు సభలో సమ్మక్క, సారలక్క, భువనగిరికి వెళ్లి శ్రీ లక్ష్మీనర్సింహస్వామి, భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామిపై.. ఇలా ఏ ఊరికి వెళితే ఆ ఊరిలో పంట రుణమాఫీపై ఒట్టు వేసిన రేవంత్.. ఎలక్షన్లు ముగియగానే దైవ ద్రోహానికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, దేవీప్రసాద్, క్యామ మల్లేశం, తదితరులు పాల్గొన్నారు. -
రేవంత్ దైవద్రోహానికి పాల్పడ్డారు: హరీశ్
సాక్షి, యాదాద్రి: పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానని రేవంత్‌రెడ్డి చేసిన ప్రమాణం ఏమైందని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రశ్నించారు. ఆరు గ్యారంటీలతో పాటు పంద్రాగస్టులోపు రుణమాఫీ చేస్తామని యాదగిరిగుట్ట దేవుడిపై ఒట్టు పెట్టి రేవంత్‌రెడ్డి దైవ ద్రోహానికి పాల్పడ్డారన్నారు. గురువారం ఆలేరులో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన.. ముందుగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా యాదగిరిగుట్టలో విలేకరులతో మాట్లాడారు. తమ హక్కుల కోసం పోరాడుతున్న రైతులను పోలీస్‌యాక్ట్, లాఠీలతో ఆపలేరన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పగా చెప్పకుంటున్న ప్రజాపాలనలో ధర్నాలు నిషేధం అని రైతులకు పోలీసులు నోటీసులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి స్వగ్రామంలో జర్నలిస్టులపై దాడి చేశారన్నారు. రైతు రుణమాఫీపై రేవంత్‌రెడ్డి, ఆయన కేబినెట్ మంత్రులు తలోమాట మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. 42 లక్షల్లో 20 లక్షల మంది రైతులకే రుణమాఫీ జరిగిందని మంత్రులే చెబుతున్నారన్నారు. మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, తుమ్మల ఇంకా రుణమాఫీ పూర్తిగా కాలేదని చెప్పిన విషయాన్ని హరీశ్‌రావు గుర్తుచేశారు. రేవంత్‌రెడ్డి మాటతప్పి చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం కోసం లక్ష్మినరసింహస్వామి దగ్గరికి వచ్చామని, ఇందుకోసం ప్రత్యేక పూజలు చేశామని చెప్పారు. డిసెంబర్ 9 నుంచి రుణాల వడ్డీ కూడా ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ఒట్టు పెట్టి ప్రమాణం చేసిన అన్ని దేవాలయాలకు వెళ్లి పాప ప్రక్షాళనకు ఆలయాలను శుభ్రం చేస్తామని వెల్లడించారు. రైతుల పక్షాన త్వరలో కేసీఆర్ పోరురైతుల పక్షాన పోరాడేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరలో రాష్ట్రంలో యాత్ర చేపడతారని హరీశ్‌రావు వెల్లడించారు. ఆలేరులో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతుధర్నాలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కొందరికే రుణమాఫీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు. రాష్ట్రంలో ఏ ఊరికైనా పోదాం..రుణమాఫీ పూర్తిగా అయ్యిందా అంటే కాలేదన్నారు. రుణమాఫీ విషయంలో ప్రజలు మంత్రులను అడ్డుకునే పరిస్థితి వచ్చిందని చెప్పారు. రైతుల కోసం అసెంబ్లీలో కొట్లాడినం. బయట కొట్లాడుతున్నామన్నారు. రైతుబంధు పథకంలో 11 విడతల్లో రూ.72 వేల కోట్లు కేసీఆర్ ఇచ్చారని, రైతు బాగుంటే రాజ్యం బాగుంటదని కేసీఆర్ ఆలోచన చేశారన్నారు. ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మాట్లాడుతూ.. ప్రభుత్వం అన్నివర్గాల ప్రజలను మోసం చేసిందని చెప్పారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెండ్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ధర్నాను విజయవంతం చేసిన రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు ముఠాగోపాల్, వివేకానంద, కాలేరు వెంకటేష్, బండారి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్, నాయకులు గొంగిడి మహేందర్‌రెడ్డి, క్యామ మల్లేశం, కల్లూరి రామచంద్రారెడ్డి, గడ్డమీది రవీందర్, కర్రె వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. -
100% మాఫీ నిరూపిస్తే రాజీనామా
చేవెళ్ల: ‘రాష్ట్రంలోని ఏ గ్రామానికైనా నీవు, నేను ఇద్దరం కలిసి వెళ్దాం.. నీ స్వగ్రామం కొండారెడ్డిపల్లి అయినా, కొడంగల్ అయినా.. సరే. రుణమాఫీ వంద శాతం జరిగిందని నిరూపిస్తే నేను అక్కడికక్కడే రాజీనామా చేసి వెళ్లిపోతా..’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సీఎం రేవంత్‌రెడ్డికి సవాలు విసిరారు. సంపూర్ణ రుణమాఫీ డిమాండ్‌తో పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో మాజీ మంత్రి సబితారెడ్డి ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రూ.49 వేల కోట్ల నుంచి రూ.7,500 కోట్లకు తెచ్చారు ‘ఎన్నికలకు ముందు ఓట్ల కోసం ఎలాంటి షరతులు లేకుండా డిసెంబర్ 9 నాడే మొదటి సంతకం చేసి రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని సోనియాగాంధీ మీద ఒట్టేసి చెప్పిన రేవంత్ అధికారంలోకి రాగానే తప్పించుకునే లెక్కలు చెబుతున్నాడు. మొదట రూ.49 వేల కోట్లు అని బ్యాంకర్ల సమావేశంలో గుర్తించిన తర్వాత.. ఏడాది కడుపు కట్టుకుని అయినా రూ.40 వేల కోట్లు బ్యాంకులకు చెల్లిస్తామని చెప్పాడు. ఆ తర్వాత కేబినెట్లో దానిని రూ.31 వేల కోట్లకు తగ్గించాడు. అనంతరం బడ్జెట్లో రూ.26 వేల కోట్లు మాత్రమే పెట్టాడు. తర్వాత కనీసం రూ.17 వేల కోట్లయినా మాఫీ అయ్యాయని అనుకుంటుండగా.. రైతుల ఖాతాల్లో రూ.7,500 కోట్లే జమయ్యాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు..’ అని కేటీఆర్ ధ్వజమెత్తారు.సంపూర్ణ రుణమాఫీ కాకపోతే అదే జరుగుతుంది ‘రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతులకు.. ఎలాంటి కొర్రీలు, కోతలు లేకుండా రూ.2 లక్షల రుణ మాఫీ వర్తింపజేసే వరకూ ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదు. ఎన్నికలకు ముందు చెప్పిన ఆరు గ్యారంటీలతో పాటు అదనంగా చెప్పిన 420 హామీలను సైతం అమలు చేయాలి. ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నాయకుడిగా రేవంత్‌రెడ్డి పదేపదే చెప్పిన మాట లు.. ‘చెట్టుకు కట్టేసి కొడతాం’.. లాగుల్లో తొండలు వదిలిపె డతాం’. సంపూర్ణ రుణమాఫీ కాకపోతే అదే జరుగుతుంది. కేసీఆర్ ఉన్నప్పుడు లేని ఆధార్ నంబర్ల తప్పులు, రేషన్ కార్డుల తప్పులు ఇప్పుడు ఎక్కడినుంచి వచ్చాయి? రుణమాఫీ ఏమైందని, రైతుబంధు డబ్బులు ఎప్పుడు ఇస్తారని.. గ్రామాల్లోకి వచ్చే కాంగ్రెస్ నేతలు, ఎమ్మెల్యేలను నిలదీయాలి..’ అని కేటీఆర్ పిలుపునిచ్చారు.100% రుణమాఫీ నిజమైతే జర్నలిస్టులపై దాడి ఎందుకు?రుణమాఫీపై సీఎం రేవంత్‌రెడ్డి స్వగ్రామమైన మహబూ బ్‌నగర్ జిల్లా కొండారెడ్డిపల్లిలో సర్వే చేసేందుకు వెళ్లిన ఇద్దరు మహిళా జర్నలిస్టులపై కాంగ్రెస్ గూండాలు దాడి చేయడం హేయమైన చర్య అని కేటీఆర్ మండిపడ్డారు. ఇందిరమ్మ రాజ్యంలో జర్నలిస్టులకు రక్షణ ఇదేనా? అని ప్రశ్నించారు. వందశాతం రుణమాఫీ నిజమైతే సర్వేకు వచ్చిన జర్నలి స్టులు విజయారెడ్డి, సరితపై రేవంత్ తొత్తులు ఎందుకు దాడి చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్య మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కార్తీక్‌రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.తెలంగాణ ద్రోహికి విగ్రహం పెట్టే అర్హత ఉందా?మహాత్మాగాంధీ విగ్రహాన్ని గాడ్సే పెట్టినట్టుగా ఉంటుందిఅనేక అంశాల్లో రాహుల్‌తో సీఎం రేవంత్‌కు భిన్నాభిప్రాయాలుతెలంగాణ నుంచి ప్రాంతేతరులకు పదవుల అప్పగింతబీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాల యం ఎదుట ప్రతిష్ఠించాలన్నది ప్రజల కోరిక. రాహుల్‌గాంధీ దగ్గర మార్కులు కొట్టేసేందుకు రేవంత్ తెలంగాణ జాతి మొత్తాన్ని అవమానిస్తున్నాడు. గాంధీ విగ్రహాన్ని గాడ్సే పెడితే ఎంత దరిద్రంగా ఉంటుందో.. తెలంగాణతల్లి విగ్ర హాన్ని రేవంత్‌రెడ్డి లాంటి తెలంగాణ ద్రోహి పెడితే అంతే దారుణంగా ఉంటుంది’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. చేవెళ్లలో రైతుధర్నాలో పాల్గొన్న అనంతరం కేటీఆర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.ఆయన ఏమన్నారంటే.. ‘ప్రధాని మోదీతో మొదలుకొని అనేక అంశాలపై రాహుల్‌గాంధీకి సీఎం రేవంత్‌కు నడుమ భిన్నాభిప్రా యాలు ఉన్నాయి. రేవంత్, రాహుల్ చర్చించుకొని అదానీ మంచివాడో.. చెడ్డవాడో చెప్పాలి. పదేళ్ల పాటు మా మెడ మీద కేంద్రం కత్తిపెట్టినా రాష్ట్రంలో అదానీని అడుగుపెట్ట నివ్వ లేదు. కానీ ప్రస్తుతం ఆయనతో రేవంత్ ప్రభుత్వం రూ.12,400 కోట్ల మేర ఒప్పందం కుదుర్చుకుంది.కాంగ్రెస్ డిక్లరేషన్లపై బీఆర్ఎస్ పోరు: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలతోపాటు డిక్లరేషన్ల అమలు కోసం బీఆర్ఎస్ పోరాడుతుంది. గతంలో డిక్లరేషన్ల పేరిట కాంగ్రెస్ సమా వేశాలు పెట్టినచోటే సెప్టెంబర్‌లో బీఆర్ఎస్ తరఫున కార్య క్రమాలు నిర్వహిస్తాం. రైతు రుణమాఫీ సంపూర్ణంగా అమ లయ్యేదాకా గ్రామస్థాయి వరకు తెలంగాణ ఉద్యమకాలం నాటి నిరసన రూపాలన్నీ కొనసాగిస్తాం. ఓవైపు రుణ మాఫీ పూర్తి చేయకుండా, మరోవైపు స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళుతుందని అనుకోవడం లేదు. ప్రజా అంశాల నుంచి దృష్టి మరల్చేందుకే రేవంత్ బజారుభాష మాట్లాడుతున్నాడు.తెలంగాణ పేరును కూడా మారుస్తారాఅధికార పార్టీ నాయకులు అహంకారంతో మాట్లాడితే మేము తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ నాయకుల పేర్లతో ఉన్న ప్రతీ పథకం పేరును మార్చడం ఖాయం. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అహంకారంగా అర్థం చేసుకుంటే నేనేమీ చేయలేను. తొమ్మిది నెలల్లో సీఎం రేవంత్ 20 సార్లు ఢిల్లీకి వెళ్లి రావడం ద్వారా కాంగ్రెస్ నాయకులు ఢిల్లీకి బానిసలు అని రుజువు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం లేకుండా చేసేందుకు రేవంత్ కుట్రలు పన్నుతున్నాడు. తెలంగాణ అనే పేరును ఏమైనా మారుస్తాడేమో చూడాలి. తెలంగాణ నుంచి అభిషేక్ సింఘ్వీని రాజ్యసభకు పంపడం మొదలుకొని అన్ని పదవులను ప్రాంతేతరులకు కాంగ్రెస్ అప్పజెప్తోంది. సింఘ్వీ తెలంగాణ కోసం కొట్లాడుతాడు అని సీఎం చెబుతున్నాడు. మరి రాష్ట్రం నుంచి ఎన్నికైన ఎనిమిది మంది ఎంపీలు గాడిదలు కాస్తారా’ అని కేటీఆర్ ప్రశ్నించారు. -
జాతి సంపద దోచిపెడుతున్న మోదీ
సాక్షి, హైదరాబాద్: లక్షల కోట్ల అప్పులతో దేశ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసిన ప్రధాని మోదీ పేదలకు దక్కాల్సిన జాతి సంపదను తన వాళ్లకు దోచిపెడుతున్నారని ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి ఆరోపించారు. అదానీతో సెబీ చైర్పర్సన్ కుమ్మక్కై రూ.లక్షల కోట్లు దోచుకున్నట్లు హిండెన్‌బర్గ్ నివేదిక వెల్లడించిందని చెప్పారు. ఈ అంశంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేయమంటే పార్లమెంటును నాలుగు రోజుల ముందే వాయిదా వేసి ప్రధాని పారిపోయారని మండిపడ్డారు. ‘హమ్ దో.. హమారే దో’ అన్నట్టుగా మోదీ, అమిత్ షా–అదానీ, అంబానీ వ్యవహారం తయారయ్యిందని తీవ్రంగా విమర్శించారు. సెబీ చైర్పర్సన్ అక్రమాలపై జేపీసీ వేయాలని, అదానీ కుంభ కోణంపై విచారణ జరపాలనే డిమాండ్‌తో, ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధర్నా జరిగింది. అంతకుముందు గన్‌పార్క్ వద్ద గల అమరవీరుల స్తూపం నుంచి మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ కార్యకర్తలు ర్యాలీగా ఈడీ కార్యాలయం వరకు వచ్చారు. ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్‌రెడ్డి.. ప్రధానితో పాటు రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్పై నిప్పులు చెరిగారు. ఇద్దరి చేతుల్లోకి జాతి సంపద‘అదానీని కాపాడేందుకే ప్రధాని సెబీ కుంభకోణంపై జేపీసీ వేయడం లేదు. దేశానికి రూ.183 లక్షల కోట్ల అప్పులున్నాయి. అయితే దేశాన్ని 67 ఏళ్లు పాలించిన 16 మంది ప్రధానులు చేసిన అప్పులతో పోల్చుకుంటే మోదీ ప్రధాని అయిన తరువాత చేసినవి రెండింతలు ఉన్నాయి. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, పీవీ నరసింహారావు వంటి ప్రధానులు దేశాన్ని వివిధ రంగాల్లో అభివృద్ధి చేశారు. కానీ మోదీ తెచ్చిన గొప్ప ప్రాజెక్టులు ఏమీలేవు. పైగా పేదలకు చెందాల్సిన జాతి సంపద ఇద్దరు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లింది. సెబీ చైర్పర్సన్ తక్షణమే రాజీనామా చేయాలి. లేకపోతే కేంద్రమే ఆమెను తొలగించాలి. కేసీఆర్, కేటీఆర్ ఎందుకు ప్రశ్నించడం లేదు?: సెబీ కుంభకోణంపై బీజేపీని కేసీఆర్, కేటీఆర్ ఎందుకు ప్రశ్నించడం లేదు? వాళ్లు విలీనమైతరో మలినమైతరో మాకు సంబంధం లేదు. కానీ బీజేపీకి బీఆర్ఎస్ అనుకూలం అనడానికి ఇది నిదర్శనం. మోదీని సంతృప్తిపరిచేందుకు రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. డిసెంబర్ 9న సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసి తెలంగాణ తల్లికి నిజమైన వారసులమని నిరూపించుకుంటాం..’ అని రేవంత్ అన్నారు. ఈ సన్నాసులను నమ్ముకొని రైతులు రోడ్డెక్కొద్దు‘రైతు రుణమాఫీపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోంది. ఈ సన్నాసులను నమ్ముకుని రైతులు రోడ్డెక్కొద్దు. రుణమాఫీ కానివాళ్లు కలెక్టరేట్లకు వెళ్లి పిటిషన్లు ఇవ్వాలి. ధర్నాలు అవసరం లేదు. పదేళ్లు మిమ్మల్ని దోచుకుతిన్న ఈ బీఆర్ఎస్ దోపిడీ దొంగలను నమ్మొద్దు. మొన్ననే తరిమికొట్టిన దొంగలను మళ్లీ ఊళ్లకు ఎందుకు రానిస్తున్నారు? రాజీనామా చేయాల్సి వస్తుందని హరీశ్ డ్రామాలు చేస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 39లో 9 కూడా మిగలవు..’ అని రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఆస్తులు నిలబెడితే.. మోదీ దోచిపెడుతున్నారు: భట్టికాంగ్రెస్ పార్టీ ఈ దేశంలోని ఆస్తులు, సంపద, వనరులను నిలబెడితే వాటిని ప్రధాని మోదీ.. అదానీ వంటి క్రోని కాపిట లిస్టులకు (స్నేహితులైన పెట్టుబడిదారులకు) దోచిపెడుతు న్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ తీరును రాహుల్‌గాంధీ చెప్పినప్పుడు మొదట స్పందించకపోయినా ఇప్పుడు ఒక్కొక్క అవినీతి వెలుగులోకి వస్తుంటే ప్రజలకు అర్థమవుతోందని చెప్పారు. దేశ సంపదను కాపాడాల్సిన సెబీ చైర్మన్ ఈ దోపిడీలో భాగస్వామిగా ఉన్నా రని హిండెన్‌బర్గ్ సంస్థ పరిశోధించి బయట పెట్టడంతో ప్రపంచమే ఆశ్చర్యపోయిందని భట్టి వ్యాఖ్యానించారు.ధర్నా అనంతరం రేవంత్, భట్టి, ఏఐసీసీ నేతలు దీపాదాస్ మున్షీ, సల్మాన్ ఖుర్షీద్, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్ ఈడీ కార్యాలయంలో అధికారికి వినతిపత్రం అందజేశారు. మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, జూపల్లి కృష్ణారావు, పార్టీ నేతలు జగ్గారెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్, అజారుద్దీన్, ఎంపీ లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
సీఎం రేవంత్‌రెడ్డికి కోర్టు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి నాంపల్లి మేజిస్ట్రేట్ కోర్టు నోటీసులు జారీ చేసింది. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కొత్తగూడెం సభలో రేవంత్ వివాదాస్పద వ్యాఖ్యలపై నోటీసులు ఇచ్చింది. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తొలగిస్తుందంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. కింది కోర్టు పలుమార్లు కేసును వాయిదా వేయడంతో కాసం.. హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాలతో రేవంత్‌కు నాంపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది.మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల సందర్భంగా తమపై అబద్ధాలు ప్రచారం చేశారంటూ బీజేపీ పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. దేశాన్ని హిందూ రాజ్యంగా మార్చేందుకు ఆర్ఎస్ఎస్ ప్రతినబూనిందని.. ఆ కుట్రలో భాగంగానే 2025లో భారత దేశాన్ని పూర్తిగా హిందూ దేశంగా మార్చబోతున్నారని.. అందుకే కేంద్రంలో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తుందంటూ రేవంత్ కాంట్రవర్శి కామెంట్స్ చేశారు. -
18 ఏళ్లుగా సాగదీత.. ఇంకా ఎన్నాళ్లో?
తాము ఏ సుద్దులు చెప్పిన... ఏ నీతులు చెప్పిన అవి ఎదుటి వారికే కాని తమకు కాదని ఈనాడు మీడియా గట్టిగా విశ్వసిస్తోంది. అందుకే ఈనాడు వారు తమకు ఇష్టం లేని వారిపై, లేదా తమ రాజకీయ ,వ్యాపార ప్రయోజనాలకు అడ్డం అవుతారని అనుకున్న వారిపై నానా బురద వేస్తుంటారు .పచ్చి అబద్దాలు రాయడానికి కూడా వెనుకాడడం లేదు .తెలుగుదేశం పార్టీకి , సీఎం చంద్రబాబుకు ,తమకు కొమ్ము కాసేవారికి మాత్రం రక్షణగా నిలబడుతుంది.గత ఐదేళ్లుగా వైఎస్ జగన్ పాలనపై ఎంత విషం చిమ్మిందో చూశాం. అప్పుడే కాదు ...వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారం కోల్పోయినా, ఇప్పటికి వారిపైనే చెడరాస్తోంది. పాపాల పుట్టలు అని... అవి అని, ఇవి అని ఇష్టరీతిలో హెడ్గింగ్లు పెడుతుంది .అదే తమకు సంబందించిన అక్రమాల గురించి మాత్రం నోరు విప్పితే ఒట్టు.మార్గదర్శి ఫైనాన్షియర్స్కు సంబందించి రిజర్వ్ బ్యాంకు అఫ్ ఇండియా నివేదిక ఇవ్వడం, అందులో రామోజి సంస్థ అక్రమాలకు పాల్పడిందని , అర్హత లేకపోయినా డిపాజిట్ లు వసూలు చేసిందని ...శిక్షార్హ నేరమని స్పష్టంగా చెప్పినా కనీసం స్పందించ లేకపోయింది.వేలకోట్లకు సంబందించిన దందా అనండి ...స్కామ్ అనండి.. దానిపై నేరుగా వివరణ ఇచ్చే పరిస్థితి కూడా మార్గదర్శి ఫైనాన్శయర్స్ కాని...ఈనాడు మీడియాకు కాని ఉన్నట్లు లేదు.మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పట్టుదలతో సాగించిన పోరాటంతో ఈ మాత్రం అయినా కదలిక వచ్చింది .లేకుంటే ఈ దేశంలో మీడియాను అడ్డంపెట్టుకుని ... ఎన్ని అరాచకాలకైనా పాల్పడవచ్చని, తమకు నచ్చిన రాజకీయ పార్టీలకు అనుకూలంగా ప్రచారం చేసి...తద్వారా ఎన్ని కైన ప్రభుత్వాల ద్వారా తమ అర్ధిక ప్రయోజనాలకు కాపాడుకోవచ్చని ఏవరైన భావించే పరిస్థితి ఏర్పడింది .తాజాగా ఈ కేసును తెలంగాణ హైకోర్టు విచారించినప్పుడు జరిగిన పరిణామం చూస్తే మార్గదర్శి అనండి...దివంగత రామోజి రావు అనండి లేదా ప్రస్తుత యాజమాన్యం అనండి.. వారికి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలపై ఎంత పట్టు ఉన్నది అర్ధం అవుతుంది .ఏపిలోని చంద్రబాబు ప్రభుత్వం...తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కార్ ఈ కేసులో జవాబు ఇవ్వడానికే సిద్దం పడకపోవడం విశేషం. చంద్రబాబు అంటే ఏటూ టిడిపి కనుక అయన తోటి ఈనాడుకు ఉన్న సంబంధాల రీత్య అర్ధం చేసుకోవచ్చు. రామోజీ కాంగ్రెస్‌కు అనుకూలం కాదని తెలిసినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఎలాంటి సమాదానం ఇవ్వకపోవడం గమనించదగ్గ అంశం.బహుశా గురుశిష్యులు ఇద్దరు రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు అవ్వడం మార్గదర్శి సంస్థకు కలిసి వస్తోందని అనుకోవాలి. ఈ రెండు రాష్ట్రాల న్యాయవాదులు మార్గదర్శి కేసు విచారణకు హజరు అయినా పూర్తిగా మాౌనం పాటించారట. దానిని మార్గదర్శి న్యాయవాది లుద్రా అనుకూలంగా మలచుకుని కేసును అలస్యం చేసేందుకు ప్రయత్నాలు ఆరంబించారని మీడియా కధనం. మొత్తం విషయం పరిశీలిస్తే నిజమే అనిపిస్తుంది .రెండు వేల ఆరువందల కోట్ల మేర అక్రమంగా డిపాజిట్లు వసూలు చేశారన్నది అభియోగం. అప్పటి ఎంపీ ఉండవెల్లి చేసిన ఫిర్యాదు వ్యవహరంలో అనేక ట్విస్టులు చోటు చేసుకుని చివరకు ఈ దశకు చేరింది .మద్యలో ఏదో కారణం చూపి రామోజి ఈ కేసును ఉమ్మడి ఏపి హైకోర్టు విభజనకు ముందు రోజు కోట్టివేయించుకోగలిగారు .ఆ తర్వాత ఎప్పటికో ఈ విషయం తెలిసి ఉండవల్లి సుప్రీం కోర్టుకు వెళ్లి తన పోరాటం కోనసాగించారు . అసలు ఏప్పడో చర్య తీసుకోవాల్సిన ఆర్బిఐ ఇనాళ్లు మౌనంగా ఉండడం కూడా అశ్చర్యం కలిగిస్తోంది .తుదకు కోర్టు ఆదేశాలతో ఒక నివేదికను తయారు చేసి సమర్పించింది.అందులో మార్గదర్శి అక్రమంగానే డిపాజిట్లు వసూలు చేసిందని తేల్చింది .ఆర్బీఐ చట్టం లో సెక్షన్ 45 ఎస్ ను మార్గదర్శి ఉల్లంఘించిందని బాధ్యులను ప్రాసిక్యూట్ చేయాలని తెలిపింది .ఈ కేసులో నేరాభియోగం రుజువు అయితే జైలు శిక్షతో పాటు డిపాజిట్ లుగా వసూలు చేసినదానికి రెండింతులు పెనాల్టి చెల్లించాల్సి ఉంటుంది .దీనితో మార్గదర్శికి, ఈనాడు వారికి మింగుడు పడని పరిస్థితి ఏర్పడింది .ఒక్క సాక్షి తప్ప మిగిలిన మీడియా ఇంత పెద్ద వార్తను ప్రముఖంగా ఇవ్వకపోవడం కూడా వారి పలుకుబడిని తెలియచేస్తుంది .రామోజి రావు 2008 లో సమర్పించిన అఫడివిట్ ప్రకారం 2610 కోట్లు సేకరించారు .అందులో 1864 కోట్లు తిరిగి చెల్లించామని తెలిపారు .మరి మిగిలిన సుమారు 750 కోట్ల డిపాజిట్లు ఏం అయ్యాయి?అవి ఎవరివి అన్న అంశాలను మాత్రం గుట్టుగా ఉంచారు .అంతేకాదు 1864 కోట్లు ఎవరేవరికి చెల్లించారో జాబితా ఇవ్వడానికి రామోజి కుటుంబం సమ్మతించడం లేదని సమాచారం మీడియాలో వచ్చింది.ఆ వివరాలు వెల్లడిస్తే కొందరు పెద్దలు ...అందులో ముఖ్యంగా టిడిపి వారికి చెందిన నల్లధనం బట్టబయలు అవుతుందని ..బినామి పేరుతో తాము పెట్టిన దందా వెల్లడి అవుతుందని రామోజీ కుటుంబం అందోళన చెందుతున్నట్టు సాక్షి పత్రిక నేరుగా అరోపించింది .ఈనాడు వారు కాని ...మార్గదర్శి వారు కాని ,రామోజి రావు కుమారుడు కిరణ్ , కోడలు శైలజ కాని ఏ మాత్రం విలువలు పాటించేవారైనా, ఖచ్చితంగా వీటికి సమాదానం చెప్పగలగాలి. అలా చెప్పడం లేదంటే దాని అర్దం వారు తప్పు చెసినట్టు అంగీకరించడమే .ఊరందరికి నీతులు చెప్పే ఈనాడు మీడియా ఈ విషయంలో ఉన్న గుట్టుముట్లను ఎందుకు విప్పడం లేదు అంటే ...దీని ఱర్ధం ఈ విషయాలు వెలుగులోకి వస్తే తమ పాపాల పుట్ట బయటపడుతుందా అన్న భయమా అనే సందేహం వస్తే తప్పు ఏముంది.దేశంలో ఉన్నవారందరని పారదర్శకంగా ఉండాలని నీతులు రాస్తూ ...కథలు చెబుతూ ఉండే ఈనాడు, మార్గదర్శిల యాజమాన్యం ఇప్పటికైనా ఉండవల్లి అరుణ్ కుమార్ డిమాండ్ చేసినట్టుగా డిపాజిట్ లు ఏవరేవరికి చెల్లించారో వెల్లడించాలి.అలాగే ఎవరికి చెల్లించని 750 కోట్ల డిపాజిట్ ల రహస్యం ఏంటో తెలపాలి.అదంతా నల్లధనం కాదని ,తాము పద్దతిగా వ్యాపారం చేస్తున్నామని చెప్పగలగాలి.అలాగే చంద్రబాబు,రేవంత్ ప్రభుత్వాలు కూడా ఈ డిపాజిట్ లకు సంబందించి వాస్తవాలను తమ అఫడవిట్ ల ద్వారా తెలియచేయాలి.లేకుంటే ఈ రెండు ప్రభుత్వాలకు ఈనాడు మీడియాకు మద్య క్విడ్ ప్రో కో సాగుంతుందని జనం అభిప్రాయపడతారు . అరుణకుమార్ చేసిన విజ్ఞప్తికి రెండు రాష్ట్రాల సీఎంలు స్పందిస్తారా?అన్నది డౌటే.ఒకవేళ స్పందించినా, అది మార్గదర్శికి, ఈనాడు వారికి అనుకూలంగానే ఉండవచ్చు. నిజానికి ఉండవల్లి తన వాదనలో చెప్పినట్టు ఆర్బీఐ ఇచ్చిన నివేదిక ఆధారంగా హైకోర్టు తదుపరి చర్యకు దిగితే మొత్తం లోగుట్టులు అన్ని బహిర్గతం అవుతాయి. కాని ఇప్పుడు ఉన్న వాతావరణం గమనిస్తే అది అంత తేలిక కాకపోవచ్చు. పద్దేనిమిది ఏళ్లుగా సాగుతున్న ఈ వ్యవహరంలో ఎంతకాలం వీలైతే , అంత కాలం ఈ కేసును సాగదీయాలని ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి కేసుల వల్లే మన వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం పోయే ప్రమాదం ఏర్పడుతుంది .ప్రజల్లో విశ్వాసం నెలకోనాలంటే కనీసం న్యాయవ్యవస్థ అయినా ఈ కేసులో నిజానిజాలను నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది .అది జరుగుతుందా లేదా అన్నది కాలమే నిర్ణయిస్తుంది.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు